• Follow NativePlanet
Share
» »భారతదేశంలోని 7 రహస్యాత్మకమైన మరియు భయంకరమైన ప్రదేశాలు...

భారతదేశంలోని 7 రహస్యాత్మకమైన మరియు భయంకరమైన ప్రదేశాలు...

భారతదేశంలోని అద్భుతమైన వాస్తుశిల్పశైలితో కూడుకునివున్న అనేక సుందరమైన కట్టడాలను చూడవచ్చును. దేవాలయాలే కానీ, స్మారకాలే కానీ, మన సంస్కృతి, వైవిధ్యత మొదలైనవన్నీ పాశ్చాత్యులు ఇష్టపడతారు. అదేవిధంగా ప్రపంచంలో మూలమూలలా అనేకమంది పర్యాటకులు సందర్శిస్తారు. మన భారతదేశంలో అనేక రహస్యమైన ప్రదేశాలు ఉన్నాయి.ఆ ప్రదేశాలలోని రహస్యాలు ఇప్పటికీ పరిష్కరించలేకుండా వున్నాయి. ఈ వ్యాసంలో తెలియజేసే ఒక్కొక్క ప్రదేశం దానికదే స్వంతశక్తిని కలిగివుంది.అయితే ఆ ప్రదేశాలు ఏవి?ఆ ప్రదేశాల వెనక దాచిన రహస్యం ఏమిటి?అనే దానిని గురించి వ్యాసంమూలంగా తెలుసుకుందాం.

కుంభల్గడ్ కోట,రాజస్థాన్

కుంభల్గడ్ కోట,రాజస్థాన్

ఇది మహారాణా ప్రతాప్ యొక్క జన్మ స్థలం. ఇది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలువబడుతుంది. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద గోడ. పురాణకథ ప్రకారం, 1443లో కుంభల్గడ్ యొక్క మహారాణ కుంభ కోటగోడలను నిర్మించుటకు ప్రయత్నించి విఫలమయ్యెను.ఒక ఆథ్యాత్మిక సలహాదారుడు మానవ బలిని సూచించెను.

PC:Aayushsomani

డుమాస్ బీచ్, గుజరాత్

డుమాస్ బీచ్, గుజరాత్

ప్రజల నమ్మకం ప్రకారం, ఈ బీచ్ భయంకరమైన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ రాత్రవుతుందీఅంటే ఒక్క ప్రాణికూడా వుండదు.కారణం ఇక్కడ కంటికి కనపడని శక్తులు సంచరిస్తూవున్నాయని నమ్ముతారు.ఈ పర్యాటకప్రదేశం ఒకానొక కాలంలో స్మాశానం అని స్థానికులు చెప్తారు.రాత్రి సమయంలో ఇక్కడికి గాని వస్తే తిరిగివెళ్ళరని నమ్ముతారు. ఉదయం పూట గుంపులతో రద్దీగా వుండే పర్యాటక ప్రదేశం రాత్రి అవుతోందంటే అందరూ స్థలం ఖాళీ చేస్తారు.

PC: Marwada

రాజస్థాన్ లోని కుల్దారా

రాజస్థాన్ లోని కుల్దారా

ఈ కోట నగర చరిత్రకు వస్తే రాత్రి సమయంలో ఇక్కడ అగోచరశక్తులు ప్రయాణిస్తుంటాయని నమ్ముతారు. ఇదొక పర్యాటకప్రదేశమైనా,రాత్రి సమయంలో మాత్రం ఏ ఒక్కజీవి కూడా ఇక్కడ వుండదు. ఇక్కడ ఒకానొకకాలంలో 85ఇళ్ళు మాత్రమే వుండేవంట.

PC:Suryansh Singh (DarkUnix)

అలియా ఘోస్ట్ లైట్స్, పశ్చిమబెంగాల్

అలియా ఘోస్ట్ లైట్స్, పశ్చిమబెంగాల్

అలియా అనేది వివరించలేని అస్పష్టమైన వింత కాంతి దృగ్విషయం. విచిత్రం ఏంటంటే పశ్చిమబెంగాల్ లోని అలియా ఘోస్ట్ లైట్స్ కనిపిస్తాయి. ఆ రంగు రంగుల దీపాలను దెయ్యాలు అని భావిస్తారు. రాత్రి సమయాలలో ఎవరూకూడా ఆ స్థలాన్ని సందర్శించరు.ఆ లైట్లు చనిపోయిన మత్స్యకారుల దయ్యాలు అని నమ్ముతారు.ఇప్పటికి ఇది ఒక రహస్యప్రదేశంగానే వుంది.ఎందుకంటే ఈ విచిత్రమైన దీపాలు ఎందుకు ఈ విధంగా కనపడుతాయి అనేది ఇప్పటికీ రహస్యంగానే వుంది.

Hermann Hendrich

భాంగ్రా కోట, రాజస్థాన్

భాంగ్రా కోట, రాజస్థాన్

దీనిని ఘోస్ట్ టౌన్ అని పిలుస్తారు. ఒక పురాణకథ ప్రకారం, మాంత్రికుడు గ్రామంలో వున్న ఒక అందమైన యువతి మీద ప్రేమలో పడతాడు.ఆమెను పెళ్ళిచేసుకోవాలని తీర్మానించుకుని ఆమెను బలవంతంగా వివాహమాడటానికి ప్రయత్నిస్తుండగా గ్రామస్థులు ఆమెను తామే పంపుతామని మాంత్రికుడితో విన్నవించుకుంటారు.మాట ఇచ్చిన ప్రజలు రాత్రికిరాత్రే ఆ గ్రామాన్ని విడిచిపెట్టి పోతారు. దీనికి కోపగించిన ఆ మాంత్రికుడు ఆ గ్రామం పిశాచులతో నిండిన గ్రామం అయిపోవాలని శపిస్తాడు.ఈ ప్రదేశంలో ఇప్పటికీ ఒక జీవి కూడా నివసించుటలేదు. కారణం ఈ ప్రదేశంలో అనేక ఆత్మలు సంచరిస్తున్నాయని భావిస్తారు.

PC:Shahnawaz Sid

రూప్ ఖండ్ సరస్సు, ఉత్తరాఖాండ్

రూప్ ఖండ్ సరస్సు, ఉత్తరాఖాండ్

అనేక సంవత్సరాలనుండి మానవుల అస్థిపంజరాలు ఈ సరస్సులో స్పష్టంగా గోచరిస్తున్నాయి.ఇక్కడ అస్థిపంజరాలు, చెక్క కళాఖండాలు, ఇనుము ముంజేతులు, తోలు బూట్లు మరియు వలయాలు ఉన్నాయి. నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ బృందం 30 అస్థిపంజరాలను కనుగొని మాంసాన్ని ఇంకా కొన్ని అస్థిపంజర బోనులకు జత చేయబడింది.

PC: Schwiki

జమాలి-కమాలి మసీదు, ఢిల్లీ

జమాలి-కమాలి మసీదు, ఢిల్లీ

జమాలి-కమలి మసీదు, మెహ్రౌలి పురావస్తు పార్కు, జమాళి లోపల ఉంది. ఇక్కడ ఒక అదృశ్య శక్తులు సంచరిస్తున్నట్లు ప్రజలు నమ్ముతారు.1535 లో ప్రసిద్ధ సుఫీ సన్యాసి జమాలీ మరియు కమాలి యొక్క సమాధి ఇది. ఇది అనేక అదృశ్య శక్తులు కలిగిన ప్రదేశం అని నమ్ముతారు.ఈ మసీదుకి రాత్రిసమయంలో సందర్శించడం సురక్షితం కాదని నమ్ముతారు.

PC:Faheemul

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి