• Follow NativePlanet
Share
» »వెలుగులోకి వచ్చిన మరో అద్భుత జలపాతం!

వెలుగులోకి వచ్చిన మరో అద్భుత జలపాతం!

వెలుగులోకి వచ్చిన మరో అద్భుత జలపాతం ఎక్కడుందో తెలుసా? ప్రపంచంలో నయాగరా జలపాతం అంటే తెలియనివారుండరు.ఎందుకంటే ప్రకృతిమధ్యలో వాలుజారే ఆ సుందరజలపాతం ప్రపంచంలోనే ఎత్తైనజలపాతం.మరి అది అమెరికాలో వుంటే మన ఇండియాలోని తెలంగాణారాష్ట్రంలో కూడా ఒక జలపాతాన్ని "తెలంగాణానయాగర" అని పిలుస్తున్నారు. మరి ఆ జలపాతం ఎక్కడుంది?దాని విశేషాలేంటి?అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణాచత్తీస్ ఘడ్ దండకారణ్యంలో సుమారు 50కిమీ ల దూరంలో వున్న నల్లందేవి గుట్టదగ్గర పుట్టింది బొగత. అక్కడినుండి గుట్టలమీడుగా దుర్గమ్మఅరణ్యాలను చీల్చుకుంటూ వాజేడుమండలంలోని పెనువోగోలుదగ్గర పాలవాగుగా మారుతోంది.

వెలుగులోకి వచ్చిన మరో అద్భుత జలపాతం!

వెలుగులోకి వచ్చిన మరో అద్భుత జలపాతం!

బొగత వాటర్‌ఫాల్స్ చీకులపల్లి ఫాల్స్ అనికూడా అంటారు. కాళేశ్వరం-భద్రాచలం అడవుల మధ్యన ఇది ఉన్నది. 30 అడుగుల ఎత్తు నుంచి వాగు నీళ్లు దుంకి కింద పెద్ద జలాశయంగా ఏర్పడుతాయి. పచ్చని దట్టమైన అడవుల మధ్య కొండకోనల్లో నుంచి హోరెత్తే నీటి హొయల నిండైన జలపాతం బొగత. ప్రకృతి సృష్టించిన అద్భుతమైన అందాల్లో ఇది ఒకటి.

PC:youtube

వెలుగులోకి వచ్చిన మరో అద్భుత జలపాతం!

వెలుగులోకి వచ్చిన మరో అద్భుత జలపాతం!

అక్కడి అడవుల్లోని ఔషదగుణాలను తనలో సంగమించుకుని పెనుగోలువూరు దాటాక,ఆల్బర్ట్ వాగుగా రూపాంతరంచెందుతుంది. అక్కడినుంచి 6కిమీల దూరంలోని గుట్టలను ఒరుసుకుంటూ పారి చీకుపల్లికి అరకిలోమీటర్ దూరంలోని బండరాళ్లమీంచి జాలువారి బొగతజలపాతంగా మారుతుంది.

PC:youtube

వెలుగులోకి వచ్చిన మరో అద్భుత జలపాతం!

వెలుగులోకి వచ్చిన మరో అద్భుత జలపాతం!

అయితే దీనిని బంధాలవాగు అని పిలిచేవారు. బంధాలవాగు బొగతజలపాతంగా మారే ప్రాంతంలో చాలాలోతుగా బండరాళ్లపైనుంచి జాలు వారే తరుణంలో నురగలు క్రక్కుతూ క్రిందికి దూకుతుంది.ఇక్కడి గిరిజనులకు ఇదో పవిత్రమైన చోటు.

PC:youtube

వెలుగులోకి వచ్చిన మరో అద్భుత జలపాతం!

వెలుగులోకి వచ్చిన మరో అద్భుత జలపాతం!

పచ్చనికొండకోనలు,ఊటీని తలపిస్తుంటే కొండకోనలమధ్య నుండి పారే వాగులు అరకును తలపించే విధంగా వుండి ఇక్కడి జలపాతం ప్రపంచంలోనే నెం1గా చెప్పుకునే నయాగరాజలపాతంలో పోల్చదగ్గ ఒక గొప్ప పర్యాటకప్రదేశంగా దీన్ని చెప్పవచ్చు.

PC:youtube

వెలుగులోకి వచ్చిన మరో అద్భుత జలపాతం!

వెలుగులోకి వచ్చిన మరో అద్భుత జలపాతం!

బొబ్బోలుకొడుతూ క్రిందకు పడుతున్న ఈ జలపాతం సోయగాల చాటున పెద్ద చరిత్రనే దాగివుంది. బొగతాజలపాతం అడుగునుండి పాతాళంకు మార్గంవుందని ఇక్కడి ఆదివాసుల అపారనమ్మకం. ఇంకా ఇక్కడ పాండవులు అజ్ఞాతవాసం చేసినప్పుడు,రాముడు ఈ ప్రాంతంలో సంచరించినప్పుడు ఇక్కడే బసచేసి ఇక్కడున్న శివయ్యకు పూజలు చేసారని అంతేకాకుండా ఇక్కడున్న విగ్రహ మూర్తులను స్వయంగా ప్రతిష్టించాడని ఇక్కడి ప్రజలు కధలుకధలుగా చెప్పుకుంటారు.

PC:youtube

వెలుగులోకి వచ్చిన మరో అద్భుత జలపాతం!

వెలుగులోకి వచ్చిన మరో అద్భుత జలపాతం!

ఇదే కాకుండా బొగాతాజలపాతం నల్లందేవి గుట్టనుంచి వచ్చే నీటికి ఔషదగుణాలువుంటాయనేది నమ్మకం. ఈ జలపాతం వున్నచోటున లోటును ఇప్పటివరకూ ఎవ్వరూ అంచనాకూడా వెయ్యలేకపోయారు. కనీసం అక్కడకు వెళ్లేందుకు కూడా ఎవ్వరూ సాహసించలేకపోయారు.

PC:youtube

వెలుగులోకి వచ్చిన మరో అద్భుత జలపాతం!

వెలుగులోకి వచ్చిన మరో అద్భుత జలపాతం!

ఇక్కడినుంచి వుండే సొరంగాలు పాతాళానికి వెళ్ళే మార్గాలని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు.నిజానికి బొగతాజలపాతం చాలా ఏళ్లముందే వునికిలోకొచ్చినా ఎవ్వరూ అక్కడకు వెళ్ళేవారుకాదు.జలపాతంలో దేవతామూర్తులు కోలువైవుంటారని పవిత్రంగా చూసేవారు.

PC:youtube

వెలుగులోకి వచ్చిన మరో అద్భుత జలపాతం!

వెలుగులోకి వచ్చిన మరో అద్భుత జలపాతం!

వాజేడుమండలకేంద్రం నుండి ఆదివాసీలఆవాసాల గుండా 15కిమీ ల ప్రయాణం.ఆ ప్రయాణంనిండా బోలిడన్ని మధురానుభూతులు. ప్రకృతిసౌందర్యాన్ని తనివితీరా ఆస్వాదించవచ్చు.అడవిలో 3కిమీలు ప్రయాణించాక అందమైన సెలయేళ్ళు మనస్సుకు స్వాంతన చేకూరుస్తాయి.

PC:youtube

వెలుగులోకి వచ్చిన మరో అద్భుత జలపాతం!

వెలుగులోకి వచ్చిన మరో అద్భుత జలపాతం!

చెట్లపొదల మధ్యనుంచి అల్లంతదూరాన బొగతాజలపాతం కన్పిస్తుంటే అప్పటిదాకా పడ్డ కష్టందూది పింజలా ఎగిరిపోతుంది. ఒక అనిర్విచనీయమైన అనుభూతి మనస్సును గిలిగింతలు పెడుతుంది.సాక్షాత్తూ ఆకాశగంగే భువికి దిగి వస్తున్నట్టుగా మరులుగొలుపుతుంది.

PC:youtube

వెలుగులోకి వచ్చిన మరో అద్భుత జలపాతం!

వెలుగులోకి వచ్చిన మరో అద్భుత జలపాతం!

బొగతాజలపాతం వద్దనే నరసింహస్వామి పుణ్య క్షేత్రం గూడా వుంది.ప్రతీ ఆదివారం ఇక్కడికి వందలాదిమంది భక్తులు స్వామిని దర్శించి ఇక్కడి ప్రకృతిని,జలపాతాన్ని చూసి మైమరచిపోతుంటారు.

PC:youtube

వెలుగులోకి వచ్చిన మరో అద్భుత జలపాతం!

వెలుగులోకి వచ్చిన మరో అద్భుత జలపాతం!

ఎలా వెళ్ళాలి?

కొత్తగూడెం నుంచి భద్రాచలం మీదుగా వాజేడుకు వెళ్లాలి. వాజేడు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో చీకుపల్లి కాజ్‌వే ఉంటుంది. అక్కడ్నుంచి మరో మూడు కిలోమీటర్లు వెళ్లే బొగత జలపాతం వస్తుంది. ఖమ్మం నుంచైతే 240 కిలోమీటర్లు.

PC:youtube

వెలుగులోకి వచ్చిన మరో అద్భుత జలపాతం!

వెలుగులోకి వచ్చిన మరో అద్భుత జలపాతం!

ఎలా వెళ్ళాలి?

ఖమ్మం జిల్లా వాజేడు మండలంలోని బొగత హైదరాబాద్ నుంచి 440 కిలోమీటర్ల దూరం. వరంగల్ పట్టణానికి 140 కిలోమీటర్ల దూరంలో.. ఏటూరు నాగారం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో బొగత ఉంటుంది. భద్రాచలం నుంచి 120 కిలోమీటర్లు.

PC:youtube

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి