Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ఉజ్జయిని

ఉజ్జయిని -  ఒక జ్యోతిర్లింగం మరియు ఒక ఆధ్యాత్మిక కేంద్రం !

22

ఉజ్జయిని : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిని జిల్లాలో ఉంది, ఇది చరిత్రకు పూర్వం ఉన్న నగరం. ఉజ్జయిని అంటే ఒక అద్భుతమైన విజయం సాధించినవాడు అని అర్థం. ఈ నగరం మతపరమైన కార్యకలాపాల కేంద్రం మరియు ఇక్కడ ఉన్న పురాతన దేవాలయాలు దేశంలో నలుమూలల ఉన్న దర్శకులిని ఆకర్షిస్తున్నవి. ఈ నగరం శిప్రా నది ఒడ్డున ఉన్నది మరియు ఇది శివరాత్రి, కుంభ మరియు అర్ధ కుంభ మేళ వంటి ఉత్సవాలకు ప్రసిద్ధి.

ఉజ్జయిని : దాని చరిత్ర యొక్క ఒక సంగ్రహావలోకనం

ఈ నగరానికి సంబంధించిన అసంఖ్యాక పౌరాణిక కథలు ఉన్నాయి. ఒకానొక సమయంలో ఉజ్జయినిని అశోకుడు మరియు విక్రమాదిత్యుడు వంటి రాజులు పరిపాలించారు. ఈ ప్రదేశంలోనే మహాకవి కాలిదాసుడు పద్యాలను రచించాడు. వేదాలలో కూడా ఉజ్జయిని గురించి చెప్పబడింది మరియు ఈ ప్రదేశంలోనే స్కంద పురాణం, రెండు భాగాలు కూర్చారని అంటారు. మహాభారతంలో, అవంతి రాజ్య రాజధానిగా ఉజ్జయిని నగరాన్ని చెప్పారు. ఈ నగరాన్ని శివుడి నగరంగా గుర్తిచారు మరియు హిందువుల ఏడు పవిత్ర నగరాలలో ఇది ఒకటి. అశోకుడు, వరాహమిహిర, కాలిదసుడు,విక్రమాదిత్యుడు మరియు బ్రహ్మగుప్తుడు వంటి ప్రముఖ వ్యక్తులతో ఈ నగరానికి అంబంధం ఉన్నది.

ఉజ్జయిని : వీధి ఆహార ప్రేమికుల కోసం ఒక స్థలం

ఉజ్జయిని ఈ వీధి ఆహారానికి చాలా ప్రసిద్ధి మరియు టవర్ చౌక్ లో దొరికే ఈ ఆహారాన్ని పర్యాటకులు ఆనందిస్తున్నారు. ప్రయాణికులు నోరూరించే స్థానిక వీధి ఆహారాలైన చాట్లు, పానీ పూరి, భేల్ పూరీ, నెయ్యితో మొక్కజొన్న అల్పాహారం వంటి ఆహారాలను ఆనందిస్తున్నారు. ఉజ్జయిని నగరం గిరిజనుల నగలు, వస్త్రాలు మరియు వెదురు ఉత్పత్తుల కోసం కూడా ప్రసిద్ధి చెందింది మరియు ప్రయాణికులు స్థానిక బజారులో మిగతా వాటితో పాటు వీటిని కూడా కొనుగోలు చేస్తారు.

ఉజ్జయినిలో మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

ఉజ్జయిని పర్యాటక రంగం దాని సందర్శకుల కొరకు కొన్ని ఆకర్షణలు అందిస్తున్నది. ఇక్కడ ఉన్న కొన్నిప్రసిద్ధ ఆలయాలు చింతమన్ గణేష్ టెంపుల్, బడే గణేష్ జి కా మందిర్, హర్సిద్ధి ఆలయం, విక్రమ్ కీర్తి మందిర్, గోపాల్ మందిర్ మరియు నవగ్రహ మందిర్. మహాకాలేశ్వర్ ఆలయం నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం. ఇక్కడ ఉన్నశివాలయం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయాన్ని ఐదు స్థాయిలలో విభజించారు మరియు గణేష్, ఓంకారేశ్వర్ శివ, పార్వతి, షణ్ముఖుడు మరియు నంది విగ్రహాలు ఉన్నాయి.

ఉజ్జయినీలోని ఇతర పర్యాటక ప్రాంతాలు, సిద్ధవట్, బర్తిహరి గుహలు, సాందీపని ఆశ్రమం, కాల్ భైరవ, దుర్గాదాస్ కి చ్చత్రి, గడ్కలిక, మంగల్నాథ్ మరియు పీర్ మత్సఎంద్రనాధ్ ఉన్నాయి. కాళిదాస్ అకాడమితో పాటు కలియదెహ్ పాలస్ ను, అద్భుతమైన నిర్మాణ సౌందర్యం కల సాన్డల్ వాల భవనాన్ని కూడా చూడవొచ్చు. గొప్ప పండితుడు అయిన జై సింగ్ రాజు వేదా శాలను అతని రాజ్య పాలనలో కట్టించాడు. మొత్తం భారతదేశమంతటా అతను కట్టించిన అనేక పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. ఉజ్జయిని నగరం ఖగోళశాస్త్ర అధ్యయనాలు కోసం పేరు పొందింది. విక్రం విశ్వవిద్యాలయం, దానియొక్క సాంస్కృతిక మరియు పాండిత్య కార్యశీలత కోసం ప్రసిద్ధి చెందింది. భారత శాస్త్రీయ భాష అయిన సంస్కృతానికి కాళిదాస్ అకాడమీ ఒక అధ్యయన కేంద్రంగా ఉన్నది. ఉజ్జయిని టూరిజంవారు నగరంలో మరింత సౌకర్యవంతంగా ప్రయాణించటానికి నగర పరిధిలో ఆటో రిక్షాలు, బస్సులు మరియు టాన్గాస్ మొదలైన వాటిని అందుబాటులో ఏర్పాటు చేశారు. భాగస్వామ్య ఆటో రిక్షాలు ఉజ్జయిని నగరంలో చౌకగా అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యం. నగరం లోపల ప్రయాణించటానికి ఎక్కువ శాతం పర్యాటకులు ఈ షేర్డ్ ఆటో రిక్షాలలోనే ఇష్టపడతారు.

ఉజ్జయినికి ప్రయాణం

నగరానికి దగ్గరలో ఇండోర్ విమానాశ్రయం ఉన్నది. ఈ విమానాశ్రయం, ఉజ్జయినికి కేవలం 55 కి.మీ. దూరంలో ఉన్నది. ఉజ్జయిని రైల్వే స్టేషన్ భారతదేశంలోని అన్ని పెద్ద నగరాలకి అనుసంధించబడింది. ప్రయాణికులు ముంబై, భోపాల్, ఢిల్లీ, ఇండోర్, ఆహ్మేదాబాద్ మరియు ఖజురహో నుండి బస్సుల ద్వారా ఉజ్జయిని చేరుకోవొచ్చు. ఇండోర్, భోపాల్, కోట మరియు గ్వాలియర్ నుండి ఉజ్జయినికి రోజువారి బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఉజ్జయిని రైల్వే స్టేషన్ దగ్గరలో మీ బడ్జెట్ కు తగ్గట్టుగా హోటళ్ళు ఉన్నాయి. ఉజ్జయినిలో వేసవిలో తీవ్రమైన ఎండలు మరియు శీతాకాలంలో వణుకు పుట్టించే చలిగా ఉంటుంది.

ఉజ్జయిని దర్శించటానికి ఉత్తమ సమయం

ఈ నగరాన్ని దర్శించటానికి అక్టోబర్ మరియు మార్చ్ నెలల మధ్య అనుకూలంగా ఉంటుంది.

ఉజ్జయిని ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఉజ్జయిని వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఉజ్జయిని

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఉజ్జయిని

  • రోడ్డు ప్రయాణం
    రోడ్ మార్గం ద్వారా: ఈ నగరం రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ పబ్లిక్ బస్సుల ద్వారా జతచేయబడి ఉన్నది. భోపాల్, ఇండోర్, ఆహ్మేదబాద్ మరియు గ్వాలియర్ నుండి ఉజ్జయినికి రోజువారి బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ మార్గంలో ఇవే కాకుండా, డీలక్స్ AC మరియు సూపర్ ఫాస్ట్ బస్సులు కూడా దర్శకులకు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైల్ మార్గం ద్వారా: ఉజ్జయిని జంక్షన్ రైల్వే స్టేషన్ ప్రధాన రైల్వే స్టేషన్; ఇది ఇండియాలోని ముఖ్య రైల్ స్టేషన్ లకు అనుసంధించబడింది. ఉజ్జయిని నుండి ఇండోర్, ఢిల్లీ, పూణే, ముంబై, చెన్నై, కోల్కతా,భోపాల్ మరియు మాల్వా మరియు అనేక ఇతర పట్టణాలకు నేరుగా రైళ్ళు ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం ద్వారా: నగరం నుండి 55 కి.మీ. దూరంలో సేవి ఆహిల్యబాయి హోల్కర్ ఎయిర్ పోర్ట్, ఇండోర్ లో ఉన్నది. ఇండోర్ ఎయిర్ పోర్ట్ నుండి ఇండియా లోని అన్ని ముఖ్య నగరాలకు, ప్రైవేటు మరియు పబ్లిక్ డొమెస్టిక్ విమానమార్గాల ద్వారా అనుసంధించబడింది. ఎయిర్ పోర్ట్ నుండి ఉజ్జయిని చేరుకోవటానికి టాక్సీలు అందుబాటులో లభిస్తాయి. ఇండోర్ నుండి బస్సుల ద్వారా కూడా ప్రయాణికులు ఉజ్జయిని చేరుకోవొచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu