Search
  • Follow NativePlanet
Share
» »సూర్యాస్తమయాల మాయాజాలం చూద్దాం

సూర్యాస్తమయాల మాయాజాలం చూద్దాం

భారత దేశంలో అందమైన సూర్యస్తమయాలకు సంబంధించిన కథనం.

చిన్నా, పెద్ద వయస్సు భేదాన్ని మరిచి పర్యాటకంలో ప్రతి ఒక్కరూ ఇష్టపడే ప్రాతం బీచ్ లు. సముద్ర తీర ప్రాంతాల్లో ఇసుకలోని గువ్వలను ఏరుకోవడం దగ్గర నుంచి ఆలలతో పోటీ పడుతూ తుళ్లింతలు ఆడటం వరకూ ప్రతి ఒక్కటీ ప్రత్యేకమే. అటువంటి బీచ్ లలో సూర్యాస్తమయాలు చాలా అందంగా కనిపిస్తాయనడంలో సందేహం ఏముంటుంది. కేవలం బీచ్ లే కాకుండా సరస్సులు, నదీతీర ప్రాంతాలు, పర్వత శిఖరాలు కూడా సూర్యస్తమయాల సమయంలో సప్త వర్ణాల శోభితంగా వెలుగొందుతాయి. అలా అందమైన సూర్యాస్తమయాలతో పర్యాటకులను ఆకర్షిస్తున్న కొన్ని ప్రాంతాల వివరాలు మీ కోసం...

కన్యాకుమారి

కన్యాకుమారి

P.C: You Tube

భారతదేశ భూ భాగం దక్షిణ భారత దేశంలో కన్యాకుమారి వద్ద ముగుస్తుంది. ఈ ప్రదేశంలో అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం మూడు ఒక చోట కలిసి ఒక అనిర్వచనీయమైన ప్రక`తి చిత్రాన్ని అందంగా గీస్తాయి. ఇక ఆ చిత్రానికి తుది మెరుగులు అస్తమించే సూర్యుడు దిద్దుతాడు. అందువల్లే ఇక్కడ సూర్యాస్తమయం చూడటానికి ఎక్కవ మంది పర్యాటకులు ఆసక్తి చూపిస్తారు.

తాజ్ మహల్

తాజ్ మహల్

P.C: You Tube

ప్రేమకు చిహ్నం తాజ్ మహల్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయాలు చాలా అందంగా కనిపిస్తాయి. అందువల్లే ఆ సమయంలో ఎక్కువ మంది పర్యాటకులు ఈ పర్యాటక కేంద్రంలో మనకు కనిపిస్తారు.

కోవలం బీచ్

కోవలం బీచ్

P.C: You Tube

సాగర తీరాల్లో సయ్యాటలు ఆడటానికి మాత్రమే బీచ్ లు అన్న నమ్మకం నుంచి బయటికి రావడానికి కోవలం బీచ్ సరైన ఎంపిక. పామ్ చెట్ల సందుల్లోనుంచి సూర్యాస్తమయాన్ని చూడటం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది.

లడక్

లడక్

P.C: You Tube

సూర్యుడు అలా అస్తమించే సమయంలో ఆయన కిరణాలు పంచు పర్వతాల పై పడి సప్త వర్ణాలు ప్రకాశింపచేయడం చూడాల్సిందేకాని చెప్పడానికి మాటలు చాలవు.

ఫోర్ట్ కొచ్చిన్

ఫోర్ట్ కొచ్చిన్

P.C: You Tube

సూర్యుడు అస్తమిస్తూ మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే ప్రక`తి చిత్రాన్ని మనకు అందిస్తాడనుకొంటే అందుకు బోనస్ గా కొన్ని ప్రాంతాలు మనకు మరింతే ఆహ్లాదాన్ని తీసుకువస్తాయి. ఆ కోవకు చెందినదే ఫోర్ట్ కొచ్చిన్. చైనీస్ నెట్స్ బ్యాక్ డ్రాప్ లో సూర్యాస్తమయం ఇక్కడ ప్రత్యేకం.

వారణాసి ఘాట్స్

వారణాసి ఘాట్స్

P.C: You Tube

అధ్యాత్మిక నగరంగా మాత్రమే వారణాసికి పేరు. అయితే ఈ ప్రాచీన నగరం ప్రక`తి అందాలకు కూడా నిలయమే. ముఖ్యంగా గంగానది ఒడ్డున ఉండే ఘాట్ వద్ద నిలబడి సూర్యాస్తమయాలు చూడటం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది.

వార్కలా, కేరళ

వార్కలా, కేరళ

P.C: You Tube

కేరళలో పర్వత శిఖరాలు అరేబియా సముద్రానికి అత్యంత దగ్గరగా ఉన్న ప్రాంతం వార్కలా. చాలా మంది పర్యాటకులు ఇక్కడ సూర్యాస్తమయాన్ని చూడటానికే వెలుతారు.

దాల్ లేక్, శ్రీనగర్

దాల్ లేక్, శ్రీనగర్

P.C: You Tube

శ్రీనగర్ లో చూడదగిన పర్యాటక ప్రాంతాల్లో దాల్ సరస్సు ప్రముఖమైనది. అయితే ఇక్కడ సూర్యాస్తమయం చూడటం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకండి. లేదంటే మీ శ్రీనగర్ పర్యటన పరిసమాప్తం కాదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X