Search
  • Follow NativePlanet
Share
» »పుణ్యక్షేత్రాలు, కొండకోనలు, జలపాతాలు కలిస్తే ఒక చిన్న ఇంద్రలోకం అదే చిక్కమంగళూరు

పుణ్యక్షేత్రాలు, కొండకోనలు, జలపాతాలు కలిస్తే ఒక చిన్న ఇంద్రలోకం అదే చిక్కమంగళూరు

భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కాఫీ తోటల పెంపకం జరిగింది ఇక్కడే. తుంగ, భద్ర నదులకు పుట్టినిల్లు ఈ ప్రదేశం. కర్ణాటక రాష్ట్రంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పర్వతశ్రేణులు ఇక్కడ ప్రత్యేకత. కెమ్మనగుండి, కుద్రేముఖ్ కొండలు, మాణిక్యధార, కల్లథిగిరి జలపాతాలు ప్రుక్రుతి రమణీయ ద్రుశ్యాలతో పర్యాటకులకు కనువిందు చేస్తాయి. శంకరాచార్యులు అద్వైత ప్రచారం కోసం స్థాపించిన శారదా పీఠం శ్రుంగేరి ఈ జిల్లాలోనే ఉంది. దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన పెద్ద సామ్రాజ్యాలలో ఒకటైన హోయసల రాజులు పాలించిన సుందర ప్రదేశం చిక్కమంగళూరు విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

చిక్ మంగళూరు పేరు జిల్లా రాజధానికి చిక్ మగళూరు పట్టణం నుండి వచ్చింది. చిక్క మగళూరు అంటే కన్నడ భాషలో చిన్న కూతురు ఊరు అని అర్ధం. సేక్రపట్న రాజైన రుక్మాంగద చిన్న కూతురుకు కట్నంగా ఇవ్వబడటం వల్ల ఈ పట్టణానికి చిక్ మగలూరు అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. రుక్మాంగద పెద్ద కూతురు పేరు మీదుగా చిక్ మగళూరుకు 5కిలోమీటర్ల దూరంలో హిరెమగళూరు కూడా ఉండటం విశేషం.

హిస్టరీ

1670 సంవత్సరంలో చిక్ మగళూరు జిల్లాలోని బాబా బుడాన్ గిరి కొండలపై భారతదేశంలోనే మొట్ట మొదటిసారిగా కాఫీ తోటలు పెంచారు. కాఫీ పెంపకం గురించి ప్రాచుర్యంలో ఉన్న కథ ప్రకారం బాబా బడాన్ ముక్క యాత్రకు వెళుతూ యెమెన్ దేశంలోని మొఛా నౌకాశ్రయం నుండి ప్రయాణం చెస్తున్నప్పుడు మొదటిసారి కాఫీని రుచి చూశాడు. కాఫీ రుచిని చూశాడు. కాఫీ రుచిని భారతదేశానికి అందించే ప్రయత్నంలో ఏడు కాఫీ గింజలు తనతో బాటు అరబ్ దేశాల నుండి తీసుకుని వచ్చాడు. బాబా బుడాన్ భారతదేశానికి తిరిగి వచ్చాక చిక్ మగళూరులో ఈ గింజలు పాతాడు. బాబా బుడాన్ పై గౌరవానికి గుర్తుగా ఈ కొండలను బాబా బుడాన్ (బాబా బుర్హాన్)కొండలని పిలుస్తారు. చిక్ మంగళూరు చుట్టూ చూడదగ్గ ప్రదేశాలు...

శృంగేరి :

శృంగేరి :

చిక్కమంగళూరుకి 90కిలోమీటర్ల దూరంలో పశ్చిమంగా తుంగనది ఒడ్డున శంకరా చార్యులు అద్వైత ధర్మ ప్రచారానికి స్థాపించిన మొట్టమొదటి మఠమైన శారద పీఠానికి నిలయం శృంగేరి. శృంగేరిలో శారదా దేవి దేవాలయానికి పక్కన విద్యాశంకరులు స్మారకంగా నిర్మతమైన విద్యశంక్ దేవాలయం హోయసల రాజుల కాలంలో ప్రారంభించబడి విజయనగర రాజుల చేత పూర్తి చేయబడింది. ఈ విద్యాశంకర దేవాలయంలో 12 రాశులను సూచిస్తూ 12 స్థంభాలు ఉన్నాయి. సూర్యడు ఏ రాశితో ఉన్నాడో సూర్యకిరణాలు ఈ స్థంభం మీద పడతుండటం ఇక్కడి విశేషం.

హెురనాడు:

హెురనాడు:

చిక్కమంగలూరుకు 100కిమీల నైబుతి దిక్కులో ఉన్న ఈ గ్రామంలో ప్రసిద్దమైన అన్నపూర్ణేశ్వరి దేవాలయం ఉంది. కొన్నేళ్ళక్రితమే ఈ దేవాలయం పునరుద్దరణ జరిగింది. ఆదిశక్తితో ప్రాణప్రతిష్ట చేసిన ఈ గుడిలో ఉన్న ఈ అమ్మవారిని ఆదిశక్త్యకాంబ శ్రీ అన్నపూర్ణేశ్వరిగా భావిస్తారు. ఈ దేవాలయంలో ప్రతి రోజూ అన్న సంతర్పణ జరుగుతుంది. అమ్మవారిని దర్శించడానికి వచ్చిన తీర్థయాత్రీకులకు దేవస్థానం భోజన సదుపాయాలు కల్పిస్తుంది.

కుద్రేముఖ్ జాతీయ వనం:

కుద్రేముఖ్ జాతీయ వనం:

కుద్రేముఖ్ జిల్లా రాజధానికి చిక్కమంగళూరుకి 95కిలోమీట నైబుతి దిశలో ఉంది. కన్నడ భాషలో కుద్రేముఖ్ అంటే గుర్రపు ముఖం అని అర్ధం. ఈ పర్వతశ్రేణులు గుర్రపు ముఖం ఆకారంలో ఉండటం వల్ల కుద్రేముఖ్ అని పిలుస్తారు. ఈ కుద్రేముక్ పర్వతకేంద్రంలో కుద్రేముఖ్ జాతీయ ఉద్యాన వనం ఉంది. అరేబియా సముద్రంవైపు ఉన్న ఈ పర్వత శ్రేణుల పరంపర లోతైన లోయలు, ఎత్తైన శికరాలతో చాలా సుందరంగా ఉంది. సముద్రమట్టానికి 1894.3 కిమీ ఎత్తులో ఉన్న ఈ పర్వత కేంద్రం కుద్రేముఖ్ లో అపారమైన ఇనుప గనులు ఉన్నాయి. కుద్రేముఖ్ లో ఉన్న ఉక్కు కర్మాగారంలో ఉక్కు కొద్దిగా శుద్ది చేసి గొట్టాల ద్వారా మంగళూరు పణం బూర్ నౌకాశ్రయానికి సరఫరా చేయబడుతుంది.

హెబ్బె జలపాతం:

హెబ్బె జలపాతం:

కెమ్మనగుండి పర్వత క్రేందం నుండి 10కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం 168మీటర్ల ఎత్తు నుండి పడుతుంది. ఈ జలపాతం రెండు గతిపథులుగా పడుతుంది. దొడ్డ హెబ్బె (పెద్ద హెబ్బె)జలపాతం , చిక్క హెబ్బె(చిన్న హెబ్బె)జలపాతం. ఇంకా ఇవేకాకుండా శాంతి హనుమాన్ గుండి, కదంబి జలపాతాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి.

కెమ్మనగుండి:

కెమ్మనగుండి:

బాబా బుడాన్ కొండల మధ్య చిక్కమంగళూరు పట్టణానికి 55కిలోమీటర్ల దూరంలో కెమ్మనగుండి పర్వత కేంద్రం ఉంది. కెమ్మనగుండి పర్వత కేంద్రంలో వాడేయార్ రాజు కృష్ణరాజ వాడేయార్ వేసవి విడిది చేసేవాడు కావున ఈ పర్వత శ్రేణులను కె. ఆర్ కొండలు అని కూడా పిలుస్తారు. ఈ పర్వత కేంద్రం సముద్రమట్టానికి 1434 మీటర్ల ఎత్తులో దట్టమైన అరణ్యాల మధ్య సంవత్సరం పొడవునా సెలయేళ్ళతో హరితంగా ఉంటుంది. పూలతోటలతో కొండలోయలతో ఉండే ఈ పర్వత కేంద్ర సౌందర్యం వర్ణణాతీతం. అరణ్యాలు అన్వేషణ జరిపేవారికి ఈ పర్వత కేంద్రం నుండి అనేక మార్గాలున్నాయి. ఈ కొండ ప్రాంతంలో వివిధ ప్రదేశాల నుండి సూర్యాస్తమయాన్ని తిలకించవచవలసిందే. కేంద్రంపైన గులాబీ తోటలు అనేక ఉన్నాయి. పర్వతం నుండి పది నిముషాల నడకలో వచ్చే జెడ్ పాయింట్ నుండి చూస్తే రమణీయంగా ఉండే పశ్చిమకనుమలలోని శొల గడ్డ భూములు కనబడుతాయి.

ముల్లయనగిరి:

ముల్లయనగిరి:

ముల్లయనగిరి బాబు బుడన్ కొండలలో ఒక భాగం. ఈ కొండ చిక్కమంగళూరు పట్టణానికి 16కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్రపట్టానికి 1930మీటర్ల ఎత్తులో ఉంది. ఈ పర్వత శ్రేణులు కర్ణాటక రాష్ట్రంలోనే ఎత్తైన పర్వత శ్రేణులు. ఈ పర్వతశిఖరం సూర్యాస్తమయం వీక్షించడానికి చాలా ప్రసిద్ది .చిక్కమంగళూరు నుండి సితలయనగిరి వెళ్లే మార్గంలో ఉన్న శివుడి గుడిలో లింగం నిరంతరం నీటిలో ఉంటుంది. నీటి మట్టం ఏ సమయంలోనైనా ఒకేలాగ ఉంటుంది. అక్కడి నుండి ముల్లయనగిరికి వెళ్లేరహదారి చాలా సన్నగా ఉండి రెండు పక్కల వాహనాలు పోవడానికి వీలు లేకుండా ఉంటుంది. ముల్లయనగిరి కొండల నుండి ఆకాశం నిర్మలంగా ఉన్న రోజులలో అరేబియా సముద్రం కనిపిస్తుంది. ఈ పర్వత శ్రేణులను అధిరోహించాలని ఆసక్తి ఉన్నవారికి ఈ కొండ చాలా మంచి ప్రదేశం.

అమృతేశ్వర దేవాలయం

అమృతేశ్వర దేవాలయం

చిక్కమగళూరు సందర్శనలో పట్టణానికి ఉత్తర దిశగా 67 కి.మీ. దూరంలో ఉన్న అమృతేశ్వర దేవాలయం, కూడా దర్శించవచ్చు. ఈ దేవాలయాన్నిక్రీ.శ. 1196 సంవత్సరంలో హొయసల రాజు వీర బల్లాల II నిర్మించారు. ఈ దేవాలయాన్ని దాని శిల్పి అమృతేశ్వర దండనాయక పేరుపై నిర్మించారు. అమృతేశ్వర దేవాలయం లో ఒక విమానగోపురం ఏకకూట డిజైన్ లో, ఒక పెద్ద మంటపం ఉంటాయి. ఒక మంటపానికి 9 గదులు మరో మంటపానికి 29 గదులు ఉన్నాయి. ఈ దేవాలయం లోని శిల్పాలలో రాక్షస ముఖాలు కనపడుతూంటాయి. అమృతేశ్వర దేవాలయంలోని మంటపాలుకుగల స్తంభాలు నేటికి ఎంతో మెరుపు కలిగి మంటప సీలింగ్ కు ఆధారంగా ఉంటాయి. సీలింగ్ లోపలి భాగంలో పూవుల డిజైన్లు ఉంటాయి. మంటపాలలో హిందూ పురాణాల పాత్రలు దర్శనమిస్తాయి. మహాభారతం, శ్రీ క్రిష్ణుడిజీవిత చరిత్ర వంటివి ఉంటాయి.రామాయణంలోని సంఘటనలు దక్షిణ భాగ గోడలలో చిత్రీకరించారు

సకలేశ్ పూర్

సకలేశ్ పూర్

పడమటి కనుమలలో ఇమిడిపోయిన చిన్న మరియు ఆహ్లాదకరమైన సకలేశ్ పూర్ ప్రాంతం పర్యాటకులకు విహార స్ధలంగా ఎంతో అనువుగా ఉంటుంది. సకలేశ్ పూర్ పట్టణం సముద్ర మట్టానికి 949 మీ.ఎత్తున ఉండి బెంగుళూరు, మైసూర్ ల నుండి తేలికగా ప్రయాణించేలా ఉంటుంది. ఈ ప్రాంతం హాసన్ జిల్లాలో ఒక భాగంగా ఉంటుంది. మన దేశంలోని కాఫీ, యాలకలు వంటి సుగంధ ద్రవ్యాలు ఈ ప్రాంతంలో అధికంగా ఉత్పత్తి అవుతాయి. పర్వతారోహకులకు ఒక స్వర్గం సకలేశ్ పూర్ ఒకప్పుడు మైసూరు రాజుల పాలనలో ఉండేది. వారికి ముందు ఆ ప్రాంతం హొయసలులు మరియు చాళుక్యుల పాలనలే ఉండేది. హొయసలుల కాలంలో ఈ ప్రాంతానికి సకలేశ్ పూర్ అనే పేరు వచ్చింది.

హళేబీడు

హళేబీడు

హళేబీడు అంటే ప్రాచీన నగరం అని అర్ధం చెప్పవచ్చు. ఒకప్పుడు హొయసల రాజులు తమ రాచరిక హంగులను ఈ ప్రదేశంలో ప్రదర్శించారు. పురాతనకాలంలో దానిని ద్వారసముద్రం అంటే సముద్రానికి ప్రవేశం అనే అర్ధంలో పిలిచేవారు. హళేబీడు కర్నాటక రాజధాని బెంగుళూరుకు 184 కి.మీ. దూరంలో హాసన్ జిల్లాలో ఉంది. సాంస్కృతిక రాజధాని మైసూరు పట్టణానికి 118 కి.మీ. ల దూరంలో ఉంది. 12వ శతాబ్దంలో ఈ నగరం రాచరిక వైభవాలతో విలసిల్లింది. తర్వాతి కాలంలో ఈ నగరాన్ని బహమనీ సుల్తాన్లు కొల్లగొట్టటం చేత దానిని హళేబీడు అని పిలిచేవారు. హళీబీడులోని పర్యాటక దృశ్యాలు ఈ పట్టణంలో గల హొయసలేశ్వర మరియు శాంతలేశ్వర దేవాలయాలు అప్పటి పాలకుడు విష్ణువర్ధన మరియు రాణి శాంతల ఆదేశాలపై కేతుమల్ల నిర్మించాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X