Search
  • Follow NativePlanet
Share
» »మన ఇండియాలో ప్రసిద్ది చెందిన 12 జ్యోతిర్లింగాలు, వాటి పేర్లు, ప్రదేశాలు

మన ఇండియాలో ప్రసిద్ది చెందిన 12 జ్యోతిర్లింగాలు, వాటి పేర్లు, ప్రదేశాలు

భారత దేశంలో ప్రతి హిందువు ఎప్పుడో ఒకసారి జ్యోతిర్లింగాల గురించి వినే ఉంటారు. ఆది దేవుడు, శివుడు, పరమేశ్వరుడు, శంకరుడు, భోళాశంకరుడు ఇలా వివిధ రకాల పేర్లుతో ఆ పరమశివున్ని పిలుచుకుంటారు. అయితే పూజలు మాత్రం లింగాకారంలో ఉన్న శివలింగంకు పూజలు చేయడం సంప్రదాయం. ఒక వయస్సు వచ్చిన తర్వాత వీటిని దర్శించుకోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది.

ప్రతి హిందువుకి జీవిత కాలంలో ఏదో ఒక రోజు జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనే కోరిక ఉంటుంది. జోతిర్లింగము అంటే లింగం రూపంలో శివుడిని ఆరాధించే ప్రదేశం. ఒక నమ్మకం ప్రకారం శివుడు ఉత్తరా నక్షత్రాణ ఒక రాత్రి ఈ భూమిపై అవతరించారని శివపురాణంలో తెలుపబడినది. జ్యోతిర్లింగాలు మొత్తం 64 ఉన్నప్పటికి వాటిలో 12 మాత్రమే ప్రాముఖ్యతను పొందాయి. మరి ఆ 12జ్యోతిర్లింగాలు మన భారత దేశంలోనే ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం..

1 . గుజ‌రాత్ రాష్ట్రం - సోమ‌నాధ జోతిర్లింగం

1 . గుజ‌రాత్ రాష్ట్రం - సోమ‌నాధ జోతిర్లింగం

గుజరాత్‌ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలతో వెలిగించిన దీపం నేటికీ ప్రజ్వరిల్లుతుండడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమ నాథేశ్వరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చంద్రుడే స్వయంగా ఈ సోమనాథేశ్వరుడిని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి.

2. ఆంధ్ర‌ప్ర‌దేశ్ - శ్రీ‌శైలం మ‌ల్లికార్జున స్వామి జోతిర్లింగం

2. ఆంధ్ర‌ప్ర‌దేశ్ - శ్రీ‌శైలం మ‌ల్లికార్జున స్వామి జోతిర్లింగం

శ్రీశైల మల్లికార్జునేశ్వరుడు మన రాష్ట్రంలోని కర్నూలు జిల్లా దోర్నాల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి 52 కిలోమీటర్ల, హైదరాబాద్‌కు 230 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది.ఇక్కడ కృష్ణానది పాతాళగంగా వర్ణిపంబడింది. ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠములలో ఒక్కటి. పరమేశ్వరుడు భార్య గౌరీదేవితో కలిసి స్వయంభువుగా శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జునుడుగా వెలిశాడు. భూ ప్రదక్షిణ ఎవరు ముందు చేస్తే వారికే గణాధిపత్యం అన్న మాట విని బయలుదేరిన షన్ముఖుడికి ప్రతీచోట వినాయకుడే ముందుగా కనిపిస్తాడు. పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం వల్లే ఇలా కనిపిస్తున్నాడని నందీశ్వరుడు చెప్పగా విన్న కుమారస్వామి అలిగి క్రౌంచ పర్వతంపైకి వెళ్లిపోయి కార్తీకుడిగా వెలిశాడు. తన తప్పిదం వల్ల ఇలా జరిగిందని తెలుసుకున్న నందీశ్వరుడు కృష్ణానదీ తీరం శ్రీశైల శిఖరంలో తప్పస్సు చేయగా పార్వతీ పరమేశ్వరులు భ్రమరాంబ సహిత మల్లిఖార్జునులుగా వెలిశారు. శ్రీరాముడు తన వనవాస సమయంలో ప్రతిష్ఠించిన వేయి లింగాలు, పాండవులు వనవాస సమయంలో ప్రతిష్ఠించిన అయిదు లింగాలు ఇక్కడే కొలువు తీరినట్లు చెబుతారు. ఆదిశంకరాచార్యులు ఇక్కడే శివానందాలహరి రాసారని ప్రతీతి.

3.మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఉజ్జయినీలోని - మ‌హాకాళేశ్వ‌ర్ జోతిర్లింగం

3.మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఉజ్జయినీలోని - మ‌హాకాళేశ్వ‌ర్ జోతిర్లింగం

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఉజ్జయినీ పట్టణంలో శ్రీ మహా కాళేశ్వరాలయం ఉంది. క్షిప్ర నది ఒడ్డున ఉంది. ఈ నగరంలో 7సాగరతీర్థములు, 28తీర్థంలు, 84 సిద్ధలింగాలు, 30శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశరుద్రులు, వందలాది దేవతా మందిరాలు, జలకుండము ఉన్నాయి. మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగం. తాంత్రిక మంత్రాలతో నడుపుతున్న జ్యోతిర్లింగాలయం ఇది. ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా, గర్భగుడి శ్రీచక్రయంత్రం తిరగవేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఐదు అంతస్తుల్లో ఉన్న ఆలయంలో మహా కాళేశ్వరుడికి పాతఃకాలం భస్మాభిషేకం చేస్తారు. ఇక్కడ కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు.

4 .మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో న‌ర్మ‌దా న‌ది ద్వీపంలో ఉన్న ఓంకారేశ్వర్ జోతిర్లింగం

4 .మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో న‌ర్మ‌దా న‌ది ద్వీపంలో ఉన్న ఓంకారేశ్వర్ జోతిర్లింగం

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఖాండ్వా జిల్లాలో ఈ పుణ్య‌క్షేత్రం ఉంది. శ్రీ ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు-మామలేశ్వరము,శివపురి, మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో వింద్య పర్వత సానువుల్లో నర్మదానది తీరంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు. ఇక్కడ ఓ లింగము రెండు భాగములుగా ఉండి, రెండు పేర్లతో పూజింపబడుతున్నాడు. ఇక్కడున్న అమ్మవారు అన్నపూర్ణదేవి. సంస్కృత ఓం ఆకారంలో వెలసిన ఈ క్షేత్రంలోని ఓంకారేశ్వర లింగం అమరేశ్వర లింగం పక్కపక్కనే ఉండడం విశేషం.

5. మహరాష్ట్రలోని - వైద్యనాథ్ జోతిర్లింగం

5. మహరాష్ట్రలోని - వైద్యనాథ్ జోతిర్లింగం

శ్రీవైద్యనాథేశ్వరుడు పాట్నా నుంచి సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహారాష్ట్రలో కంతిపూర్‌ దగ్గర పెద్ద శివాలయాన్ని కూడా శ్రీవైద్యనాథ జ్యోతిర్లింగంగా పూజిస్తున్నారు. ఈ రెండింటి నేపథ్యమూ రామాయాణాంతర్గత రావణాసురిడి కథతో ముడిపడి ఉంది. ఈ లింగాన్ని పూజిస్తే వారికి వ్యాధులు నయం మవుతుండడం వల్ల శ్రీవైద్యనాథేశ్వరుడిగా పిలుస్తారని ప్రతీతి. ఈయనను అమృతేశ్వరుడు అని కూడా పిలుస్తారు. అమృతమధనానంతరము ధన్వంతరిని , అమృతమును ఈ లింగంలో దాచిరని, స్పృశించిన భక్తులకుఅమృతం లభించుననీ భక్తుల విశ్వాసం.

6. మహారాష్ట్రలోని శ్రీనాగనాథేశ్వర జోతిర్లింగం

6. మహారాష్ట్రలోని శ్రీనాగనాథేశ్వర జోతిర్లింగం

శ్రీనాగనాథేశ్వరుడు లేదా నాగేశ్వరుడు .మహారాష్ట్ర ప్రభాస రైల్వేస్టేషన్‌కు సమీపంలో శ్రీనాగనాథేశ్వర ఆలయం ఉంది. ఈ జోతిర్గింగాన్ని భూమిపై పుట్టిన మొదటి జ్యోగిర్లింగంగా పరిగనిస్తారు. పాండవులు అరణ్యవాసంలో భాగంగా దారుకా వనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణ గాథ. మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినపుడు శరీరం నిండా పాములు, చేతుల్లో త్రిశూలాలు ధరించిన నగ్నకాపాలికులు వారిని తరిమికొట్టినట్లు కథలు ప్రచారంలో ఉన్నాయి. నాగనాథేశ్వర ఆలయాలు ద్వారాక, ఔధ్ గ్రామ్, ఆల్మోరా అను మూడు ప్రదేశాల్లో ఉన్నట్లు చెబుతారు.

7.తమిళనాడులోని రామేశ్వ‌ర జ్యోతిర్లింగం

7.తమిళనాడులోని రామేశ్వ‌ర జ్యోతిర్లింగం

తమిళనాడు లోని రామేశ్వరంలో కల రామేశ్వర జ్యోతిర్లింగం దక్షిణాదిన ప్రసిద్ధ యాత్రా స్థలంగా పేరు పడింది.శ్రీరామేశ్వరుడు తమిళనాడు రాష్ట్రంలో శ్రీ రామేశ్వరాలయం ఉంది. పురాణగాథ ప్రకారం రావణవధ అనంతరం శ్రీరామచంద్రమూర్తి సేతువును దాటి భారతదేశానికి వస్తాడు. బ్రహ్మ హత్యాపాతకాన్ని తొలగించుకునేందుకు శ్రీరాముడు కాశీ నుంచి శివలింగం తెమ్మని హనుమకు ఆజ్ఞాపిస్తాడు. సుముహూర్త సమయం దాటిపోతుండడంతో సీతాదేవి సముద్రతీరంలో ఇసుకతో లింగం చేసి ప్రతిష్ఠించింది. ఇంతలో కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన ఆంజనేయుడు ఇసుక లింగాన్ని తోకతో లాగేయాలని ప్రయత్నించినా రాలేదు. గర్వభంగమైన ఆంజనేయుడు శివునికి పక్కనే తాను తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు. రామేశ్వరంలో రెండు లింగాలు మనం గమనిస్తాం. రాముడు ప్రతిష్ఠించిన కారణంగా రామేశ్వరంగా ప్రసిద్ధి. రామేశ్వరంలోని నీటి కొలనుల్లో స్నానమాచరిస్తే సమస్త బాధలు పోతాయని భక్తుల విశ్వాసం.ఇక్కడ అమ్మవారు పర్వతవర్ధినీ దేవి.

8. ఉత్త‌రాంచల్ - కేదార్నాథ్ జోతిర్లింగం

8. ఉత్త‌రాంచల్ - కేదార్నాథ్ జోతిర్లింగం

శ్రీ కేధారేశ్వరుడు ఉత్తరాంచల్‌ రాష్ట్రంలో కేదారేశ్వలయం ఉంది. హిమాలయశిఖరం మందాకిని నదీతీరంలో సముద్ర మట్టానికి 3585 మీటర్ల ఎత్తులో ఎద్దుమూపుర ఆకారంలో ఈ జ్యోతిర్లింగం ఉంది. గౌరీకుండ్ నుంచి 14కిలోమీటర్ల దూరం గుర్రాలుపై గానీ, డోలీలో గానీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ఆలయంను సంవత్సరంలో 6నెలలు మాత్రమే తెరుస్తారు. విష్ణుమూర్తి నరనారాయణులుగా కొన్ని వేల సంవత్సరాలు శివుని ధ్యానించి తపస్సు చేసి లోక కల్యాణానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ కథ ఒకటి ఉంది. బొందితో స్వర్గానికి వెళ్లేందుకు పాండవులు ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారని ప్రతీతి. అంతరాలయంలో నేటికీ పాండవులు, ద్రౌపది విగ్రహాలు ఉన్నాయి. ఆదిశంకరాచార్యుల సమాధి, శివపార్వతుల తపోభూమి, ఆదిదంపతుల కళ్యాణసమయంలో హోమగుండం, నేటికీ దర్శించవచ్చు. హరిద్వార్‌ నుంచి గౌరీకుండ్‌ వరకు బస్సు మార్గం ఉంది.

9 . మ‌హారాష్ట్ర నాసిక్ లోని - ట్రింబ‌కేశ్వర్ జోతిర్లింగం

9 . మ‌హారాష్ట్ర నాసిక్ లోని - ట్రింబ‌కేశ్వర్ జోతిర్లింగం

శ్రీత్రయంబకేశ్వరుడు మహారాష్ట్రలోని నాసిక్‌కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ త్రయంబుకేశ్వరాలయం ఉంది. బ్రహ్మవిష్ణువుల ప్రార్థనలతో స్వయంభువుగా వెలసి బ్రాహ్మతో త్రయంబకేశ్వరుడిగా కీర్తనలందుకొన్న త్రయంబకేశ్వర క్షేత్రం గురించి రెండు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడి శివలింగము చిన్న గుంటవలె కనిపించును, అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీకగా మూడు చిన్న లింగములున్నవి.

10 . మ‌హారాష్ట్ర - భీమశంకర్ జోతిర్లింగం

10 . మ‌హారాష్ట్ర - భీమశంకర్ జోతిర్లింగం

శ్రీభీమేశ్వరుడు డాకిని, భువనగిరి జిల్లా, మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వతఘాట్‌లో పూణేకు సుమారు 110 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉపనది భీమ నది ఉద్భవ ప్రాంతంలో భీమశంకర జ్యోతిర్లింగంగా వెలసింది. కుంభకర్ణుని కుమారుడు రాక్షస భీముని నాశనం చేసే ఈశ్వరుడి రూపంలో ఈ లింగం ఉంటుంది. త్రిపురాపుర సంహారం తర్వాత మహాశివుడు విశ్రాంతి తీసుకున్న ప్రదేశం. అమ్మవారు కమలజాదేవి. ఈ జ్యోతిర్లింగం అర్థనాథేశ్వర రూపంలో భక్తులు కోర్కెలు తీర్చేదిగా ప్రసిద్ది. ఇక్కడ శివలింగం నుంచి నిత్యం నీరు ప్రవహిస్తుండడం ఓ ప్రత్యేకత. శివుని రౌద్రరూపం నుంచి వచ్చిన చెమట బిందువులు భీమనదిగా మారిందని స్థల పురాణం.

11.మ‌హారాష్ట్ర ఔరంగ‌బాద్ లోనిశ్రీ ఘృష్ణేశ్వర జోతిర్లింగం

11.మ‌హారాష్ట్ర ఔరంగ‌బాద్ లోనిశ్రీ ఘృష్ణేశ్వర జోతిర్లింగం

శ్రీ ఘృష్ణేశ్వరుడు మహారాష్ట్ర ఔరంగబాద్‌ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో శ్రీవిఘ్నేశ్వరాలయం ఉంది. అజంతా ఎల్లోరా గ్రామంలో ఘృష్ణేశ్వర ఆలయం ఉంది. అజంతా ఎల్లోరా గుహలు, ప్రపంచ ప్రసిద్ధి పొందిన దర్శనీయ పర్యాటక స్థలాలు, దేవగిరి కొండపై ఘృష్ణేశ్వరుని ఆలయం వెలిసింది.

12. విశ్వేశర జోతిర్లింగం-వారణాసి-ఉత్తర్ ప్రదేశ్

12. విశ్వేశర జోతిర్లింగం-వారణాసి-ఉత్తర్ ప్రదేశ్

శ్రీవిశ్వనాథేశ్వరుడు జ్యోతిర్లింగం వారణాసిగా జగత్‌ప్రసిద్ధి చెందిన కాశీక్షేత్రంలో ఉంది. దేవతలు నివసించే పుణ్యక్షేత్రం కాశీపట్టణం. గంగానది తీరంలో బౌద్ధ, జైన మతాలవారు, హైందవులు అనేకమంది తీర్థయాత్రికులు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటారు. అవిముక్త జ్యోతిర్లింగంగా నిలిచే విశ్వేశ్వరాలయం బంగారు శిఖరాలను కలిగి ఉంది. విశ్వనాథ దేవాలయం సన్నిధిలో విశాలాక్ష్మి శక్తిపీఠం ఉంది. కాశీలో ఎన్నో ఆలయాలు, గంగానదీ తీరంలో మరెన్నో స్నానఘట్టాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో స్నాన, దాన, హోమం చేసిన వారికి ఈశ్వర వరప్రసాదంతో మరుజన్మ ఉండదని ప్రతీతి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more