Search
  • Follow NativePlanet
Share
» »శివుడు యొక్క రహస్య పర్వతం?

శివుడు యొక్క రహస్య పర్వతం?

By Venkatakarunasri

శివుడు రహస్యంగా దాచుకున్న పర్వతం ఇప్పటికీ ఒకఅద్భుతం. త్రిమూర్తుల్లో ఒక్కడిన శివుడికి ఎన్నోఆలయాలున్నాయి. ఆయన ఎక్కువగా కొండలు, పర్వతప్రాంతంలోనే లింగరూపంలో వెలిసాడని చెబుతారు. అయితే దేవుడైన శివుడు భయంతో రహస్యంగా ఒక పర్వతంపైన దాక్కున్నాడని ఒక కధ వుంది. మరి ఆయన ఎందుకు భయపడ్డాడు?ఆయన తలదాచుకున్న పర్వతం యొక్క విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

శివుడు యొక్క రహస్య పర్వతం?

శివుడు యొక్క రహస్య పర్వతం?

ఎక్కడ వుంది?

కర్ణాటకలోని పడమటికనుమల్లో విస్తరించివున్న సహ్యాద్రిపర్వతశ్రేణుల్లో యానదగ్గర భైరవేశ్వరశిఖరం వుంది.ఇక్కడ పర్వతాలమధ్యచుట్టూ రాతి నిర్మాణాలుకలిగిన అత్యంత సుందరప్రాంతం యానా.

PC:youtube

శివుడు యొక్క రహస్య పర్వతం?

శివుడు యొక్క రహస్య పర్వతం?

అక్కడికి చేరుకోవాలంటే మాత్రం చాలా కష్టంతో కూడుకున్నపనే.ఎందుకంటే చుట్టూదట్టమైన అటవీప్రాంతం చుట్టూ ఎత్తైనకొండలు, వాటి పైనుంచి ముగ్ధమనోహరంగా జాలురే జలపాతాలు. వాటిని దాటుకుంటూ వెళితేతప్ప యానా చేరుకోలేం. అక్కడేవుంది శివుడు దాక్కున్న కొండ భైరవేశ్వరశిఖరం.

PC:youtube

శివుడు యొక్క రహస్య పర్వతం?

శివుడు యొక్క రహస్య పర్వతం?

భస్మాసురుడు శివుడ్ని తనలో కలుపుకోవాలన్న అత్యాశతో ఆయనకోసం వేట మొదలుపెడతాడు. లోకకళ్యాణార్ధం శివుడు రాక్షసరాజైన భస్మాసురుడ్నించి తప్పించుకుని రహస్యంగా దాక్కున్నాడని పురాణఇతిహాసాలు చెప్తున్నాయి.

PC:youtube

శివుడు యొక్క రహస్య పర్వతం?

శివుడు యొక్క రహస్య పర్వతం?

చరిత్ర చెపుతున్నట్లుగానే ఇది అత్యంత రహస్యమైన ప్రాంతంగానే కనిపిస్తోంది.ఇక్కడ చిత్రవిచిత్రాలు చాలానే కనిపిస్తాయి.చుట్టూ చిమ్మచీకట్లువున్న ఆ గుహలోని శివలింగంపై మాత్రం ఎప్పుడూ వెలుతురు పడుతూనేవుంటుంది. దానికి కారణం ఆకాశంనుంచి నేరుగా ఈ ప్రాంతానికి మార్గంవున్నట్టుగా తోచే కొండఆకారమే.

PC:youtube

శివుడు యొక్క రహస్య పర్వతం?

శివుడు యొక్క రహస్య పర్వతం?

ఇక శివుడ్ని జగత్తుకు కనిపించకుండా భస్మాసురుడికి అడ్డుగానిలచిన కొండగా పేరుగాంచింది మోహినీపర్వతం. యానాగుహలలో జగన్మోహినీ అనే ఒక రాతి నిర్మాణంవుంది. పురాణాలప్రకారం శివుడ్ని కాపాడేందుకు మోహినీఅవతారం ఎత్తిన శ్రీమహావిష్ణువుగా భక్తులు ఈ రాతిని పూజిస్తారు.

PC:youtube

శివుడు యొక్క రహస్య పర్వతం?

శివుడు యొక్క రహస్య పర్వతం?

ఇంత దట్టమైన కొండలమధ్య ఒక జలధార పర్యాటకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కొండల పక్కనుంచి వెళుతున్న పర్వతరోహికులకు జలధారశబ్దాలు వినిపిస్తాయి.కాని ఎక్కడా ఆ ఆనవాళ్ళు కనిపించవట.కానీ యానా గుహలలో రాళ్ళగుండా ప్రవహించే నీరు ఏకంగా ఓ నదిగా మారుతాయని చెపుతున్నారు.

PC:youtube

శివుడు యొక్క రహస్య పర్వతం?

శివుడు యొక్క రహస్య పర్వతం?

చండీహోల్ అనే నదిగా ఏర్పడి ఆదిఆఘానాసిని అనే మరోనదిలో వుప్పినపట్టణం వద్ద ఈ నీళ్ళు కలుస్తాయత.గుహలలో ప్రవహించే ఈ నీరు శివుడి జటాజూటంనుంచి ఉద్భవిస్తుందని అక్కడిప్రజల నమ్మకం.

PC:youtube

శివుడు యొక్క రహస్య పర్వతం?

శివుడు యొక్క రహస్య పర్వతం?

భైరవేశ్వరశిఖరం మహాఅద్భుతంగా కనిపిస్తుంది. స్వయంభూగా వెలసిన శివలింగం ఇక్కడ ప్రత్యేకత.అంతేకాకుండా దుర్గామాతఅవతారమైన చంద్రిక కాంశ్యవిగ్రహం కూడా ఈ భైరవేశ్వరకోనలో వున్నాయి. యానా ప్రాంతంలోని విభూతిజలపాతాలు ప్రసిద్ధిగాంచినవి.

PC:youtube

శివుడు యొక్క రహస్య పర్వతం?

శివుడు యొక్క రహస్య పర్వతం?

30అడుగులు ఎత్తు నుంచి కిందపడే ఈ జలపాతం పర్యాటకులకు, పర్వతారోహకులకు ఆనందంకలిగిస్తుంది. ఎంతోకష్టంతో కూడుకున్న ఆ రహస్యప్రదేశాన్ని చేరుకున్న భక్తుల అక్కడి ప్రాంతాన్ని చూస్తూ పులకరించిపోతుంటారు.

PC:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more