Search
  • Follow NativePlanet
Share
» »350 సంవత్సరాల క్రితం నాటి అద్భుత శివాలయం

350 సంవత్సరాల క్రితం నాటి అద్భుత శివాలయం

ముక్తేశ్వర్ నుండి భారత దేశంలోనే రెండవ ఎత్తైన పర్వతంగా ప్రసిద్ధి చెందిన నందా దేవి పర్వతాన్ని చూసి ఆనందించవచ్చు.

By Venkatakarunasri

ముక్తేశ్వర్ నుండి భారత దేశంలోనే రెండవ ఎత్తైన పర్వతంగా ప్రసిద్ధి చెందిన నందా దేవి పర్వతాన్ని చూసి ఆనందించవచ్చు. ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు వివిధ రకాల పక్షులను, అరుదుగా కనిపించే హిమాలయన్ మౌంటైన్ క్వైల్ పక్షులను చూడవచ్చు. రాక్ క్లైమ్బింగ్, రాప్పేలింగ్ వంటి సాహస క్రీడలను ఈ పర్వత శ్రేణులలో చేపట్టవచ్చు. ఇక్కడి మరిన్ని ఆకర్షణలు గమనిస్తే ..

ముక్తేశ్వర్ ఉత్తరభారతంలోని నైనితాల్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్. ఇది సముద్ర మట్టానికి 2286 మీటర్ల ఎత్తులో కలదు. సుమారు 350 సంవత్సరాల క్రితం నాటి అద్భుత శివాలయం అయినా ముక్తేశ్వర్ ధామ్ అన్న పేరు మీద ఈ ప్రాంతానికి ముక్తేశ్వర్ అన్న పేరువచ్చిందని స్థానికులు చెబుతారు.

ముక్తేశ్వర్

ముక్తేశ్వర్

ముక్తేశ్వర్ ఆలయం, శివునికి అంకితం చేయబడ్డ ప్రాచీన ఆలయం. ఇందులో తెల్లటి పాలరాతి శివుని విగ్రహం ప్రతిష్టించబడి ఉంది. బ్రహ్మ, విష్ణు, పార్వతి, హనుమాన్, గణపతి విగ్రహాలతో పాటు నంది విగ్రహాలు ఆలయంలో కనపడతాయి. ఈ గుడికి రాతి మెట్లు ఎక్కడం ద్వారా చేరుకోవచ్చు.

ముక్తేశ్వర్

ముక్తేశ్వర్

సిట్లా ముక్తేశ్వర్ సమీపాన ఉన్న పర్యాటక మజిలీ. సముద్ర మట్టానికి 6000 అడుగుల ఎత్తున ఉన్న ఈ కొండ ప్రాంతం 36 ఎకరాలలో విస్తరించబడి ఉన్నది. ఇక్కడి నుండి హిమాలయ పర్వతాల యొక్క అందాలను, సూర్యోదయ, సూర్యాస్తమ దృశ్యాలను తిలకించవచ్చు. ఓక్ మరియు పైన్ చెట్లతో సిట్లా కప్పబడి ఉంటుంది.

ముక్తేశ్వర్

ముక్తేశ్వర్

చౌతీ జాలీ వెనక ఒక పురాణ గాధ ఉన్నది. దేవతలకు, రాక్షసులకు మధ్య పోరు ఇక్కడ సాగిందని కధనం. ఏనుగు మొండెం, లోహపు పలక మరియు కత్తి యొక్క సన్నటి సరిహద్దు రేఖలను ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడున్న మరో ప్రధాన ఆకర్షణ క్రీ. శ. 11 వ శతాబ్దానికి చెందిన రాజా రాణి ఆలయం. ఇందులో అందమైన రాతి విగ్రహం కనపడుతుంది.

ముక్తేశ్వర్

ముక్తేశ్వర్

బ్రహ్మెశ్వర ఆలయం క్రీ.శ. 1050 లో నిర్మించినట్లు అక్కడి శాసనాల ద్వారా తెలుస్తుంది. అందమైన శిల్పాలతో అద్భుతంగా చెక్కబడ్డ ఆలయ ప్రాంగణంలో మరో నాలుగు ఆలయాలను చూడవచ్చు.

ముక్తేశ్వర్

ముక్తేశ్వర్

ముక్తేశ్వర్ నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న నతుకన్ ఒక అందమైన కుగ్రామం. అద్భుతమైన హిమాలయ పర్వత శ్రేణుల అందాలను వీక్షించటానికి నతుకన్ చక్కటి ప్రదేశం. ఓక్, పైన్, బిర్చ్ కఫల్ వృక్షాలు ఈ ప్రాంత అదనపు ఆకర్షణలు. ట్రెక్కింగ్, నేచర్ వాక్ వంటివి ఇక్కడి యాక్టివిటీ లు.

ముక్తేశ్వర్

ముక్తేశ్వర్

పియెరా దట్టమైన అడవులను కలిగి ఉన్నది. బార్కింగ్ డీర్స్, వైట్ క్యాట్స్, చిరుత మరియు వివిధ రకాల పక్షులకు పియెరా ఆవాసంగా వ్యవహరించబడుతున్నది. సహజ నీటి కొలనులు, వాగులు, వంకల వద్దకు వచ్చి నీరు తాగే జంతువుల ఫోటోలను కెమెరాల్లో బంధించవచ్చు.

ముక్తేశ్వర్

ముక్తేశ్వర్

ముక్తేశ్వర్ ఆలయానికి సమీపంలో ఒక బంగ్లా కలదు. దీనిని 'ముక్తేశ్వర్ ఇన్స్పెక్షన్ బంగ్లా' అని పిలుస్తారు. ఇది పూర్వం గవర్నమెంట్ గెస్ట్ హౌస్ గా ఉండేది. ప్రఖ్యాత బ్రిటీష్ హంటర్ జిమ్ కార్పెట్ పులులను వేటాడే టప్పుడు ఎక్కువ సమయం ఈ బంగ్లా లో గడిపినట్లు చెబుతారు.

ముక్తేశ్వర్ ఎలా చేరుకోవాలి ?

ముక్తేశ్వర్ ఎలా చేరుకోవాలి ?

ముక్తేశ్వర్ కు సమీపాన 86 కి. మీ ల దూరంలో పట్నంగర్ విమానాశ్రయం కలదు. 54 కి. మీ ల దూరములో కథ్గోడం రైల్వే స్టేషన్ కలదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి ముక్తేశ్వర్ కు ప్రభుత్వ బస్సులు కలవు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X