» »తమిళనాడు లో వేసవి చల్లని ప్రదేశాలు !

తమిళనాడు లో వేసవి చల్లని ప్రదేశాలు !

Written By:

పుస్తకాలతో కుస్తీలు పట్టిన పిల్లలకు సెలవులు వచ్చేశాయి. జూన్ 12 వరకు స్కూ ళ్ళకి సెలవులు ఉండటంతో పిల్లలు ఆడలాడుకుంటూ, ఆనందంలో మునిగి తేలుతుంటారు. ఎంత ఆడినా వారికి మానసికోల్లాసం కలగదు. అది కలగాలంటే ప్రయాణాలు తప్పనిసరి.

ఇది వేసవి కాలం. అందునా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలైతే ఉదయాన్నే చుక్కలు చూపిస్తున్నాయి మరెక్కడని వెళ్ళేది ? అనేగా మీ సందేహం. తమిళనాడు వెళ్ళండి ...అక్కడైతే మీకు బోలెడు మానసిక ఉల్లసాలను కలిగించే ప్రదేశాలు ఉంటాయి. వీటిలో ఏదో ఒక ప్రదేశాన్ని ఎంచుకోండి ... మీ వేసవి సెలవులను హాయిగా, ఉల్లాసంగా గడిపేయండి !!

ఇది కూడా చదవండి : తమిళనాడు అంటే చాలు ఠక్కున గుర్తుకోచ్చేస్తాయ్ !

ముదుమలై నేషనల్ పార్క్

ముదుమలై నేషనల్ పార్క్

ఇక్కడికి ఎలా వెళ్ళాలి ?

సమీప విమానాశ్రయం - పీలమేడు వద్ద ఉన్న కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయం (130 కి.మీ)

సమీప రైల్వే స్టేషన్ - నీలగిరి కొండల్లోని ఊటీ రైల్వే స్టేషన్ (40 కి.మీ) ; ప్రధాన స్టేషన్ కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ (82 కి.మీ)

రోడ్డు మార్గం - ముదుమలైకి సమీపంలో ఉన్న పట్టణం గుడలుర్. ఇది ఉదగమండలం -మైసూర్ జాతీయ రహదారిపై 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉదగమండలం(ఊటీ), మైసూర్, సమీప పట్టణాల నుండి ముదుమలై కు బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. దారంతా మలుపుల వంపులు తిరిగి ఉంటాయి అందువల్ల ఈ ప్రాంతానికి డ్రైవింగ్ చేసేటపుడు జాగ్రత్తగా ఉండడం అవసరం.

చిత్ర కృప : benuski

ముదుమలై నేషనల్ పార్క్

ముదుమలై నేషనల్ పార్క్

ఈ వేసవిలో అడవుల్లో ఉండటం కంటే ఇంకేం కావాలి ? చుట్టూ పచ్చని ప్రకృతి ఆస్వాదిస్తూ హాయిగా గడిపేయవచ్చు. దట్టమైన నీలగిరి అడవుల్లో ఉన్న ఈ అభయారణ్యం అద్భుతమైన, అరుదైన, మరెక్కడా కానరాని వివిధ జంతు, వృక్ష జాతులకు ఆవాసంగా ఉన్నది. నీటి కుంటల వద్ద, చెరువుల వద్ద, నదులు - వాగుల వద్ద ఇలా నీళ్ళు ఎక్కడ కనబడితే అక్కడకి వచ్చి దాహార్తి తీర్చుకొనే జంతువులను, పక్షులను గమనిస్తూ ఉల్లాసాన్ని పొందవచ్చు.

ఇది కూడా చదవండి : ముదుమలై అభయారణ్యం సమీపంలో ఏ ఏ ప్రదేశాలను చూడాలి ?

చిత్ర కృప : Vinoth Chandar

ఊటీ

ఊటీ

ఎలా చేరుకోవాలి ?

సమీప విమానాశ్రయం - కోయంబత్తూర్ అంతర్జాతీయ వినామాశ్రయం ( 87 కి. మీ)

సమీప రైల్వే స్టేషన్ - ఊటీ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కు చేరుకోవాలంటే మెట్టుపాళయం స్టేషన్ వద్ద రైలు మారాలి ఎందుకంటే ఊటీ కి కేవలం మీటర్ గేజ్ లైన్ ఉంది.

రోడ్డు మార్గం - చెన్నై, బెంగళూరు, మైసూర్, కోయంబత్తూర్ , కోచి , కాలికట్ మరియు సమీప పట్టణాల నుండి ఊటీ కి నేరుగా బస్సులు వెళ్తుంటాయి. సొంతవాహనాల్లో, ప్రవేట్ వాహనాల్లో కూడా ఊటీ చేరుకోవచ్చు.

ఇది కూడా చదవండి : ఉల్లాస పరిచే ఊటీ రైలు ప్రయాణం !

చిత్ర కృప : Ramkumar

ఊటీ

ఊటీ

ఊటీ అందమైన హిల్ స్టేషన్ లకు రారాజు వంటిది . కాఫీ తోటలు, టీ తోటలు మరియు పచ్చని చెట్లతో నిండిన ఇక్కడి వాతావరణం వేసవిలో 25 డిగ్రీలకు మించదు. గార్డెన్ లు, పార్క్ లు, అందమైన సరస్సులు, దోడబెట్ట శిఖరం, ఫ్లవర్ షో లు, వెన్ లాక్ డౌన్స్, తేయాకు తోటలు చూడదగ్గవి.

ఇది కూడా చదవండి : వేసవి తాపం - ఊటీ చక్కటి పరిష్కారం !

చిత్ర కృప : Darshan Simha

ఏర్కాడ్

ఏర్కాడ్

ఇక్కడికి ఎలా చేరుకోవాలి ?

సమీప వినామాశ్రయం : 183 కి. మీ. దూరంలో త్రిచి దేశీయ విమానాశ్రయం(183 కి. మీ.)

సమీప రైల్వే స్టేషన్ : సేలం రైల్వే స్టేషన్ (35 కి. మీ)

రోడ్డు మార్గం : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు లతో పాటుగా ప్రైవేట్ బస్సులు ప్రతి రోజు సేలం నుండి ఏర్కాడు కు నడుస్తాయి. కోయంబత్తూరు (190 కి. మీ), చెన్నై(356 కి. మీ), బెంగుళూరు(230 కి. మీ ) నుండి కూడా ఇక్కడికి బస్సులు ఉన్నాయి.

చిత్ర కృప : Thangaraj Kumaravel

ఏర్కాడ్

ఏర్కాడ్

ఏర్కాడ్ 'పేదల ఊటీ' గా తమిళనాడులో ప్రసిద్ధి చెందినది. వన్య సంపద కలిగిన అభయారణ్యం, వాణిజ్య తోటలు ఇక్కడ ఉన్నాయి. వ్యూ పాయింట్లు, కొండ ల పై ఉన్న ఆలయాలు మరియు ఉద్యానవనాలు చూడదగ్గవి.

ఇది కూడా చదవండి : ఏర్కాడ్ లో చూడదగ్గ ప్రదేశాలు !

చిత్ర కృప : Thangaraj Kumaravel

గుడలుర్

గుడలుర్

గుడలుర్ మూడు రాష్ట్రాల ప్రవేశ ద్వారం : కర్నాటక, కేరళ, తమిళనాడు. ఈ ప్రదేశం నీలగిరి జిల్లాలో , ఊటీకి 50 కి. మీ. దూరంలో ఉన్నది. అందమైన లోయలు, లోయ లో పచ్చని ప్రకృతి, సరస్సులు, తోటలు ఇక్కడ చూడదగ్గవి . ముదుమలై ఇది కేవలం 5 కి. మి. దూరంలో ఉంటుంది.

చిత్ర కృప : Manoj K

కొడైకెనాల్

కొడైకెనాల్

ఎలా చేరుకోవాలి

సమీప విమానాశ్రయం - మదురై విమానాశ్రయం (120 కి. మీ)

సమీప రైల్వే స్టేషన్ - కొడై రోడ్డు సమీప రైల్వే స్టేషన్ (80 కి. మీ)

రోడ్డు మార్గం - మదురై, కోయంబత్తూర్, ట్రిచి , చెన్నై , బెంగళూరు నుండి రోజువారి బస్సులు అందుబాటులో ఉంటాయి

చిత్ర కృప : Akhilesh Ravishankar

కొడైకెనాల్

కొడైకెనాల్

నీలగిరి కొండల్లో ఊటీ పర్వతాలకు రాజైతే, కొడైకెనాల్ యువరాణి వంటిది . ఈ ప్రాంతంలో మంత్రముగ్ధులను చేసే ప్రకృతి అందాలు, చెట్లు , జలపాతాలు ఉన్నాయి. సరస్సులు, పార్కులు, తోటలు మరియు అందమైన రాతి కొండల దృశ్యాలు ఇతర సైట్ సీయింగ్ లుగా ఉన్నాయి.

ఇది కూడా చదవండి : బెంగళూరు నుండి కొడైకెనాల్ కు రోడ్డు మార్గం లో ...!

చిత్ర కృప : Thangaraj Kumaravel

ఏలగిరి

ఏలగిరి

ఎలా చేరుకోవాలి ?

సమీప విమానాశ్రయం - బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం (195 కి. మీ)

సమీప రైల్వే స్టేషన్ - జోలర్పెట్టై రైల్వే జంక్షన్ (23 కి. మీ)

రోడ్డు మార్గం - తిరత్తూర్, కోయంబత్తూర్, బెంగళూరు, చెన్నై, క్రిష్ణగిరి, హోసూర్, సాలెం, వెల్లూర్, వానయంబడి వంటి నగరాల నుండి నిత్యం బస్సులు అందుబాటులో ఉంటాయి. ఏలగిరి కి - పొంనెరి నుండి చక్కటి రోడ్డు వ్యవస్థ కలదు.

చిత్ర కృప : cprogrammer

ఏలగిరి

ఏలగిరి

ఏలగిరి తమిళనాడు లో సహస క్రీడలకు పేరుగాంచినది. పర్వతారోహణ , ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్ లు వాటిలో కొన్ని. అందమైన సరస్సులలో బోటింగ్ చేస్తూ అద్భుతమైన వన సంపదను, చెట్టూ - చేమలను ఆస్వాదిస్తూ ముందుగు సాగవచ్చు . కాఫీ, టీ తోటలు అంత ఎక్కవగా లేకపోయినప్పటికీ ... ఉన్నవి మాత్రం సువాసనలను వెదజల్లుతూ మిమ్మల్ని టీ తాగేటట్టు ప్రేరేపిస్తాయి.

ఇది కూడా చదవండి : ఔరా .. అనిపించే ఏలగిరి సాహస క్రీడలు !

చిత్ర కృప : Abhinandan Momaya

కూనూర్

కూనూర్

ఎలా చేరుకోవాలి ?

సమీప విమానాశ్రయం - కోయంబత్తూర్ విమానాశ్రయం (60 కి. మీ)

సమీప రైల్వే స్టేషన్ - ఊటీ రైల్వే స్టేషన్ (17 కి. మీ)

రోడ్డు మార్గం : ఊటీ, మెట్టుపాలయం, కోయంబత్తూర్, ఏలగిరి ప్రాంతాల నుండి నిత్యం బస్సులు తిరుగుతుంటాయి

చిత్ర కృప : Thangaraj Kumaravel

కూనూర్

కూనూర్

కూనూర్ పర్యటన ఒక మరువలేని అనుభూతిగా ఉంటుంది. ఊటీ కి 17 కి. మీ దూరంలో ఉన్న ఐ ప్రదేశంలో నీలగిరి పర్వతాల సొగసులను దగ్గరనుంచి చూడవచ్చు. డాల్ఫీన్ ముక్కు, హిడెన్ లోయ, సిమ్స్ పార్క్, వ్యూ పాయింట్ లు , కటారీ జలపాతం చూడదగ్గవి.

ఇది కూడా చదవండి : కూనూర్ - ఎప్పటికీ నిద్రిస్తున్న లోయ !

చిత్ర కృప : Thangaraj Kumaravel

కోటగిరి

కోటగిరి

ఎలా చేరుకోవాలి ?

సమీప విమానాశ్రయం - కోయంబత్తూర్ విమానాశ్రయం(66 కి.మీ)

సమీప రైల్వే స్టేషన్ - కోయంబత్తూర్ నుండి మెట్టుపాలయం వెళ్ళే రైలు ఎక్కాలి. మెట్టుపాలయం నుండి నీలగిరి మౌంటెన్ రైల్వే లో రైల్ రోడ్ చేరాలి. అక్కడి నుండి టాక్సీ లేదా బస్సు లో కోటగిరి చేరవచ్చు.

రోడ్డు మార్గం - కోటగిరి వెళ్లేందుకు రోడ్డు ప్రయాణం ఉత్తమం. కూనూర్ నుండి చేరటం తేలిక. మెట్టుపాలయం(33 కి.మీ) , అరవేను ల మీదుగా కోటగిరి చేరవచ్చు.

చిత్ర కృప : Shillika

కోటగిరి

కోటగిరి

కోటగిరి ట్రెక్కింగ్ కు సరైన ప్రదేశం. ఇక్కడ ఎన్నో ట్రెక్కింగ్ మార్గాలు కలవు. వాటిలో మీకిష్టమైన దానిని ఎంచుకొని నడక సాగించవచ్చు . రంగస్వామి పిల్లర్, కొదనాడు వ్యూ పాయింట్ , కేథరిన్ వాటర్ ఫాల్, ఎల్క్ ఫాల్స్, మ్యూజియం, తోటలు, పార్కులు ఇక్కడ చూడదగ్గవి .

చిత్ర కృప : bhagathkumar Bhagavathi

నీలగిరి మౌంటెన్ రైల్వేస్

నీలగిరి మౌంటెన్ రైల్వేస్

సమ్మర్ లో పసందైన రైడ్ ఏదైనా ఉందా అంటే అది నీలగిరి మౌంటెన్ రైల్వేస్ అందించే రైలు ప్రయాణం . మెట్టుపాలయం నుండి ఊటీ కి మధ్యంలో ఈ రైలు పెట్టె నడుస్తుంది. కొండలు, లోయలు, జలపాతాల మీదుగా ఐదున్నర గంటల ప్రయాణం. సింప్లీ సూపర్బ్‌ అన్నమాట ! అటు పక్క చూడాలో, ఇటు పక్క చూడాలో తెలియని అయోమయం. అందాలన్నీ కళ్లలో నింపేసుకోవాలన్న తాపత్రయం పడుతుంటారు.

చిత్ర కృప : David Brossard

నీలగిరి మౌంటెన్ రైల్వేస్

నీలగిరి మౌంటెన్ రైల్వేస్

తల ఎక్కడ తిప్పితే అయ్యో ...! అటువైపు అందం మిస్సయ్యామే అన్న దిగాలు కలగకమానదు. రెప్పపాటులో ఒకదానివెంట మరోటి, దాని వెనుక ఇంకోటి... అలా అనేక కొండలు, లోయలు వెనక్కు వెళుతుంటే ఏమని చెప్పేది, ఆ నీలగిరి కొండల అందాలు ఏమని వర్ణించేది? ప్రకృతి నిండా తలస్నానంచేసి ఎంటికలను విరబోసుకుని నీరెండలో ఆరబెట్టుకుంటుంటే ఎలా వుంటుంది? అచ్చం అలా ఉంటాయి అక్కడి సన్నివేశాలు.

చిత్ర కృప : Kartik Kumar S

వాల్పరై

వాల్పరై

ఎలా చేరుకోవాలి ?

సమీప విమానాశ్రయం - కోయంబత్తూర్ విమానాశ్రయం ( 120 కి. మీ )

సమీప రైల్వే స్టేషన్ - పొల్లాచి రైల్వే స్టేషన్ ఉన్నప్పటికీ కోయంబత్తూర్ స్టేషన్ ప్రధాన జంక్షన్ గా ఉన్నది.

రోడ్డు మార్గం - కోయంబత్తూర్ నుండి వాల్పరై వెళ్ళే మార్గంలో పొల్లాచి (100కి. మీ) కనిపిస్తుంది. నేషనల్ హై వే కు సమీపంలో ఉన్నవాల్పరై కు కోయంబత్తూర్, చెన్నై నుండి బస్సులు నడుస్తుంటాయి.

చిత్ర కృప : Indianature st2

వాల్పరై

వాల్పరై

'వాల్పరై' తమిళనాడు లో టీ సమృద్ధిగా దొరికే అరణ్య ప్రాంతం. అంటే ఈ హిల్ స్టేషన్ లో మాన వ నిర్మిత టీ మరియు కాఫీ తోటలు ఎక్కువగా ఉత్పత్త వుతాయన్న మాట ... ! ఇక్కడున్న దట్టమైన అడవులు, జలపాతాలు, గణపతి ఆలయం, జలాశయాలు ఇక్కడి ఆకర్షణ ల్లో కొన్ని.

చిత్ర కృప : Thangaraj Kumaravel

పొల్లాచి

పొల్లాచి

పొల్లాచి నీలగిరి పర్వతాల అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది . టాలీవుడ్ , కోలీవుడ్ తో పాటుగా అనేక చిత్ర పరిశ్రమలు ఇక్కడ సినిమా షూటింగ్ లను చిత్రీకరిస్తుంటారు. ఇప్పటికే వందల సినిమా షూటింగ్ లు ఇక్కడ జరిగాయి. ఆలయాలు,సాన్చురీ, మంకీ ఫాల్స్, అజియార్ డ్యాం లు చూడదగ్గవి. కోయంబత్తూర్ నుండి రవాణా సౌకర్యాలు సులభంగా లభ్యమవుతాయి.

ఇది కూడా చదవండి : సినిమా షూటింగ్ ల చిరునామా ... పొల్లాచి !

చిత్ర కృప : Raghavan Prabhu