Search
  • Follow NativePlanet
Share
» »22 ఏళ్ల వరకూ ఆ గ్రామం ‘ఆ’ కార్యానికి దూరం

22 ఏళ్ల వరకూ ఆ గ్రామం ‘ఆ’ కార్యానికి దూరం

రాజస్థాన్ లోని థోల్ పూర జిల్లాలో రాజ్ ఘట్ అనే గ్రామంలో 22 ఏళ్లుగా వివాహం జరగని విషయానికి సంబంధించి.

By Kishore

సామాజిక కోణంలో వివాహమన్నది అతి ముఖ్యమైన కార్యం. అయితే ఒక గ్రామంలో దాదాపు 22 ఏళ్లపాటు ఎటువంటి వివాహం జరగనే లేదు. ఇందుకు ప్రధాన కారణం అక్కడ తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడమే ప్రధాన కారణం. ఈ గ్రామం గొప్ప పర్యాటక ప్రాంతం కాకపోయినా ఆ గ్రామానికి ప్రస్తుతం చాలా మంది సామాజిక వేత్తలు వెళ్లి అక్కడి పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరం అన్న సంగతి ఇప్పటికే అర్థమయ్యింది కదా? ఆ గ్రామం వివరాలు, ప్రస్తుతం అక్కడి పరిస్థితులకు సంబంధించిన వివరాలు మీ కోసం

కొత్తదంపతులూ ఇక్కడకు వెళ్లకండికొత్తదంపతులూ ఇక్కడకు వెళ్లకండి

1. వివాహం జరగనే లేదు.

1. వివాహం జరగనే లేదు.

P.C.YouTube

22 ఏళ్ల పాటు ఇక్కడ వివాహమే జరుగలేదు. ఇది ఒక కట్టుకథ కాదు. యదార్థగాథ. కథ అనడం కంటే రాజస్థాన్ లోని ఓ గ్రామం వ్యథ అంటే సరిపోతుందేమో? వివాహం జరగాలని ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు.

2. ఆ గ్రామం పేరు

2. ఆ గ్రామం పేరు

P.C.YouTube

రాజస్థాన్ లోని థోల్ పూర జిల్లాలో రాజ్ ఘట్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో దాదాపు రెండు దశాబ్దాలుగా వివాహం జరగనే లేదు. అంటే ఆ గ్రామానికి చెందిన ఏ ఒక్క యువకుడికి కూడా ఇతర గ్రామస్తులు తమ ఆడపిల్లను ఇచ్చి వివాహం అన్నది చేయించలేదు.

4. ఒకే ఒక బోరింగ్ పంపు

4. ఒకే ఒక బోరింగ్ పంపు

P.C.YouTube

ఈ గ్రామంలో మౌలిక సదుపాయాలన్నవే లేవు. ఉదాహరణకు విద్యుత్, మురుగునీటి పారుదల కాదు కదా కనీసం తాగునీటి సరఫరా కూడా మనం చూడలేము. ఈ గ్రామంలో 40 ఇళ్లు ఉండగా దాదాపు 250 మంది జనాభా ఉన్నారు. వీరందరికి కలిపి కేవలం ఒకే ఒక బోరింగ్ పంపును ఇక్కడ మనం చూడవచ్చు. అది కూడా కనీసం పదిహేను ఇరవై నిమిషాలు సేపే కొడితే కొంత నీరు వస్తుంది.

5. అందుకే

5. అందుకే

P.C.YouTube

ఇంతటి దుర్భర పరిస్థితులు ఉండటం వల్లే ఈ గ్రామానికి తమ ఇంటి పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇక ఎవరైతే ఈ గ్రామం నుంచి వలస వెళ్లి ఇతర పట్టణాల్లో స్థిరపడినవారిలో ఇద్దరి ముగ్గురికి మాత్రం వివాహం అయ్యింది.

6. కొన్ని రోజుల క్రితమే...

6. కొన్ని రోజుల క్రితమే...

P.C.YouTube

అయితే కొన్ని రోజుల క్రితం ఆ గ్రామానికి చెందిన పవన్ అనే యువకుడు దగ్గర్లో ఉన్న ఓ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకొన్నాడు. దీంతో ఆ గ్రామంలోకి దాదాపు 22 ఏళ్ల తర్వాత ఓ కోడలు వచ్చింది.

7.ఒకే ఒక పాఠశాల

7.ఒకే ఒక పాఠశాల

P.C.YouTube

ఇక్కడ ఉన్న ఓ పాఠశాలలో కేవలం పది నుంచి 15 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇక ఈ గ్రామంలో ఉన్న 125 మంది మహిళల్లో కేవలం ఇద్దరికి మాత్రమే తమ పేరును రాయడానికి వస్తుంది.

8.ఈ గ్రామాన్ని చూడాలని ఉందా?

8.ఈ గ్రామాన్ని చూడాలని ఉందా?

P.C.YouTube

రాజస్థాన్ లోని జైపూర్ నుంచి దాదాపు 283 కిలోమీటర్ల దూరంలో థోల్ పూర్ ఉంది. ఈ థోల్ పూర్ నుంచి కొంత దూరంలో రాజ్ ఘట్ ఉంది. అదే విధంగా ఈ థోల్ పూర్ కు సమీప పట్టణం గ్వాలియర్. (65.9 కిలోమీటర్లు). రాజస్థాన్, మధ్య ప్రదేశ్ సరిహద్దులో ఈ గ్రామం ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X