Search
  • Follow NativePlanet
Share
» »మహ్మద్ ప్రవక్త పవిత్ర కేశం భద్రపరచబడిన ప్రాంతం మన తెలుగు రాష్ట్రాల్లోనే?

మహ్మద్ ప్రవక్త పవిత్ర కేశం భద్రపరచబడిన ప్రాంతం మన తెలుగు రాష్ట్రాల్లోనే?

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని పర్యాటక ప్రాంతాల గురించి కథనం.

హైదరాబాద్ అన్న తక్షణం మీకు కేవలం బిర్యానీ, ఛార్మినార్ మాత్రమే గుర్తుకు వస్తోందా? అయితే మీరు చాలా మిస్ అవుతున్నట్లు లెక్క. మూసినది ఒడ్డున ఉన్న ఈ హైదరాబాద్ కు ఘనమైన చరిత్ర ఎంతో ఉంది. కుతుబ్ షాహీ వంశానికి చెందిన మహ్మద్ ఆలీ కుతుబ్ షాహీ ఈ పట్టణానికి పునాది వేశారు. అటు పై భారత దేశానికి స్వతంత్రం వచ్చే వరకూ ఇది నిజాం వంశీయుల చేతిలో ఉంది. 16 వ శతాబ్దం నుంచి ఈ పట్ణణంలో దర్శించదగిన ఎన్నో కట్టడాలు ఉన్నాయి. ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆ పర్యాటక కేంద్రాలకు సంబంధించిన క్లుప్తమైన సమాచారం మీ కోసం...

అపరిచిత వ్యక్తి రూపంలో మీకు కాళీమాత వివాహం చేస్తుంది.అపరిచిత వ్యక్తి రూపంలో మీకు కాళీమాత వివాహం చేస్తుంది.

మక్కా మసీదు

మక్కా మసీదు

P.C: You Tube

హైదరాబాద్ లోని మక్కా మసీదు భారత దేశంలోని పెద్దదైన మసీదుల్లో ఒకటి. క్రీస్తుశకం 1617లో మహ్మద్ కులీ కుతుబ్ షా మీర్ ఫజులుల్లా బేగ్, రంగయ్య చౌదిల ఆధ్వర్యంలో ఈ మసీదును కట్టించాడు.

77 ఏళ్లు

77 ఏళ్లు

P.C: You Tube

అయితే ఈ మసీదు నిర్మాణం పూర్తైనది మాత్రం క్రీస్తుశంక 1694లో. దీని నిర్మాణం కొరకు ప్రతి రోజూ 8వేల మంది కార్మికులు పనిచేశారు. మసీదు నిర్మాణం మొదలు పెట్టినప్పటి నుంచి పూర్తి కావడానికి 77 సంవత్సరాలు పట్టింది.

పవిత్ర కేశం

పవిత్ర కేశం

P.C: You Tube

చార్మినార్ కు నైరుతి దిశలో ఉన్న మసీదు నిర్మాణం కొరకు మక్కా నుంచి ఇటుకలను తెప్పించారని నమ్ముతారు. అందుకే దీనికి మక్కా మసీదు అని పేరు వచ్చింది. దీని హాలు 75 అడుగుల ఎత్తు 220 అడుగులు వెడల్పు 180 అడుగులు. ఈ మసీదులో మహ్మద్ ప్రవక్త పవిత్ర కేశం భద్రపరచబడిందని నమ్ముతారు.

చార్మినార్

చార్మినార్

P.C: You Tube

చార్మినార్ కు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. నాలుగు మినార్లతో నిర్మితమై ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చిందని తెలిసిందే. భారత దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా చార్మినార్ కు పేరు ఉంది.

మొత్తం విస్తీర్ణం 840

మొత్తం విస్తీర్ణం 840

P.C: You Tube

ఈ చారిత్రాత్మక కట్టడం నాలుగు రోడ్ల కూడలిలో గస్తీ తిరిగే సైనికులా ఉంటుంది. చార్మినార్ నిర్మాణం చేపట్టిన మొత్తం స్థల విస్తీర్ణం 840 చదరపు గజాలు. ఇది హైదరాబాద్ లోని పాత బస్తీలో ఉంది.

ప్లేగు వ్యాధి నివారణ

ప్లేగు వ్యాధి నివారణ

P.C: You Tube

ఈ చారిత్రక కట్టడం యోక్క ప్రఖ్యాతి వలన దీని చుట్టూ ఉన్న ప్రాంతానికి ఛార్మినార్ గా పేరువ చ్చింది. ఈ కట్టడానికి ఈశాన్యంలో లాడ్ బజార్, పడమర గ్రానైట్ తో నిర్మించిన మక్కా మసీదు ఉన్నాయి. మహ్మద్ కులీ కుతుబ్ షా క్రీస్తుశకం 1591లో ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా ఈ కట్టడాన్ని నిర్మించారు.

కుతుబ్ షాహీ సమాధులు

కుతుబ్ షాహీ సమాధులు

P.C: You Tube

కుతుబ్ షాహీ సమాధులు హైదరాబాద్ లోని ప్రసిద్ధ గోల్కొండ కోట సమీపంలో ఉన్నాయి. ఇక్కడ కుతుబ్ షాహీ రాజ వంశానికి చెందిన పలువురు రాజులు నిర్మించిన సమాధులు, మసీదులను మనం చూడవచ్చు.

రెండు అంతస్తుల్లో

రెండు అంతస్తుల్లో

P.C: You Tube

చిన్న సమాధుల వరుసలు ఒక అంతస్తులో ఉండగా పెద్ద సమాధుల వరుసలు రెండు అంతస్తుల్లో ఉన్నాయి. ఒక్కొక్క సమాధి మధ్యభాగంలో శవపేటిక దాని కింద నేలమళిగ ఉంటాయి. ఈ సమాధులు గోల్కొండ కోట కు ఉత్తర దిశలో ఒక కిలోమీటరు దూరంలో ఇబ్రహీం భాగ్ వద్ద ఉన్నాయి.

ఎత్తైన వేదిక మీద

ఎత్తైన వేదిక మీద

P.C: You Tube

సమాధుల సమూహం విశాలమైన ఎత్తైన వేదిక మీద నిర్మించబడ్డాయి. సమాధుల గోపురాలు చదరమైన వేదిక మీద ఆర్చీల మధ్య అమర్చబడ్డాయి. సమాధుల నిర్మాణంలో విభిన్నమైన పర్షియన్, హిందూ మిశ్రిత శైలి కనిపిస్తుంది. సమాధుల చుట్టూ అందమైన ఉద్యానవనాలను చూడవచ్చు.

పైగా సమాధులు

పైగా సమాధులు

P.C: You Tube

పైగా సమాధులను మఖ్బారా షామ్స్- ఆల్-ఉమారా అని కూడా అంటారు. ఈ సమాధులు నిజాం రాజుకు విధేయులుగా ఉంటూ రాజ్య పరిపాలనతో సేనా నాయకులుగా పనిచేసిన పైగా వంశానికి చెందినవి. వీటి నిర్మాణ శైలి కూడా చాలా భిన్నంగా ఉంటుంది.

చార్మినార్ కు ఆగ్నేయంగా

చార్మినార్ కు ఆగ్నేయంగా

P.C: You Tube

పైగా సమాధులు హైదరాబాద్ లోని చార్మినార్ కు ఆగ్నేయంగా 4 కిలోమీటర్ల దూరంలోని పిసల్ బండ ప్రాంతంలో ఒవైసీ అసుపత్రి దగ్గర ఉన్నాయి. సున్నంతో నిర్మించి అందమైన పాలరాయి అమర్చారు. ఈ సమాధులు దాదాపు 200 ఏళ్ల నాటివి. అద్భుతమైన శిల్ప కళా నైపుణ్యం, పూల డిజైన్లతో విశిష్టమైన పర్ాయటక ప్రాంతాలుగా వీటికి పేరుంది.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

P.C: You Tube

ఇది హైదరాబాద్ కు 11 కిలోమీటర్ల దూరంలో గోల్కొండ కోట ఉంటుంది. ఈ కోటను దాదాపు 120 మీటర్ల ఎత్తైన నల్లరాతి కొండమీద కట్టారు. కోట రక్షణ కోసం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా ఉంది. గోల్కొండను కాకతీయులు, మహ్మద్ బీన్ తుగ్లక్ తో పాటు బహుమనీ సుల్తానులు కూడా పాలించారు.

నాలుగు వేర్వేరు కోటలు

నాలుగు వేర్వేరు కోటలు

P.C: You Tube

అటు పై నిజాం నవాబులు దీనిని పరిపాలించారు. ఈ గోల్కొండ కోట నాలుగు వేర్వేరు కోటల సముదాయం. ఒక దానిని చుట్టి మరొకటి నిర్మించబడ్డాయి. ఈ కోటను పటిష్టంగా తయారుచేయడంలో కుతుబ్ష హీలదే ప్రధాన పాత్ర.

87 అర్థ చంద్రాకారపు బురుజులు

87 అర్థ చంద్రాకారపు బురుజులు

P.C: You Tube

ఈ కోట 87 అర్థ చంద్రకారపు బురుజులతో కూడిన 100 కిలోమీటర్ల పొడవైన గోడను కలిగి ఉంటుంది. 8 సింహద్వారాలు, 4 ఎత్తైన వంతెనలు ఉంటాయి. ఈ కోట లోపల అనేక మందిరాలు, మసీదులు ఉంటాయి. ఇక్కడ ఫతే దర్వాజ చూడదగినది.

ధ్వని శాస్త్రం

ధ్వని శాస్త్రం

P.C: You Tube

ధ్వని శాస్త్రమును అనుసరించి దీనిని నిర్మించారు. ఈ కోట వద్ద ఒక నిర్మిత ప్రదేశంలో చప్పట్లు కొడితే అటువైపు గోల్కొండ కోటలో అతి ఎత్తైన ప్రదేశం అయిన బాలా హిస్సారు వద్ద ఆ శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X