Search
  • Follow NativePlanet
Share
» »ఆంధ్ర ప్రదేశ్ లో పర్యాటకులను ఆకర్షిస్తున్న కొన్ని ద్వీపాలు !

ఆంధ్ర ప్రదేశ్ లో పర్యాటకులను ఆకర్షిస్తున్న కొన్ని ద్వీపాలు !

ఆంధ్రప్రదేశ్ లో పుట్టుకొచ్చిన కొన్ని ద్వీపాలు ఒకసారి గమనిస్తే, ఎపి తీరరేఖ పొడవు 974 కిలోమీటర్లు. గుజరాత్ తర్వాత ఎపి అత్యధిక తీరప్రాంతం కలిగిఉన్న రాష్ట్రం. దీని వెంబడి ఎన్ని దీవులు, ద్వీపాలు ఉన్నాయో !!

By Mohammad

భూగోళం అనంతం. ఎప్పుడు ఎక్కడ ఏ కొత్త విషయం పుట్టుకొస్తుందో ఎవరికీ తెలీదు. కొత్త ఊర్లను కనిపెట్టాం అనుకుంటే మరో కొత్త ఊరు పుట్టుకొస్తుంది. అలానే మొన్నీమధ్య ఒకటి కాదు .. రెండు కాదు ... ఏకంగా 400 పైగా కొత్త ద్వీపాలను కనుగొన్నారు. మన ఇండియా తక్కువేం కాదు. మనవాళ్ళు కొత్త ఐలాండ్ లను కనుగొన్నారు. ఆ కొత్త వాటితో కలుపుకొని ప్రస్తుతం ఇండియా 700 ద్వీపాలను కలిగి ఉంది.

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనం !

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఐలాండ్ లు ఉన్నాయి. వాటిలో ఒకటో .. రెండో మీరు విని ఉంటారు. మరి మిగితా వాటి సంగతేంటి ?? ఆంధ్ర ప్రదేశ్ తీరరేఖ పొడవు 974 కిలోమీటర్లు. దేశంలో గుజరాత్ తర్వాత ఎపి అత్యధిక తీరప్రాంతం కలిగిఉన్న రాష్ట్రం. మరి ఈ తీరరేఖ వెంబడి ఎన్ని దీవులు, ద్వీపాలు ఉన్నాయో, ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందామా ..!

హోప్ ఐలాండ్

హోప్ ఐలాండ్

ఎక్కడ ఉంది - తాళ్ళరేవు మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్

సమీపాన నగరం - కాకినాడ

కాకినాడ తీర ప్రాంతం అంతా హాప్ ఐలాండ్ చేత రక్షించబడుతున్నది. ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన హోప్ ఐలాండ్ సుమారు 500 ఏళ్ల క్రితం ఏర్పడిందని చెబుతారు. ఇది తీరం వెంబడి 23 కి. మీ మేర విస్తరించి ఉన్నది. పర్యాటకులు విహారయాత్రలకు తరచూ వస్తుంటారు. సదుపాయాలకు లోటు లేదు.

చిత్రకృప : Cleared as filed

దివిసీమ

దివిసీమ

ఎక్కడ ఉంది - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో
సమీప నగరం - విజయవాడ (85 కి.మీ), మచిలీపట్టణం (57 కి.మీ), తెనాలి (68 కి.మీ).

దివిసీమ కృష్ణా జిల్లాలో గల చిన్న మరియు సారవంతమైన ద్వీపం. ఇది అవనిగడ్డ (పులిగడ్డ) వద్ద డెల్టా ప్రాంతంలో ఏర్పడింది. ఇక్కడ కృష్ణా నది రెండు పాయలుగా చీలి బంగాళాఖాతం సముద్రంలో కలుస్తుంది. ఇటీవల ఒక కొత్త వంతెనను పులిగడ్డ వద్ద నిర్మించారు. ఇది రేపల్లె మరియు అవనిగడ్డను కలుపుతుంది.

చిత్రకృప : Kalyan Kanuri

చూడదగ్గవి

చూడదగ్గవి

సమీప సందర్శనీయ స్థలాలు : భావదేవరాపల్లిలోని భావనారాయణ స్వామి ఆలయం, నాగాయలంక, కోడూరు, హంసలదీవి, కూచిపూడి, ఘంటసాల, సంగమేశ్వరం గుర్తించదగ్గ ప్రదేశాలు.

ఘటన : 1977 లో ఈ ప్రాంతం ఒక పెద్ద సైక్లోన్ కు గురై అపారనష్టాన్ని చవిచూసింది. పదివేల మందికి పైగా ప్రజలు మరణించగా, లక్షల్లో మూగజీవాలు చనిపోయాయి. దాతలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సహాయంతో త్వరగా కోలుకొని పర్యాటకులను ఆకర్షిస్తున్నది.

చిత్రకృప : Rasmi Pinky

భవానీ ఐలాండ్

భవానీ ఐలాండ్

ఎక్కడ ఉంది - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో
సమీప నగరం - విజయవాడ

విజయవాడ బస్ స్టాండ్ నుంచి భవానీ ఐలాండ్ 7 కి.మీ ల దూరంలో ఉన్నది. చుట్టూ కృష్ణా నది, మధ్యలో దీవి, అక్కడికి వెళ్లేందుకు బోట్ షికారు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.

చిత్రకృప : Shivram Ravi

అడ్వెంచర్ గేమ్స్

అడ్వెంచర్ గేమ్స్

ఇక్కడ పర్యాటకశాఖ వారు పిల్లల కోసం అడ్వెంచర్ గేమ్స్, పెద్దలకు ఆటపాటలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను అందిస్తున్నారు.

ప్రవేశ రుసుము : ఎటువంటి ఎంట్రీ ఫీ ఉండదు.
తెరిచే సమయం : వారంలో అన్ని రోజులూ తెరుస్తారు.
సందర్శనకు పట్టె సమయం : రెండు నుండి నాలుగు గంటలు.

చిత్రకృప : Darshik Mehta

గొల్లపాలెం

గొల్లపాలెం

ఎక్కడ ఉంది - ఏపీలోని కృష్ణా జిల్లాలో

సమీప నగరం - గుంటూరు (88 కి. మీ), విజయవాడ (113 కి. మీ) , తుళ్లూరు (154 కి. మీ), భీమవరం (37 కి. మీ).

గొల్లపాలెం ఐలాండ్ బంగాళాఖాతం సముద్రానికి అనుకోని ఉన్నది. దీనికి సమీపాన భీమవరం పట్టణం కలదు. చిన్న గొల్లడు, పెద్ద గొల్లడు పేరుతో ఇద్దరు అన్నదమ్ములు ఈ ప్రాంతాన్ని పాలించారు. బ్రిటీష్ వారి హయాంలో నిర్మించిన బంగ్లా చూడముచ్చటగా ఉంటుంది.

చిత్రకృప : Pranav Yaddanapudi

మినీ కేరళ

మినీ కేరళ

ఆహ్లాదపరిచే వాతావరణం, చుట్టూ కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, ఊరి మధ్యలో నుంచి వెళ్లే కెనాల్స్ వంటివి చూసి ఆనందించవచ్చు.

టూరిస్ట్ స్ధలాలు : బీచ్ (500 మీటర్ల సముద్ర తీరం), బంగ్లా, సముద్రంలో బోట్ షికారు మొదలైనవి.

వసతి : 'మినీ కేరళ' గా పిలువబడుతున్న గొల్లపాలెం లో రిసార్టులు కలవు. కోనసీమ వంటకాలను రుచి చూడవచ్చు.

చిత్రకృప : kiran kumar

శ్రీహరికోట

శ్రీహరికోట

ఎక్కడ ఉంది - ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో.

సమీపాన నగరం - నెల్లూరు (118 కి. మీ), సూళ్లూరుపేట (22 కి. మీ), చెన్నై (103 కి. మీ).

శ్రీహరికోట నెల్లూరు జిల్లాలోని ఒక తీరప్రాంత ద్వీపము. ఇది కోరమాండల్ తీరంలో కలదు. పులికాట్ సరస్సు, బంగాళాఖాతం మధ్య శ్రీహరికోట ఒక ద్వీపంలా ఉంటుంది.

చిత్రకృప : Manvendra Bhangui

శ్రీఅరకోటై

శ్రీఅరకోటై

ఇక్కడ ఉన్న సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో వారు భారతదేశం తరుపున గగనతలంలోకి రాకెట్లను ప్రయోగిస్తుంటారు.

చారిత్రక నేపథ్యం : శ్రీరాముడు ఇక్కడ అరకోటి లింగాలను ప్రతిష్టించి, రాక్షస ప్రభావాన్ని తొలగించాడని, అందువల్లనే ఈ ప్రాంతానికి శ్రీఅరకోటై అనే పేరొచ్చిందని, పిమ్మట శ్రీహరికోట గా మార్పు చెందినదని ప్రజలు భావిస్తారు.

చిత్రకృప : oneindia

ఇరక్కమ్ దీవులు

ఇరక్కమ్ దీవులు

ఎక్కడ ఉన్నాయి - పులికాట్ సరస్సు మధ్యలో
సమీపాన నగరం - నెల్లూరు, సూళ్లూరుపేట

ఇరక్కం దీవులు నెల్లూరు జిల్లాలోని పులికాట్ సరస్సు మధ్యలో ఉన్నాయి. ఇక్కడి వెళ్లాలంటే బోట్, ఫెర్రీ లే గతి. 8 కి. మీ ల దూరంలో ఉన్న బీమునివారిపాలెం వద్ద ప్యాసింజర్ ఫెర్రీలు లభిస్తాయి.

చిత్రకృప : McKay Savage

ఏమి చేయాలి ?

ఏమి చేయాలి ?

ఉదయం 9 గంటలకు, సాయంత్రం 4 గంటలకు మరియు ఆ మధ్యే ఫెర్రీలు తిరుగుతాయి. ఒక్కొక్కరికి 20 రూపాయలు టికెట్ వసూలు చేస్తారు. సొంతంగా వెళ్లాలనుకుంటే 700 రూపాయలు ఖర్చు అవుతుంది.

ఏమి చేయాలి : ఇసుకతిన్నెల మీద క్యాంపింగ్, ఫిషింగ్.

చిత్రకృప : McKay Savage

పర్యాటక శాఖ

పర్యాటక శాఖ

పైన పేర్కొన్న ఐలాండ్ లే కాక, ఏపీలో మరికొన్ని ఐలాండ్ లను అభివృద్ధిపరుస్తున్నారు రాష్ట్ర పర్యాటక శాఖ వారు. ఆ మిగితా ఐలాండ్ లలో కూడా వసతి, త్రాగునీరు వంటి మౌలికసదుపాయాలను కల్పిస్తే ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక రంగంలో దూసుకెళ్తుంది. అప్పుడు 'కేరళ వద్దు .. ఆంధ్రప్రదేశ్ ముద్దు'అనాల్సివస్తుంది.

చిత్రకృప : Pranav Yaddanapudi

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X