Search
  • Follow NativePlanet
Share
» »క్రిస్మ‌స్ వేడుక‌ల‌కు ముస్తాబయిన‌ న‌గ‌రాలు

క్రిస్మ‌స్ వేడుక‌ల‌కు ముస్తాబయిన‌ న‌గ‌రాలు

క్రిస్మ‌స్ వేడుక‌ల‌కు ముస్తాబయిన‌ న‌గ‌రాలు

ఏటా క్రిస్మస్ వేడుకలను గుర్తుండిపోయేలా చేయడానికి అందమైన ప్రదేశాలను అన్వేషించేవారు చాలామందే ఉంటారు. ఈ ఫెస్టివ‌ల్‌కు అంత‌టి ప్రత్యేక‌త ఉంది. మ‌త‌సంబంధ‌మైన పండ‌గే అయిన‌ప్ప‌టికీ దాదాపు దేశంలోని అంద‌రి మ‌న‌సుల్లో క్రీస్మ‌స్ అంటే ఓ పంగ‌డ‌లా ఉంటుంది మరి. ఈ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఇప్ప‌టికే దేశవ్యాప్తంగా క్రిస్మస్‌కు స్వాగతం పలికేందుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

ప్రజలు క్రిస్మస్ ట్రీలు వేసి, దీపాలు పెట్టి ఇళ్లను అలంకరించుకుంటున్నారు. అదే సమయంలో, కొంతమంది అందమైన ప్రదేశాలలో క్రిస్మస్ జరుపుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సందడి నెలకొంది. ఇందుకోసం దేశంలోని అన్ని ప్రాంతాలలో కలిసి క్రిస్మస్ వేడుకలు జ‌ర‌ప‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ముఖ్యంగా గోవా, కేరళలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుతారు. మీరు కూడా క్రిస్మస్ వేడుకలను గుర్తుండిపోయేలా చేయాలనుకుంటే, ఈ అందమైన నగరాల్లో క్రిస్మస్ ప్లాన్ చేసుకోవ‌చ్చు.

ప్ర‌ధాన గ‌మ్య‌స్థానంగా కేర‌ళ‌..

ప్ర‌ధాన గ‌మ్య‌స్థానంగా కేర‌ళ‌..

క్రిస్మస్ పర్యాటకులకు కేరళ ప్ర‌ధాన‌ గమ్యస్థానంగా నిలుస్తుంది. కేరళలో క్రైస్తవ మతానికి చెందిన వారు ఎక్కువ. క్రిస్మస్‌ను ఘనంగా జ‌ర‌ప‌డానికి ఇదోక కార‌ణంగా కూడా చెప్పొచ్చు. అంతేకాదు, పురాత‌న చ‌ర్చ్ నిర్మాణాలకు కేర‌ళ పెట్టిందిపేరు. ఈ అద్భుత‌మై నిర్మాణ శైలిని అంద‌మైన రంగుల లైట్ల‌తో అలంక‌రించిన‌ప్పుడు చూస్తే ఆ అందం రెట్టింపు అవుతుంద‌నే చెప్పాలి.

ఈ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ సంద‌ర్శ‌కుల‌కు మ‌రింత ఆహ్లాదాన్ని పంచేందుకు ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు. అదే సమయంలో ఇళ్లలో కూడా బంధుమిత్రుల‌తో క‌లిసి కుటుంబ‌స‌మేతంగా పార్టీలు నిర్వహిస్తుంటారు. దీంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. అందుకే మీరు క్రిస్మస్ వేడుకల కోసం కేరళకు నిరభ్యాంత‌రంగా వెళ్లవచ్చు.

ఆర్థిక రాజ‌ధాని ముంబయిలో..

ఆర్థిక రాజ‌ధాని ముంబయిలో..

ముంబ‌యిని దేశ‌ ఆర్థిక రాజధాని అని కూడా అంటారు. ఈ మ‌హాన‌గ‌రం రాత్రి జీవితానికి కూడా పేరుగాంచింది. ఇక్క‌డ‌ క్రిస్మస్ సందర్భంగా ఫెస్ట్ నిర్వహిస్తారు. చర్చిలలో ఆడంబరంగా ఇవి సాగుతుంటాయి. రోడ్లపై రంగురంగుల లైట్లు ఏర్పాటు చేసి, మిరుమెట్లు గొలిపేలా న‌గ‌రాన్ని ముస్తాబు చేస్తున్నారు. అదే సమయంలో మార్కెట్‌ల‌ని షాపింగ్‌తో రద్దీగా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

వ్యాపార సముధాయాలలో సందడి వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంది. నగరం మొత్తం అంద‌మైన క్రిస్మ‌స్ ట్రీల‌తో అలంకరించబడి ఉంది. ప్రజలు తమ ప్రియమైన వారితో క్లబ్బులు మరియు లాంజ్‌లను సందర్శిస్తారు. మీరు మీ స్నేహితులతో కలిసి ముంబ‌యిని సంద‌ర్శించేందుకు ఇదే స‌రైన స‌మ‌యం.

గోవా తీరం.. ఆహ్వానం..

గోవా తీరం.. ఆహ్వానం..

మీరు క్రిస్మస్‌ను గుర్తుండిపోయేలా చేయాలనుకుంటే, గోవాను సందర్శించవచ్చు. క్రిస్మస్ సందర్భంగా గోవాలో ఫెస్ట్‌ను ఏర్పాటు చేస్తారు. క్రిస్మస్ వేడుకలు జరుపుకునేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు గోవాకు వస్తుంటారు. దీని కోసం బీచ్‌లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. నైడ్ క్ల‌బ్‌లు, తీరం వెంబడి అందంగా అలంక‌రించ‌డే రిసార్ట్‌లు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తాయి.

అచ్చంగా చెప్పాలంటే, క్రిస్మస్ వేడుకలకు గోవా సరైన గమ్యస్థానం. ఇది కాకుండా, మీరు ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు మరియు చెన్నైలలో కూడా క్రిస్మస్ జరుపుకోవచ్చు. ఈ న‌గ‌రాలు కూడా క్రిస్మ‌స్ ప‌ర్యాట‌కుల‌కు ఆహ్వానం ప‌లుకుతున్నాయి.

Read more about: kerala mumbai goa
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X