Search
  • Follow NativePlanet
Share
» »ఈ వేసవిలో హైదరాబాద్ చుట్టూ ఉన్నఈ టాప్ 12 బీచెస్ తప్పక సందర్శించండి

ఈ వేసవిలో హైదరాబాద్ చుట్టూ ఉన్నఈ టాప్ 12 బీచెస్ తప్పక సందర్శించండి

మార్చి నెల మొదలైందో లేదో అప్పుడు ఎండలు భగభగ మండిపోతుననాయి. మరో కొద్ది రోజుల్లు పిల్లలకు వేసవు సెలవులు రాబోతున్నాయి. అయితే ఈ వేసవి వేడి తప్పించుకోవాలంటే శరీరానికి ఉపశమనం మనస్సుకు ఆహ్లాదం కలిగించే ప్రదేశాలను ఎంపిక చేసుకోవడం మంచిది. అయితే ఎప్పటిలాగే రొటీగా ఏ ఊటినో, కొడైకెనాల్ కాకుండా ఈ సంవత్సరం కాస్త భిన్నంగా ఎంపిక చేసుకోండి. ఎందుకంటే మనిషి తన జీవితంలో ఆనందాన్ని,ఆహ్లాదాన్ని ఇతరులతో పంచుకోవాలనుకోవడం సహజం.

ప్రస్తుతం వేసవికాలం వస్తుంది కనుక పర్యాటకులు, ప్రకృతి ప్రియులు చల్లదనాన్ని ఆస్వాదించాలనుకుంటారు. చల్లదనం ఎక్కడ దొరుకుతుంది? అంటే తీర ప్రాంతాలలో.... భారతదేశంలోని తీరప్రాంతాలలో చెప్పుకోదగ్గ బీచ్ లు ఉన్నాయి. ఇవి ప్రకృతి ప్రియులను,పర్యాటకులను మరియు స్థానికంగా ఉండే వాళ్ళను ఎక్కువ సంఖ్యలో ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి సముద్ర తీరాలకు వెళ్ళినప్పుడు మనసు చాలా ఆహ్లాదంగా, సంతోషంగా ఉంటుంది. ఇటువంటి ప్రదేశాలకు కుటుంబసభ్యులతో గాని,స్నేహితులతో గాని వెళితే ఉంటుంది ఆ మాటలు వర్ణించలేము.

ఓడరేవు బీచ్:

ఓడరేవు బీచ్:

విజయవాడకు 100 కిమీల దూరంలో చీరాలకు 6 కిమీల దూరంలో ఈ బీచ్ ఉంది. ఉదయం సాయంత్రం వేళల్లో ఈ బీచ్‌కు సమీపంలో ఉన్న జాలర్లు సముద్రంలోకి వేటకు వెళ్తుంటారు. వారు పట్టుకున్న చేపలను ఇక్కడికి వచ్చే పర్యటకులకు అమ్ముతారు. జాలర్లు పర్యటకులను సైతం పడవల్లో ఎక్కించుకుని సముద్రంలోకి తీసుకెళ్తారు.

సూర్యలంక

సూర్యలంక

గుంటూరు జిల్లా, బాపట్ల సమీపం లో ఉన్న ఈ సూర్యలంక బీచ్ ఆంధ్ర ప్రదేశ్ లోనే బాగా పేరు ఉన్న బీచ్. సంవత్సరం లో దాదాపు అన్ని రోజులు ఈ సూర్యలంక బీచ్ సందర్శకులతో కిటకిటలాడుతూనే ఉంటుంది. ఇక్కడి సముద్రపు అలలు అందరిని ఆకట్టుకుంటాయి. ఈ బీచ్ గుంటూరు కి 50 కిలోమీటర్ల దూరం లో ఉంది.

మచిలీపట్నం బీచ్:

మచిలీపట్నం బీచ్:

హైదరాబాద్ సమీపంలో ఉన్న ఒక అద్భుతమైన బీచ్, లేజీ వీకెండ్ లేదా వేసవి విహారానికి ఇది చాలా చక్కటి ఆహ్లాదకరమైన ప్రదేశం. ఈ బీచ్ చుట్టూ కొబ్బరి తోటలు చాలా అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి సందర్శకులను ఆకర్శిస్తుంటుంది. ఈ బీచ్ క్రిష్ణా డెల్టాలకు సమీపంలో కనుగొనబడినది. వేసవిలో అద్భుతంగా ఆకట్టుకోగలిగిన ప్రదేశాల్లో మచిలిపట్నం బీచ్ ఒకటి. ఇది హైదరాబాద్ నుండి 340కిలోమీటర్ల దూరంలో ఉంది

మంగినపూడి

మంగినపూడి

విజయవాడకు 75 కిమీల దూరంలో మచిలీపట్టణం కి 11 కిలో మీటర్ల చేరువలో ఉన్న ఈ బీచ్, చాలా మంది పర్యాటకులకు ఇష్టమైన ప్రదేశం గా పేరు తెచ్చుకుంది. ఇక్కడ రాష్ట్ర టూరిజం శాఖ వారి ఎన్నో అద్భుతమైన రిసార్ట్స్, మిమ్మల్ని మైమరచేలా చేస్తాయి. మంగినపడి దగ్గరలో, చిలకలపూడి అని పల్లెటూరిని కూడా విజిట్ చెయ్యండి, ఇక్కడ చాలా అందమైన ఇమిటేషన్ ఆభరణాలు మీకు లభిస్తాయి. సెలవు దినాల్లో ఈ బీచ్‌లో ఇసుక కూడా కనిపించనంత జనం ఉంటారు. 2004 సునామీ తర్వాత ఈ బీచ్ అత్యంత ప్రమాదకరంగా మారింది. దీంతో ఇందులో స్నానాలు చేయడం ప్రమాదకరమని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

యానం బీచ్:

యానం బీచ్:

చార్మింగ్ బీచ్ డెస్టినేషన్, గోదావరి మరియు కొరింగ నదుల సమీపంలో కనుగొనబడినది. ఇక్కడ పర్యాటకులు తక్కువగా వస్తుంటారు, ఈ బీచ్ లో వాటర్ బ్లూకలర్లో ఉండి ఎక్కువగా ఆకర్షిస్తుంటుంది. దీన్నిరాజీవ్ గాంధీ బీచ్ అని కూడా పిలుస్తారు. ఈ బీచ్ తీరంలో జీజస్ క్రిస్ట్, భరతమాత మరియు లార్డ్ శివ టెంపుల్ ప్రత్యేక ఆకర్షణలు. అలాగే ఈ బీచ్ లో అతి పెద్దగా ఉన్న శివలింగంపై ఇరువైపుల నుండి ఏనుగులు నీటితో అభిషేకం చేసే ద్రుశ్యం పర్యటకులను అమితంగా ఆకర్షిస్తుంది. ఇండియాలో అది హైదరాబాద్ కు సమీపంలో ఉన్నఈ బీచ్ ను సందర్శించడం మర్చిపోకండి. హైదరాబాద్ నుండి 403కిమీ దూరంలో ఉంది.

కాకినాడ బీచ్

కాకినాడ బీచ్

కాకినాడ లో ఉన్న ఈ వాకలపూడి బీచ్, రోజు రోజు కి ఫేమస్ అవుతోంది. ఇక్కడ ఉండే మాన్గ్రోవ్ చెట్ల సంపద, ఊరికి దూరం గా ప్రశాంతం గా ఉండే సముద్రం, పర్యాటకులకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక్కడే ఏటా కాకినాడ బీచ్ ఫెస్టివల్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటయి కూడా.

ఉప్పాడ

ఉప్పాడ

కాకినాడ సమీపం లో ఉన్న ఉప్పాడ బీచ్, తూర్పు గోదావరి జిల్లాల్లో చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడి అలల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. అయితే ఉప్పాడ పరిసర ప్రాంతాలు, వాతావరణం చాలా బాగుంటాయి.

బారువా

బారువా

శ్రీకాకుళం కి 108 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ బీచ్, ఆహ్లాదకరమైన వాతావరణం తో ఆకట్టుకుంటుంది. ఇక్కడ పల్లెటూరి వాతావరణం, సముద్రపు అలల శబ్దాలతో మైమరిచిపోయేలా చేస్తాయి. ఈ బీచ్ ఉన్న ప్రాంతం లోనే, మహేంద్ర తనయ అనే నది, సముంద్రం కలుస్తాయి. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం మిస్ కాకుండా చూడాలి.

భీమునిపట్నం బీచ్

భీమునిపట్నం బీచ్

విశాఖ్పట్నం దగ్గర చూడవలసిన మరో ముఖ్యమైన బీచ్ ఇది. భీముని పట్నం బీచ్ ను భీమిలి బీచ్ అని కూడా అంటారు. గోస్తానీ నది పాయ ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడున్న వాతావరణం చాలా వైవిధ్యంగా, ప్రశాంతం గా ఉంటుంది. ఇక్కడి బీచ్ అందాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. వైజాగ్ నుండి, 20 కిలోమీటర్ల దూరం లో ఈ భీమిలీ బీచ్ ఉంది. ఇది చాలా దూరం కనిపిస్తుంది. ఇక్కడకు దేశ విదేశాల నుంచి జనం వస్తుంటారు.

యారాడ బీచ్

యారాడ బీచ్

యారాడ బీచ్ వైజాగ్ నగరానికి చాలా దగ్గరలో వున్న బీచ్. బీచ్ కి మూడు వైపులా పచ్చని కొండలు మరియు నాలుగో వైపున బంగాళాఖాతం వుంది.ఈ సముద్ర తీరంలో ఒక అందమైన సూర్యాస్తమయంను చూడవచ్చు. బీచ్ పచ్చదనం మరియు బంగారు రంగు ఇసుకతో ఉంటుంది. ఇక్కడ ప్రశాంతత ఎక్కువుగా ఉంటుంది. ఈ బీచ్ ను చాలా శుభ్రంగా నిర్వహిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఇక్కడ అనేక సినిమా షూటింగ్స్ జరుగుతుంటాయి. సాయంకాలం వేళ ఇక్కడ తిరగడం ఒక ప్రత్యేకమైన అనుభూతి.

రిషి కొండ బీచ్

రిషి కొండ బీచ్

రిషికొండ బీచ్ వైజాగ్ నగరానికి 8 కిమీ దూరంలో ఉంది. ఇది కూడా మంచి టూరిష్ట్ స్పాట్. ఇది . ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు పున్నమి రిసార్ట్ ని ఏర్పాటు చేసారు. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో మరొక అందమైన బీచ్ రుషికొండ బీచ్. RK బీచ్ కి అత్యంత చేరువలో ఉన్న ఈ రుషికొండ బీచ్, కొండల నడుమ చాలా విశేషంగా కనపడుతుంది. ఇక్కడ, సముద్ర కెరటాల మధ్య సూర్యోదయాన్ని ఎంతగానో ఆస్వాదించచ్చు. ఇక్కడ సుపీడఁబోట్స్, స్కీయింగ్, విండ్ సర్ఫింగ్ లాంటి ఎన్నో వాటర్ స్పోర్ట్స్ టూరిజం వారు ప్రోత్సహిస్తున్నారు.

వైజాగ్ సమీపం లో ఉన్న మరో ముఖ్యమైన బీచ్ యారాడ బీచ్. ఇది ఒక ప్రైవేట్ బీచ్, ఇందులోకి వెళ్లాలంటే ఎంట్రీ ఫి ఉంటుంది. ఈ ప్రైవేట్ బీచ్ ఎర్రటి ఇసుక దిబ్బల మధ్య చూడటానికి చాలా వైవిధ్యంగా ఉంటుంది. వైజాగ్ సమీపం లో బీచ్లలో ఇక్కడి కెరటాల తాకిడి కొంచెం ఎక్కువగా ఉంటుంది, అలాగే చాలా రాళ్లు ఉండటం వల్ల ఇక్కడ అలలు చాలా పెద్ద ఎత్తున ఎగసిపడుతూ ఉంటాయి.

మైపాడు

మైపాడు

నెల్లూరు కి దగ్గర్లో ఉన్న ఈ మైపాడు బీచ్, రాష్ట్రంలోనే చూడవలసిన బీచ్ ల లో ఒకటి. ఇక్కడ సముద్రపు అందాలను చిన్న చిన్న పడవలు, స్పీడ్ బోట్స్ తో వెళ్లి చూసి వచ్చే అవకాశం కూడా ఉంది. AP టూరిజం వారి సౌకర్యాలు ఈ మైపాడు ప్లేస్ ని సందర్శించే వారికి ఇక్కడున్న ప్రకృతిని ఆనందించే అవకాశాన్ని ఇస్తున్నాయి. ఈబీచ్ నెల్లూరు నగరం నుండి 25 కిలోమీటర్ల దూరం లో ఉంది.

ఇలా ఆంధ్రప్రదేశ్ లో చాలా ముఖ్యమైన, చూడవలసిన బీచ్ లు చాలా ఉన్నాయి . అధికారికంగా పర్యాటక శాఖ వారు సందర్శించటానికి వీలుగా గుర్తించిన బీచ్లు ఇవి. ఇక్కడ బస చేసే హోటల్స్, రవాణ వయవస్థ మిగితా సౌకర్యాలు ఉన్నాయి. ఈసారి ఫ్రెండ్స్ తో గానీ, మీ కుటుంబం తో గానీ ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు ఇందులో మీకు దగ్గర్లోని బీచ్ ను తప్పకుండ చూడండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X