Search
  • Follow NativePlanet
Share
» »హంపిలోని ఈ బడవి లింగ దేవాలయాన్ని చూశారా

హంపిలోని ఈ బడవి లింగ దేవాలయాన్ని చూశారా

బడవిలింగ దేవాలయానికి సంబంధించిన కథనం.

హంపిలోని బడవిలింగ దేవస్థానంలో ప్రధాన దైవం శివుడు. హిందువులు శివుడిని ఈ దేవాలయంలో లింగ రూపంలో పూజిస్తారు. హంపిలోని ప్రసిద్ధ నరసింహ స్వామి విగ్రహానికి సమీపంలో ఉన్న ఈ దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...

బడవి లింగ దేవస్థానం, హంపి

బడవి లింగ దేవస్థానం, హంపి

P.C: You Tube

హంపిలో ఉన్న బడవిలింగ దేవస్థానం ఏకశిలాతో చెక్కిన పెద్ద శివలింగం. ఈ శివలింగం పై మూడు కన్నులు ఉండటం విశేషం. ఈ మూడు కన్నులు ఈ శివుడి త్రినేత్రుడనడానికి నిదర్శనమని చెబుతారు.

ఈ విగ్రహం గురించిన సమస్త విషయాలు మీ కోసం?ఈ విగ్రహం గురించిన సమస్త విషయాలు మీ కోసం?

బడవి లింగ దేవస్థానం, హంపి

బడవి లింగ దేవస్థానం, హంపి

P.C: You Tube

అత్యంత అందమైన ఈ శివలింగాన్ని నల్లని గ్రానైట్ రాయితో తయారు చేశారు. మూడు మీటర్ల ఎత్తు ఉన్న ఈ శివలింగాన్ని చూడటానికి రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. విజయనగర సామ్రాజ్య కాలం నుంచి ఈ దేవాలయం ఇక్కడ ఉన్నట్లు చెబుతారు.

అండమాన్ లో మీలో కాముడిని ఎవరెస్టు ఎక్కించే ప్రాంతాలు ఇవేఅండమాన్ లో మీలో కాముడిని ఎవరెస్టు ఎక్కించే ప్రాంతాలు ఇవే

బడవి లింగ దేవస్థానం, హంపి

బడవి లింగ దేవస్థానం, హంపి

P.C: You Tube

శివరాత్రి సమయంలో ఈ శివలింగాన్ని పూజించడానికి భక్తులు ఇక్కడికి వస్తారని చెబుతారు. బడవలింగ అనే పదం రెండు పదాల కలయికగా చెబుతారు. బడ, లింగ అనే రెండు పదాల కలయిక వల్ల ఈ బడవిలింగ అనే పదం ఏర్పడింది.

మగధీర ఎడారిలో పర్యటకం వెళ్లాలని ఉందామగధీర ఎడారిలో పర్యటకం వెళ్లాలని ఉందా

బడవి లింగ దేవస్థానం, హంపి

బడవి లింగ దేవస్థానం, హంపి

P.C: You Tube

పేదరికంలో ఉన్న ఓ రైతు ఈ దేవాలయాన్ని నిర్మించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. బడతనం అంటే పేదరికం అని అర్థం. ఈ బడవిలింగం ఒక చిన్న తటాకం మధ్యన ఉంటుంది. ఈ దేవాలయంలోకి వెళ్లడానికి చిన్న ద్వారం కూడా ఉంటుంది.

బడవి లింగ దేవస్థానం, హంపి

బడవి లింగ దేవస్థానం, హంపి

P.C: You Tube

ఈ దేవాలయానికి ఎటువంటి పై కప్పు ఉండదు. సూర్యరశ్మి ఎల్లప్పుడూ ఈ శివలింగం పై భాగాన పడుతూ ఉంటుంది. అదే విధంగా వర్షం వచ్చినప్పుడు కూడా ఆ వరణుడు ఈ శివలింగానికి అభిషేకం చేస్తాడు.

బడవి లింగ దేవస్థానం, హంపి

బడవి లింగ దేవస్థానం, హంపి

P.C: You Tube

హంపిలో విమానాశ్రయం లేదు. అందువల్ల మీరు విమానంలో ఇక్కడికి చేరుకోవాలంటే మొదట బళ్లారీకి వెళ్లి అక్కడి నుంచి హంపికి రావాల్సి ఉంటుంది. రైలులో హంపి చేరుకోవాలంటే మొదట హొస్పేట చేరుకోవాలి.

బడవి లింగ దేవస్థానం, హంపి

బడవి లింగ దేవస్థానం, హంపి

P.C: You Tube

భారత దేశంలోని వివిధ నగరాల నుంచి హెస్సేటకు రైలు సౌకర్యాలు ఉన్నాయి. అయితే రోడ్డు ప్రయాణం ద్వారా హంపి చేరుకోవడం చాలా బాగుంటుంది. బెంగళూరు నుంచి నిత్యం హంపికి బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

ఈ రంధ్రం గుండా వెళితే మీ కడుపు పండుతుంది?ఈ రంధ్రం గుండా వెళితే మీ కడుపు పండుతుంది?

బడవి లింగ దేవస్థానం, హంపి

బడవి లింగ దేవస్థానం, హంపి

P.C: You Tube

ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఈ శివలింగం దర్శనానికి అవకాశం ఉంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య హంపిని చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఇదే సమయంలో దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

ఈ స్వామి చెప్పులను కానుకలుగా స్వీకరిస్తాడు?ఈ స్వామి చెప్పులను కానుకలుగా స్వీకరిస్తాడు?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X