• Follow NativePlanet
Share
» »కాలినడకన 2300 మెట్లను ఎక్కి తిరుమలకు చేరిన ఆవు

కాలినడకన 2300 మెట్లను ఎక్కి తిరుమలకు చేరిన ఆవు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి "తిరుమల తిరుపతి" అని వ్యవహరిస్తూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతిదినం లక్ష నుండి రెండు లక్షల వరకు భక్తులు సందర్శిస్తుంటారు. ప్రత్యేక దినాలలో 5 లక్షలమంది వరకూ దర్శనం చేసుకొంటారు. ఈ యాత్రాస్థలం శ్రీవైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్యదేశాలలో ఒకటి.

తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల విశ్వాసం. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభువుగా అవతరించాడని భవిష్యోత్తరపురాణం లోని శ్రీ వేంకటాచల మహత్యం కథనం. తిరుమల వేంకటేశ్వరుని శ్రీనివాసుడు, బాలాజీ అని కూడా పిలుస్తారు. శ్రీవారు అని కూడా అంటారు.

తిరుమల ఆలయం లోని మొదటి ప్రాకారం (విమాన ప్రాకారం), ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు.దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వేంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాభ్దానికి చెందిన చోళులు (తంజావురు) పాండ్య రాజులు (మదురై), 13-14 శతాభ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది, ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతులైన శ్రీ కృష్ణదేవ రాయలు, రాజా తోడరమల్లు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.

కాలినడకన 2300 మెట్లను ఎక్కి తిరుమలకు చేరిన ఆవు

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. శ్రీమహావిష్ణువు దర్శనార్ధం వాయు దేవుడు

1. శ్రీమహావిష్ణువు దర్శనార్ధం వాయు దేవుడు

ద్వాపర యుగంలో శ్రీమహావిష్ణువు దర్శనార్ధం వాయు దేవుడు, వైకుంఠానికి వస్తే ఆదిశేషువు వాయుదేవుడిని అడ్డగించి, మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శయనించి ఉన్నాడని చెప్తాడు. అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి యుద్ధం జరుగుతుంది.

pc: youtube

2. మేరు పర్వతం

2. మేరు పర్వతం

అప్పుడు శ్రీమహావిష్ణువు అక్కడకు వస్తే ఇద్దరు వాళ్ళవాళ్ళ గొప్పతనం చెప్పుకొంటారు. మహావిష్ణువు వారికి పరీక్షగా మేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టిగా చుట్టి పట్టుకొమని చెప్పి, వాయుదేవుడిని ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడ నుండి కదిలించమని పరీక్షపెడతాడు.

pc: youtube

3. ఆనందపర్వతం

3. ఆనందపర్వతం

ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం నెలకొనగా చతుర్ముఖబ్రహ్మ, ఇంద్రాది దేవతల కోరికమేరకు ఆదిశేషువు ఆనందపర్వతం మీద తన పట్టు సడలించి పరీక్షనుంచి విరమిస్తాడు. దాని ఫలితంగా ఆనంద పర్వతం వాయువు ప్రభావం వల్ల అక్కడనుండి వెళ్ళి స్వర్ణముఖీ నది ఒడ్డున పడుతుంది.

pc: youtube

4. వేంకటాద్రి పర్వతం

4. వేంకటాద్రి పర్వతం

ఇది తెలుసుకొని ఆదిశేషువు బాధ పడతాడు. ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వేంకటాద్రితో విలీనం చేస్తాను అక్కడ మహావిష్ణువు వెలస్తాడు అని చెబుతాడు. ఆదిశేషువు వేంకటాద్రి పర్వతంలో విలీనం అయి ఆదిశేషువు పడగ భాగంలో (శేషాద్రి) శ్రీమహావిష్ణువు వెలశారు, శేషువు మధ్య భాగంలో అహోబిలంలో శ్రీ నారసింహమూర్తి, తోక భాగంలో శ్రీశైల క్షేత్రములో మల్లికార్జునస్వామిగా వెలశారు.

pc: youtube

5. తిరుమల

5. తిరుమల

15 వందల ఏళ్ల నుండి తిరుమల, పాలకుల ఆదరణకు నోచుకుంటూ ఉంది. క్రీ.శ.614. పల్లవ రాణి సామవై కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్దారణ కావింపబడింది.

pc: youtube

6. భోగ శ్రీనివాసమూర్తి విగ్రహం

6. భోగ శ్రీనివాసమూర్తి విగ్రహం

సామవై పెరిందేవి క్రీ.శ. 614 లో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని బహుకరించింది. అక్కడి అర్చకులు సూచించిన విధంగా ఈ విగ్రహాన్ని బహుకరించి శ్రీ వైఖనస భగవఛ్ఛాస్త్రోక్తంగ ప్రతిష్ఠింపజేసింది. ఇదే తిరుమల ఆలయంలో మొట్టమొదటి కానుకగా దేవాలయంలోని గోడల మీది శాసనం వలన తెలుస్తోంది.

pc: youtube

7. శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాధయాధవరాయలు

7. శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాధయాధవరాయలు

తరువాత తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు క్రీ.శ.1328లో, శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాధయాధవరాయలు క్రీ.శ.1429లో, హరిహరరాయలు క్రీ.శ. 1446లోను బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.

pc: youtube

 8. ప్రపంచవ్యాప్తంగా భక్తులు

8. ప్రపంచవ్యాప్తంగా భక్తులు

కలియుగ దైవం నెలకొన్న పవిత్రపుణ్యక్షేత్రం తిరుమల. శ్రీవారి దర్శనానికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు.

pc: youtube

9. శ్రీవారి లీల

9. శ్రీవారి లీల

ఆయన లీలలు, అన్ని ఇన్ని కావు.తాజాగా శ్రీవారి లీల మరొకటి వెలుగులోనికి వచ్చింది. సాధారంగా తిరుమలకు కాలినడకన వెళ్ళాలంటే కొన్ని ఇబ్బందులు తప్పవు.

pc: youtube

10. శ్రీవారి లీల

10. శ్రీవారి లీల

కాళ్ళ నొప్పులనేవి సహజంగా వస్తూవుంటాయి.మానవులకే ఇన్ని ఇబ్బందులంటే ఇక జంతువుల విషయం వేరే చెప్పాలా.

pc: youtube

11. శ్రీవారి లీల

11. శ్రీవారి లీల

అలాంటిది జంతువులు మెట్లు ఎక్కి తిరుమలకు వెళితే అవునండీ.ఖచ్చితంగా అలాగే జరిగింది.

pc: youtube

12. 2300 మెట్లు

12. 2300 మెట్లు

ఒక గోవు కాలినడకన తిరుమలకు చేరుకుంది.వివరాలలోకి వెళితే తిరుపతి సమీపంలోని శ్రీవారి మెట్టు మార్గం నుంచి ఒక గోవు 2300 మెట్లను సునాయాసంగా ఎక్కి తిరుమలకు చేరుకుంది.

pc: youtube

13. గోవును చూసిన భక్తులు

13. గోవును చూసిన భక్తులు

కాలినడకన మార్గంలోనే భక్తులతో కలిసి గోవు ఎక్కింది. గోవును చూసిన భక్తులు ఆశ్చర్యపోయి ఆ గోవుకు కుంకుమబొట్లు పెట్టారు.

pc: youtube

14. శ్రీవారి లీల

14. శ్రీవారి లీల

కొంతమంది గోమాతకు నమస్కరించారు. కొంతమంది అరటి పండ్లు, కొన్ని పండ్లను ప్రసాదంగా ఇచ్చారు. గోవు మెట్లు ఎక్కి తిరుమలకు వెళ్ళటం ఏమిటో ఇప్పటికి ఎవరికీ అంతుపట్టటంలేదు.

pc: youtube

15. శ్రీవారి లీల

15. శ్రీవారి లీల

తిరుమలకు వెళ్ళిన గోవును టిటిడి అధికారులు గుర్తించి గోవును తిరుమలలోని గోశాలకు తరలించారు.

pc: youtube

16. శ్రీవారి లీల

16. శ్రీవారి లీల

ఆ ఆవుకు సరిపడా మేతను అందిస్తున్నారు టిటిడి అధికారులు. గోశాలలోని గోవును చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

pc: youtube

17. శ్రీవారి లీల

17. శ్రీవారి లీల

కాలినడకన 2300 మెట్లను సునాయాసంగా ఎక్కేసింది ఆ ఆవు.

pc: youtube

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి