» »శ్రావణబెళగోళలోని బాహుబలి మాహిష్మతి కాదు !

శ్రావణబెళగోళలోని బాహుబలి మాహిష్మతి కాదు !

Written By: Venkatakarunasri

LATEST: ఒక్క రాత్రిలో ఊరు మొత్తం ఖాళీ...

మీరు బాహుబలిని చూశారా? బాహుబలి సినిమా కాదు. శ్రావణబెళగోళలోని బాహుబలిని చూశారా? చూడకపోతే టైం వేస్ట్ చేయకుండా ఇది చదివి శ్రావణబెళగోళలోని అతన్ని సందర్శించండి. కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలోని చెన్నగరాయపట్టణానికి సమీపంలోని పట్టణం. ఇది బెంగుళూరుకు 158 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

పట్టణానికి మధ్యలో ఒక కొలను ఉంది. దీనికి శ్వేతకొలను లేదా దవళ సరోవరం అని పేరు. ఈ శ్వేతకొలనుకు కన్నడంలో బెళగొళ అని పేరు. శ్రవణుడి (గోమఠేశ్వరుడి) బెళగొళ కాబట్టి శ్రావణబెళగొళగా ఈ ప్రాంతానికి పేరు స్థిరపడిపోయింది.

వింధ్యగిరిపై రాజమల్ల మంత్రి చాముండిరాయ ఎన్నో ప్రయాసలు పడి గోమఠేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. ఈ విగ్రహానికి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహామస్తకాభిషేకం జరిగేలా ఏర్పాటుచేశాడు.

తొలినాళ్ళలో అభిషేకోత్సవం జరిపించాలని చాముండిరాయ నిర్ణయించాడు. గొప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేయించిన తనకు తప్ప వేరే ఎవరికి ఆ అభిషేకోత్సవంలో పాల్గొనే అవకాశం లేదని ప్రకటించాడు. బాహుబలి అభిషేకానికి అన్ని ద్రవ్యాలు తెప్పించాడు చాముండిరాయ. అభిషేకోత్సవం మొదలైంది.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. అభిషేక ద్రవ్యాలు

1. అభిషేక ద్రవ్యాలు

చాముండి తెప్పించిన అన్ని ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అన్నీ ఐపోయాయి. కాని అభిషేక ద్రవ్యాలు బాహుబలి పాదాలకు కూడా చేరలేదు.

pc: Thejaswi

2. చాముండిరాయ

2. చాముండిరాయ

చాముండిరాయకు యేమిచేయాలో పాలుపోలేదు. చివరికి ఒక అజ్జి (ముసలవ్వ) గుల్లెకాయ (కొబ్బరికాయ) లో కొన్ని పాలు తీసుకొని వచ్చిందట.

pc:Dineshkannambadi

3. ఆజ్ఞ

3. ఆజ్ఞ

తనకు అభిషేకానికి అనుమతి ఇవ్వమని కోరిందట. భటులు ముందు అంగీకరించకపోయినా, చాముండిరాయ ఆజ్ఞతో అనుమతించారట.

pc:Sughoshdivanji

4. వింధ్యగిరి

4. వింధ్యగిరి

అవ్వ ఆ చిన్న కొబ్బరి చిప్పలోని పాలను బాహుబలి మస్తకంపై పోయగా, ఆ కొద్ది పాలే ఆశ్చర్యంగా బాహుబలి శిరస్సు నుండి పాదాలకు చేరి మొత్తం తడిపివేశాయట. అంతటితో ఆగకుండా ఆ విగ్రహం నుండి పాలు కొండ మీదికి, ఆ వింధ్యగిరి మీద నుండి కిందికి ధారాపాతగా ప్రవహించాయట.

pc:Matt Logelin

5. శ్వేతకొలను

5. శ్వేతకొలను

అలా పారిన ఆ పాలతో ఏర్పడినదే ఈ సరస్సు అని, అందుకే ఇది తెల్లగా ఉన్నదని, దానికి శ్వేతకొలను లేదా దవళసరోవరమని పేరొచ్చిందని చెబుతారు. చాముండిరాయ అవ్వ మహాత్యానికి అబ్బురపడి, క్షమించమని కోరాడట.

pc:Travelling Slacker

6. గుల్లెకాయ అజ్జి ఆలయం

6. గుల్లెకాయ అజ్జి ఆలయం

ఆ అవ్వ ఎవరో కాదని జైన జాతి రక్షక దేవత అని, భగవంతుడి సేవాభాగ్యాన్ని అందరికి కలిపించాలని చాటి చెప్పి, చాముండిరాయ కళ్ళు తెర్పించడానికి వచ్చిందని జైనులు విశ్వసిస్తారు. ఆ అవ్వకు ఒక ఆలయాన్ని నిర్మిచారు. ఆ ఆలయాన్ని గుల్లెకాయ అజ్జి ఆలయంగా పిలుస్తారు.

7. చంద్రగుప్త మౌర్యుడు

7. చంద్రగుప్త మౌర్యుడు

ఈ పట్టణంలో చంద్రగిరి, వింధ్యగిరి అను రెండు కొండలు ఉన్నాయి. ఇక్కడ ఆచార్య బద్రబాహు మరియు అతని శిష్యుడు చంద్రగుప్త మౌర్యుడు తపస్సు ఆచరించినట్లు తెలుస్తుంది. క్రీస్తుపూర్వం 3 వ శతాబ్దిలో అశోకడు ఇక్కడ చంద్రగుప్తుని పేరుతో మఠాన్ని ఏర్పాటు చేశాడు.

pc:Benjamín Preciado

8. చాముండిరాయ

8. చాముండిరాయ

చంద్రగిరిపై గొప్ప ఆలయం ఉంది. దీనిని గంగ రాజు రాజమల్ల మంత్రి, మరియు నేమిచంద్రుని శిష్యుడిగా చెప్పబడె చాముండిరాయ నిర్మించాడు.

pc:Archit894

9. గోమఠేశ్వరుడి ఏకశిలా విగ్రహం

9. గోమఠేశ్వరుడి ఏకశిలా విగ్రహం

పట్టణంలోని వింధ్యగిరిపై 58 అడుగుల ఎత్తైన ఆకర్షణీయమైన గోమఠేశ్వరుడి ఏకశిలా విగ్రహం ఉంది. దీనికి ప్రపంచంలో అతి పొడవైన ఏకశిలా విగ్రహంగా గుర్తింపు ఉంది. ఈ విగ్రహం యొక్క పీఠంపై కన్నడ, ప్రాచీన కొంకణి, సంస్కృత సమ్మిళితమైన లిపిలో ఒక శాసనం ఉంది.

pc:chetan tg

10. మహామస్తకాభిషేకం

10. మహామస్తకాభిషేకం

ఈ శాసనం క్రీ.శ.981 నాటిదిగా చెప్పబడింది. 2018లో మహామస్తకాభిషేకం జరుగుతుంది. ఈ విగ్రహాన్ని కన్నడ ప్రజలు గోమఠేశ్వరుడిగా పిలుస్తే, జైనులు బాహుబలిగా కొలుస్తారు.

pc:Akshatha Inamdar

11. అభిషేకం

11. అభిషేకం

అందులో 49 శాతం మంది గోమఠేశ్వర విగ్రహానికి తమ మద్ధతు తెలిపి మొదటి స్థానాన్ని కట్టబెట్టారు. ఈ గోమఠేశ్వరుడికి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహామస్తకాభిషేక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ సందర్భంగా పాలు, పెరుగు, నెయ్యి, కుంకుమపూలు, బంగారు నాణేలతో అభిషేకం చేస్తారట.

pc:chetan tg

12. మహామస్తకాభిషేకం

12. మహామస్తకాభిషేకం

ఈ ఉత్సవానికి దేశ నలుమూలల నుండి వేలకొలది జైనులు తరిలివస్తారట. మళ్ళీ 2018లో మహామస్తకాభిషేకం జరుగుతుంది. శ్రావణబెళగొళలో క్రీ.శ.600 నుండి 1830 మధ్య వివిధ కాలాలకు చెందిన దాదాపు 800 శాసనాలు ఇక్కడ లభించాయి.

pc:chetan tg

13. చంద్రగిరి పర్వతం

13. చంద్రగిరి పర్వతం

ఈ శాసనాలు చంద్రగిరి, ఇంద్రగిరి పర్వతాలపై మరియు పట్టణంలోని వివిధ ప్రాంతాలలో లభించాయి. వీటిలో ఎక్కువ భాగం చంద్రగిరి పర్వతం మీద లభించగా, ఇవన్నీ కూడా క్రీ.శ. 10 వ శతాబ్దికి ముందువే కావడం విశేషం. ఈ శాసనాలు కన్నడ, కొంకిణి, మరాఠి, తమిళ, సంస్కృత, మహాజనీ, మర్వారి భాషల్లో ఉన్నాయి.

pc:RakeshRaju M

14. గొప్ప సంపద

14. గొప్ప సంపద

వీటిలో ఎక్కువ భాగం ప్రాచీన కన్నడలో ఉన్నాయి. వీటిలో చాలా శాసనాలు పశ్చిమ గంగ, రాష్ట్ర కూట, హొయసల, విజయనగర, ఒడయార్ సామ్రాజ్యాల ఉత్థానపతనాలను సూచిస్తాయి. అదేవిధంగా కన్నడ భాష, సాహిత్యాల స్వభావం, పరిణామ క్రమాన్ని అధ్యనం చేయడానికి, అర్థం చేసుకోవడానికి ఆధునిక పరిశోధకులకు ఈ శాసనాలు ఓ గొప్ప సంపద.

pc:Benjamín Preciado

15. శ్రావణబెళగొళ సందర్శించడానికి ఉత్తమ సమయం

15. శ్రావణబెళగొళ సందర్శించడానికి ఉత్తమ సమయం

శ్రావణబెళగొళ సంవత్సరం పొడవునా ఎప్పుడైనా సందర్శించవచ్చు. అయితే శీతాకాలంలో అనేక మంది ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఇష్టపడతారు. ఈ ప్రదేశం సందర్శించడానికి ఉత్తమ నెలలు అక్టోబర్ నుండి మే వరకు.

pc:Dey.sandip