Search
  • Follow NativePlanet
Share
» »నాగపట్టణం పర్యాటక వెళ్లారా?

నాగపట్టణం పర్యాటక వెళ్లారా?

నాగపట్టణం, దాని చుట్టు పక్కల ఉన్న పర్యాటక ప్రాంతాల వివరాలు.

తమిళనాడుకు పర్యాటకంగా ఎంతో పేరుంది. ఇక్కడ ధార్మిక ప్రదేశాలతో పాటు ఆహ్లాదకర పర్వత పంక్తులు, జలపాతాలు, సముద్ర తీరప్రాంతాలు ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ పర్యాటక ప్రదేశాలన్నింటినీ చూస్తూ సమయాన్ని ఇట్టే మరిచిపోవడమే కాకుండా ఒత్తిడిని కూడా జయించవచ్చు. ఈ నేపథ్యంలో తమిళనాడులోని నాగపట్టణం చుట్టు పక్కల ఉన్న పర్యాటక కేంద్రాలకు సంబంధించిన వివరాలు మీ కోసం....

చెన్నై నుంచి 300 కిలోమీటర్లు

చెన్నై నుంచి 300 కిలోమీటర్లు

P.C: You Tube

నాగపట్టణం తమిళనాడు రాజధాని చెన్నై నుంచి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ నాగపట్టణం స్థానికులు అంటే చెన్నైవాసులతోపాటు దక్షిణాదిరాష్ట్రాల వారిని కూడా విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ నాగపట్టణానికి పర్యాటకానికి వెళ్లడానికి అనేక కారణాలు ఉన్నాయి.

సముద్రతీర ప్రాంతం

సముద్రతీర ప్రాంతం

P.C: You Tube

నాగపట్టణం సముద్రతీర ప్రాంతం. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ముఖ్యంగా చల్లటి సాయంకాలం ఈ ప్రాంతం చాలా అందంగా కనిపిస్తుంది. ఇది మంచి పిక్నిక్ స్పాట్ కూడా. సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు పిక్నిక్‌కు వస్తుంటారు.

నాగపట్టణం బీచ్

నాగపట్టణం బీచ్

P.C: You Tube

ఇక్కడ ముఖ్యంగా చూడదగిన ప్రాంతాల్లో నాగపట్టణం బీచ్ ఒకటి. సూర్యోదయం, సూర్యాస్తమయాలు చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఫొటోగ్రఫీ అంటే ఇష్టపడేవారికి ఈ నాగపట్టణం బీచ్ స్వర్గధామం. ఈ నాగపట్టణం బీచ్‌కు సమీపంలో నాగూర్ బీచ్ ఉంది. ఈ రెండింటి మధ్య దూరం 7 కిలోమీటర్లు.

చోళుల కాలంలోనే

చోళుల కాలంలోనే

P.C: You Tube

నాగపట్టణం చారిత్రాత్మకంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందినది. చోళ సామ్రాజ్య కాలంలో ఈ నాగపట్టణానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు దక్కింది. ఇక్కడి నుంచే వివిధ రాష్ట్రాలకు, దేశాలకు అనేక వస్తువులను ఎగుమతి అయ్యేవి. అందుకే చరిత్రకారులు ఈ పట్టణం ఎంతో ఇష్టమైనది.

పోర్చుగీసు వారికి కూడా

పోర్చుగీసు వారికి కూడా

P.C: You Tube

పోర్చుగీసువారితో పాటు ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ఈ నాగపట్టణానికి తమ ఏలుబడిలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవి. ఇది ఆకాలంలో ప్రముఖ సైనిక స్థావరంగా కూడా ఉండేది. భౌగోళికంగా ఈ నాగపట్టణానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించే వారు దీనిని సైనిక స్థావరంగా ఏర్పాటు చేసుకొన్నారని చెబుతారు.

పురాతన దేవాలయాలు

పురాతన దేవాలయాలు

P.C: You Tube

నాగపట్టణం అనేక పురాతన దేవాలయాలకు నిలయం. అందువల్లే దీనిని ధార్మిక నగరంగా కూడా పిలుస్తారు. ఇక్కడ ఒకవైపు శైవ దేవాలయాలు ఉంటే మరోవైపు వైష్ణవ దేవాలయాలు కూడా ఉన్నాయి. దీంతో అటు వైష్ణవులకు ఇటు శైవులకు కూడా ఇది ఎంతో పవిత్రమైన పట్టణం.

సిక్కల్ సిగరావేలన్ దేవాలయం

సిక్కల్ సిగరావేలన్ దేవాలయం

P.C: You Tube

ఇక్కడ ముఖ్యంగా దర్శించుకోవాల్సిన దేవాలయాల్లో సిక్కల్ సింగరావేలన్ దేవాలయం, వేదరాణ్యేశ్వర దేవాలయం ముఖ్యమైనవి. ఇక్కడ నాగూర్ దర్గా కూడా చూడటానికి సుదూర ప్రాంతం నుంచి వస్తుంటారు.

వేలాంగని చర్చి

వేలాంగని చర్చి

P.C: You Tube

భారతదేశంలోని క్రైస్తవ పుణ్యక్షేత్రాలను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అటువంటి క్షేత్రాల్లో వేలాంగణి చర్చి కూడా ఒకటి. ఇది నాగపట్టణం నుంచి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక్క క్రైస్తవులే కాకుండా మిగిలిన మతాలకు చెందినవారు కూడా ఇక్కడకు చాలా మంది వస్తుంటారు.

వేలాంగణి బీచ్

వేలాంగణి బీచ్

P.C: You Tube

ఇక్కడ చర్చితో పాటు బీచ్ కూడా చూడదగినదే. ముఖ్యంగా సాయంకాలాలాల్లో ఇక్కడకు చాలా మంది వస్తుంటారు. పిల్లలతో పాటు పెద్దలకు కూడా ఈ ప్రాంతం బాగా నచ్చుతుంది. అందుకే ఇది ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X