Search
  • Follow NativePlanet
Share
» »వీకెండ్ లో వెల్లూరు చూసొద్దాం

వీకెండ్ లో వెల్లూరు చూసొద్దాం

వెల్లూరు చుట్టు పక్కల చూడదగిన ప్రాంతాలకు సంబంధించిన కథనం.

వీకెండ్ వచ్చేసింది. మరెక్కడికి వెలుదాం? అని ఆలోచిస్తున్నారా? మీ కోసమే ఈ వెల్లూరు ఎదురు చూస్తోంది. బెంగళూరు నుంచి 211 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం అటు ఆధ్యాత్మికతకు ఆలవాలమైన దేవాలయాలు, చర్చ్ లకు నిలయం. అంతేకాకుండా చరిత్రకు సాక్షీభూతమైన ఈ వెల్లూరులో సందర్శించదగిన కోటలు ప్యాలెస్ లు కూడా ఉన్నాయి. మరోవైపు ప్రకతి ప్రేమికులు ఇష్టపడే ఉద్యానవనాలు ఎన్నో ఇక్కడ ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ మీ కోసం

వెల్లూరు కోట

వెల్లూరు కోట

P.C: You Tube

విజయనగర కాలంలో వారికి సామంతులుగా ఉన్న నాయక రాజులు ఈ కోటను క్రీస్తుశకం 1526 నుంచి క్రీస్తుశకం 1604 వరకూ పరిపాలించారు. వారి కాలంలోనే ఈ కోటను నిర్మించారు. వెల్లూరు వంటి శత్రుదుర్భేద్యమైన కోట భారత దేశంలో మరొకటి లేదని ఆ కాలంలో ప్రతీతి.

వెల్లూరు కోట

వెల్లూరు కోట

P.C: You Tube

ఈ కోట చుట్టూ పెద్ద కందకం కూడా ఉంది. ఇందులో దాదాపు వెయ్యి మొసళ్లను ఆ కాలంలో వదిలారని చెబుతారు. అత్యంత విశాలమైన ఈ కోటను పూర్తిగా చూడటానికే ఒక రోజు పడుతుందని చెబుతారు. ఇక్కడ చిన్న సంగ్రహాలయం కూడా ఉంది.

మహాలక్ష్మీ దేవాలయం

మహాలక్ష్మీ దేవాలయం

P.C: You Tube

వెల్లూరులో మరో ముఖ్యమైన పర్యాటక కేంద్రం శ్రీ పురం గోల్డెన్ దేవాలయం. మలై కోడి అనే చిన్న గుట్టమీద ఈ దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయంలో ప్రధాన దైవం లక్ష్మీదేవి.

మహాలక్ష్మీ దేవాలయం

మహాలక్ష్మీ దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయం మూడు వందల ఎకరాల్లో నిర్మించబడిందని చెబుతారు. ఇక్కడ దేవతను లక్ష్మీ నారాయణి పేరుతో కూడా పిలుస్తారు. ఇక ఆలయ గోపురం మొత్తం బంగారు తాపడం చేయించింది.

జలకంఠేశ్వర దేవాలయం

జలకంఠేశ్వర దేవాలయం

P.C: You Tube

వెల్లూరులో ఉన్న పర్యాటక ప్రాంతాల్లో జలకంటేశ్వర దేవాలయం కూడా ఒకటి. ఇక్కడ ప్రధాన దైవం పరమశివుడు. వెల్లూరు కోటలో ఒక భాగమైన ఈ జలకంటేశ్వర దేవాలయంలోని కళ్యాణ మంటపం భారతీయ శిల్పకళకు అద్దం పడుతుంది.

జలకంఠేశ్వర దేవాలయం

జలకంఠేశ్వర దేవాలయం

P.C: You Tube

ఈ కళ్యాణ మంటపాన్ని ఆంగ్లేయులు ఓడలో ఇంగ్లాడుకు తరలించాలని భావించిన ఇందుకు వినయోగించదలచిన ఓడ నీటిలో మునిగి పోయింది దీంతో వారు తమ ఆలోచనను విరమించుకున్నారు. చోళుల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చెబుతారు.

వినాయక దేవాలయం

వినాయక దేవాలయం

P.C: You Tube

వెల్లూరు దగ్గర చూడదగిన మరో పర్యాటక స్థలం పిళ్లైయార్పట్టి గణేష దేవాలయం. ఇది ఒక గుహాలయం. ఇక్కడ గణపతి చాలా పెద్ద ఆకారంలో ఉంటారు.వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దేవాలయాన్ని దర్శిస్తే అనుకొన్నకోర్కెలన్నీ నెరవేరుతాయని చెబుతారు.

చర్చ్

చర్చ్

P.C: You Tube

ఇండో, యురోపియన్ వాస్తు శైలిలో నిర్మించిన సెయింట్ జాన్స్ చర్చ్ కూడా చూడదగినదే. గతంలో ఈ చర్చ్ ఆవరణంలో ఈస్ట్ ఇండియా కంపెనీ తన మిలటరీ అవసరాల కోసం దీనిని వినియోగించేవారు. ప్రస్తుతం ఇది పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది.

హైదర్, టిప్పు మహల్స్

హైదర్, టిప్పు మహల్స్

P.C: You Tube

వెల్లూరులో చూడదగిన ప్రాంతాల్లో హైదర్ మహల్, టిప్పు మహల్ కూడా ఉన్నాయి. ఈ రెండు మహల్స్ చుట్టూ ప్రస్తుతం అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి. ఈ కోటల్లోనే టిప్పు సుల్తాన్ కుటుంబ సభ్యులను బంధించి ఉంచారని చెబుతారు.

పెరియార్ పార్క్

పెరియార్ పార్క్

P.C: You Tube

వెల్లూరులో పెరియార్ పార్క్ అత్యంత సుందరమైన పర్యాటక ప్రాంతం. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్రత్యేక స్థలం ఉంది. బ్యాటరీ ఆధారిత వాహనాలతో ఈ ఉద్యానవనం మొత్తం తిరగడానికి వీలవతుంది. చిన్న పక్షి సంరక్షణ కేంద్రాన్ని కూడా మనం చూడవచ్చు.

బాలమురుగన్ దేవాలయం

బాలమురుగన్ దేవాలయం

P.C: You Tube

వెల్లూరు దగ్గరల్లోని రత్నగిరి కోట పై బాలమురుగన్ దేవాలయం ఉంది. ఇక్కడ ప్రధాన దైవం బాలమురుగన్. ఇక్కడ స్వామివారు చాలా అందంగా ఉంటారు. ప్రతి ఏడాది జరిగే రథోత్సవానికి ఇక్కడకు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

శ్రీలంక రాజును, టిప్పు కొడుకును బంధించిన కోట ఎక్కడుందో తెలుసా?శ్రీలంక రాజును, టిప్పు కొడుకును బంధించిన కోట ఎక్కడుందో తెలుసా?

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఈ రహస్యాలన్నీ మీకు తెలుసా?శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఈ రహస్యాలన్నీ మీకు తెలుసా?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X