Search
  • Follow NativePlanet
Share
» »వివేక్ ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు వారానికి రెండుసార్లు నడపబడుతోంది

వివేక్ ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు వారానికి రెండుసార్లు నడపబడుతోంది

వివేక్ ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు వారానికి రెండుసార్లు నడపబడుతోంది

దేశంలోనే అత్యంత పొడవైన రైలు వివేక్ ఎక్స్‌ప్రెస్. ఇది డిబ్రూఘర్ నుండి తమిళనాడు దక్షిణాన చివ‌ర‌గా ఉన్న కన్యాకుమారితో అస్సాంను కలుపుతుంది. సుధీర్ఘ రైలు ప్ర‌యాణ‌పు అనుభూతుల‌ను చేరువ‌చేస్తూ అవిశ్రాంతంగా త‌న సేవ‌ల‌ను అందిస్తోంది. వారంలో ఒక్క‌రోజు అందుబాటులో ఉండే వివేక్ ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు వారంలో రెండు రోజులు త‌న ప్ర‌యాణాన్ని కొన‌సాగించ‌నున్న‌ట్లు రైల్వే అధికారులు ప్ర‌క‌టించ‌డంతో ప్ర‌యాణీకులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే విష‌యాన్ని దృవీక‌రిస్తూ ఈ రోజు నుంచి (నవంబర్ 22 నుండి) వారానికి రెండుసార్లు అందుబాటులో ఉంటుందని ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే (NFR) ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.

భారతీయ రైల్వే అత్యంత ప్రాధాన్యమైన రవాణా వ్య‌వ‌స్థ‌గా పేరుగాంచింది. ఎందుకంటే మ‌న దేశంలో సుదూర గ‌మ్య‌స్థానాల‌కు చేరేందుకు స‌గ‌టు ప్ర‌యాణీకులు రైలునే ప్ర‌ధాన ర‌వాణా సాధ‌నంగా వినియెగిస్తారు. ప్రయాణీకులకు అత్యంత సౌకర్యాల‌తో సమయానికి వారి గమ్యాన్ని చేరుకునేలా భార‌తీయ రైల్వే రూపుదిద్దుకుంది. భారతీయ రైలు నెట్‌వర్క్ దేశంలోని మారుమూల ప్రాంతాలను మెట్రోపాలిటన్ నగరాలకు అనుసంధానం చేయ‌డంలో విజ‌యం సాధించింది కూడా. అలా ఉత్తరం, దక్షిణం నుండి తూర్పు మరియు పడమరల మధ్య అంతరాన్ని తగ్గించడం ద్వారా భారతీయ రైల్వే తన రైలు నెట్‌వర్క్‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. అందులో కీల‌క పాత్ర పోషిస్తోంది ఈ వివేక్ ఎక్స్‌ప్రెస్‌.

india-longest-train-vivek-express-1

తొమ్మిది రాష్ట్రాల మీదుగా ప్రయాణం..

నవంబర్ 19, 2011న మొత్తం 59 హాల్ట్‌లతో ప్రారంభించబడిన దిబ్రూఘర్-కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్ మొత్తంగా 4,189 కిలోమీట‌ర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. 80 గంటల్లో తొమ్మిది రాష్ట్రాల మీదుగా ప్రయాణం సాగిస్తోంది. రైలు నెంబ‌ర్‌ 15906 (దిబ్రూఘర్ నుండి కన్యాకుమారి వరకు) గతంలో శనివారాల్లో నడిచే వివేక్ ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు నవంబర్ 22 నుండి ప్రతి మంగళవారం అదనంగా నడుస్తుందని NFR విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. అలాగే, రైలు నెంబ‌ర్‌ 15905 (కన్యాకుమారి నుండి దిబ్రూగఢ్) వివేక్ ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం గురువారం మాత్రమే నడుస్తుంది. ఇప్పుడు నవంబర్ 27 నుండి ఆదివారాల్లో కూడా అందుబాటులో ఉంటుందని ఈ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

india-longest-train-vivek-express-1

మ‌న రైల్వే నెట్‌వ‌ర్క్ సామ‌ర్ధ్యం..

దేశంలోనే అత్యంత పొడవైన రైలుగా ఆరు రోజుల్లో 4,189 కిలోమీట‌ర్ల దూరాన్ని చేరుకోవ‌డంతోపాటు తొమ్మిది రాష్ట్రాల గుండా ప్రయాణించం అంటే మ‌న రైల్వే నెట్‌వ‌ర్క్ సామ‌ర్ధ్యం ఇట్టే అర్థ‌మైపోతుంది. దిబ్రూఘర్-కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్ 74-79 గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. వివేక్ ఎక్స్‌ప్రెస్ వారానికి రెండుసార్లు నడుస్తుందని ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే (ఎన్‌ఎఫ్‌ఆర్) ఇటీవల ప్రకటించింది. గతంలో దిబ్రూఘర్ నుండి శనివారం మాత్రమే నడిచే వివేక్ ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు నవంబర్ 22 నుండి ప్రతి మంగళవారం నడుస్తుంది. అదేవిధంగా, గతంలో కన్యాకుమారి నుండి గురువారం మాత్రమే నడిచే రైలు ఇప్పుడు నుండి ప్రతి ఆదివారం అదనంగా నడుస్తుంది.

భారతదేశంలోని 17 రైల్వే జోన్‌లలో ఒకటైన NFR, మేఘాలయ, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లోని ఏడు జిల్లాలు మరియు బీహార్‌లోని ఐదు జిల్లాలు, ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలలో ఆరింటిలో పూర్తిగా మిగిలిన‌వి పాక్షికంగా క‌వ‌ర్ చేస్తుంది. స్వామి వివేకానంద 150వ జయంతిని పురస్కరించుకుని ఈ రైలు మార్గాన్ని ఏర్పాటు చేశారు.

Read more about: vivek express
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X