Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» భరత్పూర్

భరత్పూర్ – ఇక్కడ పక్షులతో మమేకమవ్వండి !!

19

భారతదేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో భరత్పూర్ ఒకటి. ‘రాజస్థాన్ కి తూర్పు ద్వారం’ అని పిలువబడే ఈ పట్టణం రాజస్థాన్ లోని భరత్పూర్ జిల్లలో వుంది. 1733 లో సూరజ్ మల్ మహారాజు నిర్మించిన పురాతన నగరం. రాముడి సోదరుడు భరతుడి పేరిట ఈ నగరం ఏర్పడింది.

భరత్పూర్ లో రాముడి మరో సోదరుడు లక్ష్మనుడిని తమ ఇలవేల్పుగా కొలుస్తారు. లోహఘర్ గా పిలువబడే భరత్పూర్ జైపూర్, ఉదయపూర్, జైసల్మేర్, జోధ్పూర్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు ద్వారం గా ఉంటుంది. భరత్పూర్ జిల్లాకు హర్యానా, ఉత్తర ప్రదేశ్, ధోల్పూర్, కరౌలి, జైపూర్, ఆల్వార్ లు సరిహద్దుగా వున్నాయి.

పక్షుల స్వర్గధామం

పక్షి ప్రేమికులకు స్వర్గధామంగా వుండే భరత్పూర్ ఇక్కడి నేషనల్ పార్క్ గురించి ప్రసిద్ది చెంది౦ది. ఈ పార్కు లో 375 జాతుల పక్షులు నివాసం ఉంటున్నాయి. వర్షా కాలం, శీతకాలాలు ఈ పార్క్ సందర్శనకు అనువైన సమయం. వలస వచ్చే నీటి బాతులు, పొడవు మెడ బూడిద రంగు కాళ్ళు వుండే బాతులు, సన్న తోక పక్షులు, నీలిరంగు పిట్టలు, రడ్డీ షెల్ డక్ లు, మల్లార్డ్ లు, విడ్జియన్ లు, షోవేలర్ లు, సాధారణ షెల్ డక్ లు, ఎర్ర మెడ బాతులు, గడ్వాల్ బాతులు లాంటి వివిధ జాతుల బాతులను ఈ అడవుల్లో చూడవచ్చు.

వాస్తు నిర్మాణ శైలుల మిశ్రమం

భరత్పూర్ లోని కట్టడాలు రాజపుత్ర, ముఘలాయి, బ్రిటిష్ నిర్మాణ శైలుల ప్రభావానికి ప్రతీక గా నిలుస్తాయి. రాజస్థాన్ రాష్ట్రం లోని ప్రసిద్ధ కోటలలో లోహ ఘర్ కోట ఒకటి. ఈ నగరంలో పర్యాటకులు డీగ్ కోట, భరత్పూర్ రాజప్రాసాదం, గోపాల్ భవన్, ప్రభుత్వ మ్యూజియం కూడా చూడవచ్చు. అంటే కాకుండా భరత్పూర్ లోని ప్రధాన ధార్మిక క్షేత్రాలు బాంకే బిహారీ దేవాలయం, గంగా దేవి గుడి, లక్ష్మణుడి గుడి కూడా వున్నాయి.

భరత్పూర్ చేరుకోవడం

ఈ అందమైన ప్రదేశానికి వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా తేలిగ్గా చేరుకోవచ్చు. న్యూ డిల్లీ లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టాక్సీలు లేదా బస్సులలో పర్యాటకులు ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ విమానాశ్రయం ముంబై, బెంగళూరు, కోల్కతా, చెన్నై లాంటి దేశంలోని ప్రధాన నగరాలకు నిత్యం తిరిగే విమానాల ద్వారా అనుసంధానం చేయబడి వుంది. భరత్పూర్ రైల్వే స్టేషన్ జైపూర్, ముంబై, అహ్మదాబాద్, డిల్లీ లకు అనుసంధానించబడి వుంది. రైల్వే స్టేషన్ నుంచి భరత్పూర్ చేరుకోవడానికి పర్యాటకులకు టాక్సీలు, బస్సులు అందుబాటులో వున్నాయి. ఆగ్రా, న్యూ డిల్లీ, ఫతే పూర్ సిక్రీ, జైపూర్, ఆల్వార్ వంటి నగరాల నుండి ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల ద్వారా భరత్పూర్ చేరుకోవచ్చు.

థార్ ఎడారికి దగ్గరగా వుండడం వల్ల భరత్పూర్ లో తీవ్రమైన వాతావరణం వుంటుంది. భరత్పూర్ సందర్శనకు వర్షాకాలం, శీతాకాలం అనువైనవి.

 

భరత్పూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

భరత్పూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం భరత్పూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? భరత్పూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా: పర్యాటకులు ఆగ్రా, ఫతేపూర్, సిక్రీ, జైపూర్ నుండి అందుబాటులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ బస్సు సర్వీసుల ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. న్యూ డిల్లీ, జైపూర్, ఆల్వార్ నుండి ప్రైవేట్ డీలక్స్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా: భరత్పూర్ రైల్వే స్టేషన్ కి జైపూర్, ముంబై, అహ్మదాబాద్, డిల్లీ వంటి నగరాలు బాగా అనుసంధానించబడి ఉన్నాయి. పర్యాటకులు రైల్వే స్టేషన్ నుండి అద్దె టాక్సీలు ఎంచుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    పర్యాటకులు వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా భరత్పూర్ చేరవచ్చు. వాయు మార్గం ద్వారా: డిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భరత్పూర్ కి సమీప విమానాశ్రయం. ఇది ఇక్కడి నుండి 207 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ విమానాశ్రయానికి కోల్కతా, చెన్నై, బెంగుళూరు, ముంబై వంటి భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలకు రోజువారీ విమానాలు అనుసంధానించబడి ఉన్నాయి. పర్యాటకులు ఈ విమానాశ్రయం నుండి టాక్సీల ద్వారా భరత్పూర్ చేరుకోవచ్చు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పక్కనే ఉన్న ఆగ్రా లోని ఖేరియ విమానాశ్రయం నుండి కూడా పర్యాటకులు భరత్పూర్ వెళ్ళవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed