Search
  • Follow NativePlanet
Share
» »2200 సంవత్సరాల క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

2200 సంవత్సరాల క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

తిరుమల, తిరుపతి కలియుగంలో దర్శనప్రార్థనార్చనలతో భక్తులను తరింపజేయడానికి సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే శ్రీవేంకటేశ్వరుడిగా తిరుమలకొండలోని ఆనందనిలయంలో అవతరించారనేది భక్తులనమ్మకం.

By Venkatakarunasri

తిరుమల, తిరుపతి కలియుగంలో దర్శనప్రార్థనార్చనలతో భక్తులను తరింపజేయడానికి సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే శ్రీవేంకటేశ్వరుడిగా తిరుమలకొండలోని ఆనందనిలయంలో అవతరించారనేది భక్తులనమ్మకం.

ఈ తిరుమల ఆలయాన్ని, ఆనందనిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించారని ప్రతీతి.తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు.

దక్షిణభారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖరాజులందరూ శ్రీవేంకటేశ్వరుని దాసులే.వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాబ్దానికి చెందిన చోళులు, పాండ్యరాజులు 13,14వ శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి వెలువైన కానుకలు సమర్పించినట్లు అక్కడున్న శిలాశాసనాలు చెప్తున్నాయి.

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

తిరుపతి కి దగ్గరగా ఉన్న తిరుమల కొండ ప్రదేశం. ఇక్కడ ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ కొండలు సముద్ర మట్టంపై 3200 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో, ఏడు శిఖరాలను కలిగి ఉంటుంది. నారాయణాద్రి, నీలాద్రి, శేషాద్రి, అంజనాద్రి, గరుడాద్రి, వృషభాద్రి, వేంకటాద్రి అని పిలువబడే ఏడూ శిఖరాలూ ఆదిశేషుడికి ప్రాతినిధ్యం వహిస్తాయి.

PC:youtube

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వేంకటాద్రి అని పిలువబడే ఏడవ శిఖరంపై ఉంది. తిరుమల అనే పదం ‘తిరు' (పవిత్ర), ‘మల' (రద్దీ లేదా పర్వతం) అనే రెండు పదాలను కలిగి ఉంటుంది. అందువల్ల తిరుమల పదం ద్రావిడ భాషలో అక్షరాలా ‘పవిత్ర పర్వతం' అని అనువదించబడింది.

PC:youtube

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

విజయనగరరాజులకాలంలోనే ఈ దేవాలయం ప్రాముఖ్యత పెరిగి ఆలయవిస్తరణ జరిగింది. సతీసమేతుడైన శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలు ఈ ఆలయప్రాంగణంలో వున్నాయి. ఇక్కడి వరకూ ఈ చరిత్ర మనందరికి తెలిసిందే కాని 2000ఏళ్ల నాటి తిరుమల చరిత్ర పరిశీలిస్తే మాత్రం మనం ఆశ్చర్యపోవలసిందే.

PC:youtube

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

మన తిరుమలను మొదట్లో తుల్కవ్యం అని పిలిచేవారని తమిళగ్రంథాలు చెప్తున్నాయి.ఈ గ్రంథాలు 2000 ఏళ్లక్రితం రాసారు.ఈ గ్రంథంలో వేంగడం అని సంభోదించారు.వేంగడం అనగా తమిళదేశానికి వుత్తరసరిహద్దు అని అర్థం.

PC:youtube

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

ఈ తిరుమల కొండలు అప్పటి తమిళదేశానికి వుత్తరసరిహద్దుగా వుండేవి.తరువాతి రోజుల్లో వేంగడంఅనేది కాస్త వెటకారంగా మారింది. వేంగడం కొండల్లోని దేవుడే వెంకటేశ్వరస్వామి అయ్యాడని తమిళగ్రంథాలు చెప్తున్నాయి.

PC:youtube

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

ఈ గ్రంథాలు చెపుతున్న దాని ప్రకారం 2200 ఏళ్ల చరిత్ర వుందని తెలుస్తుంది. ఇక 1940ల నాటికి తిరుమలకు వచ్చే భక్తులసంఖ్య మెల్లగా పెరగటం మొదలైంది.దాంతో నాటి బ్రిటీష్ ప్రభుత్వం 1944లో తిరుమలకొండకు ఘాట్ రోడ్ వేసారు.

PC:youtube

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

రోడ్డును వేసిన ఇంజనీర్ మాత్రం భారతీయుడు కావటం విశేషం.ఆయన మరెవరో కాదు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారు. అప్పటివరకూ తిరుమల కొండకు కాలి నడకనే వెళ్ళేవారు భక్తులు. తిరుమలకొండలలోవున్న క్రూరమృగాలని, పాములను, దొంగలను దాటుకుంటూ గుంపులుగుంపులుగా వెళుతూ ప్రాణాలు గుప్పెట్లోపెట్టుకుని తిరుమల కొండను ఎక్కి శ్రీవారిని దర్శనం చేసుకునేవారు భక్తులు.

PC:youtube

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

కాని ఈ ఘాట్ రోడ్ వేసినప్పటినుండి అలాంటి భయాలేవీలేకుండా ప్రశాంతంగా బస్సుల్లోవెళ్లి శ్రీవారిని దర్శించుకుంటున్నారు భక్తులు.ఒకప్పుడు ఈ కాలి నడక బాటలు 4వుండేవి.కాని ఇప్పడుమాత్రం మూడే వున్నాయి.అవి తిరుపతి నుండి అలిపిరి కాలిబాట.చంద్రగిరి వైపు నుండి శ్రీవారి మెట్టు సోపానం, మామండూరు నుండి అన్నమయ్యకాలి బాట.

PC:youtube

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

అలిపిరి కాలిబాట నుండి 5సంల క్రితం రామానుజాచార్యుడు మోకాళ్ళమీద కొండను ఎక్కి శ్రీవారిని దర్శించుకున్నారుఅతడే శైవులు ఆక్రమించిన ఈ కొండను తిరిగి వైష్ణవకొండగా మార్చాడు. అలిపిరి అంటే అందరికీ తెలిసిందే తిరుపతి నుండి తిరుమలకు దారితీసే కాలిబాటకు తొలిమెట్టు వున్న ప్రాంతమే ఈ అలిపిరి.

PC:youtube

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

అక్కడికి వెళ్ళగానే అక్కడున్న ఓ శిల్పం మనల్ని ఆకట్టుకుంటుంది. అది నేల మీద సాష్టాంగనమస్కారం చేస్తూవున్న శిల్పం.ఈ శిల్పం గురించి ఓ కధకూడా ప్రచారంలో వుంది.ఆ కధప్రకారం ఆ రోజులలో దాసరులు అని పిలవబడే వైష్ణవులు హరినామ స్మరణ చేస్తూ శ్రీహరి పాటలు పాడుతూ భిక్షాటనచేసి జీవించేవారు.

PC:youtube

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

దాసరి అంటే వెనుకబడిన కులంలో పుట్టి వీరవైష్ణవం పుచ్చుకుని వైష్ణవుడిగా మారిన వ్యక్తిఅని అర్థం.దాసరి విష్ణుదాసుడి భక్తుడు. కొన్ని వందల ఏళ్లక్రితం హరిదాసుడైన ఓ మాల దాసరి శ్రీవారిని దర్శించుకోవటానికికని తిరుమలకు బయలుదేరాడు.

PC:youtube

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

అలిపిరికి చేరినతరువాత అక్కడ తొలి మెట్టు ఎక్కబోతూవుండగా శ్రీవారికి సాష్టాంగనమస్కారం చేసాడు.అప్పుడు ఆ మాల దాసరి శిలగా మారిపోయాడుఅని అంటారు.అలాగే తిరుమలకొండలలో ఇప్పటివరకూ ఎన్నో అద్భుతాలు జరిగాయి.

PC:youtube

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

ఈ కొండపై వెలసిన శ్రీనివాసుడు ఎంతో శక్తిస్వరూపుడు. ఏడు కొండల్లో వున్న ఈ దేవుడు ఏ దేవతస్వరూపమని ఇప్పటివరకూ ఎవ్వరూతేల్చుకోలేక పోయారు.అందుకు కారణం ఈ తిరుమలకొండపైన సకల దేవతల అంశాలు వుండటమే.

PC:youtube

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

దాస భావనతో తనకు సాక్షాంగనమస్కారం చేసిన వాడిని శ్రీనివాసుడు రక్షిస్తూవుంటాడని ఇక్కడికి వచ్చేభక్తుల నమ్మకం.అందుకే తన లాగా సాష్టాంగనమస్కారం చేసి శ్రీవారి దయను పొందమని భక్తులకు తెలియచేయటానికి దాసరి ఇలా శిలగా మారిపోయాడని ఈ దాసరిశిల్పం వెనుక వున్న కధ.కాబట్టి మీరు కూడా తిరుమల కొండపై వెలసిన అత్యంత శక్తిస్వరూపుడైన శ్రీవారిని దర్శించుకుని సాష్టాంగ నమస్కారం చేసి ఆ తిరుమల శ్రీవారి దయను పొందండి.

PC:youtube

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

తిరుపతి వాతావరణం

సరైన సమయం సంవత్సరంలో వర్షాకాలం తరువాత వచ్చే శీతాకాలంలో తిరుపతిని సందర్శించడం ఉత్తమం. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు తిరుపతి సందర్శనకు అనువైన పరిస్థితులను అందిస్తాయి. అయితే, జూన్ నుండి సెప్టెంబర్ మధ్యలో జరిగే ప్రధాన పండుగ బ్రహ్మోత్సవ సమయంలో యాత్రికులు తిరుపతిని సందర్శించడం ఉత్తమం.

PC:youtube

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

ఎలా చేరాలి?

రోడ్డు ద్వారా

తిరుపతి రాష్ట్రంలో అతిపెద్ద బస్సు టర్మినల్స్ కలిగి ఉంది. అన్ని ప్రధాన పట్టణాలూ, నగరాలూ లేదా దక్షిణ భారతదేశం నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. అలిపిరి బస్ స్టాప్ నుండి తిరుపతికి ప్రతి రెండు నిమిషాలకు బస్సులు నడుస్తాయి. ఈ నగరం అంతర్గతరవాణా వ్యవస్థ బాగా అభివృద్ది చెందడం వల్ల ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

రైలు మార్గం ద్వారా

దేశవ్యాప్తంగా నడుపుతున్న రైళ్లకు తిరుపతి ఒక ప్రధాన రైల్వే స్టేషన్. తిరుపతి నుండి రేణిగుంట జంక్షన్ కి ప్రయాణం 10 నిమిషాల దూరంలో ఉంది. తిరుపతి నుండి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న గూడూర్ జంక్షన్ కూడా యాత్రీకుల అవసరాలు తీరుస్తుంది.

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

2200 సం,, క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!

వాయు మార్గం ద్వారా

తిరుపతి విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించబడింది, కానీ ఇప్పటికీ అంతర్జాతీయ విమానాలు నడవడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, వైజాగ్, కోయంబత్తూర్, కోలకతా, ముంబైకి విమానాలు ఉన్నాయి. ఈ విమానాశ్రయం నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై దీనికి సమీప విమానాశ్రయం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X