Search
  • Follow NativePlanet
Share
» » లైఫ్ లో ఒక్కసారైనా అరకు లోయ అందాలు+ బెలూన్ ఫెస్టివల్ చూడాల్సిందే..

లైఫ్ లో ఒక్కసారైనా అరకు లోయ అందాలు+ బెలూన్ ఫెస్టివల్ చూడాల్సిందే..

శీతాకాలంలో అరక అందాలు చూడాల్సిందే. ముఖ్యంగా జనవరిలో మూడు రోజుల సంక్రాంతి పండుగ తర్వాత మరో మూడు రోజుల పండగ అరకులో జరుగుతుంది. ఆ పండుగ ఏంటో తెలుసా? బెలూన్ ఫెస్టివల్ . హాట్ బెలూన్ లేదా ప్యారచూట్ గా పిలువ

శీతాకాలంలో అరక అందాలు చూడాల్సిందే. ముఖ్యంగా జనవరిలో మూడు రోజుల సంక్రాంతి పండుగ తర్వాత మరో మూడు రోజుల పండగ అరకులో జరుగుతుంది. ఆ పండుగ ఏంటో తెలుసా? బెలూన్ ఫెస్టివల్ . హాట్ బెలూన్ లేదా ప్యారచూట్ గా పిలువబడే బెలూన్ ఈ ఫెస్టివల్ ను ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ వారు, ఇతర కంపెనీలతో కలిసి మూడు రోజుల పాటు అరకులో అట్టహాసంగా జరుపుతారు. ఈ బెలూన్ ఫెస్టివల్ చూడటానికి, అందులో పాల్గొనడానికి వచ్చే పర్యాటకులతో అరకు వ్యాలీ సందడిగా ఉంటుంది.

ఈ బెలూన్ ఫెస్టివల్ కు కేవలం మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, అమెరికా, ఇంగ్లాండ్, దక్షిణ కొరియా, మలేషియా మొదలగు పది దేశాలకు పైన వారు కూడా ఈ బెలూన్ ఫెస్టివల్ లో పాల్గొనడానికి పనిలోపనిగా అరకు పర్యటనకు ఇక్కడి వస్తుంటారు. ఇలా ఇక్కడి వచ్చే వారు హాట్ బెలూన్ ఫెస్టివల్ ను సంబంరంగా జరుపుకుంటారు.

అసలే చలికాలం, ఈ చలికాలంలో బెలూన్లో పైకి ఎగిపోవడం అంటే చలికి ఇక అంతే సంగతలు, మన ఇండియన్స్ చలి అనిపించినా, ఫారినర్స్ కు అలవాటే కానీ మనకైతే చలికి వనికిపోవాల్సిందే. ఇంత చలిలో బుగ్గలో కూర్చొని గాలిలో తేలుతుంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఊహించుకుంటేనే భలే అనిపిస్తుంది కదూ. ఈ బెలూన్ ఫెస్టివల్ జనవరి 18 నుండి జనవరి 20వరకూ జరుగుతుంది.

పర్యాటకులను ఆకర్షించడం కోసం

పర్యాటకులను ఆకర్షించడం కోసం

పర్యాటకులను ఆకర్షించడం కోసం అరకు లోయలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ప్రతి సంవత్సరం బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నది. మూడు రోజుల పాటు కన్నుల పండుగగా కొనసాగే ఈ బెలూన్ ఫెస్టివల్లో ఆంధ్రప్రదేశ్ పలు కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది.

PC: Adityamadhav83

ఈ బెలూన్ ఫెస్టివల్ జనవరి 18న ప్రారంభం కానుంది

ఈ బెలూన్ ఫెస్టివల్ జనవరి 18న ప్రారంభం కానుంది

ఈ బెలూన్ ఫెస్టివల్ జనవరి 18న ప్రారంభం కానుంది. ఈ వేడుకల్లో ఆస్ట్రేలియా, బ్రెజిల్ తో సహా మొత్తం 13 దేశాలకు చెందినవారు ఇక్కడ పాల్గొంటారు. ఈ పోటీల్లో భాగంగా కొన్ని బెలూన్లను ఐదు వేల ఎత్తు వరకూ తీసుకెళతారు.

P.C: ian dooley

బెలూన్లలో విహరించేందుకు ఔత్సాహికులు

బెలూన్లలో విహరించేందుకు ఔత్సాహికులు

బెలూన్లలో విహరించేందుకు ఔత్సాహికులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకట్టుకోవడం కోసమే ప్రతి ఏడు ఈ బెలూన్ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పర్యాటక శాఖ అధికారులు చెప్తున్నారు. హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ మాత్రమే కాదు, ప్యారా మోటరింగ్, మ్యూజిక్ మరియు గేమ్స్ వంటి ఇతర కార్యక్రామలు కూడా అతిథేయిల కోసం లగ్జరీగా ఏర్పాటు చేస్తారు.

బెలూన్ ఫెస్టివల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. అవి ఏంటంటే

బెలూన్ ఫెస్టివల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. అవి ఏంటంటే

అరకు బెలూన్ ఫెస్టివల్ ను ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాక ప్రారంభిస్తుంది. ఇందులో దాదాపు 13 దేశాలు పాల్గొంటాయి.

బెలూన్ ఫెస్టివల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. అవి ఏంటంటే

బెలూన్ ఫెస్టివల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. అవి ఏంటంటే

అరకు బెలూన్ ఫెస్టివల్ కు వివిధ వయస్సుల గల పైలట్లు హాజరవుతుంటారు.

బెలూన్ ఫెస్టివల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. అవి ఏంటంటే

బెలూన్ ఫెస్టివల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. అవి ఏంటంటే

హాట్ ఎయిర్ బెలూన్ పైలట్ కంట్రోల్ చేసేంత ప్యారా మీటర్ ఎత్తులో ఉంటుంది, ఎయిల్ బెలూన్ గాలి వీచే దిశలో పయనిస్తుంది. ఈ ఎయిర్ బెలూన్ రైడ్ పర్యాటకులకు ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది.

బెలూన్ ఫెస్టివల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. అవి ఏంటంటే

బెలూన్ ఫెస్టివల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. అవి ఏంటంటే

మూడు రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్ జనవరి 18-20వరకు జరుగుుతంది. ఉదయం విమానాలు, సాయంత్రం టెథర్స్ మరియు నైట్ గ్లోస్ తో ఆ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది.

బెలూన్ ఫెస్టివల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. అవి ఏంటంటే

బెలూన్ ఫెస్టివల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. అవి ఏంటంటే

నైట్ గ్లోస్ పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తుంటుంది. ముఖ్యంగా అన్ని బెలూన్స్ నుండి నైట్రోజన్ పవర్డ్స్ ఫ్లేమ్స్ ఒక్కసారి విడుదల చేయడం చాలా అదంగా కనబడుతుంది.

P.C: ian dooley

బెలూన్ ఫెస్టివల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. అవి ఏంటంటే

బెలూన్ ఫెస్టివల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. అవి ఏంటంటే

చాలా మంది నైట్ గ్లోస్ ను రైడ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. అయితే అదృష్టవశాత్తు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన వారు మాత్రం వెళ్ళాల్సి ఉంటుంది.

బెలూన్ ఫెస్టివల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. అవి ఏంటంటే

బెలూన్ ఫెస్టివల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. అవి ఏంటంటే

ఉదయం పారామోటరింగ్ ప్రదర్శనలు చాలా అద్భుతంగా ఉంటాయి. జైపూర్ నుంచి భారతదేశానికి చెందిన మొదటి పారామోటరింగ్ మహిళా పైలట్ అయిన వేదకా థాపర్.

బెలూన్ ఫెస్టివల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. అవి ఏంటంటే

బెలూన్ ఫెస్టివల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. అవి ఏంటంటే

కొన్ని ప్రత్యేకంగా వివిధ ఆకారాల్లో రూపొందించిన బెలూన్స్ జోడించిన కలర్స్ బెలూన్ ఫెస్టివల్ ను మరింత ఉత్సాహాభరితంగా చేస్తుంది.

P.C: ian dooley

అరకు సందర్శించడానికి ఉత్తమ సమయం:

అరకు సందర్శించడానికి ఉత్తమ సమయం:

అరకు వ్యాలీ ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఆ విధంగా మీరు మీ ట్రిప్ ను సంవత్సరంలో ఎప్పుడైనా అరకు వాలీకి ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఈ బెలూన్ ఉత్సవం జరిగే సమయంలో అరకు వ్యాలీకి అదనపు ఆకర్షణలు.

లొకేషన్ :

లొకేషన్ :

అరకు వ్యాలీ విశాక పట్టణంకు 114కిలోమీటర్ల దూరంలో ఉంది, హైదరాబాద్ కు నుండి సుమారు 760కిలోమీటర్ల దూరంలో ఉంది . ఒడిశా రాష్ట్ర బార్డర్ కు దగ్గరలో ఉంది.

PC: roadconnoisseur

టూరిస్ట్ అట్రాక్షన్స్ :

టూరిస్ట్ అట్రాక్షన్స్ :

అరకు ట్రైబల్ మ్యూజియం, అనంత గిరి కాఫీ తోటలు, పురాతన బొర్రా గుహలు, సంగ్డ జలపాతం, మత్సగుండం, పాడేరు పద్మపురం బొటానికల్ గార్డెన్ మరియు సుంకరమెట్ట రిజర్వ్డ్ ఫారెస్ట్ అరకు వ్యాలీలో ఒక భాగం. ఇంకా పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే అరకు చుట్టు పక్కల గాలికొండ, రక్త కొండ, సుంకురమెట్ట మరియు చిత్తమగొండి చూడదగ్గ ప్రదేశాలు.

PC:Yalla.vamsi

సమయం:

సమయం:

ఈ బెలూన్ ఫెస్టివల్ ఉదయం 7.30 నుండి 9 గంటల వరకూ తిరిగి సాయంత్రం 6.30గంటల నుండి 8గంటల వరకూ రెయిడ్స్ చేస్తుంటారు. సహజంగా బెలూన్ రైడర్స్ కోసం అరకు సమీపంలో సుంకర మెట్టను ఎంపిక చేస్తుంటారు. అక్కడ నుండి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చంపగూడ వరకూ బెలూన్ రెయిడ్ జరుగుతుంది.

ఎలా వెళ్లాలి:

ఎలా వెళ్లాలి:

ఎయిర్: అరకు వ్యాలీకి విశాకపట్నం ఎయిర్ పోర్ట్ చాలా దగ్గర
రోడ్డు: అరకు వ్యాలీకి రెగ్యులర్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

PC: Ashokdonthireddy

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X