Search
  • Follow NativePlanet
Share
» »నవంబర్ మాసం లో సందర్శించే పర్యాటక ప్రదేశాలు !!

నవంబర్ మాసం లో సందర్శించే పర్యాటక ప్రదేశాలు !!

By Mohammad

నవంబర్ నెల పర్యాటకులకు ఉత్తమమైన మాసం. చాలా వరకు చూసినట్లయితే ఈ మాసంలోనే అధికంగా పక్షులు వలసలుగా వెళుతుంటాయి మరికొన్ని వస్తుంటాయి. ప్రకృతి కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉండి, పర్యాటకులను ఆకర్షిస్తున్నది. ఇప్పటి వరకు మనం ప్రతి మాసంలో చూడవలసిన కొన్ని ప్రదేశాల గురించి చెప్పుకొచ్చాం అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ కొన్ని ప్రదేశాల గురించి మీ తెలుగు నేటివ్ ప్లానెట్ పొందుపరుస్తున్నది.

కింద పేర్కొనబడిన ప్రదేశాలలో కొన్నేమో ఆధ్యాత్మికత సంతరించుకున్న ప్రదేశాలుగా, ఇంకొన్నేమో హిల్ స్టేషన్ లుగా, మరికొన్నేమో అభయారణ్యాలుగా ఉన్నాయి. ఈ ప్రదేశాలలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండి సందర్శనకు అనువైనవిగా చెప్పుకోవచ్చు. సరే అయితే ఇక్కడ ఉన్న ఒక్కొక్క ప్రదేశాలను సంక్షిప్తంగా వివరిస్తూ ...

వారణాసి, ఉత్తరప్రదేశ్

వారణాసి, ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు భాగంలో ఉన్న వారణాసి(కాశీ) ఒక ప్రముఖ పుణ్య క్షేత్రం. నవంబర్ మాసంలో సందర్శించే ప్రదేశాలలో మొదట నిలిచినది ఈ పట్టణం. ఇది పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్నది. ఇక్కడ ఉదయం, సాయాంత్రం ధూపదీపాలతో గంగమ్మకు హారతి ఇస్తుంటారు. దీపావళి పండుగ ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు.

మరింత చదవండి : వారణాసి - ప్రముఖ పుణ్య క్షేత్రం !!

Photo Courtesy: Tiago Almeida

జైసల్మీర్, రాజస్థాన్

జైసల్మీర్, రాజస్థాన్

రాజస్థాన్ రాష్ట్రంలో పశ్చిమ దిశగా ఉండి, పాకిస్థాన్ దేశంతో సరిహద్దు పంచుకుంటున్న ప్రదేశం జైసల్మీర్. దీనిని బంగారు నగరం అంటుంటారు. ఈ ప్రదేశం దేశంలో ప్రసిద్ధి గాంచిన థార్ ఎడారి మధ్యలో ఉన్నది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రాజస్థాన్ సంగీతానికి, నృత్య రీతులకి ఈ బంగారు నగరం సుప్రసిద్ధి. ఇక్కడ ప్రధానంగా చూడాల్సినది జైసల్మీర్ కోట దాని తరువాతే ఏదైనా కూడా ..! నవంబర్ మాసంలో సందర్శించవలసిన ప్రదేశాలలో ఒకటిగా పేర్కొనబడినది.

మరింతగా చదవండి : జైసల్మీర్ లో గల మరిన్ని పర్యాటక ఆకర్షణలు !!

Photo Courtesy: shymal nandy

తర్కాలీ, మహారాష్ట్ర

తర్కాలీ, మహారాష్ట్ర

మహారాష్ట్ర రాష్ట్రం లోని కొంకణ తీరంలో గల సింధుదుర్గ్ జిల్లాలో తర్కాలీ అనే ప్రదేశం ఉన్నది. ఇది ఒక బీచ్ ప్రాంతం. ఈ బీచ్ లో నడుస్తుంటే అసలు ఇంటి ధ్యాస గుర్తుకురాదు. తీరం పొడవుగా ఉంటుంది కాబట్టి అలా తీరం వెంబడి చెప్పులు లేకుండా నడుస్తుంటే .. కాళ్ళ కింద సముద్రపు నీరు జాలువారుతుంటే ఆ అనుభవాలు చెప్పలేనివి. ఈ ప్రదేశంలో తాబేళ్ల సంచారం ఎక్కువగా ఉంటుంది. నవంబర్ నెలలో చూడవలసిన ప్రదేశాలలో ఇది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు.

Photo Courtesy: adam broad

బుద్ధగయ లేదా బోధగయ, బీహార్

బుద్ధగయ లేదా బోధగయ, బీహార్

బుద్ధగయ బీహార్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ బౌద్ధ మత ప్రదేశం. ఈ ప్రదేశంలో ప్రముఖంగా చూడవలసినది మహాబోధి ఆలయం, బోధి వృక్షం. మహా బోధి ఆలయాన్ని అశోకుడు కట్టించినాడు. బోధి వృక్షం కింద గౌతముడు జ్ఞానాన్ని పొందాడు తరువాత దానికి కృతజ్ఞతగా తన హృదయాన్ని ఆనికితం చేశాడు. ఈ ప్రదేశం నవంబర్ మాసంలో సందర్శించాలి అప్పుడే వాతారవణం కాస్త కుదటగా ఉంటుంది.

మరింత సమాచారం కోసం చదవండి : బుద్ధగయ... బౌద్ధ మతం పరిఢవిల్లిన పుణ్య క్షేత్రం !!

Photo Courtesy: Siva Subramanian Vasanth

శాంతినికేతన్, పశ్చిమ బెంగాల్

శాంతినికేతన్, పశ్చిమ బెంగాల్

జనగణమన గేయ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన అంతర్జాతీయ విశ్వవిద్యాలయం శాంతినికేతన్ లో ఉన్నది. కేవలం విద్యాలయమే కాదు ఎన్నో ఆకర్షణలతో ఈ ప్రదేశం సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నంగా ఉంది. కళలు, నృత్యం మరియు సంస్కృతి ని ఆదరించే లేక ఇష్టపడే ప్రతి పర్యాటకుడు తప్పనిసరిగా శాంతినికేతన్ లో గల సాంస్కృతిక కేంద్రాన్ని చూడటం మరవద్దు. ఈ ప్రదేశం లో వాతావరణం నవంబర్ నెలలో కాస్త ప్రశాంతగా ఉంటుంది.

Photo Courtesy: Biswarup Ganguly

భరత్పూర్, రాజస్థాన్

భరత్పూర్, రాజస్థాన్

రాజస్థాన్ రాష్ట్రం లోని భరత్పూర్ పక్షి ప్రేమికులకు ప్రసిద్ధి గాంచినది. రాముని సోదరుడు భరతుని పేరుమీద ఈ నగరం ఏర్పడింది. రాజస్థాన్ కి తూర్పు ద్వారంగా ఈ నగరం పిలవబడుతుంది. చూడటానికి ఎన్నో వైవిధ్యమైన ప్రదేశాలు కలిగిన భరత్పూర్ వర్షాకాలం, శీతకాలాలు సందర్శనకు అనువైన సమయం. ఇక్కడ గల పక్షి పార్కు లో వలస వచ్చే నీటి బాతులు, సన్న తోక పక్షులు, నీలిరంగు పిట్టలు, ఎర్ర మెడ బాతులు ఇలా ఎన్నో రకాల పక్షి జాతులను చూడవచ్చు.

మరింత సమాచారం కోసం చదవండి : భరత్పూర్ - పక్షి ప్రేమికులకు స్వర్గం !!

Photo Courtesy: Debojit Deb

సనసార్, జమ్మూ - కాశ్మీర్

సనసార్, జమ్మూ - కాశ్మీర్

సనసార్ రెండు గ్రామాల కలయిక మరియు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో గల అందమైన, సుందర దృశ్య భరిత ప్రదేశం. చిన్న గల్మార్గ్ గా పిలువబడే సనసార్ సముద్రమాటానికి 2079 మీటర్ల ఎత్తులో ఉన్నది. ఈ ప్రదేశం మైదానాలు మరియు పర్వత ప్రాంతంలో ఉండటం చేత స్కీయింగ్, పారా గ్లైడింగ్, హాట్ ఏర్ బెలూనింగ్, గుర్రపు స్వారీ, పర్వతారోహణ వంటి సాహస యాత్రలు చేయవచ్చు. ఈ ప్రదేశం నవంబర్ మాసంలో సందర్శించవలసిన ప్రదేశాలలో ఉత్తమ ప్రదేశం గా ఉన్నది.

మరింత సమాచారం కోసం చదవండి : సనసార్ లో గల మరిన్ని పర్యాటక ఆకర్షణలు !!

Photo Courtesy: Extremehimalayan

సుందర్బన్స్ , పశ్చిమ బెంగాల్

సుందర్బన్స్ , పశ్చిమ బెంగాల్

సుందర్బన్స్ భారతదేశాన్ని, బంగ్లాదేశ్ లను వేరుచేసే అడవులు. ఈ అడవులు అంతరించిపోతున్న పులులకు ఆవాసంగా ఉన్నది. పర్యాటక సౌకర్యాలు అందుబాటులో ఉండటం వలన యాత్రికులు ఇక్కడికి వస్తుంటారు. కొత్తగా పెళ్ళైన జంటలకి, కుటుంబాలకి సుందర్బన్ అడవులు ఆహ్లాద వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ పడవలను అద్దెకు తీసుకొని ఇరుకైన ఉప నదుల గుండా, సెలయెర్ల గుండా ప్రయాణించడం ఒక మాధురానుభూతి కలిగిస్తుంది.

మరింతగా చదవండి : సుందర్బన్ అడవులలో గల ప్రకృతి దృశ్యాలు !!

Photo Courtesy: rajikatravels

ఉజ్జయిని, మధ్య ప్రదేశ్

ఉజ్జయిని, మధ్య ప్రదేశ్

మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో ఉజ్జయిని అనే చారిత్రక నేపధ్యం ఉన్న ప్రదేశం ఉన్నది. ఉజ్జయిని అంటే అద్భుతమైన విజయం సాధించినవాడు అని అర్థం. ఎన్నో చారిత్రక ప్రదేశాలను కలిగి ఉన్న ఈ ప్రాంతం సినిమా దర్శకులను సైతం ఆకర్షిస్తున్నది. శిప్ర నది ఒడ్డున ఉన్న ఉజ్జయిని పట్టణం లో శివరాత్రి తో పాటుగా కుంభమేళా ఉత్సవాలకు ప్రసిద్ధి. ఇది ఒక జ్యోతిర్లింగ మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా ఖ్యాతి గడించినది. నవంబర్ మాసంలో సందర్శించే ప్రదేశాలలో ఇది కూడా ఒకటిగా నిలిచింది.

మరింత సమాచారం కోసం : ఉజ్జయిని లో గల మరిన్ని పర్యాటక ఆకర్షణలు !!

Photo Courtesy: Ssriram mt

అమృత్‌సర్ , పంజాబ్

అమృత్‌సర్ , పంజాబ్

భారత దేశంలో వాయువ్య భాగంలో పంజాబ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ సిక్కుల మత కేంద్రం అమృత్‌సర్. అమృత్‌సర్ లో అనేక గురుద్వారాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది హర మందిర్ సాహిబ్. దీనినే గోల్డెన్ టెంపుల్ అని అంటారు. పవిత్రమైన ఈ గురుద్వారం ఏటా సుమారు ఒక మిలియన్ కు పైగా సందర్శకులను ప్రపంచం నలుమూలల నుండి ఆకర్షిస్తున్నది. ఈ ప్రదేశం కూడా నవంబర్‌లో సందర్శించవలసిన ప్రదేశాలలో చోటు సంపాదించినది.

మరింత చదవండి: అమృత్‌సర్ స్వర్ణ దేవాలయ సందర్శన !!

Photo Courtesy: sandeepachetan.com travel photography

పుష్కర్, రాజస్థాన్

పుష్కర్, రాజస్థాన్

రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న పవిత్ర నగరాలలో పుష్కర్ ఒకటి. స్వయాన బ్రహ్మదేవుడు తీరుగాడిన ప్రదేశం గా చెబుతారు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సినది పుష్కర్ సరస్సు. ఇదే ఈ నగరం అంతటికీ ప్రధాన ఆకర్షణ. కొన్ని పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు వజ్రనాభుడనే రాక్షసున్ని తన కమలంతో చంపుతుండగా, పువ్వు నుండి కిందపడిన రేకు నుండి పుష్కర్ సరస్సు ఏర్పడిందని కథనం. ఈ ప్రదేశ సందర్శనకు ఉత్తమ సమయం నవంబర్ మాసం.

మరింతగా చదవండి : పుష్కర్ లోని మరిన్ని పర్యాటక ఆకర్షణలు !!

Photo Courtesy: Hemant Shesh

హంపి, కర్నాటక

హంపి, కర్నాటక

ఈ ప్రదేశం గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా ..! హంపి పట్టణం విజయనగర సామ్రాజ్యానికి రాజధాని. ఈ పట్టణంలో హోయసలులనాటి శిల్ప సంపద కనపడుతూంటుంది. రాతి శిల్పాలైనప్పటికి సందర్శకులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి.ఇది ప్రపంచ వారసత్వ ప్రదేశం గా యునెస్కో సంస్థ చేత గుర్తించబడింది. ప్రతి సంవత్సరం నవంబర్ వచ్చిందంటే చాలు వేల మంది పర్యాటకులు స్థానికంగా సైకిళ్లు అద్దెకు తీసుకొని హంపి మొత్తం తిరుగుతారు.

మరింత చదవండి : హంపిలో ఒక్కరోజు సైకిల్ యాత్ర !!

Photo Courtesy: Ben Witt

మనాలి, హిమాచల్ ప్రదేశ్

మనాలి, హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని మనాలి ఒక హిల్ స్టేషన్. సముద్ర మట్టానికి 1950 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రదేశం లో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో సుమారుగా 300 మీటర్ల ఎత్తులో ఉన్న సోలాంగ్ లోయ ప్రధానమైనది. పర్వతారోహణ చేసేవారికి, అలాగే ట్రెక్కింగ్ యాత్రికులకు కూడా ఇది శీతల స్వర్గంగా ఉంటుంది. సుందరమైన ప్రకృతి, అందమైన పూల మొక్కలు, మంచుచే కప్పబడిన పర్వతాలకి ఈ ప్రదేశం ప్రసిద్ధి. నవంబర్ మాసం ఈ ప్రదేశ సందర్శనకు ఉత్తమమైనది.

మరింతగా చదవండి : మనాలి అందాలు - మహిళల మొజులు !!

Photo Courtesy: Vineet Timble

కూర్గ్, కర్నాటక

కూర్గ్, కర్నాటక

కర్నాటక రాష్ట్రం లో ఉన్న కూర్గ్ పట్టణం సాదా సీదా పట్టణమేం కాదు. పశ్చిమ కనుమలలో విస్తరించిన ఈ ప్రదేశం సుముద్రమట్టానికి 900 - 1715 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ప్రదేశంలో ఎప్పుడూ పచ్చగా ఉండే అడవులు, లోయాలు, మంచు పడే కొండలు, జలపాతాలు, కాఫీ మరియు టీ ఎస్టేట్ లు ఇలా ఎన్నో ప్రకృతితో పెనవేసుకుపోయిన ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి కనుకనే దీనిని భారతదేశపు స్కాట్ లాండ్ అని, కర్నాటక కాశ్మీరం అంటారు.

మరింతగా చదవండి : కొత్త జంటల విహార కేంద్రం - కూర్గ్ !!

Photo Courtesy: Kovendhan Venugopal

జిరో, అరుణాచల్ ప్రదేశ్

జిరో, అరుణాచల్ ప్రదేశ్

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని జిరో, చుట్టూ వారి పొలాలతో, పైన్ చెట్ల సమూహం మధ్యలో ఉన్న ఒక అందమైన వేసవి విడిది పర్వత ప్రాంతం. ఈ చిన్న పట్టణం సముద్రమట్టానికి 1500 మీటర్ల ఎత్తులో ఉన్నది. నిర్మలమైన టాలీ లోయ, కర్దొ వద్ద ఉన్న పొడవైన శివలింగం ఇంకా అనేక ప్రాంతాలు ఇక్కడ ఆకర్షణగా నిలిచాయి. నవంబర్ మాసం సదర్శనకు ఉత్తమ సమయం.

మరింత సమాచారం కోసం : జిరో వద్ద గల మరిన్ని పర్యాటక ఆకర్షణలు !!

Photo Courtesy: Arpan Kalita

కాలింపాంగ్, పశ్చిమ బెంగాల్

కాలింపాంగ్, పశ్చిమ బెంగాల్

కాలింపాంగ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రధాన హిల్ స్టేషన్. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 4000 అడుగుల ఎత్తున ఉన్నది. సెలవు సమయాలలో కుటుంబ సభ్యులు ఇక్కడ బస చేసి చూడటానికి ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. హిమాలయ ప్రాంతానికి దిగువ భాగంలో ఉన్నందున చాలా వరకు కొండలు, పర్వత ప్రాంతాలు మంచుచేత కప్పబడి ఉంటాయి. ఈ ప్రదేశ సందర్శనకు ఉత్తమ సమయం నవంబర్ మాసం.

మరింత సమాచారం కోసం : కాలింపాంగ్ వద్ద గల మరిన్ని ఆకర్షణలు !!

Photo Courtesy: Sreetama Das

ఓర్చా, మధ్య ప్రదేశ్

ఓర్చా, మధ్య ప్రదేశ్

ఓర్చా, మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని ఒక ప్రసిద్ధ చారిత్రక ప్రదేశం. ఈ ప్రదేశాన్ని మహారాజా రుద్ర ప్రతాప్ సింగ్ స్థాపించాడు మరియు ఆయనే దీనికి మొదటి రాజు. ఇక్కడ కల నిర్మాణాలు అద్భుత ఆకర్షణలుగా నిలిచాయి. వాటిలో రాజ మహల్, రాణి మహల్, సుందర్ మహల్, లక్ష్మి నారాయణ ఆలయం తప్పని సరిగా చూడాలి. ఈ ప్రదేశ సందర్శనకు ఉత్తమమైన సమయం నవంబర్ మాసం.

మరింత సమాచారం కోసం : ఓర్చా లో గల మరిన్ని పర్యాటక ఆకర్షణలు !!

Photo Courtesy: Arian Zwegers

అల్మోర, ఉత్తరాఖండ్

అల్మోర, ఉత్తరాఖండ్

అల్మోర, ఉత్తరాఖండ్ రాష్ట్రం లో కుమావోస్ పర్వత శ్రేణులలో గల ఒక ప్రధాన హిల్ స్టేషన్. 5 కి. మీ. పరిధిలో విస్తరించిన ఈ ప్రదేశం సుయల్ - కోసి నదుల మధ్య ఉన్నది. దాదాపుగా సముద్ర మట్టానికి 1651 మీటర్ల ఎత్తు లో ఈ ప్రదేశం ఉంది. మంచుతో కప్పబడిన హిమాలయ పర్వత శిఖరాలను అల్మోర కొండల మీద నుంచి చూసి ఆనందించవచ్చు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు మౌంటేన్ బైకింగ్, ట్రెక్కింగ్ వంటి సాహసాలాను తప్పనిసరిగా ఆచరిస్తారు. ఈ ప్రదేశం నవంబర్ మాసంలో నిర్మాలంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.

మరింత చదవండి : అల్మోర లో గల పర్యాటక ఆకర్షణలు !!

Photo Courtesy: Allan Hopkins

కొహిమా, నాగాలాండ్

కొహిమా, నాగాలాండ్

ఈశాన్య భారత దేశంలో గల నాగాలాండ్ రాష్ట్ర రాజధాని కొహిమా. ఎన్నో తరాల నుంచి ఈ ప్రాంతం తన అంద చందాలతో ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్నది. ఇక్కడ మోనదేలిన కొండ శిఖరాలు, పారాడే మేఘాలు, మంచు గాలులు ఈ ప్రదేశానికి మరింత అందాన్ని చేకూర్చాయి. ఇక్కడ కొహిమా జూ ప్రపంచ ప్రసిద్ధి చెందినది. ఈ ప్రదేశాన్ని సందర్శించాలంటే నవంబర్ మాసం సరైనది.

మరింతగా చదవండి : కొహిమా లో గల ప్రకృతి సోయగాలు !!

Photo Courtesy: Sharada Prasad CS

గిర్, గుజరాత్

గిర్, గుజరాత్

గుజరాత్ రాష్ట్రం లో గల గిర్ ఒక నేషనల్ పార్క్. ఇక్కడ ఆసియా సింహాలు సంరక్షించబడుతున్నాయి. ఈ నేషనల్ పార్క్ ఒక రిజర్వ్‌డ్ ఫారెస్ట్ ప్రాంతంగా ఆసియా ఖండం లోనే ఒక ప్రధాన జంతు సంరక్షణ కేంద్రంగా ఉన్నది. అరుదైన పాములు, మొసళ్ళు మరియు తాబేల్లు ఇక్కడ చూడవచ్చు. ఈ అభయారణ్యాన్ని నవంబర్ మాసంలో తప్పని సరిగా సందర్శించాలి ఎందుకంటే అప్పుడే ఆసియా సింహాలు వాటి సంతానాన్ని కలిగి ఉంటాయి.

మరింతగా చదవండి : గిర్ నేషనల్ పార్క్ మరిన్ని ఆకర్షణలు !!

Photo Courtesy: Asim Patel

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X