Search
  • Follow NativePlanet
Share
» »బీదర్ కోట మిస్టరీ !

బీదర్ కోట మిస్టరీ !

By Venkatakarunasri

ఫ్రెండ్స్ ఈ వ్యాసంలో మనం కర్ణాటకలోని ప్రఖ్యాత బీదర్ కోట గురించి తెలుసుకోబోతున్నాం. బీదర్ ఇది ఒక చారిత్రాత్మకఅతి పురాతనమైన నగరం. మన హైదరాబాద్ కి 135కిమీ ల దూరంలో కర్ణాటకరాష్ట్రం ఉత్తరభాగాన వుంది.క్రీ.పూ ఈ నగరాన్ని శాతవాహనులు పరిపాలించేవారు ఆ తర్వాత ఈ నగరం క్రీశ 753లో రాష్ట్రకూటులచేతుల్లోకి వెళ్ళింది.

బీదర్ కోట కర్నాటకలోని ఉత్తర భాగంలో ఉన్న బీదర్ నగరంలో ఉంది. ఈ ప్రాంతం పీఠభూమి ప్రాంతం. 1427లో బహమనీ రాజవంశపు సుల్తాసు అయిన సుల్తాన్ అల్లావుద్దీన్ బహమన్ తన రాజధానిని గుల్బర్గా నుండి బీదర్ కు తరలించాడు. ఆ కాలంలోనే ఈ కోటను మరికొన్ని మొహమ్మదీయ నిర్మాణాలను నిర్మించాడు. ఇక్కడ దగ్గర దగ్గర 30 నిర్మాణాలున్నాయి.

బీదర్ కోట మిస్టరీ !

బీదర్ కోట మిస్టరీ !

ఇక్కడ నగరానికి, జిల్లాకు, కోటకూ ఒకటే పేరు - బీదర్. 22 మైళ్ళ పొడవు అత్యధికంగా 12 మైళ్ళ వెడల్పు కలిగిన పీఠభూమికి ఒక మూలన ఈ నగరం మరియు కోట ఉన్నాయి. మొత్తం విస్తీర్ణం 12 చదరపు మైళ్ళు. ప్రాచీన కళ్యాణి చాళుక్యుల రాజధాని కల్యాణి (బసవ కల్యాణ్) బీదర్ కు పశ్చిమంగా 40 మైళ్ళ దూరంలో ఉంది.

pc: Krb2383

బీదర్ కోట మిస్టరీ !

బీదర్ కోట మిస్టరీ !

బీదర్ నగరం, జిల్లాలోని నగర పరిసర ప్రాంతాలు కారంజ నది ద్వారా నీళ్ళ అవసరాన్ని తీర్చుకుంటాయి. ఈ కారంజ నది మంజీర నదికి ఉపనది. ఇక్కడి వాతావరణం సంవత్సరం పొడుగునా ఆహ్లాదకరంగా, అనుకూలంగా ఉంటుంది.

pc: wikimedia.org

బీదర్ కోట మిస్టరీ !

బీదర్ కోట మిస్టరీ !

ఏప్రిల్ మే నెలల్లో కూడా అనుకోని వర్షాలు కురిసి ఈ ప్రదేశం చల్లబడుతుంది. జూన్ మొదట్లో నైఋతి ఋతుపవనాలు ఈ ప్రాంతాన్ని చేరి మరింత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిస్తాయి. చలికాలంలో కూడా ఈ ప్రాంతపు వాతావరణం బాగుంతుంది.

pc: wikimedia.org

బీదర్ కోట మిస్టరీ !

బీదర్ కోట మిస్టరీ !

చరిత్ర

ప్రస్తుత బీదర్ కోటను కట్టించింది బహమనీ సుల్తాను అల్లావుద్దీన్ బహమన్ అనీ, అతడు 1427లో తన రాజధానిని గుల్బర్గా నుండి బీదర్ కు తరలించినప్పుడు కట్టించాడనీ చరిత్ర ద్వారా తెలుస్తున్నది. ఈ ప్రదేశం మెరుగైన వాతావరణం, సారవంతమైన భూమి కలిగి ఉండటమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.

pc: wikimedia.org

బీదర్ కోట మిస్టరీ !

బీదర్ కోట మిస్టరీ !

ఈ ప్రదేశంలో దృఢమైన, చిన్నదైన ఒక కోట ఉందనీ 1322 లో జరిగిన మొదటి ముస్లిం దండయాత్ర కు సంబంధించిన రాజకుమారుడు ఉలుఘ్ ఖాన్ ద్వారా తుగ్లక్ సామ్రాజ్యం కిందకు వచ్చిందనీ ఆధారాలున్నాయి. బహమనీ సామ్రాజ్యం స్థిరపడ్డాక 1347లో బీదర్ సుల్తాన్ అల్లావుద్దీన్ బహమన్ షా బహమనీ పాలనలోకి వచ్చింది.

pc: wikimedia.org

బీదర్ కోట మిస్టరీ !

బీదర్ కోట మిస్టరీ !

మొదటి అహ్మద్ షా (1422-1486) పాలనలో బీదర్ బహమనీ సామ్రాజ్యపు రాజధాని అయింది. పాత కోట స్థానంలో కొత్త కోటతో పాటుగా మద్రాసాలు, మసీదులు, మహల్లు, రాజభవనాలు, తోటలు నిర్మించబడ్డాయి. బీదర్ చరిత్రలో చెప్పుకోదగ్గ వ్యక్తి 1466లో ప్రధాన మంత్రిగా పని చేసిన మహమ్మద్ గవాన్.

pc: Vinayak

బీదర్ కోట మిస్టరీ !

బీదర్ కోట మిస్టరీ !

క్రీ.శ. 1656 లో ముఘల్ చక్రవర్తి ఔరంగుజేబ్ ఆక్రమించుకునేవరకూ ఈ కోట బారిద్ షాహీ సామ్రాజ్యం అధీనంలో ఉంది. 1724లో బీదర్ నిజాము నవాబులైన ఆసఫ్ జాహీల అదుపులోకి వచ్చింది. బీజాపుర్ సామ్రాజ్యంలోకి 1619-20 లలో చేర్చబడి 1657లో ముఘల్ రాజప్రతినిధిత్వం కిందకు వచ్చి, 1686 నాటికి ముఘల్ సామ్రాజ్యంలో భాగమయింది.

pc: Lala Deen Dayal

బీదర్ కోట మిస్టరీ !

బీదర్ కోట మిస్టరీ !

1751 నుండి 1762 మధ్య ఆసఫ్ జా మూడవ కుమారుడైన నవాబ్ సఈద్ మొహమ్మద్ ఖాన్ అసఫుద్దౌలా బీదర్ కోట నుండి సామ్రాజ్యాన్ని పాలించాడు. తన తమ్ముడు మూడవ మీర్ నిజాం అలీ ఖాన్ ఆసఫ్ జా ఇతన్ని కోటలో బంధించి 16 సెప్టెంబర్ 1763 లో హత్య చేయించే వరకూ అతని పాలన కొనసాగింది.

pc: Santosh3397

బీదర్ కోట మిస్టరీ !

బీదర్ కోట మిస్టరీ !

బీదర్ కు పాత పేరైన మొహమ్మదాబాద్ కూడా ఇతని స్మృతిలోనే పెట్టబడింది. ఆ విధంగా బహమనీ రాజులు గుల్బర్గా నుండి 1347-1424 మధ్య కాలంలో 1424 నుండి రాజ్యం సమాప్తి చెందే వరకూ బీదర్ నుండి పరిపాలన సాగించారు. ఆ పైన సామ్రాజ్యం 5 ముక్కలయింది.

pc: Santosh3397

బీదర్ కోట మిస్టరీ !

బీదర్ కోట మిస్టరీ !

బీజాపుర్, గోల్కొండ, అహ్మద్ నగర్, బీదర్, బేరార్ ప్రాంతాలుగా సామ్రాజ్యం విడిపోయింది. భారత స్వాతంత్ర్యం తరువాత 1956లో బీదర్ మైసూర్(ప్రస్తుత కర్నాటక) లో భాగమయింది.

pc: Santosh3397

బీదర్ కోట మిస్టరీ !

బీదర్ కోట మిస్టరీ !

చేరుకోవడం ఎలా?

బీదర్ రైలు, రోడ్డు, విమానయానం ద్వారా మంచి అనుసంధానం కలిగి ఉంది. బీదర్ బెంగుళూరుకు ఉత్తరాన 740 kilometres (460 mi) దూరంలో, గుల్బర్గాకు ఈశాన్యంగా 116 kilometres (72 mi) దూరంలో, హైదరాబాదుకు జాతీయ రహదారి 9 మీద 130 kilometres (81 mi) దూరంలో ఉంది.

బీదర్ కోట మిస్టరీ !

బీదర్ కోట మిస్టరీ !

విమానాశ్రయం

అతి చేరువలో ఉన్న సామాన్య విమానాశ్రయం హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. బీదర్ ఎయిర్‌పోర్ట్ ఉన్నప్పటికీ, ఇది భారత వాయుదళానికి సంబంధించింది. ప్రముఖులు ఈ విమానాశ్రయాన్ని వాడతారు. బీదర్ కోట హైదరాబాదుకు 115 కి.మీ. దూరంలో ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more