» »అమ్మాయిలూ ఇక్కడకు వెలుతున్నారా...తోడు తప్పక తీసుకెళ్లండి

అమ్మాయిలూ ఇక్కడకు వెలుతున్నారా...తోడు తప్పక తీసుకెళ్లండి

Written By: Beldaru Sajjendrakishore

భారత దేశ సంస్కృతి సంప్రదాయాలతో పాటు ప్రకృతికి ప్రతి ఒక్కరూ దాసోహం. ఇక్కడి అందాలను చూడటానికి దేశంలోని ప్రజలు కూడా ఉవ్విళ్లూరు తుంటారు. దీంతో ఏ చిన్న అవకాశం దొరకినా దగ్గర్లోని పర్యాటక ప్రాంతాలను చూడటానికి వెళ్లపోతున్నారు. మరొకొంతమంది తమకు దూరంగా ఉన్న పర్యటక ప్రాంతాలను కూడా చూడటానికి ప్రత్యేక ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇక విదేశీయులు కూడా మిగిలిన దేశాల కంటే భారత దేశ అందాలను వీక్షించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో భారత దేశం పర్యాటక రారాజు అన్న బిరుదును దక్కించుకుంది. అయితే ఇదంతా నాణ్యానికి ఒక వైపు మాత్రమే. భారత దేశంలో మహిళల, చిన్న పిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. ఇందుకు సంబంధించి గత 30 ఏళ్లలో 50 మిలియన్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా సామూహిక అత్యాచారాలు, చిన్నపిల్లలను వేశ్యవాటికకు అమ్మడం తదితర నేరాలు ఇక్కడ ఎక్కువ. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో గణాంకాలతో పాటు కొన్ని అంతర్జాతీయ సంస్థల నివేదికలను అనుసరించి భారత దేశంలో మహిళలు ఒంటరిగా పర్యాటకం చేయడానికి అంత అనుకూలం కాని ప్రదేశాలు నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం...

1. గోవా

1. గోవా

Image source

గోవా ప్రపంచ పర్యాటక ప్రదేశాల్లో టాప్ 30లో ఒకటి. అదే విధంగా మద్యం సేవించడం, ఇక్కడ డ్రగ్స్ సంస్క`తి కూడా ఎక్కువే. మంద్యం, డ్రగ్స్ నిషాలో ఉన్నవారు ఒంటరి మహిళలు కనబడితే అత్యాచారానికి ఒడగట్టమ మానరు. ఇలాంటి సంఘటనలు ప్రతి నిత్యం ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. పడుపు వ`త్తి ఇక్కడ సర్వసాధారణం. ఉపాధి పేరుతో అమ్మాయిలను ఇక్కడకు తీసుకువచ్చి వేశ్య గ`హాలకు అమ్ముతుంటారు. ఈ నేపథ్యంలో మహిళలు ఇక్కడికి సరైన భద్రత ముఖ్యంగా తోడు లేకుండా వెళ్లడం అంత శ్రేయస్కరం కాదు.

2.ఉత్తరప్రదేశ్

2.ఉత్తరప్రదేశ్

Image source

మహిళల పై అత్యాచారాలు, భౌతిక దాడులు జరిగే విషయంలో ముందున్న ఐదు రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్ కూడా ఒకటి. ఇక్కడి పర్యటక ప్రాంతాల్లో మహిళల పై అనేక సార్లు సామూహిక అత్యాచారాలు జరిగిన సంఘటనలు ఎక్కువ. ఈ విషయాలను మనం నిత్యం ప్రసారమాద్యమాల్లో వస్తూ ఉంటాయి.

3.పూణే

3.పూణే

Image source

మహారాష్ర్టలో ముంబై తర్వాత అతి పెద్ద నగరం పూణే. ఇక్కడ ఇప్పుడిప్పుడే ఐటీ హబ్ తయారవుతోంది. ఈ నగరం చుట్టు పక్కల పలు పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అయితే అక్కడ వసతి సౌకర్యాలు సరిగా ఉండక పోవడంతో చాలా మంది పూణేలోనే రాత్రి బస చేస్తుంటారు. దీంతో ఒంటరి మహిళల పై మగవారి కన్ను ఎప్పుడూ ఉంటుంది. తస్మత్ జాగ్రత్త.

4.హైదరాబాద్

4.హైదరాబాద్

Image source

తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ లో చార్మినార్ నుంచి గోల్గొండ వరకూ అనేక పర్యటక ప్రాంతాలు ఉన్నాయి. ఈ నగరం మొత్తం చూడటానికి కనీసం మూడు రోజులైనా పడుతుంది. ఈ క్రమంలో ఒంటరి మహిళల పై ఎక్కువగానే అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇటీవల ఓ విదేశీ మహిళ పై జరిగిన గ్యాంగ్ రేప్ తో ఈ నగరం మరోసారి వార్తల్లో నిలిచింది.

5.మధ్యప్రదేశ్

5.మధ్యప్రదేశ్

Image source

అటు ఖజురహో వంటి శిల్పకళకు కాణాచి లాంటి ప్రదేశాల నుంచి ఇటు ప్రక`తి రమణీయతను తన సొంతం చేసుకున్న పన్నా నేషనల్ పార్క్ వరకూ ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. వీటిని చూడటానికి దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది పర్యాటకలు నిత్యం వస్తుంటారు. అయితే సరైన భద్రతా ప్రమాణాలు పాటించక పోవడంతో ఇక్కడ నిత్యం మహిళల పై అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటాయి. అందువల్ల మహిళలు ఇక్కడకు వెళ్లడం

6.ముంబై

6.ముంబై

Image source

అసలు నిద్రపోని నగరంగా ముంబైకు పేరు. ఇక్కడ 24 గంటలూ ప్రజలు పనిచేస్తూనే ఉంటారు. ఈ నగరంలోనే అనేక పర్యటాక ప్రాంతాలు ఉన్నాయి. దేశ విదేశీ సంస్క`తి కూడా ఎక్కువే. మరోవైపు మద్యం, డ్రగ్స్ ఏరులై పారుతూ ఉంటుంది. అందువల్ల ఇక్కడి పర్యాటక ప్రాంతాలను వీక్షించేవారు తోడు లేకుండా వెళ్లకండని నిపుణులు చెబుతున్నారు.

7.గుర్గావ్

7.గుర్గావ్

హర్యాణలోని ప్రముఖ పట్టణమైన గుర్గావ్ ఢిల్లీకి అత్యంత సమీపంలో ఉంటుంది. దీంతో చాలా ఢిల్లీ టూర్ కు వచ్చేవారు అక్కడి వసతులతో పాటు ఆర్థిక పరిస్థితుల వల్ల గుర్గావ్ లో బస చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఇక్కడ భద్రతా ప్రమాణాలు అంతంతమాత్రమే. దీంతో మహిళా పర్యటకులకు ఈ ప్రాంతం అంత శ్రేయస్కరం కాదని చెప్పవచ్చు.

8.బెంగళూరు

8.బెంగళూరు

Image source

రెండేళ్ల క్రితం జరిగిన ఘటనతో బెంగళూరు మహిళలకు ఏ మాత్రం భద్రత ఇవ్వని నగరంగా పేరు తెచ్చుకొంది. నగరంలోని ఎంజీ రోడ్డు, బ్రిగెడ్ రోడ్డులో డిసెంబర్ 31న అర్థరాత్రి వేడుకల కోసం చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు, అమ్మాయిలు వస్తూ ఉంటారు. ఆ సమయంలో ఒకే సారి గుంపులు గుంపులుగా అమ్మాయిల పై లైంగిక దాడులు జరిపారు. ఇక ఈ నగరంలో నిత్యం ఏదో ఒక చోట అత్యాచారాలు, మహిళల పై భౌతిక దాడులు జరుగుతూనే ఉంటాయి.

9.కొలకత్తా

9.కొలకత్తా

Image source

ప్రాచీన సంస్కృతి కలిగిన కొలకత్తాలో పొరుగున ఉన్న దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చే వారు ఎక్కువగా ఉంటారు. సమాజిక పరిస్థితుల వల్ల వీరిలో చాలా మంది నేరాల బాట పడుతున్నారని స్థానిక స్వచ్చంద సంస్థల పరిశీలనలో తేలుతోంది. ఇటువంటి వారి వల్ల ఒంటరి మహిళా పర్యాటకులకు ఈ నగరంలో నిత్యం ఇబ్బందులు ఎదురవతూనే ఉన్నాయి.

10.ఢిల్లీ

10.ఢిల్లీ

Image source

దేశ రాజధాని అయిన ఢిల్లీ మహిళల పై అత్యాచారాలు, భౌతిక దాడుల విషయంలో అదే పేరును సంపాదించుకుంది. వెలుతున్న వాహనాల్లోనే మహిళలు సామూహిక అత్యాచారాలకు గురవుతున్నట్లు నిత్యం వార్తలు వినిపిస్తున్నాయి. అందువల్ల ఇక్కడకు వెళ్లే మహిళలు తోడు లేకుండా వెళ్లకండి.