Search
  • Follow NativePlanet
Share
» » యముడు, నారసింహుడు ఒకే దేవాలయంలో సందర్శనతో కుజదోష నివారణ

యముడు, నారసింహుడు ఒకే దేవాలయంలో సందర్శనతో కుజదోష నివారణ

ధర్మపురిలోని నారసింహ దేవాలయం గురించి కథనం.

భారత దేశంలోని అన్ని నారసింహ క్షేత్రాలతో పోలిస్తే ధర్మపురి నారసింహ క్షేత్రం అత్యంత పురాతన ప్రాధాన్యత కలిగినది. దీని గురించి భారత దేశంలోని అన్ని పురాణాల్లో ప్రస్తావించబడింది. ఇక్కడ గోదావరి దక్షిణ వాహినిగా ప్రవహించడమే కాకుండా ఐదు పవిత్ర పుష్కరిణిలుగా ఏర్పడింది.

అంతే కాకుండా దేశంలో మరెక్కడా లేనట్లు యముడి విగ్రహాన్ని కూడా ఈ దేవాలయాన్ని చూడవచ్చు. అందువల్లే ధర్మపురికి వెళ్లినవారికి యమపురి ఉండదన్న నానుడి వచ్చింది. ఇది హరిహర క్షేత్రం. అంతే కాకుండా త్రిమూర్తి క్షేత్రం కూడా.

అంటే ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దేవాలయాలు ఉన్నాయి. ఇటువంటి క్షేత్రం దేశంలో మరెక్కడా లేదు. ఇక్కడ దైవ దర్శనంతో కుజదోష నివారణ జరుగుతుందని చెబుతారు. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ దేవాలయానికి సంబంధించిన పూర్తి స్థాయి కథనం మీ కోసం.

అత్యంత పవిత్రమైనది

అత్యంత పవిత్రమైనది

P.C: You Tube

గోదావరి తీరంలోని ప్రసిద్ధ క్షేత్రాల్లో ధర్మపురిలోని లక్ష్మీనారసింహ స్వామి క్షేత్రం అత్యంత పవిత్రమైనది. ఈ దేవాలయానికి ఎన్నోవిశిష్టతలు ఉన్నాయి. అందువల్లే నారసింహ క్షేత్రాల్లో ఈ దేవాలయానికి ప్రత్యేక స్థానం ఉంది.

ధర్మవర్మ అనే రాజు పేరు పై

ధర్మవర్మ అనే రాజు పేరు పై

P.C: You Tube

ఈ ప్రాంతాన్ని ధర్మవర్మ అనే గొప్ప రాజు పాలించడంతో ఈ క్షేత్రానికి ధర్మపురి అనే పేరువచ్చినట్లు చెబుతారు. ఈ ధర్మవర్మ తపస్సుకు మెచ్చిన నారసింహుడు యోగ నారసింహుడి రూపంలో ప్రహ్లాద సమేతుడై ఇక్కడ సాలగ్రామ రూపంలో వెలిశాడని చెబుతారు.

త్రిమూర్తి క్షేత్రం

త్రిమూర్తి క్షేత్రం

P.C: You Tube

అదేవిధంగా ఈ క్షేత్రాన్ని త్రిమూర్తి క్షేత్రం అని కూడా అంటారు. ఇక్కడ బ్రహ్మ విగ్రహంతో పాటు ఆ పరమశివుడు శ్రీ రామలింగేశ్వరుడి పూజలందుకొంటున్నారు. అందువల్లే ఈ క్షేత్రాన్ని త్రిమూర్తి క్షేత్రం అనే కాకుండా హరిహర క్షేత్రం అని కూడా పిలుస్తారు.

యమధర్మరాజు విగ్రహం

యమధర్మరాజు విగ్రహం

P.C: You Tube

యమలోకంలో నిత్యం పాపులను శిక్షిస్తూ క్షణం తీరిక లేని యమధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరి నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని సాంత్వన పొందినట్లు చెబుతారు. అందువల్లే ఈ ఆలయం ద్వారం కుడివైపున యమధర్మరాజు విగ్రహం ఉంటుంది.

 అత్యంత పవిత్రమైన పుష్కరిణిలు

అత్యంత పవిత్రమైన పుష్కరిణిలు

P.C: You Tube

ఇలా ఒక నారసింహ క్షేత్రంలో యమధర్మరాజు విగ్రహం ఉండటాన్ని మనం ధర్మపురిలో తప్ప మరెక్కడా చూడలేము. అందువల్లే ధర్మపురికి వెలితే యమపురికి వెళ్లరన్న నానుడి వచ్చింది. ఈ క్షేత్రంలో బ్రహ్మగుండం, సత్యవతి గుండం, యమగుండం, పాలగుండం, చక్రగుండం పేర్లతో పుష్కరిణిలు ఉన్నాయి.

దక్షిణ వాహినిగా గోదావరి

దక్షిణ వాహినిగా గోదావరి

P.C: You Tube

అదే విధంగా ఎక్కడా లేనివిధంగా ధర్మపురి క్షేత్రంలో గోదావరి దక్షణవాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్లే ఈ క్షేత్రంలో భక్తులు మూడు సార్లు గోదావరి స్నానం చేస్తే మూడు జన్మల్లో చేసిన పాపములు తొలిగిపోతాయని శ్రీ దత్తాత్రేయ పురాణాల్లో ఉంది.

కుజదోష నివారణకు

కుజదోష నివారణకు

P.C: You Tube

అదే విధంగా ధర్మపురి క్షేత్రం పితృకర్మలకు, కుజదోష నివారణకు ప్రసిద్ధి చెందినది. కుజదోషమున్నవారు ఈ క్షేత్రంలో స్వామివారి కళ్యాణం చేయిస్తే దోష నివారణ జరిగి వారికి త్వరగా విహామవుతుందని భక్తులు బలంగా నమ్ముతారు.

వివాహం తర్వాత కూడా

వివాహం తర్వాత కూడా

P.C: You Tube

ఇదిలా ఉండగా కొన్ని సార్లు కుజదోషం ఉన్నట్లు తెలియక వివాహం కొంతమంది వివాహం చేసుకొంటూ ఉంటారు. అటువంటి సమయాల్లో వివాహానంతరం వైవాహిక జీవితంలో అనేక సమస్యలు వస్తాయి.

సరిగంగ స్నానాలు

సరిగంగ స్నానాలు

P.C: You Tube

ఇటువంటి వివాహానంతర కుజదోషాలకు ధర్మపురి మంచి పరిహారంగా పనిచేస్తుందని పూజారులు చెబుతున్నారు. అందువల్లే ఇక్కడ దంపతులు గోదావరి తీరంలో సరిగంగ స్నానాలుచేసి, ఆ దుస్తులతోనే స్వామివారిని అర్చిస్తే ఎటువంటి వైవాహిక సమస్యలైనా ఇట్టే తొలిగిపోతాయని వారు చెబుతారు.

వివిధ పురాణాల్లో

వివిధ పురాణాల్లో

P.C: You Tube

ధర్మపురి దేవాలయానికి సంబంధించిన సమాచారం వివిధ పురాణాల్లో మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ దేవాలయానికి సంబంధించిన శాసనసాలు ఇక్కడికి దగర్లో ఉన్న కోటిపల్లిలో ఇప్పటికీ బయటపడుతున్నాయి.

ఐదు నారసింహ దేవాలయాలు

ఐదు నారసింహ దేవాలయాలు

P.C: You Tube

గోదావరి, భద్ర నదులు ఇక్కడ సంగమిస్తాయి. అందువల్లే ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైదిగా ప్రజలు భావిస్తారు. ఈ గ్రామంలో ఐదు నరసింహ దేవాలయాలు ఉన్నాయి. ఇక ఇక్కడ గోదావరి నీరు చాలా స్వచ్ఛమైన నీటితో ప్రవహిస్తూ ఉంటుంది.

మతసామరస్యానికి

మతసామరస్యానికి

P.C: You Tube

పురాణ ప్రాధాన్యత కలిగిన ఈ ధర్మపురి మత సామరస్యానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇక్కడ మసీదు, నరసింహ స్వామి దేవాలయం పక్కపక్కనే ఉంటాయి. గౌతమి మహర్షి ఇక్కడ నదిని తీసుకువచ్చాడు కావబట్టి ఇక్కడ గోదావరిని గౌతమి అని కూడా పిలుస్తారు.

ఇతర దేవాలయాల నిర్మాణానికి

ఇతర దేవాలయాల నిర్మాణానికి

P.C: You Tube

ఇక ఈ క్షేత్రంలోని అనేక దేవాలయాలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లోని దేవాలయాల నిర్మాణానికి అదర్శమని చెబుతారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న రామేశ్వరాలయం భువనేశ్వర్ లోని లింగరాజస్వామి దేవాలయాన్ని పోలి ఉంటుంది.

షద్భుజ నారసింహ విగ్రహానికి

షద్భుజ నారసింహ విగ్రహానికి

P.C: You Tube

అదే విధంగా హంపిలోని షద్భుజ నారసింహ విగ్రహానికి ధర్మపురిలోని మసీదు నారసింహ దేవాలయంలోని విగ్రహమని చెబుతారు. అదేవిధంగా ధర్మపురిలోని అలయాలకు హంపిలోని విఠల, విరూపాక్ష దేవాలయాలకు మధ్య అనేక పోలికలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

కరీం నగర్ నుంచి 70 కిలోమీటర్లు

కరీం నగర్ నుంచి 70 కిలోమీటర్లు

P.C: You Tube

ధర్మపురి కరీంనగర్ నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుది. అదే విధంగా జగిత్యాల నుంచి 27 కిలోమీటర్ల దూరలో హైదరాబాద్ కు 232 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది. ధర్మపురికి సమీపంలో అంటే 42 కిలోమీటర్ల దూరంలో మంచిర్యాల రైల్వే స్టేషన్ ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X