Search
  • Follow NativePlanet
Share
» » హంపి పర్యాటకంలో ఈ ప్రాంతలను చూశారా? లేదంటే ఆ నగరానికి వెళ్లిన ప్రయోజనం శూన్యం

హంపి పర్యాటకంలో ఈ ప్రాంతలను చూశారా? లేదంటే ఆ నగరానికి వెళ్లిన ప్రయోజనం శూన్యం

తుంగభద్ర నది ఒడ్డున ఉన్న హంపి విజయనగర పాలన కాలంలో అత్యంత దేదీప్యమానంగా వెలుగొందింది. ఆ సమయంలో ఇక్కడ అనేక అద్భుత దేవాలయాలు నిర్మించబడ్డాయి. వాటిలోని శిల్పకళ భారత శిల్పకళకు నిదర్శనం.

అంతేకాకుండా ఇక్కడ ఆలయాల్లోని కొన్నిరహస్యాలు ఇప్పటికీ మర్మంగానే ఉండిపోయాయి. ఈ మర్మాలు భారతీయ వాస్తు శిల్పకళకు నిదర్శనం. కేవలం ఆలయాలే కాకుండా చుట్టు పక్కల ప్రదేశాలు ప్రకతి ప్రేమికులను రారమ్మని ఆహ్వనిస్తుంటాయి.

ఫొటోగ్రఫీ అంటే ఇష్టమున్నవారికి ఈ చారిత్రాత్మక నగరం ఎప్పుడూ ఎర్ర తివాచిని పరుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో హంపి చుట్టు పక్కల ఉన్న పర్యాటక కేంద్రాల్లో తొమ్మిది ముఖ్యమైన ప్రదేశాలకు సంబంధించిన వివరాలు మీ కోసం..

విజయ విఠల దేవాలయం

విజయ విఠల దేవాలయం

P.C: You Tube

హంపిలో అత్యంత ఆకర్షణీయ ప్రదేశాల్లో విజయ విఠల దేవాలయం ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ మహావిష్ణువును విఠల రూపంలో కొలుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి రాతి రథం భారతీయ శిల్పకళా చాతుర్యానికి నిదర్శనం. వారంలో అన్ని రోజులూ ఈ దేవాలయం అందుబాటులో ఉంటుంది. ఈ దేవాలయం చూడటానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది.

విరూపాక్ష దేవాలయం

విరూపాక్ష దేవాలయం

P.C: You Tube

భారత దేశంలో పూజాధికార్యక్రమాలు నిర్వహిస్తున్నకొన్ని అతి ప్రాచీన దేవాలయంలో హంపిలోని విరూపాక్ష దేవాలయం కూడా ఒకటి. ఇది ఏడవ శతాబ్దంలో నిర్మించినట్లు శాసనాల ద్వార అర్థమవుతోంది. ఆలయ శిఖరం నీడ తలకిందులుగా పడటం ఇక్కడ ప్రత్యేకత. ఈ దేవాలయం పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఒక గైడ్ ను అద్దె ప్రతిపాదికన తీసుకొంటే మంచిది. ఇదే దేవాలయంలో నీటి లోపల ఉన్న శివలింగాన్ని దర్శించుకోవడం మరిచిపోవద్దు.

హనుమాన్ దేవాలయం

హనుమాన్ దేవాలయం

P.C: You Tube

హంపికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలోని ఆంజనేయ పర్వత శిఖరం పై భాగంలోనే హనుమాన్ దేవాలయం ఉంది. ఇక్కడే హనుమంతుడు జన్మించినట్లు చెబుతారు. తుంగభద్ర నదిని తెప్పలతో దాటి మెట్ల దారి గుండా హనుమాన్ వెలితేనే హనుమాన్ దేవాలయాన్ని చూడవచ్చు. ఎక్కడ కోతులు ఎక్కువ. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి హాని చేయడానికి ప్రయత్నించకండి. ఆలయ సందర్శనకు సుమారు 45 నిమిషాల సమయం పడుతుంది.

సాసువేకాళు గణపతి దేవాలయం

సాసువేకాళు గణపతి దేవాలయం

P.C: You Tube

హంపికి కూతవేట దూరంలోని హేమకుంట పర్వత శిఖరం పై భాగంలో దక్షిణ దిశలో ఈ సాసువే కాళు హనుమాన్ దేవాలయం ఉంది. ఇక్కడి గణపతి బొజ్జపై సాసువులు (ఆవాలు) ఉంచి ప్రార్థించడం వల్ల కోరిన

కోర్కెలు తీరుతాయని చెబుతారు. కన్నడలో సాసువే అంటే ఆవాలు అని అర్థం. ఇక్కడి గణపతి విగ్రహం ఎత్తు 2.4 మీటర్లు. దీనికి దగ్గర్లోనే కడలేకాలు ( వేరుశనగ ) గణపతి విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు.

నరసింహస్వామి దేవాలయం

నరసింహస్వామి దేవాలయం

P.C: You Tube

హంపిలో ఉన్న విగ్రహాల పైకి ఏక శిలలో రూపిందించిన ఉగ్రనరసింహ స్వామి విగ్రహం చాలా పెద్దది. దీని ఎత్తు 6.7 మీటర్లు. దీనిని క్రీస్తు శకం 1528న ఏర్పాటు చేశారు. అయితే విజయనగర సామ్రాజ్యం పై మొఘల్ దండయాత్రల సమయంలో ఈ విగ్రహం పాక్షికంగా దెబ్బతిన్నది. అయినా ఈ ఉగ్రనరసింహ స్వామి విగ్రహంచూడటానికి ఎంతో బాగుంటుంది.

 రాణీవారి స్నానాల స్విమ్మింగ్ పూల్

రాణీవారి స్నానాల స్విమ్మింగ్ పూల్

P.C: You Tube

విజయనరగ రాజుల కాలంలో ఇక్కడ రాజులు, వారి భార్యలు స్నానం చేసేవారని చెబుతారు. అప్పట్లోనే అత్యాధునిక స్విమ్మింగ్ పూల్ ను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒక వైపు నుంచి చల్లని నీరు, మరోవైపు నుంచి వేడి నీరు రావడం ఈ స్విమ్మింగ్ పూల్ ప్రత్యేకత. ఇక్కడ శిల్పకళ, వాస్తు శైలి భారతీయతను ప్రతిభింబిస్తుంది. హంపికి వచ్చిన వారులో దాదాపు 9 శాతం మంది ఈ స్నానాల స్విమ్మింగ్ పూల్

మాతాంగ హిల్స్

మాతాంగ హిల్స్

P.C: You Tube

మాతాంగ పర్వత శిఖరం పై భాగం నుంచి చూస్తూ హంపితో పాటు చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. సాధారణంగా ట్రెక్కింగ్ ద్వారా ఈ పర్వత శిఖరం పై భాగానానికి చేరుకొంటారు. ట్రెక్ సమయం దాదాపు 30 నిమిషాలు. పర్వత శిఖరం పై భాగంలో మనం వీరభద్ర దేవాలయాన్ని చూడవచ్చు. ఇక్కడి నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయాలు చాలా అందంగా కనిపిస్తాయి.

దరోజి అభయారణ్యం

దరోజి అభయారణ్యం

P.C: You Tube

దరోజి అభయారణ్యంలో ముఖంగా ఇండియన్ స్లోత్ ఎలుగుబండ్లను సంరక్షిస్తుంటారు. దీనిని 1994లో ఏర్పాటు చేశారు. ఇటువంటి అభయారణ్యం ఇది ఒక్కటే. ఇక్కడ చిరుతలు, హైనాలు, మచ్చల జింకలను కూడా మనం చూడవచ్చు. ప్రక`తి ప్రేమికులకు ఈ అభయారణ్యం చాలా బాగా నచ్చుతుంది. ఒక్కొక్కరికి రూ.50 ప్రవేశ రుసుం. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సందర్శనా

సమయం. ఈ అభయారణ్యం చూడటానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది.

తుంగభద్ర డ్యాం

తుంగభద్ర డ్యాం

P.C: You Tube

హంపి చుట్ట పక్కల చూడదగిన ప్రాంతాల్లో తుంగభద్ర డ్యాం కూడా ఒకటి. ఇక్కడ ఒక పక్కగా ఉన్న ఉద్యాన వనం మన మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. తుంగభద్ర నది పై నిర్మించిన ఈ ఆనకట్ట జులై నుంచి నవంబర్ మధ్య నిండుకుండలా కనిపిస్తుంది. ఏడు గంటల సమయంలో ఈ ఉద్యానవనంలో మ్యూజికల్ ఫౌటైన అందాలను చూడటానికే చాలా మంది ఇక్కడికి వస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X