» »మనాలిలో దాగివున్న అద్భుత ప్రదేశాలు

మనాలిలో దాగివున్న అద్భుత ప్రదేశాలు

Posted By: Venkata Karunasri Nalluru

మనాలి హిమాచల్ ప్రదేశ్ లో ఒక సుందరమైన పట్టణం. ఎత్తైన మంచు శిఖరాలు కలిగిన ఈ ప్రదేశంలో లష్ లోయలు మరియు పువ్వులు గల పచ్చికభూములు కలిగివున్నాయి. భారతదేశంలో సందర్శించాల్సిన ఉత్తమ ప్రదేశాలలో మనాలి ఒకటి. డిసెంబర్ నుండి జనవరి నెలల మధ్యలో చుట్టూ మంచు దుప్పటి పరచుకుని అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. వర్షాకాలం ఇక్కడ అత్యంత ఘోరంగా అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడతాయి. ప్రతి ప్రయాణికుడు మనాలిలో తప్పక చూడవలసిన పది ప్రాంతాల జాబితాను ఇక్కడ పొందుపరుస్తున్నాం.

ప్రతి ట్రావెలర్ తప్పకచూడవలసిన మనాలిలో దాగివున్న 10 ప్రదేశాలు

1. మలానా

1. మలానా

మలానా మనాలి నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్వతీ లోయలో వున్న ఒక చిన్న హిమాలయ కుగ్రామం. జమదగ్ని మరియు రేణుకా దేవి ఆలయాలు మలానా గ్రామంలో వున్న చూడదగ్గవి. ఇక్కడ ప్రసిద్ధిపొందిన అందమైన రాతి చెక్కడాలు వున్నాయి. ఇక్కడ ట్రెక్కింగ్ చేయాటానికి చాలా థ్రిల్లింగ్ గా వుంటుంది.

PC: flickr.com

2. హిడింబా దేవి ఆలయం

2. హిడింబా దేవి ఆలయం

మందపాటి దేవదారు అడవులతో నిండివున్న కొండ మీద 1553నాటి హిడింబా దేవి ఆలయం చూడవచ్చును. ఆలయంలో పురాతన భారతీయ ఇతిహాసమైన మహాభారతంలో ఒక ముఖ్యమైన పాత్ర అయిన హిడింబా ఇక్కడ పూజలందుకుంటుంది. నిశితంగా రూపొందించబడిన చెక్క ఆలయం ఒక ప్రత్యేకమైన నిర్మాణ శైలిని కలిగి ఉంది.

3. ఖీరగంగా

3. ఖీరగంగా

మనాలి నుండి 95 కిలోమీటర్లలో వున్న పార్వతీ లోయలో ఉన్న ఖీరగంగా వేడి నీటి బుగ్గలకు ప్రసిద్ధి. ఖీరగంగా చేరుకోవడానికి సుమారు11 కిలోమీటర్లు నడవాల్సి వుంది.

4. వశిస్ట్ కుండ్

4. వశిస్ట్ కుండ్

వశిష్ట గ్రామం మనాలి నుండి 5 కిలోమీటర్ల దూరంలో బియాస్ నది ఒడ్డున వున్నది. ఇది సల్ఫ్యూరస్ వేడి నీటి బుగ్గలకు ప్రసిద్ధి చెందింది. ఈ నీటిలో మునగాలనుకునేవారికి ప్రత్యేక స్నానపు గదులు నిర్మించబడ్డాయి. ఈ నీటిలో అలసిపోయిన శరీరం సడలించడం కోసం సల్ఫర్ నీటి చికిత్సా విలువలు వున్నాయి. ఇక్కడ వశిష్ట మహర్షి యొక్క రాతి ఆలయం ప్రసిద్ధి చెందింది.

PC: flickr.com

5. గధన్ తెక్ చోక్లింగ్ గొంప

5. గధన్ తెక్ చోక్లింగ్ గొంప

టిబెటన్ ఆశ్రమంలో పాత మనాలి రహదారికి దగ్గరగా వుంది. ఇది ఎక్కువమంది పర్యాటకులకు తెలియదు. ఇది టిబెటన్ చరిత్ర, నిర్మాణం మరియు సంస్కృతిని అన్వేషించడానికి ఒక ఆదర్శ ప్రదేశం. సందర్శకులు ప్రాంగణంలో ఉన్న దుకాణాల నుండి టిబెట్ హస్త కళలు కొనుగోలు చేయవచ్చు. ఆదివారం మినహా అన్ని రోజుల్లో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల మధ్య సందర్శించవచ్చు.

PC: wikimedia.org

6. హిమాలయన్ నైన్గమప గొంప

6. హిమాలయన్ నైన్గమప గొంప

మనాలిలోని బిజీ మార్కెట్ వీధులకు దగ్గరగా ఈ అందమైన హిమాలయన్ నైన్గమప గొంప అసాధారణ ప్రదేశంలో వుంది. ఈ నిర్మాణం చిన్నదైనా ఈ స్థలంలో చాలా ప్రార్థనలు, శ్లోకాలు ప్రశాంత వాతావరణాన్ని కలిగివుంది.

PC: flickr.com

7. అర్జున గుఫ

7. అర్జున గుఫ

అర్జున్ గుఫ (గుహలో) మనాలి నుండి 5 కిలోమీటర్ల దూరంలో వున్న అందమైన బియాస్ నది ఒడ్డున ఉన్నది. ఇది అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశం. ప్రశాంత వాతావరణాన్ని అందిస్తుంది. మహాభారతంలోని అర్జునుడు ఇక్కడ ధ్యానం చేసినందువల్ల ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చింది. మంచుతో కప్పబడిన పర్వతాలు మరియు ఆల్పైన్ అడవులు చూచుటకు అద్భుతంగా వుంటుంది.

8. హంప్ట

8. హంప్ట

మనాలి నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో దాచిన హంప్ట గ్రామం ఉంది. ఏకాంత ప్రశాంతతను కలిగించే ఒక పరిపూర్ణ ప్రదేశం. ఇక్కడ నదిలో ఈత కొత్తవచ్చును. అద్భుత ప్రదేశాలను చూసి ఆనందించవచ్చును. ఇక్కడ సాహసికులు ప్రసిద్ధహంప్ట కనుమ ద్వారా ట్రెక్ చేయవచ్చును.

PC: wikimedia.org

9. మను దేవాలయం

9. మను దేవాలయం

మనాలి దాని పేరును బ్రాహ్మణ స్మృతి కర్త అయిన మనువు పేరు మీదుగా పొందింది. మనాలి అనే పదానికి సాహిత్యపరమైన అర్ధం "మనువు యొక్క నివాసం". పురాణాల ప్రకారం ఒక గొప్ప వరద ప్రపంచాన్ని ముంచి వేసిన తరువాత మరల మానవ జీవితాన్ని సృష్టించడానికి మనువు తన ఓడ నుండి మనాలిలో అడుగుపెడతాడు. మనాలి ఉన్న హిమాచల్ లోని కులు జిల్లా "దేవతల లోయ"గా ప్రసిద్ధిచెందింది. పాత మనాలి గ్రామంలో మనువు యొక్క ప్రాచీనమైన గుడి ఉంది. ఈ గుడి ప్రధాన మార్కెట్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో పాత మనాలిలో వున్నది.

PC: wikimedia.org

10. సోలాంగ్ వాలీ

10. సోలాంగ్ వాలీ

మనాలి నుండి 13 కిమీ దూరంలో విస్తరించివున్న సోలాంగ్ వాలీ హిమనీనదాలు మరియు శక్తివంతమైన హిమాలయాల మంచుతో కప్పబడిన శిఖరాలు చాలా అద్భుతంగా వుంటాయి. అలాగే 'స్నో పాయింట్ గా పిలువబడే సోలాంగ్ వాలీ ఉత్తేజకరమైన శీతాకాలంలో ఒక హాట్ స్పాట్. అలాగే స్కీయింగ్, ఎగిరే పారాచూట్ మరియు పారాగ్లైడింగ్ వంటి వేసవి సాహస క్రీడలు కూడా ఇక్కడ వున్నాయి.