• Follow NativePlanet
Share
» » నోరూరించే స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ ఫేమస్

నోరూరించే స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ ఫేమస్

Written By: Beldaru Sajjendrakishore

మైసూరు వచ్చినప్పుడు ఏమేమి కొనాలో తెలియదా

దేవతలందరూ నివశించే ప్రదేశం

విషపు రాళ్లతో మలచబడిన ప్రపంచంలో ఏకైక విగ్రహం

విద్యా, ఉపాధి కోసం ఎంతో మంది బెంగళూరు బాట పడుతున్నారు. ఇలా వచ్చిన వారికి ఇంటి భోజనం దొరకడం కష్టం. అంతే కాకుండా వండుకోవడానికి అంత సమయం కూడా ఉండటం లేదు. అటు వంటి వారికి పెద్ద పెద్ద హోటల్స్ కు వెళ్లడం ఎల్లవేళలా కుదరదు. ఇటువంటి వారి కోసం బెంగళూరులో కొన్ని స్ట్రీట్ ఫుడ్ హబ్స్ వెలిశాయి. ఈ స్ట్రీట్ ఫుడ్ హాబ్స్ లో ధర అందుబాటులో ఉంటమే కాకుండా ఇంటి రుచిని మరిపిస్తాయి. సాయంకాలం ఫలహారం అదేనండి ఛాట్స్ తినడానికి కొన్ని ప్రాంతాలు చాలా ఫేమస్. అటువంటి స్ట్రీట్ ఫుడ్స్, అవి దొరికే చోటు మీ కోసం

1. వి.వి పురం ఫుడ్ స్ట్రీట్

1. వి.వి పురం ఫుడ్ స్ట్రీట్

Image Source:

మసాల దోసె నుంచి మొదలుకొని మసాలా నిప్పట్టు వరకూ ప్రతి ఒక్కటి ఈ వి.వి పురం ఫుడ్ ఫుడ్ స్ట్రీట్ లో దొరుకుతుంది. ఇక్కడ ఉన్న శివణ్ణ గుల్కన్ సెంటర్ లో దొరికే చాట్ కోసం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తుంటారు. ముఖ్యంగా శుద్ధమైన తేనతో తయారుచేసిన గుల్కన్ తో కూడిన ఛాట్ ఇక్కడ చాలా ఫేమస్. అంతే కాకుండా ఇక్కడ మిగిలిన ఛాట్ సెంటర్స్ లో కూడా అత్యుత్తమ ఆహారాన్ని అందుబాటు ధరల్లోనే పొందవచ్చు.

2. సెంట్రల్ టిఫిన్ రూమ్, మల్లేశ్వరం

2. సెంట్రల్ టిఫిన్ రూమ్, మల్లేశ్వరం

Image Source:

శుద్ధమైన వెన్నతో తయారైన దోసె తినాలనుకొంటే తప్పకుండా మల్లేశ్వరంలోని మార్గోస్ రోడ్డులోని సీటీఆర్ సెంటర్ కు వెళ్లాల్సిందే. దాదాపు 60 ఏళ్లుగా ఈ టిఫిన్ సెంటర్ వినియోగదారుల మనస్సు దోచుకుంటోంది. ఇక్కడ కేవలం దోస మాత్రమే కాకుండా ఇడ్లీ, వడా, కేసరిబాత్, పూరి, సాగు తదితర దక్షిణ భారత దేశ శైలి టిఫిన్స్ అన్నీ దొరుకుతాయి.

3. బ్రహ్మణ కాఫీ బార్, బసవనగుడి

3. బ్రహ్మణ కాఫీ బార్, బసవనగుడి

Image Source:

బెంగళూరు నగరంలోని బసవనగుడి వద్ద ఉన్న బ్రహ్మణ కాఫీ బార్ కు దక్షిణ భారత దేశ టిఫిన్స్ తయారు చేయడంలో ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. ముఖ్యంగా ఇడ్లీ ఇక్కడ చాలా ఫేపస్. బియ్యపు రవ్వతో చేసే ఈ ఇడ్లీ కోసం ప్రజలు ఎగబడుతారు. మొదటి సారి ఇక్కడకు వెళ్లిన వారు ఒక్క ప్లేట్ తో కడుపు నింపుకోరు. కనీసం రుచి కోసమైనా ఇంకొక్క ప్లేట్ తింటారు. ఇక ఇక్కడ దొరికే కాఫీ, టీ రుచికి సాటి నగరంలో మరెక్కడా దొరకదు.

4. హారిస్ స్యాండ్ విచ్ జ్యూస్ సెంటర్, జయనగర

4. హారిస్ స్యాండ్ విచ్ జ్యూస్ సెంటర్, జయనగర

Image Source:

సాండ్ విచ్ ను మీరు ఎన్నోసార్లు రుచి చూసి ఉంటారు. అయితే చాకొలేట్ సాండ్ విచ్ అవును మీరు విన్నది నిజమే. చాకొలేట్ సాండ్ విచ్ రుచి చూడాలంటే మాత్రం జయనగర్ కు వెళ్లాల్సిందే. అక్కడ ఉన్నటు వంటి హారిస్ స్యాండ్ విచ్ ముందు ఎప్పుడూ యువత ఈ చాకొలేట్ స్యాండ్ విచ్ కోసం బారులు తీరి ఉంటారు. ధర కూడా మనకు అందుబాటులోనే ఉంటుంది. ఇక ఈ ఛాట్ బండార్ కు పక్కనే లస్సీ బార్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకు వివిధ రకాల లస్సీలు దొరుకుతాయి.

5. రాకేష్ కుమార్ పానీపూరి స్టాల్, జయనగర

5. రాకేష్ కుమార్ పానీపూరి స్టాల్, జయనగర

Image Source:

గోల్ గుప్పా, పానీపూరి ఇలా రకరలా పేర్లతో పిలుచుకొనే ఈ స్ట్రీట్ ఫుడ్ ఉత్తర భారత దేశం నుంచి దిగుమతి అయ్యింది. బెంగళూరులో చాలా ప్రాంతాల్లో ఈ పానీపూరి మనకు దొరుకుతుంది. అయితే జయనగర్ 3వ బ్లాక్ లో ఉన్న రాకేష్ కుమార్ పానీపూరి సెంటర్ లో దొరికే పానీపూరికి ఉన్న రుచి మరెక్కడా దొరకదు. ఒక చిన్న దుకాణం వలే కనిపించినా ప్రతి రోజూ ముఖ్యంగా సాయంకాలం 5 గంటల నుంచి 10 గంటల మధ్య కొన్ని వేల మంది ఇక్కడ పానీపూరి రుచి చూస్తారు. ఒక్కసారి ఇక్కడ పానీపూరి రుచి చూసిన వారు మరలా మరలా ఇక్కడకు వస్తుంటారు.

6. ఖాన్ సాహేబ్ గ్రిల్స్ ఇందిరా నగర

6. ఖాన్ సాహేబ్ గ్రిల్స్ ఇందిరా నగర

Image Source:

మాంసప్రియులకు అవసరమైన అన్ని రకాల పదార్థాలు ఈ ఖాన్ సాహేబ్ గ్రిల్స్ దుకాణంలో దొరుకుతాయి. బెంగళూరులోని అత్యుత్తమ స్ట్రీట్ ఫుడ్ హబ్ లలో ఇది కూడా ఒకటి. ఇక్కడ మాంసాహార ప్రియులకే కాకుండా శాకాహారులకు కూడా వివిధ రకాల గ్రిల్స్ దొరుకుతాయి. ముఖ్యంగా వెబిటబుల్ టిక్కా రోల్, పన్నీర్ మశ్రూమ్, బేబీ కార్న్, తదితర వంటకాలు చాలా ఫేమస్.

7. శ్రీ సాయిరాం చాట్స్ అండ్ జూస్

7. శ్రీ సాయిరాం చాట్స్ అండ్ జూస్

Image Source:

మల్లేశ్వరంలోని శ్రీ సాయిరాం చాట్స్ అండ్ జూస్ సెంటర్ లో దహీ పూరి తినడం మరిచిపోకండి. ఇక్కడ కేవలం దహీపూరినే కాకుండా మరెన్నో రకాల ఛాట్స్ కూడా మనకు దొరుకుతాయి. ఇక ఇక్కడ సర్వీస్ అందించే వారు కూడా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. అందువల్లే ఇక్కడ దొరికే ఛాట్స్ కు అంత రుచి ఉంటుందేమో. ఇక్కడ మనకు వేఫర్ ఛాట్ చిప్స్, మసాలా డిస్కోఛాట్, క్రేజీ ఛాట్ రుచి చూడటం కూడా మరిచిపోకండి. ముఖ్యంగా ఇక్కడ స్వయంగా తయారు చేసే చొకొలేట్ రుచి చూడటం మరిచిపోకండి.

8. పుచ్కాస్, మారత్ హళ్లీ

8. పుచ్కాస్, మారత్ హళ్లీ

Image Source:

ఈ చాట్ బండార్ మారత్ హళ్లీలోని సిల్వర్ సింగ్ లే అవుట్ రివెరా అపార్ట్ మెంట్ కు దగ్గరగా ఉంది. మిగిలిన ఛాట్ బండారాలతో పోలిస్తే ఇక్కడ కొంత ధర ఎక్కువగానే ఉంటుంది. అయితే రుచి, శుచి చాలా బాగుంటుంది. హాట్ డాగ్ పుట్కా ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఛాట్.

 9. కర్నాటక బేల్ హౌస్

9. కర్నాటక బేల్ హౌస్

Image Source:

సాయంకాలం మంచి ఛాట్ తినాలనుకొంటే బసవనగుడికి దగ్గర్లోని ఉమా సినిమా థియేటర్ రోడ్డులో ఉన్న కర్ణాటక బేల్ హౌస్ కు వెళ్లాల్సిందే. ఇక్కడ ధరలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ బేల్ పూరి చాలా ఫేమస్. అంతే కాకుండా ఆలూదహీ పూరి, సేవ్ పూరి, మసాలా పూరి వంటి ఛాట్స్ కూడా ఇక్కడ ఎక్కవగా అమ్ముడు పోతుంటాయి.

10. టిక్కీ టిక్కీ కోరమంగళ

10. టిక్కీ టిక్కీ కోరమంగళ

Image Source:

నగరంలో స్ట్రీట్ ఫుడ్స్ కు ఫేమస్ అయిన ప్రాంతాల్లో కోరమంగల కూడా ఒకటి. ఇక్కడ ఉన్న టిక్కీ టిక్కీ కోరమంగళలో దొరకని ఛాట్ అంటూ ఉండదు. రుచి కూడా అమోఘం. ఒక్కసారి ఇక్కడ ఛాట్స్ ను తింటే ప్రతి రోజూ ఇక్కడికే వెళ్లాల్సి ఉంటుంది. చాకోలెట్ టిక్కి, ముడిపి టిక్కీ, మసాల టిక్కీ పన్నీర్ టిక్కీ వంటి వాటి రుచి మనం చూడాల్సిందే.

11. శాహీ దర్బార్, యశ్వంతపుర

11. శాహీ దర్బార్, యశ్వంతపుర

Image Source:

ఎం.ఎస్ రామయ్య గ్రౌండ్ పక్కన ఈ ఛాట్ బండార్ ఉంది. ఇది రోల్స్ కు చాలా ఫేమస్. ఇక్కడకు విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ధర కూడా చాలా అందుబాటు ధరలోనే ఉంటుంది. ఇక్కడ పన్నీర్ రోల్స్, డబుల్ ఎగ్ చికెన్ రోల్స్ రుచి చాలా బాగుంటుంది.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి