» »1000 కిలోల బంగారంతో నిర్మించిన రాజస్థాన్ లోని దేవాలయం

1000 కిలోల బంగారంతో నిర్మించిన రాజస్థాన్ లోని దేవాలయం

Written By: Venkatakarunasri

బంగారం అంటే ఎవరికి ఇష్టం వుండదు చెప్పండి. ఇప్పుడైతే బంగారం యొక్క ధర ఆకాశానికి చేరుతోంది. పేదవారి నుండి శ్రీమంతులవరకూ పిచ్చి ఎక్కువైందనే చెప్పాలి. సామాన్యంగా మన భారతదేశంలోని దేవాలయాల్లో బంగారాన్ని చూడవచ్చును.భగవంతునికి బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు.

దక్షిణ భారతదేశం యొక్క గోల్డెన్ టెంపుల్ బంగారానికి ఒక మంచి ఉదాహరణనిచ్చే దేవాలయంగా చెప్పవచ్చును. బంగారు దేవాలయం మంచి ఉదాహరణ. ఇక్కడున్న బంగారు దేవాలయం వర్ణించలేనంత వైభవంతో కూడుకుంది. మరైతే, అప్పుడు 1000 కిలోలు ఉపయోగించి నిర్మించిన ఆలయం. ఆశ్చర్యమే. ఏమిటి 1000 కిలోలా ? అని ఆశ్చర్యపడకండి.ఇది నిజంగా సత్యం.

ప్రస్తుత వ్యాసం మూలంగా 1000 కిలోలు ఉపయోగించి దేవాలయాన్ని నిర్మించినదాన్ని గురించి విశేషాలను తెలుసుకుందాం.

1000 కిలోల బంగారంతో నిర్మించిన రాజస్థాన్ లోని ఆలయం

ఎక్కడుంది?

ఎక్కడుంది?

1000 కిలోల బంగారంతో నిర్మించిన దేవాలయం రాజస్థాన్ లోని అజ్మీర్ లో ఉంది. ఇది జైన మతస్థులకు పవిత్రమైన దేవాలయం.ఈ అందమైన దేవాలయాన్ని 19వ శతాబ్దంలో నిర్మించారు.

PC:Ramesh Lalwani

వాస్తుశిల్పాలు

వాస్తుశిల్పాలు

ఈ జైన మందిరం అత్యంత సుందరమైనది,వైభవోపేతమైనది. నిజంగా చెప్పాలంటే ఈ దేవాలయం వాస్తుశిల్పాలకి పేరు గాంచినది.ఈ దేవాలయాన్ని సోనీజీ కీ నాశియాన్ అని కూడా పిలుస్తారు.

PC:Vaibhavsoni1

సిటీ ఆఫ్ గోల్డ్

సిటీ ఆఫ్ గోల్డ్

స్వర్ణ నగరం " సిటీ ఆఫ్ గోల్డ్ " అని పిలవబడుతున్న ముఖ్య ఛాంబర్ ఇది.ఈ దేవాలయంలో బంగారు పూతపూయబడిన చెక్క బొమ్మలు అనేకం వున్నాయి. ఇక్కడ జైనధర్మంలోని అనేకమంది ప్రముఖవ్యక్తులను చిత్రించారు.ఈ దేవాలయంలో అయోధ్య చిత్రాన్ని ఒక క్రమంలో రూపొందించటానికి 1000 కె.జీల బంగారాన్ని వుపయోగించారు.

PC:Vaibhavsoni1

 వృషభనాథుడు

వృషభనాథుడు

ఈ జైన దేవాలయంలో వృషభనాథుడుని ఆరాధిస్తారు.ఈ మందిరాన్ని పూర్తిగా కెంపులు, ఇసుక మరియు రాళ్ళతో 1865లో నిర్మించారు. అయితే 1870నుండి 1895అంటే సుమారు 25సంలు ఈ దేవాలయాన్ని ఓర్వలేనివారు కొంత మంది నాశనం చేసారు.

నిర్మించినది ఎవరు?

నిర్మించినది ఎవరు?

ఈ దేవాలయాన్ని నిర్మించినది ఎవరంటే ఆజ్మీర్ లోని సోని కుటుంబంవారు.ఇప్పటికీ కూడా ఈ దేవాలయాన్ని ఈ సోని కుటుంబంవారే నిర్వహిస్తున్నారు.

PC:Vaibhavsoni1

దిగంబరులు

దిగంబరులు

సామాన్యంగా జైనులలో 2 రకాలుగా వున్నారు.వారు శ్వేతాంబరులు, దిగంబరులు. శ్వేతాంబరులు తెల్లని రంగు దుస్తులు ధరిస్తారు.కానీ దిగంబరులు ఎటువంటి దుస్తులూ ధరించరు. విషయానికి వస్తే ఈ దేవాలయం దిగంబరులకు చెందిన దేవాలయం.

PC:aibhavsoni1

సిద్ధకుట్ చైత్యాలయం

సిద్ధకుట్ చైత్యాలయం

ఈ దేవాలయాన్ని సోనీజీ కీ నాశియాన్ అని లేదా సిద్దకుట్ చైత్యాలయం, కెంపు దేవస్థానం అని కూడా పిలుస్తారు.ఎందుకంటే ఈ దేవాలయాన్ని కెంపులు,ఇసుకతో నిర్మించారు.

PC:Aibhavsoni1

వృక్షస్థంభం

వృక్షస్థంభం

ఈ ఇతిహాసిక దేవాలయంలోకి ప్రవేశించగానే అందమైన మరియు కళాత్మకమైన సుమారు 82 అడుగులు ఎత్తైన వృక్షస్థంభం యొక్క విన్యాసం చూడవచ్చును.
ఈ స్తంభాన్ని ఆర్.బి.సేథ్,భగచంద్ సోని నిర్మించారు.

PC:Vaibhavsoni1

సందర్శించటానికి మంచి సమయం

సందర్శించటానికి మంచి సమయం

ఈ దేవాలయానికి ప్రతి సంవత్సరం అనేకమంది పర్యాటకులు వస్తారు.భారతదేశంలో రాజేంద్ర ప్రసాద్, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, మొరార్జీ దేశాయ్ మరియు రాజీవ్ గాంధీ ఇంకా అనేకమంది రాజకీయనాయకులు ఈ దేవాలయాన్ని సందర్శించారు.

PC:Vaibhavsoni1

సమీపంలోని విమానాశ్రయం

సమీపంలోని విమానాశ్రయం

ఈ దివ్యమైన దేవాలయానికి దర్శించటానికి సమీపంలోని విమానాశ్రయమేదంటే అది అజ్మీర్ విమానాశ్రయం.