Search
  • Follow NativePlanet
Share
» »ప్రకృతి ప్రేమికుల మనసు దోచే బెకాల్ !!

ప్రకృతి ప్రేమికుల మనసు దోచే బెకాల్ !!

సహజ సిద్దమైన ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ కేరళ లోని పర్యాటక ప్రదేశాలు. ఇక్కడ ఉన్న తీర ప్రాంత దృశ్యాలు పర్యాటకులని ఆనందంలో ముంచెత్తుతాయి. పచ్చని తీవాచీ పరిచినట్లుండే కొండ కొనల ఎత్తుపల్లాలు, బ్యాక్ వాటర్ ప్రాంతాలు ప్రకృతి ప్రేమికులను ఆహ్లాదపరుస్తాయి. పర్యాటకుల మనసు దోచే కేరళ అందాలను ఒకసారి చూస్తే ...

కేరళ లోని అరేబియా కోస్తా తీరంలో ఉన్నచిన్న పట్టణం బెకాల్. స్థానికుల నమ్మకాల మేరకు ఇక్కడ ఒక పెద్ద భవంతి ఉండేదట. ఈ పట్టణం దాని సహజ అందాలతో ప్రపంచ ప్రసిద్ధి చెందినది. ఆతిధ్యానికి బేకాల్ పట్టణం ఒక చక్కటి ఉదాహరణ. ఇవే కాదు ఆధ్యాత్మికపరంగాను ఈ పట్టణం ఖ్యాతి గడించింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క దేవాలయాన్ని చూసే విధంగా నిర్మాణాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ జరిగే ప్రధాన జాతర తెయ్యం జాతర. చూడటానికి చిన్న పట్టణమే అయినా ఇక్కడ డజనుకు పైగా కోటలు ఉన్నాయి. ఇవి నాటి చారిత్రక ప్రాధాన్యతను చాటుతున్నాయి. మరి ఇక్కడ ఉన్న పర్యాటక ఆకర్షణలను చూసొద్దామా ..!

బెకాల్ కోట

బెకాల్ కోట

బెకాల్ పట్టణంలో ప్రధానంగా చెప్పుకోవలసినది బెకాల్ కోట. ఈ కోట రెండు తాటి తోపుల మధ్య ఎగిసి పడే అలలతో ఉంటుంది. ఈ కోట టూరిస్టులను మరియు చరిత్రకారులను ఎన్నో ఏళ్ల నుండి ఆకర్షిస్తున్నది. ఈ కోట 40 ఎకరాల విస్తీర్ణంలో అరేబియా సముద్రం పక్కనే నిర్మించబడి, కేరళ రాష్ట్రం లోనే అతి పెద్ద కోట గా చరిత్రకెక్కింది. ఈ కోటలోనే సూపర్ హిట్ సినిమా "బొంబాయి" చిత్రీకరించారు.

Photo Courtesy: Art and Craft www.handiques.com

చంద్రగిరి కోట

చంద్రగిరి కోట

చంద్రగిరి కోట ను క్రీ.శ. 17 వ శతాబ్ధంలో చంద్రగిరి నది పక్కనే నిర్మించినారు. చంద్రగిరి నది పక్కన కలదు. ఒక పురాతన కోటగా కనపడుతూ కొబ్బరి తోటలు, పక్కనే ఒక నది పారుతూ, మరో పక్క అరేబియా సముద్ర హోరు తో ఈ కోట ప్రదేశం అద్భుతంగా ఉంటుది. సూర్యాస్తమయాలు ఇక్కడ నుండి చూస్తె చాలా బాగుంటాయి.

Photo Courtesy: kerala tourism

నిత్యానంద గుహలు

నిత్యానంద గుహలు

నిత్యానంద ఆశ్రమాన్ని స్వామి నిత్యానంద స్థాపించారు. ఇది ఒక కొండ మీద సుమారు 500 మీ.ల ఎత్తున కలదు. ఒకే లాటరైట్ స్టోన్ నుండి 45 గుహలను నిర్మించారు. ఈ గుహలు నేటికి ఇంజనీరింగ్ ప్రపంచానికి ఒక అద్భుతమే. వీటిని చూసేందుకు ప్రపచంత వ్యాప్తంగా వేలాది పర్యాటకులు ప్రతి సంవత్సరం వస్తారు. ఇక్కడ కల పంచ లోహాలతో తయారుచేయబడ్డ నిత్యానంద స్వామి విగ్రహం ఒక ఆకర్షణ.

Photo Courtesy: Shareef Taliparamba

బెకాల్ బీచ్

బెకాల్ బీచ్

బెకాల్ బీచ్ బెకాల్ లో ప్రధాన ఆకర్షణలలో ఒకటి. బీచ్ లో ఉండే ఇసుక సూర్య రశ్మి కి తళతళమంటూ అందంగా వుంటుంది. బీచ్ లో మీరు ఆనందంగా గడపవచ్చు. బ్యాక్ వాటర్స్ లో ఈత కొట్టవచ్చు, కొబ్బరి చెట్ల మధ్య తిరగవచ్చు, కొండలు ఎక్కవచ్చు. బెకాల్ లో సూర్యాస్తమయాలు తప్పక చూడాలి ఎందుకంటే అద్భుతంగా వుంటాయి.

Photo Courtesy: Soman

కప్పిల్ బీచ్

కప్పిల్ బీచ్

కప్పిల్ బీచ్ బెకాల్ కోట కు సుమారు 7 కి.మీ. ల దూరంలో ఉంటుంది. విశాలమైన ఈ బీచ్ ఒక పెద్ద పర్యాటాక ఆకర్షణ. ఈ బీచ్ చాల ప్రశాంతం గా ఉంటుంది. బెకాల్ కోట మొదలైనవి చూసిన తరవాత సేద తీరేటందుకు ఈ బీచ్ ఎంతో బాగుంటుంది.సాహసాలు చేయాలనుకోనేవారు కోడి కొండను ఎక్కి అక్కడ నుండి చక్కని అరేబియా సముద్ర దృశ్యాలను చూడవచ్చు. ఈ ప్రదేశం నుండి చక్కని ఫోటో లు కూడా తీసి ఆనందించవచ్చు.

Photo Courtesy: Ikroos

నీలేస్వరం

నీలేస్వరం

నీలేస్వరం బెకాల్ కు 12 కి.మీ. దూరం లో కలదు. నీలేస్వరం అంటే నీలకంఠ మరియు ఈశ్వర్ అని అర్థం చెపుతారు. పురాతన కాలంలో ఈ ప్రదేశం నీలేస్వరం రాజుల రాజ్యం గా ఉండేది. ఇక్కడ ప్యాలసు ఒక పెద్ద ఆకర్షణ. ఇక్కడ కల యోగ సెంటర్ మరియు కల్చరల్ సెంటర్ కూడా మీరు చూడవచ్చు. హెర్బల్ బాత్ , మట్టి బాత్ వంటివి చేయవచ్చు.

Photo Courtesy: Galoiserdos

అనంతపుర దేవాలయం

అనంతపుర దేవాలయం

కేరళ మొత్తం మీద ఏదైన ఆలయం సరస్సు కలిగి ఉందంటే అది అనంతపుర దేవాలయమే. అనంతపుర దేవాలయం క్రీ.శ. 9 వ శతాబ్ధంలో నిర్మించబడి, బెకాల్ కు 30 కి. మీ. దూరంలో ఉన్నది. రెండెకరాల ప్రాకార విస్తీర్ణంలో గల ఈ దేవాలయాన్ని స్థానికులు అనంత పద్మనాభ స్వామి మూల స్థానంగా చెబుతారు. ఈ గుడి సరస్సులో ఒక ముసలి ఉంటుంది. ఆది దేవాలయాన్ని రక్షిస్తుందని, ఒకవేళ చనిపోతే దాని స్థానంలో మరొకటి రహస్యంగా వస్తుందని చెబుతుంటారు.

Photo Courtesy: Sandeep Janardhanan

మాలిక్ దీనర్ మసీదు

మాలిక్ దీనర్ మసీదు

మాలిక్ దీనర్ మసీదు ని మాలిక్ దీనర్ గ్రాండ్ జుమా మసీద్ అనేవారు. ఇది ఇండియా లో ఒక పురాతన మసీదు. ఈ ప్రదేశం ముస్లిములకు పవిత్రమైనది. దీనిని మలబార్ స్టైల్ లో నిర్మించారు. ఇక్కడ జరిగే ఉరుసు వేడుకలకు కిక్కిరిసిన సంఖ్యలో భక్తులు, పర్యాటకులు వస్తుంటారు.

Photo Courtesy: Rannusmash

హౌస్ బోటు ప్రయాణం

హౌస్ బోటు ప్రయాణం

హౌస్ బోటు ప్రయాణం బెకాల్ లో మరొక ప్రధాన ఆకర్షణ. మలబార్ ప్రాంతం లోని తాటి చెట్ల మధ్య గల బ్యాక్ వాటర్స్ లో ప్రశాంతం గా బోటు విహారం చేయవచ్చు. మీకు గల బాధలనన్నింటిని మరచి హాయిగా బోటు హౌస్ లో తిరగవచ్చు. పెళ్లి అయిన కొత్త జంటలకు ఇవి సరైనవి.

Photo Courtesy: telugu native planet

బెకాల్ ఎలా చేరుకోవాలి ??

బెకాల్ ఎలా చేరుకోవాలి ??

విమాన ప్రయాణం

బెకాల్ కి మంగళూరు విమానాశ్రయం 70 కి.మీ. ల దూరం లో కలదు. మంగళూరు నుండి టాక్సీ లలో బెకాల్ కు చేరవచ్చు. బెకాల్ కు కాలికట్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం 180 కి. మీ. ల దూరం లో కలదు.

రైలు ప్రయాణం

బెకాల్ కు సమీప రైలు స్టేషన్ కాసర్గోడ్ రైలు స్టేషన్ మరియు కన్హన్ గాడ, రెండు కూడా 12 కి.మీ. ల దూరం లో కలవు. కాసర్గోడ్ రైలు స్టేషన్ , కోజికోడ్ - మంగళూరు - ముంబై రూటు లో కలదు.

రోడ్డు ప్రయాణం

బెకాల్ పట్టణం చాల ప్రదేశాలకు కలుపబడి వుంది. తరచుగా బస్సు లు మరియు టాక్సీ లు ఇక్కడకు వచ్చి పోతుంటాయి. బెకాల్ కు మంగళూరు 65 కి.మీ. మరియు కన్నూర్ 78 కి.మీ. ల దూరం లో కలవు.

Photo Courtesy: Sandeep Gangadharan

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X