» »కొడైకెనాల్లో చూడాల్సిన ప్రదేశాలు ఇవే !

కొడైకెనాల్లో చూడాల్సిన ప్రదేశాలు ఇవే !

Written By: Venkatakarunasri

LATEST: వెనక్కి తిరిగి చుస్తే ఆ ఆలయ గోపురం మీ వెనకాలే వస్తుంది ఎక్కడో తెలుసా?

వేసవిలో చల్లదనం కోసం హిల్ స్టేషన్స్ కు వెళ్ళటం అందరూ చేసేదే. అయితే ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళాలంటే కొంత వ్యయప్రయాసలకు లోను కావలసి వస్తుంది. ఎక్కువ రోజులు సమయం కేటాయించవలసి వస్తుంది. అలా కాకుండా కొడైకెనాల్ వంటి ప్రదేశాలను ఎంచుకుంటే సమ్మర్ వొకేషన్ ను ఈజీగా పూర్తిచేసుకుని రావచ్చును.

తమిళనాడులో వేసవి చల్లని ప్రదేశాలు !

తమిళనాడులో వున్న కొడైకెనాల్ హిల్ స్టేషన్ పర్యాటకులకు స్వర్గధామంగా నిలుస్తుంది. ఎత్తైన కొండలు, పచ్చదనం పరచుకున్న లోయలు అక్కడక్కడా పారుతున్న నదులతో కొడైకెనాల్ అందాలు చూపరులను కట్టిపడేస్తాయి. 7200 అడుగుల ఎత్తులో వుండే కొడైకెనాల్ మండువేసవిలో చల్లదనాన్ని పంచుతుంది. కొడైకెనాల్ కు వెళితే గనక నాలుగైడురోజులు విడిది చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి.

దెయ్యాల కిచెన్ ఎపుడైనా చూసారా ?

కొడైకెనాల్ తమిళనాడులో, తూర్పు కనుమల్లో నెలకొని ఉన్న అందమైన వేసవి విడిది. భారతదేశంలో పేరు పొందిన వేసవి విడుదుల్లో ఒకటి. కొడై కెనాల్ తమిళనాడు రాష్ట్రానికి దాదాపు నడిబొడ్డుకు దగ్గరగా ఉంది. దీనికి దక్షిణంగా 120 కి.మీ. దూరంలో మదురై, పడమరగా 64 కి.మీ. దూరంలో పళని, ఉత్తరంగా 99 కి.మీ. దూరంలో దిండిగల్ ఉన్నాయి.

రొమాన్స్ ప్రదేశాల పుట్టిల్లు - తమిళనాడు !!

కొండ ప్రాంతం కనుక ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తే మదురై నుండి సుమారు నాలుగు గంటలు, పళని నుండి రెండు గంటలు, దిండిగల్ నుండి మూడున్నర గంటల బస్సు ప్రయాణం ద్వారా కొడైకెనాల్ చేరుకోవచ్చు.

ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు కూడా చాలా వుంటాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. కోకర్స్ కేవ్స్:

1. కోకర్స్ కేవ్స్:

కొడైకెనాల్ లో చూడాల్సిన ముఖ్య ప్రదేశం ఇది. సిటీకి 40కి.మీ ల దూరంలో వుంటుంది. అడవి గుండా ప్రయాణించి చేరుకొనవలసి వుంటుంది.

Ramkumar

2. కోకర్స్ కేవ్స్:

2. కోకర్స్ కేవ్స్:

సుబ్రమణ్యస్వామి ఆలయం వుంటుంది ఇక్కడ. కార్తీకస్వామి ఆలయమని పిలుస్తారు దీనిని. ఎక్కువ మంది పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు.

Vijay S

3. కోకర్స్ కేవ్స్:

3. కోకర్స్ కేవ్స్:

కొడైకెనాల్ కు 65 కి.మీ ల దూరంలో వుంటుంది. కొడైకెనాల్ కు వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా దర్శించుకొనవలసిన ప్రదేశం ఇది.

Nijumania

4. బెరిజం లేక్:

4. బెరిజం లేక్:

ఈ సరస్సు అందాలు తప్పకుండా చూడాల్సిందే. ట్రెక్కింగ్ చేయాలనుకొనేవారికి ఇది మంచి ప్లేస్. కొడైకెనాల్ కు ఈ లేక్ హార్ట్ లాంటిది.

Monalisha Ghosh

5. పిల్లర్ రాక్స్:

5. పిల్లర్ రాక్స్:

కొడైకెనాల్ లో ఫేమస్ ఎట్రాక్షన్ ప్లేస్ ఇది. 400అడుగుల ఎత్తులో వుండే రాక్ పిల్లర్స్ ఎట్రాక్షన్ పర్యాటకుల మదిని దోచేస్తాయి. ఇక్కడ నుంచి కొడైకెనాల్ అందాలు చూసితీరాల్సిందే.

rajaraman sundaram

 6. కొడై సరస్సు:

6. కొడై సరస్సు:

కోడైకెనాల్ పట్టణ కేంద్రానికి చేరువలో 1863 లో కట్టిన మానవనిర్మిత కొడై సరస్సు వుంది. 45 హెక్టార్లలో (60 ఎకరాల్లో) విస్తరించి ఉన్న ఈ సరస్సు ఒక వైపు అరచెయ్యి మాదిరిగా వెడల్పుగా ఉండి, మరోవైపు చేతి వేళ్ళ మాదిరిగా సన్నని పాయలుగా వుంటుంది. ఈ సరస్సులో బోటు షికారు కూడా ఉంది.

Ranjithsiji

7. కోకర్స్ వాక్:

7. కోకర్స్ వాక్:

ఇది ఒక కొండ అంచునే సన్నగా పొడుగుగా ఉన్న కాలి బాట. ఈ బాట వెంబడే నడుచుకుంటూ వెళితే, చుట్టూ కనిపించే ప్రకృతి దృశ్యాలు చాలా బాగుంటాయి.

ఇండియాలో అమెరికన్లు కనుగొన్న ఏకైక హిల్ స్టేషన్ !

Kreativeart

 8. సెయింట్ మేరీ చర్చి:

8. సెయింట్ మేరీ చర్చి:

ఈ చర్చి సుమారు 150 సంవత్సరాలకు పూర్వం కొడైకెనాల్ లో నిర్మించబడిన మొట్ట మొదటి చర్చి. ఈ చర్చిలో నగిషీ పని బాగా ఉంది.

Paulosraja

9. పంపార్ జలపాతం:

9. పంపార్ జలపాతం:

ఈ జలపాతం కొడైకెనాల్ పట్టణానికి ఒక చివరగా ఉంటుంది. ఎత్తు పల్లాలతో ఉన్న రాతినేల మీద ప్రవహించు కుంటూ వస్తున్న సన్నని వాగు ఇది.

Kreativeart

10. గ్రీన్ వ్యాలీ వ్యూ:

10. గ్రీన్ వ్యాలీ వ్యూ:

ఒక కొండ అంచున మనం నిలబడి చూడటానికి వీలుగా ఒక ప్లాట్ ఫామ్ నిర్మించారు. ఇక్కడి నుండి చూస్తే విశాలమైన లోయ, పచ్చని చెట్లతో కూడిన పర్వతాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి.

Aruna

11. గుణ గుహ:

11. గుణ గుహ:

రోడ్డు అంచులో వున్న ఒక బాట వెంట సుమారు 200 గజాలు గుబురుగా ఉన్న చెట్ల మధ్యలో నుండి కిందకు దిగుతూ వెళితే, ఒక చిన్న కొండ యొక్క అడుగు భాగంలో ఒక గుహ కనిపిస్తుంది. కాని మనం దాని దగ్గరగా వెళ్ళి చూడటం కుదరదు. అక్కడకు వెళ్ళటానికి వీలు లేకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేసారు.స్థానికులు దీనిని దయ్యాల గుహ అని పిలుస్తారు.

Harrybabu

12. పైన్ వృక్షాల అరణ్యం:

12. పైన్ వృక్షాల అరణ్యం:

కేవలం మంచు, చలి ఉండే కొండ ప్రాంతాల్లో మాత్రమే పెరిగే పైన్ వృక్షాలు ఇక్కడ ఒక చోట సుమారు ఒక కిలోమీటర్ విస్తీర్ణంలో దట్టంగా పెరిగి ఉన్నాయి. ఇక్కడ చాలా సినిమాల షూటింగ్ జరిగింది.

Kreativeart

13. శాంతి లోయ:

13. శాంతి లోయ:

ఇది దట్టంగా చెట్లతో నిండి ఉన్న విశాలమైన లోయ.

Challiyan

14. కురింజి ఆండవర్ ఆలయం:

14. కురింజి ఆండవర్ ఆలయం:

ఈ దేవాలయము కోడైకెనాల్ కు దూరంగా ఉంది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. 1930 వ సంవత్సర ప్రాంతంలో ఇక్కడ నివసిస్తూ ఉండిన ఒక యూరోపియన్ మహిళకు ఈ స్వామివారు కలలో కనిపించి ఆశీర్వదించాడట.

Aruna

15. కురింజి ఆండవర్ ఆలయం:

15. కురింజి ఆండవర్ ఆలయం:

దానికి కృతజ్ఞతగా ఆవిడ ఈ దేవాలయం నిర్మింప చేసిందని స్థానికులంటారు. కొడైకెనాల్ పరిసర ప్రాంతాలలో పుష్కరానికి ఒకసారి మాత్రమే ఊదారంగు పూలు పూచే కురింజి పొదల వల్ల ఈ గుడికి ఆ పేరు వచ్చింది.

బెంగుళూరు నుండి కోడైకెనాల్ రోడ్డు మార్గంలో .. !

Monalisha Ghosh

 16. కొడైకెనాల్ కు ఎలా చేరుకోవాలి

16. కొడైకెనాల్ కు ఎలా చేరుకోవాలి

విమానం ద్వారా అయితే, మదురై, కోయంబత్తూర్, తిరుచునాపల్లికి విమానంద్వారా చేరుకుని, అక్కడ నుండి టాక్సీలో వెళ్ళ వచ్చు. రైలు ద్వారా అయితే, చెన్నై నుండి మధురై వేళ్ళే ఏదైనా రైలు ద్వారా కొడై రోడ్డు స్టేషను కాని, దిండిగల్ కాని చేరుకుని వెళ్ళ వచ్చు.

Rohit.fnds1

17. విమానం మార్గం

17. విమానం మార్గం

కొడైకెనాల్ కు 120 కి.మీ ల దూరంలో మధురై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వుంది. విమానంలో ఇక్కడకు చేరుకుంటే ఇక్కడ నుంచి టాక్సీ, కేబ్ లో కొడైకెనాల్ కు సులభంగా చేరుకోవచ్చు.

Hareey3

18. కొడైకెనాల్ కు ఎలా చేరుకోవాలి

18. కొడైకెనాల్ కు ఎలా చేరుకోవాలి

రోడ్డు మార్గం

ఇక రోడ్డు మార్గంలో అయితే బెంగుళూరుకు 460 కి.మీ లు, తిరుచానూరుకు 90 కి.మీలు, చెన్నైకి 530 కి.మీలు, ఊటీకి 55 కి.మీలు, కోయంబత్తూరు కు 175 కి.మీల దూరంలో కొడైకెనాల్ వుంది. ఈ ప్రదేశాల నుండి బస్సులో లేదా కార్లో రోడ్డుమార్గంలో చేరుకోవచ్చు.

Wikitom2

19. కొడైకెనాల్ కు ఎలా చేరుకోవాలి

19. కొడైకెనాల్ కు ఎలా చేరుకోవాలి

రైలు మార్గం

ఇక రైల్లో అయితే కొడైకెనాల్ రోడ్ రైల్వేస్టేషన్ లో దిగి కొడైకెనాల్ చేరుకోవచ్చు. సుమారు 90 కి.మీల దూరం వుంటుంది.టాక్సీలు అందుబాటులో వుంటాయి.

Ezhuttukari

20. వసతి సౌకర్యాలు

20. వసతి సౌకర్యాలు

కొడైకెనాల్ బస్ స్టాండును ఆనుకుని హోటళ్ళు చాలా ఉన్నాయి. రోజుకు 250 రూపాయల నుండి, వేయి రూపాయల వరకు గదులు అద్దెకు దొరికే హోటళ్ళు ఉన్నాయి.

Ezhuttukari

21 . వసతి సౌకర్యాలు

21 . వసతి సౌకర్యాలు

బస్ స్టాండ్ దగ్గరనే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక సంస్థ వారి కార్యాలయము ఉంది. అక్కడ బస చేయటానికి అనువైన హోటళ్ళ వివరాలు, కొడైకెనాల్లో చూడదగ్గ ప్రదేశాల వివరాలు లభిస్తాయి.

Poornima Haridas

Please Wait while comments are loading...