• Follow NativePlanet
Share
» »ఈ ఆలయం ఒక్కసారి దర్శించారో మీ జన్మ ధన్యం

ఈ ఆలయం ఒక్కసారి దర్శించారో మీ జన్మ ధన్యం

పూరీ ఒరిస్సా రాష్ట్రంలో భారతదేశంలో తూర్పు వైపు బంగాళాఖాత తీరంలో ఉన్నది. ఇది ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిమీ దూరంలో ఉంది. పూరి నగరం చాలా ప్రాముఖ్యం కలిగి ఉన్నది. జగన్నాథ ఆలయాన్ని జగన్నాథ్ పూరీ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో ప్రజలు హిందూ మత తీర్ధయాత్రను పూరీను సందర్శించినప్పుడు మాత్రమే యాత్ర పూర్తి అయినదని భావిస్తారు. జగన్నాథ ఆలయం భారతదేశంలో ఉన్న దేవాలయాలల్లో ప్రముఖమైనది. ఇక్కడ రాధా, దుర్గ, లక్ష్మి, పార్వతి, సతి, మరియు కృష్ణ తో శక్తి నిలయాలు ఉన్నాయి. జగన్నాథుని యొక్క పవిత్ర భూమిగా భావిస్తారు. ప్రస్తుతం ఉన్న పూరీని ఒకప్పుడు పురుషోత్తమ పురి, పురుషోత్తమ క్షేత్ర, పురుషోత్తమ ధర్మ, నీలాచల,నీలాద్రి, శ్రీక్షేత్ర, శంఖక్షేత్ర వంటి అనేక పేర్లతో పిలేచేవారు.

మన భారతదేశంలో ఎన్నో ప్రాముఖ్యం,విశిష్టత,అద్భుతం కలిగిన దేవాలయాలు ఎన్నో వున్నాయి. అలాంటి దేవాలయాలు జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శించాలని అంటుంటారు.అలంటి మహా అద్భుత ఆలయాలలో ఎంతో ప్రసిద్ధిచెందిన పూరీ జగన్నాథ్ ఆలయం.

ఈశాన్య భారతదేశంలోని ఒడిషాలోని ఈ పూరీజగన్నాథ్ ఆలయం వుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం చేసే రథయాత్ర ఎంతో ప్రఖ్యాతమైనది.ప్రపంచ ప్రసిద్ధిచెందింది.ఈ ఆలయాన్ని 1078సంలో పూరీలో నిర్మించారు.

ఈ ఆలయంలో కృష్ణుడి జీవితాన్ని కళ్ళకుకట్టినట్లు చూపించే గోడలు, స్థంభాలు ఈ ఆలయానికి మరింత శోభను తీస్కోస్తాయి.అన్ని ఆలయాలలో వున్నట్లే గోపురం, దేవతలు, గంటలు, ప్రసాదం అన్నీ వున్నా ప్రతీదానికీ ఒక విశిష్టత వుంది ఇక్కడ.ఇంకా ఎన్నో అద్భుతాలు ఈ ఆలయానికున్నాయి. బహుశా అవి ప్రపంచంలో ఇంకెక్కడా వుండవు అని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం

 గోపురం

గోపురం

ప్రతి ఆలయంలో గోపురం నీడని మనం చూడొచ్చు గానీ ఈ పూరీ జగన్నాథ ఆలయంలో గోపురం నీడ కన్పించదు. పగలైనా రాత్రైనా అస్సలు కన్పించదు. ఇది దేవుడి కోరిక అంటారు కొందరు. ఆలయ గొప్పదనమని మరికొందరు అంటారు.

చిత్ర కృప : Abhishek Barua

రెపరెపలాడే జెండా

రెపరెపలాడే జెండా

ఈ ఆలయగోపురానికి పైనకట్టిన జెండాకి ఒక ప్రత్యేకతవుంది.అన్ని జెండాలలో గాలి ఎటువైపు వస్తే అటు వైపు ఎగురుతుంటాయి.కానీ ఇక్కడ గాలికి వ్యతిరేకదిశలో రెపరెపలాడుతుంటుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఆ జెండాను తరచుగా ఆలయప్రత్యేక పూజారులు మారుస్తుంటారు. ఒక వేళ మార్చడం మరిచిపోతే ఆలయాన్ని దాదాపు 18సంలు మూసివేయాలని భావిస్తారు.

చిత్ర కృప : Srikanta Mahapatra

పూరీ జగన్నాధుడి రధయాత్ర

పూరీ జగన్నాధుడి రధయాత్ర

ఈ ఆలయ ప్రత్యేకతలో రధయాత్ర ఎంతో ముఖ్యమైనది.ఈ రధయాత్రలో కూడా కొన్ని ప్రత్యేకతలు వున్నాయి.రధయాత్రకు ముందు పూరీ రాజు బంగారు చీపురుతో రథాల ముందు వూడ్చి తాళ్ళను లాగటంతో రధయాత్ర ప్రారంభమౌతుంది.

PC:youtube

పూరీ జగన్నాధుడి రధయాత్ర

పూరీ జగన్నాధుడి రధయాత్ర

పూరీ వీధుల్లో శ్రీకృష్ణ, బలరాముల విగ్రహాలను వూరేగిస్తారు.రధం సుమారు 45అడుగుల ఎత్తు, 35అడుగులు వెడల్పు వుంటుంది. ఈ రధానికి సుమారు 16 చక్రాలుంటాయి. పూరీ జగన్నాధ రెండు రధాలు లాగుతారు.

PC:youtube

పూరీ జగన్నాధుడి రధయాత్ర

పూరీ జగన్నాధుడి రధయాత్ర

మొదటి రధం దేవుళ్ళను రధం వరకు తీసుకెళుతుంది.ఆ తరవాత 3 చెక్క పడవళ్ళలో దేవతలు నది దాటాలి.అక్కడి నుంచి మరో రధం దేవుళ్ళను గుండీచ ఆలయానికి తీసుకెళుతుంది.

PC:youtube

రధయాత్రలోని విశిష్టత

రధయాత్రలోని విశిష్టత

ప్రతీ ఏడాది జరిగే ఈ రధయాత్రలో ఒక విశిష్టత జరుగుతుంది. గుండీచ ఆలయానికి వూరేగింపు చేరుకోగానే రథం దానంతట అదే ఆగిపోతుంది.ఇది ఆలయంలో ఒక విశిష్టత. సాయంత్రం 6 గంటల తర్వాత ఆలయతలుపులు మూసేస్తారు.

చిత్ర కృప : Yuv103m

సుదర్శన చక్రం

సుదర్శన చక్రం

పూరీలో అత్యంత ప్రసిద్ధిచెందిన జగన్నాధ ఆలయం చాలా ఎత్తైనదిమీరు పూరీలో ఎక్కడ నిలబడినా గోపురంవైపున్న సుదర్శన చక్రాన్ని చూసినా అది మీ వైపు తిరిగినట్టుమిమ్మల్ని చూస్తున్నట్టు కనిపించటం ఇక్కడి ప్రత్యేకత.

చిత్ర కృప : Partha Misra

సముద్రపు అలలు

సముద్రపు అలలు

సాధారణంగా తీర ప్రాంతాలలో గాలి సముద్రపు వైపు నుంచి భూమి వైపుకి వుంటుంది.సాయంత్రపు పూట గాలి నేలవైపు నుంచి సముద్రం వైపుకు వీస్తుంది.కానీ పూరీలో అంతా విభిన్నం.

చిత్ర కృప : suvadeep ghosh

 సముద్రపు అలలు

సముద్రపు అలలు

దీనికి వ్యతిరేకంగా గాలి వీస్తుండటం ఇక్కడి ప్రత్యేకత. పూరీ జగన్నాధ ఆలయం పైన పక్షులుగానీ, విమానాలు గానీ అస్సలు వుండవు. అది ఎందుకు అనేది ఇప్పటికీ ఎవ్వరికీ అంతు చిక్కటం లేదు.

PC:youtube

సముద్రపు అలలు

సముద్రపు అలలు

సాధారణంగా మనం సముద్రతీరాన ఆలయానికి వెళ్ళినప్పుడు మనం బయటవున్నంతసేపు సముద్రపు అలలు,వాటి శాభ్దాలు మనకు వినిపిస్తాయి. లోపలికి వెళ్ళినాకూడా ఆ శాభ్దాలు స్పష్టంగా వినిపిస్తాయి.

PC:youtube

సముద్రపు అలలు

సముద్రపు అలలు

కానీ ఈ పూరీ జగన్నాధ ఆలయంలో అలా వుండదు. సింహద్వారం గుండా ఆలయంలో ప్రవేశిస్తూ ఒక్క అడుగు గుడి లోపలికి పెట్టగానే సముద్రంలో నుంచి వచ్చే శబ్దం ఏ మాత్రం వినిపించదు. కానీ ఎప్పుడైతే బయటకు అడుగు పెడతారో వెంటనే చాలా క్లియర్ గా వినపడుతుంది.

PC:youtube

 సముద్రపు అలలు

సముద్రపు అలలు

అయితే సాయంత్రం పూట ఈ రహస్యాన్ని అంత శ్రద్ధగా గమనించలేరు. దీనికి కారణం కూడా వుంది.ఇద్దరు దేవుళ్ళ సోదరి సుభద్రా దేవి ఆలయం లోపల ప్రశాంతత కావాలని కోరటం వల్ల ఇలా జరుగుతుందని ఆలయ పూజారులు చెప్తారు.

PC:youtube

సముద్రపు అలలు

సముద్రపు అలలు

అంతేకానీ దీని వెనక ఎలాంటి సైంటిఫిక్ రీజన్స్ లేవని వివరిస్తారు కూడా. ఈ ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారుచేసినవి. ఇక్కడ శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు.

PC:youtube

పూరీలో గొప్ప రథం ఫెస్టివల్

పూరీలో గొప్ప రథం ఫెస్టివల్

ప్రతి సంవత్సరం పర్యాటకులు అధిక సంఖ్యలో రథయాత్ర లేదా రథం ఫెస్టివల్ సమయంలో సందర్శిస్తారు. పండుగ సమయంలో దేవతలైన జగన్నాథ్,బలభద్ర మరియు సుభద్రల విగ్రహాలను బాగా అలంకరించిన రథాల్లో ఉంచి గుండిచ ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చితిరిగి జగన్నాథ ఆలయానికి తీసుకువస్తారు.

PC:youtube

పూరీలో గొప్ప రథం ఫెస్టివల్

పూరీలో గొప్ప రథం ఫెస్టివల్

ఈ ఉత్సవము సాధారణంగా జూలై నెలలో జరుగుతుంది. ఈ ఉత్సవము పూరీ పర్యాటక క్యాలెండర్ లో అత్యంత ముఖ్యమైన ఆకర్షణగా చెప్పవచ్చు.

PC:youtube

మరొక ప్రత్యేకత

మరొక ప్రత్యేకత

ఇక్కడ దేవునికి సమర్పించే ప్రసాదంది.పూరీ జగన్నాధ ఆలయంలో 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు.ఈ ప్రసాదాలు కేవలం ఆలయ వంటశాలలో మట్టికుండలో మాత్రమే తయారు చేస్తారు. ఈ ప్రసాదాలు చేసి దేవుడికి సమర్పించే ముందు వరకు ఎలాంటి రుచి,వాసన వుండదు.

PC:youtube

మరొక ప్రత్యేకత

మరొక ప్రత్యేకత

ఎప్పుడైతే దేవుడికి సమర్పిస్తారో వెంటనే ఘుమఘుమలతో పాటు రుచి కూడా వుంటుంది.మరొక ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక సంవత్సరం వరకు పాడవకుండా వుంటుందట.ఈ ప్రసాదాన్ని దాదాపు 2000మంది దగ్గర నుంచి 2 లక్షల వరకు భక్తులకు ఇవ్వొచ్చు.

PC:youtube

మరొక ప్రత్యేకత

మరొక ప్రత్యేకత

ఇంకా దేవుడికి పెట్టె నైవేద్యం 7మట్టి కుండలలో ఒకదాని పైన ఒకటి పెట్టి వండుతారు.సాధారణంగా మంట పైన వున్న కుండలోని ఆహారం మొదటగా వుడుకుతుంది.కానీ ఇక్కడ ఏడవకుండలోని ఆహారం వుడికినతర్వాత చివరగా వున్న కుండలోని ఆహారం వుడుకుతుంది.

PC:youtube

మరొక ప్రత్యేకత

మరొక ప్రత్యేకత

అదే ఇక్కడి ప్రసాదం,నైవేద్యం యొక్క ప్రత్యేకత.ఇన్ని విశేషాలు, అద్భుతాలు కలిగిన పూరీ జగన్నాథ్ ఆలయాన్ని ప్రతీ ఏడాది లక్షలమంది భక్తులు సందర్శిస్తారు.మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా ఈ అద్భుతాన్ని చూసి తరించండి. తప్పకుండా పూరీ జగన్నాధఆలయాన్ని దర్శించండి.

PC:youtube

పూరీ మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు

పూరీ మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు

పర్యాటకులకు పురీలో సందర్శించటానికి అనేక ఆలయాలు ఉన్నాయి. హిందువులకు పూరీ భారతదేశంలో ఉన్న ఏడు అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటిగా ఉన్నది. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ ఆలయమే కాక చక్ర తీర్థా ఆలయం, ముసిమ ఆలయం, సునర గౌరంగ్ ఆలయం, శ్రీ లోక్నాథ్ ఆలయం, శ్రీ గుండిచ ఆలయం, అలర్నాథ్ ఆలయం మరియు బలిహర్ చండి ఆలయం మొదలైనవి హిందువులకు ముఖ్యమైన ప్రార్థనా ప్రదేశాలుఉన్నాయి.

PC:youtube

పూరీ మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు

పూరీ మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు

మరొక ప్రత్యేకతగోవర్ధన మఠం వంటి మఠాలు దైవిక ఉపశమనం అందిస్తున్నాయి. బేడి హనుమాన్ టెంపుల్ కి సంబంధించిన స్థానిక పురాణము కలిగి ఉంది. పూరీ బీచ్ మరొక ముఖ్యమైన పర్యాటక ఆకర్షణ కేంద్రంగా ఉంది.

PC:youtube

 పూరీ మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు

పూరీ మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు

వార్షిక పూరీ బీచ్ ఫెస్టివల్ పూరీ పర్యాటకంలో ఆకర్షణగా ఉంటుంది. ఈ బీచ్ ను హిందువులు పవిత్రమైనదిగా భావిస్తారు. అంతేకాక ఈ బీచ్ సుందరమైన వీక్షణ నిజంగా మంత్రముగ్ధుణ్ణి చేస్తుంది.

PC:youtube

పూరీ మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు

పూరీ మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు

ఉదయిస్తున్న సూర్యుడి చూడటం లేదా అస్తమిస్తున్న సూర్యుడి చూడటంతో తీర్థయాత్ర ముగుస్తుంది అనుకుంటున్నారా? కానేకాదు పర్యాటకులు బలిఘి బీచ్ వద్ద కోణార్క్ సముద్ర డ్రైవ్ చేయవచ్చు. పూరీ మతసంబంధ ఆసక్తికరమైన మరొక ప్రదేశం హిందూ మత శ్మశానం స్వర్గాద్వర్ ఉంది.

PC:youtube

పూరీ మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు

పూరీ మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు

పూరీ నుండి 14 కిమీ దూరంలో భారతదేశం యొక్క సాంస్కృతిక రాజధాని రఘురజ్పూర్ ఉన్నది. ఒరిస్సాలో అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన షాఖిగోపాల్ పూరీ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

PC:youtube

పూరీ మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు

పూరీ మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు

నీటి ప్రేమికులు లేదా సర్ఫింగ్ ఆస్వాదించే వారికి మరొక అద్భుతమైన ఆకర్షణ కేవలం పూరీ నుండి 50 కిమీ దూరంలో సాత్పదా వద్ద ఉంది. పూరీ నుండి సాత్పదా చేరుకోవటానికి అనేక బస్సులు మరియు టాక్సీలు అందుబాటులో ఉంటాయి.

PC:youtube

పూరీ సందర్శించడానికి ఉత్తమ సమయం

పూరీ సందర్శించడానికి ఉత్తమ సమయం

ఈ ప్రదేశాన్ని దర్శించడానికి ఉత్తమ సమయం జూన్ నెల నుండి మార్చి వరకు ఉంటుంది.

PC:youtube

ఎలా వెళ్ళాలి

ఎలా వెళ్ళాలి

1. ఒడిశాలోని పూరి క్షేత్రానికి దేశంలోని అన్ని ప్రాంతాలతో రవాణా సదుపాయం వుంది.
2. భువనేశ్వర్‌లోని బిజూపట్నాయక్‌ విమానాశ్రయం పూరికి 60 కి.మీ. దూరంలో వుంది.
3. దేశంలోని ప్రధాన నగరాల నుంచి పూరీకి రైలు సర్వీసులు నడుస్తున్నాయి.
4. కోల్‌కతా-చెన్నై ప్రధాన రైలుమార్గంలోని ఖుర్ధారోడ్‌ రైల్వేస్టేషన్‌ ఇక్కడ నుంచి 44 కి.మీ. దూరంలో వుంది.
5. భువనేశ్వర్‌, కోల్‌కతా, విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యముంది.

 పూరీ చేరుకోవడం ఎలా

పూరీ చేరుకోవడం ఎలా

పూరీ విమాన, రోడ్డు మరియు రైలు మార్గాలతో అనుసంధానం చేయబడివుంది.

PC: google maps

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి