Search
  • Follow NativePlanet
Share
» »శివుడు కుంభకర్ణుడి పుత్రుడుని సంహరించింది ఈ క్షేత్రంలోనే...

శివుడు కుంభకర్ణుడి పుత్రుడుని సంహరించింది ఈ క్షేత్రంలోనే...

భీమాశంకర్ జ్యోతిర్లింగం గురించిన సమాచారం.

శివుడి గురించిన ఎన్నో కథలు మనకు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా జ్యోతిర్లింగాలకు సంబంధించి ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క కథనం ప్రచారంలో ఉంటుంది. కథ ఏదైనా వాటి భావం మాత్రం ఒకటే. అదే దుష్ట శిక్షణ. శిష్ట రక్షణ. అటువంటి జ్యోతిరింగమే భీమాశంకర్ జ్యోతిర్లింగం. భారత దేశంలోని ద్వాదశ అంటే 12 జ్యోతిర్లింగాల్లో భీమాశంకర్ జ్యోతిర్లింగం ఆరవది. ఈ జ్యోతిర్లింగం ఇక్కడ వెలియడానికి కుంభకర్ణుడి కుమారుడు భీముడి పాత్ర ఎంతో ఉంది. ఈ నేపథ్యంలో ఆ విశేషాల గురించిన సమస్థ సమాచారం మీ కోసం...

భీమాశంకర్ జ్యోతిర్లింగం

భీమాశంకర్ జ్యోతిర్లింగం

P.C: You Tube

రావణాసురుడి సోదరుడైన కుంభకర్ణుడికి ప్రస్తుతం భీమాశంకర్ జ్యోతిర్లింగం ఉన్న పర్వత ప్రాంతంలో కర్నటి అనే రాక్షసమహిళ కనబడుతుంది. ఆమెను చూసి కుంభకర్ణుడు మోహిస్తాడు. అటు పై ఆమెను వివాహం చేసుకొంటాడు.

భీమాశంకర్ జ్యోతిర్లింగం

భీమాశంకర్ జ్యోతిర్లింగం

P.C: You Tube
అటు పై ఆమెతో కొన్ని రోజులు ఉండిన తర్వాత లంకకు వెళ్లిపోతాడు. అయితే కర్కటి మాత్రం ఆ పర్వతంలోనే నిలబడి పోతుంది. అటు పై కొన్ని రోజుల తర్వాత కర్కటి భీమ అనే పిల్లాడికి జన్మనిస్తుంది.

భీమాశంకర్ జ్యోతిర్లింగం

భీమాశంకర్ జ్యోతిర్లింగం

P.C: You Tube
శ్రీరాముడు కుంభకర్ణుడిని వధించిన తర్వాత కర్నటి తన కుమారుడిని దేవతల విషయాలు ఏవీ తెలియకుండా పెంచుతుంది. అయితే కుమారుడు పెద్దవాడైన తర్వాత భీముడు తన తండ్రి చావుకు శ్రీ రాముడి రూపంలో ఉన్న విష్ణువు ప్రధాన కారణమని తెలుస్తుంది.

భీమాశంకర్ జ్యోతిర్లింగం

భీమాశంకర్ జ్యోతిర్లింగం

P.C: You Tube
దీంతో ఆ విష్ణువుని సంహరించాలన్న ఉద్దేశంతో బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు. అటు పై అనేక వరాలు పొందుతాడు. వర గౌర్వంతో భీముడు కామరూపేశ్వర అనే శివభక్తుడైన రాజును బంధిస్తాడు.

భీమాశంకర్ జ్యోతిర్లింగం

భీమాశంకర్ జ్యోతిర్లింగం

P.C: You Tube
దేవతలకు పూజలు చేయకూడదని తననే పూజించాలని ఆదేశిస్తాడు. అయినా కామరూపేశ్వరుడు భీముడి మాటలను లెక్క చేయకుండా తనను బంధించిన జైలులోనే ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని శివుడిని పూజిస్తూనే ఉంటాడు.

భీమాశంకర్ జ్యోతిర్లింగం

భీమాశంకర్ జ్యోతిర్లింగం

P.C: You Tube
దీంతో ఆగ్రహం చెందిన భీముడు కత్తితో ఆ శివలింగాన్ని ఖండించడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో శివుడు స్వయంభువుగా ఆ శివలింగం నుంచి ప్రత్యక్షమవుతాడు. అపుడు శివుడు భీముని మధ్య పెద్ధ యుద్ధమే జరుగుతుంది.

భీమాశంకర్ జ్యోతిర్లింగం

భీమాశంకర్ జ్యోతిర్లింగం

P.C: You Tube
ఈ యుద్ధంలో భీముడు చనిపోతాడు. అటు పై దేవతలంతా ప్రత్యక్షమయ్యి అక్కడే లింగ రూపంలో ఉండిపోవాలని శివుడిని కోరుతారు. ఇక ఇక్కడ భీముడితో యుద్ధం చేయడం కోసం శివలింగం నుంచి బయటికి వచ్చినందువల్ల ఈ జ్యోతిర్లింగాన్ని భీమశంకర జ్యోతిర్లింగం అని అంటారు.

భీమాశంకర్ జ్యోతిర్లింగం

భీమాశంకర్ జ్యోతిర్లింగం

P.C: You Tube
ఇక భీముడితో యుద్ధం చేసే సమయంలో శివుడి శరీరం నుంచి జాలువారిన స్వేదమే భీమా నదిగా రూపాంతరం చెంది ప్రవహిస్తోందని చెబుతారు. ఈ భీమాశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూణేకు 127 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక ముంబై నుంచి ఇక్కడకు చేరుకోవడానికి 200 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

ఈసారి దసరా కు మైసూరు వెళుతున్నారా? ఈ విషయాలన్నీ మీకు తెలుసాఈసారి దసరా కు మైసూరు వెళుతున్నారా? ఈ విషయాలన్నీ మీకు తెలుసా

ఈ దేవాలయాల్లో ఇదేమి ఆచారంఈ దేవాలయాల్లో ఇదేమి ఆచారం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X