• Follow NativePlanet
Share
» »బ్లాక్ అండ్ వైట్ లో బెంగళూరు

బ్లాక్ అండ్ వైట్ లో బెంగళూరు

Written By: Kishore

కేవలం 2,500 టికెట్ ఖర్చుతో వైష్ణోదేవి యాత్ర పూర్తి

ప్రస్తుతం మనం అత్యంత ఆధునికమైన బెంగళూరును చూస్తున్నాం. ఐటీ విషయంలో ఇది భారత దేశానికే కాక ప్రపంచానికి కూడా తలమానికం. అటు వంటి ఆధునిక బెంగళూరుకు పునాధి వేసిన వాడు కెంపేగౌడ. దాదాపు 16వ శతాబ్దంలో పడిన ఆ పునాది దిన దిన ప్రవర్థమానంగా పెరుగుతూ మనం ఇప్పుడు చూస్తున్న నగరంగా సాక్షాత్కారమయ్యింది. అయితే ఇప్పటి తరానికి అప్పడు బెంగళూరు ఎలా ఎండేదన్న విషయం కుతూహలం కలిగించేదే. మీ ఆశను తీర్చడానికి నేటివ్ ప్లానెట్ దాదాపు యాభై నుంచి 80 ఏళ్ల క్రితం బెంగళూరు ఎలా ఉండేదన్న విషయాన్ని ఫొటోల రూపంలో తీసుకువచ్చింది. ఈ వ్యాసంలో బెంగళూరులో అత్యంత ప్రముఖమైన ఐదు ప్రాంతాలు అప్పట్లో ఎలా ఉండేవన్న విషయానికి సంబంధించి ఫొటోలను కూడా తీసుకువచ్చాం. మరెందుకు ఆలస్యం ఆ ఫొటోలను చూసి ఆ పాత మధురాలను ఒక సారి గుర్తుకు తెచ్చుకుని ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న సామెతను గుర్తుకు తెచ్చుకోండి. 

1.కబ్బన్ పార్క్

1.కబ్బన్ పార్క్

Image Source:

బెంగళూరుకు ఉద్యాన నగరం అని రావడానికి కారణం నగరంలో ఉన్నటు వంటి పార్కులే. భారత దేశంలోని మిగిలిన నగరాలతో పోలిస్తే బెంగళూరులో ఉద్యానవనాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ఉద్యానవనాల్లో 300 ఎకరాల్లో ఉన్న కబ్బన్ పార్క్ ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉంది. ఇది నగరంలో రైల్వే స్టేషన్ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎక్కడ చూసిన పచ్చదనంతో ఉండే ఈ ఉద్యానవనంలో రాక్ గార్డెన్ చూడదగినది. అదే విధంగా ఎండి పోయిన చెట్లను అందమైన శిల్పాలుగా మలిచి వాటిని ఒక చోట చేర్చారు. కబ్బన్ పార్క్ వెళ్లి నప్పడు ఈ రెండింటిని చూడటం మరిచిపోకూడదు. ఈ కబ్బన్ పార్క్ పరిధిలోనే మనకు కర్ణాటక పాలన కేంద్రమైన విధానసౌధ, వికాససౌధతో పాటు కర్ణాటక రాష్ట్ర హై కోర్టును కూడా చూడవచ్చు. విధానసౌధ చూడటానికి మనం ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

2. ఎంజీ రోడ్డు

2. ఎంజీ రోడ్డు

Image Source:

బెంగళూరులో అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఎంజీ రోడ్డు మొదటి స్థానంలో ఉంటుంది. ఇది ప్రముఖ షాపింగ్ స్పాట్ కూడా. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏదీ ఉండదు. అందే విధంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ ఇక్కడ మనం షాపింగ్ చేయవచ్చు. మెజెస్టిక్ నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఇది ఉంటుంది. కొన్ని దశాబ్దాలుగా ఈ ఎం.జీ రోడ్డు అంటే మహాత్మాగాంధీ రోడ్డు వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతోంది. కేవలం వ్యాపార కేంద్రంగానే కాకుండా అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థల ప్రధాన కేంద్రాలన్నీ ఇక్కడే ఉన్నాయి.

3. లాల్ బాగ్

3. లాల్ బాగ్

Image Source:

మైసూరును పరిపాలించిన హైదరాలీ సూచనలతో ఈ లాల్ బాగ్ ఉద్యాన వనం ఏర్పడింది. ఇందులో ఉన్నటు వంటి గ్లాస్ హౌస్ లో ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవంతో పాటు స్వతంత్ర దినోత్సవం రోజున ఫల ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. దీనిని చూడటానికి భారత దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడకు వెళ్లినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల ఇక్కడ తేనెటీగలు దాడి చేయడం ఎక్కువయ్యింది. వీటి బారినపడి కొంత మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. లాల్ బాగ్ లో ఉన్నటు వంటి బోన్సాయ్ విభాగాన్ని సందర్శించడం సరదాగా ఉంటుంది. మర్రి చెట్టును కూడా ఇక్కడ కుండీల్లో పెంచడం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు.

4.బెంగళూరు ప్యాలెస్

4.బెంగళూరు ప్యాలెస్

Image Source:

బెంగళూరు నగరానికి మధ్య భాగంలో అటు సదాశివనగర, ఇటు జయమహల్ మధ్య ఈ బెంగళూరు ప్యాలెస్ నిర్మించబడింది. ట్యూడర్ వాస్తు శైలిలో నిర్మించబడిన ప్యాలెస్ గోపురాలు చూడముచ్చటగా ఉంటాయి. ఈ ప్యాలెస్ ఆవరణంలో దాదాపు 50 క్రితం నుంచి సినిమాలను షూటింగ్ చేస్తున్నారు. పాత తెలుగు, కన్నడతో పాటు హింది సినిమాల్లో ఈ ప్యాలెస్ ను మనం చూడవచ్చు. ఈ ప్యాలెస్ మైసూరు రాజు చామరాజ ఒడయార్ కుటుంబం రారెట్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు. ఈ ప్యాలెస్ కు సంబంధించి న్యాయపరమైన సమస్యలు చాలా కాలంగా ఉన్నాయి. ఈ ప్యాలెస్ మొత్తం చూడటానికి కనీసం రెండు గంటల సమయం పడుతుంది. ఇందుకు కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

5. బెంగళూరు కోట

5. బెంగళూరు కోట

Image Source:

నగరంలోని చామరాజ నగర పరిధిలో బెంగళూరు కోట వస్తుంది. విజయనగర సామ్రాజ్యానికి సామంత రాజుగా ఉన్న కెంపేగౌడ క్రీస్తు శకం 1537లో మట్టి కోటను నిర్మించి ఆధునిక బెంగళూరుకు పునాది వేశారు. అటు పై 1761లో అదే మట్టి కోట ప్రాంతంలో పెద్ద రాళ్లతో ఈ కోటను నిర్మించారు. ఈ కోట మొత్తం 4 అంతస్తులను కలిగి ఉంటుంది. అండాకారంలో ఉన్న ఈ కోట శత్రుదుర్భేద్యంగా ఉండేదని అప్పటి వారు చెబుతారు.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి