Search
  • Follow NativePlanet
Share
» »ఐదురోజుల ఔలీ పర్యటన అత్యంత ఆహ్లాదకరం.

ఐదురోజుల ఔలీ పర్యటన అత్యంత ఆహ్లాదకరం.

సముద్రమట్టం నుంచి 2500 అడుగుల ఎత్తులో ఉన్న ఔలి పర్యాటక పరంగా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. ఈ ఔలి ఉత్తర ప్రదేశంలోని చమోలి జిల్లాలో ఉంది. స్కీయింగ్ వంటి సహాస క్రీడలకు ఈ ఔలి స్వర్గధామం. ప్రకతి ప్రేమికులకు ఈ ప్రాంతం స్వర్గధామం. ఔలి చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలన్నీ పర్యాటకంగా ఎంతో ప్రాచూర్యం చెందాయి. ఢిల్లీ నుంచి ఔలి ప్రయాణం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి ఔలి చేరే మార్గంలోని పర్యాటక ప్రాంతాలతో పాటు ఔలి పాటు చుట్టు పక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన కథనం మీ కోసం...

ఔలి చూస్తే....

ఔలి చూస్తే....

P.C: You Tube

ప్రయాణానికి సంబంధించిన వివరాలు ఇలా...

పర్యాటకం ఎక్కడి నుంచి ప్రారంభం ఢిల్లీ

ఎక్కడికి చేరుకోవాలి ఔలి

ప్రయాణ సమయం 5 రోజులు

ప్రయాణ విధానం రోడ్డు మార్గంలో

ప్రయాణ దూరం 487 కిలోమీటర్లు

ఉత్తమ సమయం

ఉత్తమ సమయం

P.C: You Tube

ఔలి ఏడాదిలో ఎప్పుడైనా చూడటానికి అనుకూల వాతావరణమే ఉంటుంది. అయితే జనవరి నుంచి మార్చి కాలంలో అక్కడి ప్రక`తి మరింత అందంగా కనిపిస్తుంది. దీనితో పాటు జులై నుంచి అగస్టు మధ్య కాలంలో స్కీయింగ్ చేసేవారు ఎక్కువగా ఇక్కడిగి వెలుతూ ఉంటారు.

ఢిల్లీ నుంచి ప్రయాణం ఇలా

ఢిల్లీ నుంచి ప్రయాణం ఇలా

P.C: You Tube

ఢిల్లీ నుంచి ఔలికి సొంత వాహనంలో చేరడానికి ముందు మధ్యలో మరో పర్యాటక ప్రాంతమైన రుషికేష్ మీకు ఎదురవుతుంది. మొత్తం 225 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రయాణంలో ఢిల్లీ - గజియాబాద్ - మోదీనగర్ - మీరట్ - ఖతౌలి - ముజఫర్ నగర్ - రూర్కి - హరిద్వార్ - రుషికేష్ లు వస్తాయి.

నీరజ్ భవన్

నీరజ్ భవన్

P.C: You Tube

ఢిల్లీ నుంచి ఔలి వెళ్లాలనుకొనేవారు రుషికేష్ చేరుకొన్న తక్షణం అక్కడ ఉన్న నీరజ్ భవన్ లో విశ్రాంతి తీసుకొంటారు. రుషికేష్ లోని రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ కు ఈ హోటల్ కేవలం 0.7 కిలోమీటర్ల దూరంలో ఉండటమే ఇందుకు కారణం.

అనేక పర్యాటక స్థలాలు...

అనేక పర్యాటక స్థలాలు...

P.C: You Tube

రిషికేష్ లో అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ముఖ్యంగా రామ్ ఝూలా, రాజాజీ నేషనల్ పార్క్, లక్ష్మణ ఝూలా, తదితర పర్యాటక కేంద్రాలన్నింటినీ చూడవచ్చు. వీటన్నింటిలోకంటే ఇక్కడ ఎక్కువగా ఆకర్షించేది రామ్ ఝూలా పేరుతో ఉన్న హాంగింగ్ బ్రిడ్జ్.

జోషిమఠ్ వరకూ

జోషిమఠ్ వరకూ

P.C: You Tube

రుషికేష్ లో ఒక రోజు గడిపిన తర్వాత అక్కడి నుంచి 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోశిమఠ్ కు చేరుకొంటారు. జోశిమఠ్ ప్రక`తి ప్రేమికులకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అక్కడి వాతావరణం ఇందుకు కారణం. ఈ జోశిమఠ్ నుంచి ఔలి కేవలం 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

కేబుల్ కార్

కేబుల్ కార్

P.C: You Tube

జోషిమఠ్ నుంచి మరో 12 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే కేబుల్ కార్ పార్కింగ్ ప్రాంతం వస్తుంది. ఇక్కడి నుంచి చాలా మంది కేబుల్ కారులో ప్రయాణం చేస్తారు. చుట్టూ ఉన్న మంచు పర్వత అందాలను చూస్తూ నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నంత సేపు సమయమే తెలియదని చెప్పడం అతిశయోక్తి కాదు.

కనీసం 10 మంది

కనీసం 10 మంది

P.C: You Tube

ఒక్కొక్క కేబుల్ కారులో కనీసం పదిమంది ఉండాల్సిందే. అంత వరకూ కేబుల్ కార్ కదలదు. గరిష్టంగా 25 మంది ఒక కేబుల్ కారులో ప్రయాణించవచ్చు. ప్రయాణ సమయం 25 నిమిషాలు. ఔలిలో వసతి కోసం అనేక లాడ్జీలు అందుబాటులో ఉంటాయి.

మనోహరం

మనోహరం

P.C: You Tube

ఔలిలో చూడదగని ప్రాంతాల్లో మొదట నందాదేవి పర్వతం గురించి చెప్పుకోవచ్చు. 7817 మీటర్ల ఎత్తు ఉన్న ఈ పర్వత అందాలు ఎప్పుడైనా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అయితే సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఆ అందాలు మనోహరంగా కనిపిస్తాయి.

సాహసక్రీడలు

సాహసక్రీడలు

P.C: You Tube

స్కీయింగ్, స్నో బోటింగ్ కు ఔలి పెట్టింది పేరు. ఇక్కడ ఔత్సహికులకు సరైన మార్గ నిర్దేశం చేయడానికి అనేకమంది నిపుణులు ఉంటారు. వారికి కొంత రుసుమును చెల్లించి వారి సేవలను వినియోగించుకోవచ్చు. ఔలి ట్రెక్కింగ్ కు కూడా అనుకూలమైన ప్రాంతం.

అద్భుత ప్రాంతాలు ఎన్నో

అద్భుత ప్రాంతాలు ఎన్నో

P.C: You Tube

ఔలిలో చూడదగిన ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. అందులో గుస్కో బుగ్యాల్. ఇక్కడి నుంచే ద్రోణ్ శిఖరం, త్రిషూల్ శిఖరం తదితర పర్వత శిఖరాల అందాలను ఆస్వాధించవచ్చు. ట్రెక్కింగ్ ద్వారా కూడా ఆ పర్వత ప్రాంతాల వద్దకు వెళ్లవచ్చు.

సమయాన్ని అనుసరించి

సమయాన్ని అనుసరించి

P.C: You Tube

మన దగ్గర ఉన్న సమయాన్ని బట్టి అక్కడికి వెళ్లాలా లేక దూరం నుంచే చూసి ఆనందించాలా అన్నది మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఇకఇక్కడికి దగ్గర్లోనే రూప్ కుండ్ అనే సరస్సు ఉంది. దీనికి మరికొంత దూరంలోనే ఛత్రకుండ్ అనే సరస్సు ఉంది. ఛత్రకుండ్ సరస్సులోని నీరు అత్యంత స్వచ్ఛమైన నీరుగా భావిస్తారు.

ట్రెక్కింగ్

ట్రెక్కింగ్

P.C: You Tube

ఔలి దగ్గరకు వెళ్లినవారిలో ఔరి పాస్ లో ట్రెక్కింగ్ జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు. సముద్ర మట్టం నుంచి 4268 మీటర్ల ఎత్తులో చుట్టు మంచు పర్వత అందాలను చూస్తూ ముందుకు సాగడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది.

షాపింగ్

షాపింగ్

P.C: You Tube

ఔలి వెళ్లినవారు అక్కడషాపింగ్ చేయకుండా వెనుదిరగరు. ఇక్కడి స్థానికులు స్వయంగా నేసిన దుస్తులు, తయారు చేసిన పాదరక్షలతో పాటు ఇంటి అలంకార వస్తువులు తదితరాలను కొనుక్కోవచ్చు. బయటి మార్కెట్ తో పోలిస్తే వాటి ధరలు కొంత తక్కువగానే ఉంటాయి. మొత్తం ఐదు రోజుల పాటు ఢిల్లీ నుంచి ఔలి వెళ్లి అక్కడ గడపడం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X