» »కర్నాటకలో కూడా 1000 స్థంభాల గుడి

కర్నాటకలో కూడా 1000 స్థంభాల గుడి

By: Beldaru Sajjendrakishore

వెయ్యి స్థంభాల గుడి అన్న తక్షణం మనకు మదిలో మెదిలేది వరంగల్లోని రామప్ప దేవాలయమే. అయితే కన్నడనాట కూడా వెయ్యి స్థంభాలు కలిగిన దేవాలయం ఉంది.

రేవు పట్టణం మంగళూరుకు 32 కిలోమీటర్ల దూరంలోనే ున్న మూడబిదిరి పట్టణంలో ఈ వెయ్యి స్థంభాల గుడి ఉంది. జైనులకు పరమ పవిత్రమైన ఈ దేవాలయం గురించి పూర్తి వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం....

1. త్రిభువన తిలక చూడామని

1. త్రిభువన తిలక చూడామని

Image Source

ఈ వెయ్యి స్థంభాల గుడి (బసది)ని త్రిభువన తిలక చూడామని, చంద్రనాథ దేవాలయంగా కూడా పిలుస్తారు. ాలయంలో 8 అడుగుల జైన తీర్థాంకరుడైన చంద్రప్రభనాథుడికి ప్రధానంగా పూజలు జరుగుతాయి. చరిత్రను అనుసరించి 1430లో ఈ దేవాలయాన్ని నిరి్మంచినట్లు తెలుస్తోంది. ఈ కట్టడం మొత్తం కఠిన శిలతో నిర్మించడం వల్ల అనేక ప్రక`తి విపత్తులను కూడా తట్టుకుని చెక్కుచెదరకుండా ఉంది.

2. మూడు దశల్లో

2. మూడు దశల్లో

Image Source

ఈ దేవాలయం మూడు దశల్లో మొత్తం 31 ఏళ్లపాటు నిర్మితమయ్యింది. మొదటి దశలో మూలవిరాట్ అయిన చంద్రనాథ్ విగ్రహంతో పాటు గర్భగుడిని నిర్మించారు. అటు పై ప్రార్థనా మందిరాని్న నిర్మించారు. ఇక్కడే అద్భుతమైన శిల్పకళతో కూడిన స్థంభాలు ఉనా్నయి. ఇక చివరి మూడో దశలో 60 అడుగుల ధ్వజస్థంభాని్న నిర్మించారు. ఈ ధ్వజస్థంభం ఏక శిలతో నిర్మించడం ఇక్కడ గమనార్హం.

3. అద్భుత శిల్పకళ, చిత్రకళ

3. అద్భుత శిల్పకళ, చిత్రకళ

Image Source

స్థంభాల పై భారతీయ సంస`తి సంప్రదాయాలకు అద్ధం పట్టే అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. ఈ వెయ్యి స్థంభాల్లో ఏ ఒక్కటీ మరో స్థంభాన్ని పోలి ఉండకపోవడం విశేషం. ఇక జైన సంప్రదాయాలను తెలిపే అనేక కుడ్య చిత్రాలు కూడా ప్రధాన ఆలయ గోడల పై చూడవచ్చు. ఏళ్లు గడిచినా కుడ్య చిత్రాలు ఇప్పటికీ తమ రూపును కోల్పోకపోవడం మరో విశేషం.

4. దక్షిణ జైన కాశీ

4. దక్షిణ జైన కాశీ

Image Source

దేశంలోని జైన మునులు ఒక్కసారైనా మూడబిదిరిలోని ఈ త్రిభువన తిలక చూడామనిని చూడాలని భావిస్తారు. తద్వార జీవితం సార్థకమైనట్లు, చనిపోయిన తర్వాత మరో జన్మ ఉండదని ముక్తి లభిస్తుందని భావిస్తుంటారు. అందువల్లే ఈ మూడ బిదరిని దక్షిణ జైన కాశీ అని పిలుస్తుంటారు. ఇక్కడికి వచ్చిన జైన మునుల్లో చాలా మంది కనీసం నెల రోజులైన గడుపుతారు.

5. మరో 18 దేవాలయాలు

5. మరో 18 దేవాలయాలు

Image Source

ఇక్కడ వెయ్యి స్థంభాల గుడితో పాటు గురు బసది, కోటిశెట్టి బసది. విక్రమశెట్టి బసది, లెప్పడ బసది తదితర 18 దేవాలయాలు ఉన్నాయి. ఇందులో గురు బసది అతి ప్రాచీనమైనది. దీనిని క్రీస్తుశకం 714లో నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ దేవాలయాలన్నీ దగ్గరదగ్గరగా ఉండటం వల్ల మూడు గంటల్లోపు ఈ దేవాలయాలన్నీంటినీ చూడటానికి వీలవుతుంది.

6. వందలకోట్ల రుపాయల విలువ చేసే విగ్రహాలు

6. వందలకోట్ల రుపాయల విలువ చేసే విగ్రహాలు

Image Source

గురుబసదిలో వెలకట్టలేని 52 విగ్రహాలు ఉండేవి. ఇందులో 15 విగ్రహాలను కొన్ని సంవత్సరాల క్రితం దొంగలించబడ్డాయి. అందులో కొన్నింటిని పోలీసులు రికవరీ చేశారు. ఇక ఈ గురుబసదిలో 3.5 మీటర్ల పార్శ్వనాథ విగ్రహం కూడా పర్యాటకులను ఆకర్శిస్తోంది. ఈ బసదిలోనే 12వ శతాబ్ధంనాటి తాళపత్రాల గ్రంథాలను కూడా భద్రపరిచారు.

7. క్రూయిజ్ నౌకలో వచ్చి

7. క్రూయిజ్ నౌకలో వచ్చి

Image Source

క్రూయిజ్ నౌకలో మంగళూరుకు విహారయాత్రకు వచ్చే విదేశీయుల్లో దాదాపు 90 శాతం మంది మూడబిదిరిని తప్పక సందర్శిస్తారు. ఆ సమయంలో ఈ ప్రాంతం విదేశీపర్యాటకులతో కిటకిటలాడుతుంది. గత ఐదేళ్లుగా క్రూయిజ్ నౌకలో మంగళూరుకు వచ్చే యాత్రికుల సంఖ్య పెరుగుతోంది. దరిమిల మూడబిదిరికి ఇప్పుడిప్పుడే విదేశాల్లో కూడా ఆదరణ పెరుగుతోంది.

8. దగ్గర్లో ఇంకా ఏమి చూడవచ్చు

8. దగ్గర్లో ఇంకా ఏమి చూడవచ్చు

Image Source

శ్రావణబెళగోళలోని గోమఠేశ్వరుడి తర్వాత అంతటి ప్రాముఖ్యం కలిగిన గోమఠేశ్వరుడి విగ్రహం వేణూరులో ఉంది. మూడబిదిరిని చూసే వారు అక్కడి నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలోని వేణూరు వెళ్లి అక్కడి గోమఠేశ్వరుడిని తప్పక సందర్శిస్తారు.

9. ఎంత దూరం

9. ఎంత దూరం

Image Source

మంగళూరు నుంచి మూడబిదిరి 32 కిలోమీటర్లు. బెంగళూరు నుంచి మూడబిదిరి 400 కిలోమీటర్లు. ఉడిపి నుంచి మూడబిదిరి 55 కిలోమీటర్లు.

10. ఎలా చేరుకోవచ్చు

10. ఎలా చేరుకోవచ్చు

మంగళూరుతో పాటు బెంగళూరు, ఉడిపి నుంచి మూడ బిదరికి బస్సు సర్వీసులు ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మంగళూరుకు విమానాలు, రైళ్లద్వార చేరుకుంటే అక్కడి నుంచి ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి.