Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» తేజ్ పూర్

తేజ్ పూర్  – ఘన చరిత్ర, వర్ణమయ సంస్కృతి!

బ్రహ్మపుత్ర నది ఉత్తర ఒడ్డున వున్న అందమైన నగరం తేజ్ పూర్. సోనిట్ పూర్ జిల్లాకు ఇది ప్రధాన కేంద్రం. తేజ్ పూర్ తన సంస్కృతీ వైభవానికి పేరెన్నిక గన్నది. ఇది కేవలం ఘన చరిత్ర వున్న సాంస్కృతిక కేంద్ర౦ మాత్రమె కాక మంచి విద్యా కేంద్రం కూడా. సంస్కృత౦ లో ‘తేజ్’ అంటే రక్తం, ‘పుర’ అంటే నగరం, వెరసి తేజ్ పూర్ అనే పేరు వచ్చింది.

19

తేజ్ పూర్ లో బహుముఖ పర్యాటకం

భౌగోళికంగా తేజ్ పూర్ లో చాలా మైదానాలు, పర్వత దృశ్యాలు, బ్రహ్మాండమైన నది వున్నాయి. ప్రకృతి ఇక్కడ వైభవంగా వుంటుంది. బ్రహ్మపుత్ర నది అందరినీ అలరిస్తుంటే, సోనిట్ పూర్ జిల్లా ను నగవోన్ జిల్లాకు కలిపే 3015 మీటర్ల పొడవుండే కొలియా భోమోరా వంతెన కూడా అచ్చెరువొందిస్తుంది. నగరంలోని సుప్రసిద్ధ అగ్ని ఘర్ వల్ల తేజ్ పూర్ పర్యాటకం మరింత ఆకర్షణీయం అవుతుంది. అగ్ని ఘర్ పై నుంచి నగరం మొత్తాన్ని చూడవచ్చు.

తేజ్ పూర్ లోని ఆసక్తికర పర్యాటక కేంద్రాలు

పర్యాటకులకు ఆసక్తికరంగా వుండే భైరవి దేవాలయం, కోల్ పార్క్, కొలియా భోమోరా వంతెన, పదు౦ పుఖూరి లాంటి వాటితో పాటు కేతకేశ్వార్ దేవల్, మహాభైరవ్ దేవాలయం, రుద్ర పాద, నాగ శంకర్ దేవాలయం లాంటి కొన్ని శివాలయాలు కూడా చూడదగ్గవి.

చరిత్ర, పురాణాల్లో తేజ్ పూర్

పురాణ గాధల ప్రకారం శ్రీ కృష్ణుడి మనుమడు అనిరుద్ధుడికి, బాణాసురుడి కూతురు ఉష కు మధ్య జరిగిన ప్రేమాయణానికి ఈ నగరం సాక్షి. అయితే, వీళ్ళ ప్రేమ గురించి తెలిసిన బాణాసురుడు, యువరాజును బంధించాడు. అగ్రహోదగ్రుడైన శ్రీ కృష్ణుడు అతని రాజ్యాన్ని ముట్టడించి ఘోరమైన యుద్ధం చేసాడు. ఇక్కడ జరిగిన తీవ్రమైన రక్త పాతం వల్ల ఈ ప్రాంతాన్ని తేజ్ పూర్ లేదా ‘ రక్త నగరం’ అని పిలుస్తారని భావిస్తారు.

ఆధునిక తేజ్ పూర్ మాత్రం 1835 లో బ్రిటిష్ వారు ఈ నగరాన్ని దరాంగ్ జిల్లా కేంద్రంగా మార్చాక వెలుగులోకి వచ్చింది. వ్యూహాత్మక స్థితి వల్లా, అరుణాచల్ ప్రదేశ్ కు దగ్గరగా వుండడం వల్లా ఇక్కడ వాయు సేన, ఆర్మీ జవాన్ల ఉనికి వుంటుంది. వాయు సేనకు ఇక్కడ సుఖోయ్ బేస్ కూడా వుంది (ఇలాంటివి భారత దేశంలో రెండే వున్నాయి – ఒకటి పూణే లో వుంది)

తేజ్ పూర్ – అస్సాం కు సాంస్కృతిక రాజధాని

సాంస్కృతికంగా తేజ్ పూర్ కు చాలా పేర్ల తో అనుబంధ౦ వుంది. ప్రఖ్యాత తొలి అస్సామీ సినీ నిర్మాత జ్యోతి ప్రసాద్ అగర్వాలా, విప్లవ గాయకుడు కళా గురు బిష్ణు ప్రసాద్ రాభా, ప్రసిద్ధ నిర్మాత, నటుడు, ఫణి శర్మ ఇక్కడే జన్మించారు. ఈ నగరాన్ని అస్సాం కు సాంస్కృతిక రాజధానిగా పిలుస్తారు.

తేజ్ పూర్ ఎలా చేరుకోవాలి ?

నిత్యం కోల్కతా, సిల్చార్ లకు విమానాలు తిరిగే చిన్న విమానాశ్రయం తేజ్ పూర్ లో వుంది. రంగియా, రంగపరా లకు మాత్రమె వెళ్ళే రైళ్ళు నడిచే ఒక రైల్వే లైన్ కూడా ఇక్కడ వుంది. అయితే, అస్సా౦ లోని అన్ని ప్రాంతాలకు వెళ్ళే రోడ్డు మార్గాలు తేజ్ పూర్ నగరానికి కీలకం.

తేజ్ పూర్ వాతావరణం

తేజ్ పూర్ లో సాధారణంగా భారీ వర్ష పాతం వుంటుంది. ఇక్కడ తీవ్రమైన వేసవి తో పాటు ఆహ్లాదకరమైన శీతాకాలాలు వుంటాయి.

శీతాకాల సమయంలో ఉష్ణోగ్రత 36 డిగ్రీల వరకు పెరుగుతుంది, ఉష్ణోగ్రత షుమారు 7 డిగ్రీల తక్కువకు పడిపోతుంది. వర్షాకాలంలో ఈ నగరంలో భారీవర్షాలు ఉంటాయి.

తేజ్ పూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

తేజ్ పూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం తేజ్ పూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? తేజ్ పూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా తేజ్ పూర్ కు రోడ్డుమర్గాలే జీవన రేఖలు. గౌహతి నుండి, తేజ్ పూర్ చేరుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి 52 వ జాతీయ రహదారి పై ఉన్న (166 కిలోమీటర్లు) మంగల్డై, ఉడల్బరి, రెండోది 37 వ జాతీయ రహదారిపై ఉన్న (185 కిలోమీటర్లు) నగోన్. ఈ రెండు మార్గాల నుండి పగలు, రాత్రి బస్సులు అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం ద్వారా ఈ నగరంలో రైలు మార్గం సరిగా లేదు. తేజ్ పూర్ నుండి రైళ్ళు కేవలం రంగపర (24 కిలోమీటర్ల దూరం), రంగియ (150 కిలోమీటర్ల దూరం) చేరుకుంటాయి. ఈ అందమైన నగరాన్ని చేరుకోవడానికి రైలు మార్గం సరైనది కాదు. అయితే, పర్యాటకులు గౌహతి (166 కిలోమీటర్ల దూరం) నుండి రైలు ఎక్కి అక్కడినుండి బస్సులో తేజ్ పూర్ చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా తేజ్ పూర్ కోల్కతా, సిల్చార్ నుండి తరచూ విమానాలు కలిగి క్రియాత్మక విమానాశ్రయం ఉన్నప్పటికీ, ఈ నగరానికి ప్రయనిన్హదానికి ప్రసిద్ది చెందిన మార్గాలలో ఇది ఒకటే కాదు. తేజ్ పూర్ విమానాశ్రయాన్ని భారత వైమానిక దళం వారి వైమానిక స్థావరంగా ఉపయోగిస్తారు. ఈ విమానాశ్రయం సిటీ సెంటర్ నుండి షుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Sun
Return On
27 Apr,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Sun
Check Out
27 Apr,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Sun
Return On
27 Apr,Mon