Search
  • Follow NativePlanet
Share
» »పోయిన వస్తువులన్నీ మీ చెంతకుచేర్చే బ్రహ్మ, రుణ బాధలు పోగెట్టే నారాయణుడు ఒకే చోట

పోయిన వస్తువులన్నీ మీ చెంతకుచేర్చే బ్రహ్మ, రుణ బాధలు పోగెట్టే నారాయణుడు ఒకే చోట

కుంభకోణంలోని బ్రహ్మ దేవాలయం గురించి కథనం.

తమిళనాడులోని కుంభకోణంలో ఉన్నన్ని పురాణ ప్రాధాన్యత ఉన్న దేవాలయాలు మరెక్కడా కనిపించవు. అందువల్లే కుంభకోణాన్ని టెంపుల్ టౌన్ అని కూడా పిలుస్తారన్న విషయం తెలిసిందే. అటు వంటి కుంభకోణంలో మనకు అరుదైన బ్రహ్మ దేవాలయం కూడా కనిపిస్తుంది. ఇక్కడ బ్రహ్మ సంకల్ప పూజ చేసి తాను పోగొట్టు కొన్న వేదాలను తిరిగి పొందాడు. అందువల్లే ఈ దేవాలయంలో బ్రహ్మను దర్శించుకొంటే పోయిన వస్తువులన్నీ తిరిగి లభిస్తాయని, దూరమైన వ్యక్తులు దగ్గరవుతారని భక్తుల నమ్మకం. ఇక బ్రహ్మ పోగొట్టుకొన్న వేదాలను తిరిగి పొందగలిగేలా చేసిన నారాయణుడు ఇక్కడ వేద నారాయణుడిగా వెలిసి భక్తుల రుణబాధలను తీరుస్తున్నాడు. ఇక్కడ బ్రహ్మకు ఉన్న నాలుగు ముఖాల్లో ఒకటి గాయిత్రీ దేవి మొహం వలే కనిపిస్తుంది. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ దేవాలయం పూర్తి వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకులైన మీ కోసం

కుంభకోణంలో కూడా బ్రహ్మకు దేవాలయం

కుంభకోణంలో కూడా బ్రహ్మకు దేవాలయం

P.C: You Tube

భారత దేశంలోని పురాణాల ప్రకారం బ్రహ్మకు రాజస్థాన్ లోని పుష్కర్ లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ ఆలయాలు లేవు. అంతేకాకుండా ఆ బ్రహ్మకు పూజలు కూడా లేవు. ఈ క్రమంలోనే టెంపుల్ టౌన్ గా పేరగాంచిన కుంభకోణంలో బ్రహ్మ ఆలయం ఉంది. అయితే అక్కడ ప్రధాన దైవం బ్రహ్మ కాదు. వేద నారాయణుడు. అయినా బ్రహ్మ దేవాలయంగానే ఇది ప్రాచూర్యం పొందింది. ఇదిలా ఉండగా ఒకే ఆలయంలో ఇక విష్ణువు, బ్రహ్మ విగ్రహలు ఉండి పూజలలు అందుకొంటున్న దేవాలయం దేశంలో ఇది ఒక్కటే.

బ్రహ్మకు అహంకారం

బ్రహ్మకు అహంకారం

P.C: You Tube

ఇక పురాణ, స్థానిక కథనం ప్రకారం ఒకానొక సమయంలో బ్రహ్మకు అహం కలిగింది. విష్ణువును రక్షించడం, శివుడికి శిక్షించడం తప్ప మరే విషయం చేతకాదని భావిస్తారు. ఈ సృష్టి లో ఏ జీవి జన్మించాలన్నా తన వల్లే అవుతుందని గర్వంతో విర్రవీగి పోతుంటాడు. దీంతో విశ్వంలో జీవగతులు అదుపుతప్పుతాయి. ఈ పరిమాణంతో భయపడ్డ దేవతలు విష్ణువును శరణు వేడుతాడు.

బుద్ధి చెప్పాలని

బుద్ధి చెప్పాలని

P.C: You Tube

దీంతో విష్ణువు, బ్రహ్మకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని భావిస్తాడు. ఇందు కోసం తన నుదురు నుంచి ఓ రాక్షసుడిని సృష్టిస్తాడు. అతను బ్రహ్మ వద్ద ఉన్న వేదాలను దొంగిలించి తీసుకొని వెళ్లిపోతాడు. దీంతో బ్రహ్మ సృష్టిచే శక్తితో పాటు జ్జానము కోల్పోతాడు. అంతేకాకుండా తన గర్వానికి తగిన శాస్తి జరిగిందని తీవ్రంగా మదనపడుతూ ఉంటాడు. ఇంతలో అటుగా వచ్చిన నారద మహర్షి సహకారం కోరుతాడు.

నారాదముని సూచనమేరకు

నారాదముని సూచనమేరకు

P.C: You Tube

అటు పై నారదముని సూచన మేరకు కుంభకోణం చేరుకొని నారాయణుడిని ప్రసన్నం చేసుకోవడానికి గొప్ప యాగం చేయాలని భావిస్తాడు. హిందూ పురాణాలను అనుసరించి యాగం భార్యా, భర్తలు ఇద్దరూ చేయాలి. దీంతో బ్రహ్మ దేవుడు తన భార్యలైన సరస్వతీ, గాయిత్రీ దేవతలతో యాగం మొదలు పెడుతాడు. అయితే యాగ కుండంలో అగ్ని రాచుకోదు.

హెచ్చు తగ్గులు ఉండకూడదు

హెచ్చు తగ్గులు ఉండకూడదు

P.C: You Tube

యాగం చేసే భార్య, భర్తల్లో హెచ్చు తగ్గులు ఉండకూడదాని భారత దేశం పురాణాలు చెబుతాయి. దీంతో యాగం నిర్విఘ్నంగా కొనసాగడానికి సరస్వతీ దేవి సూచనమేరకు గాయత్రీ దేవి తన కున్న ఐదు తలల్లో ఒక తలల్లో ఒక తన తలను బ్రహ్మ దేవుడికి ఉన్న నాలుగు తలల్లో నిక్షిప్తం చేస్తుంది. దీంతో ఇద్దరికీ నాలుగు తలలు అవుతాయి. ఇలా భార్యా భర్తలు ఇద్దరూ అన్ని విషయాల్లో సమానంగా ఉండి యాగాన్ని నిర్వఘ్నంగా పూర్తి చేస్తాడు.

యాగంతో సంతృప్తి చెందిన విష్ణువు

యాగంతో సంతృప్తి చెందిన విష్ణువు

P.C: You Tube

యాగంతో సంతృప్తి చెందిన విష్ణువు ప్రత్యక్షమయ్యి బ్రహ్మకు వేదాలను తిరిగి ఇవ్వడమేకాకుండా ఆయనకు పోయిన శక్తులన్నీ తిరిగి ఇస్తాడు. అంతే కాకుండా బ్రహ్మకు తిరిగి అహం రాకుండా ఉండేటట్లు విష్ణువు వరమిస్తాడు. అటు పై యాగానికి వచ్చిన మునులు, దేవతలు స్నానం చేయడానికి ఒక నదిని తన గదతో విష్ణువు ఏర్పాటు చేశాడు. దీనిని ప్రస్తుతం అరసలారు నది అని అంటున్నారు.

అరసలారు నది అయ్యింది.

అరసలారు నది అయ్యింది.

P.C: You Tube

దానిని మొదట్లో హరి నది అని పిలిచేవారు. అటు పై ఈ నదిలోనే దేవాలయాలనికి సంబంధించిన వస్తువులను ఆలయ పూజారి శుభ్రపరిచేవాడు. నదిలోని నీరు పాత్రలకు తగిలి హరి...హరి అనే శబ్దం చేస్తూ ఉండేవి. దీంతో పూజారి ఈ నదికి హరి సొల్లారు అని పేరు పెట్టాడు. కాల క్రమంలో అది అరసలారు నది అయ్యింది.

 బ్రహ్మ సంకల్ప యాగం చేసినవారికి

బ్రహ్మ సంకల్ప యాగం చేసినవారికి

P.C: You Tube

అటు పై బ్రహ్మ కోరిక పై బ్రహ్మ సంకల్ప యాగం చేసినవారికి పోయిన శక్తులు, వస్తువుతో పాటు దూరమైన వ్యక్తులు తిరిగి దక్కేటట్టు వరమిస్తాడు. అంతేకాకుండా తాను ఇక్కడ వేద నారాయణుడిగా కొలువుంటానని కూడా ఆ విష్ణువు చెబుతారు. ఇలా ఇక్కడ బ్రహ్మ దేవాలయంతో పాటు విష్ణు దేవాలయం కూడా ఉంది. అంతేకాకుండా ఇక్కడ బ్రహ్మ నరసింహుడిని కొలిచి తన పాపాలన్నీ పోగొట్టుకొన్నట్లు చెబుతారు. అందేవల్లే ఇక్కడ నారసింహుడి విగ్రహం కలిగిన ఉపాలయం ఉంది.

ఆ నాల్గవ మఖం గాయిత్రీ దేవి వలే కనిపిస్తుంది

ఆ నాల్గవ మఖం గాయిత్రీ దేవి వలే కనిపిస్తుంది

P.C: You Tube

ఆలయం మధ్యలో వేదనారాయణుడు దేవేరులతో ఉంటారు. ఆయనకు కుడి వైపున బ్రహ్మ ఉపాలయం ఉంటుంది. అందులో బ్రహ్మకు ఇరువైపులా గాయిత్రీ దేవి, సరస్వతి దేవతలు ఉంటారు. ఇక ఇక్కడ బ్రహ్మ నాల్గవ ముఖంలో గాయిత్రీ దేవి తన ఐదమ ముఖాన్ని నిక్షిప్తం చేసింది. దీంతో ఆ నాల్గవ మఖం గాయిత్రీ దేవి వలే కనిపిస్తుంది.

ముక్కెరను దర్శించుకుంటే

ముక్కెరను దర్శించుకుంటే

P.C: You Tube

దీనిని పూజారి మనకు అద్దంలో చూపిస్తారు. అంతేకాకుండా ఆ ముఖానికి ఉన్న ముక్కెరను దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని చెబుతారు. ఇదిలా ఉండగా ఇక్కడ ఉన్న వేదనారాయణుడు రుణ బాధలను పోగొట్టి వ్యాపారంలో వ`ద్ధి చెందేలా చేస్తాడని భక్తులు నమ్ముతారు. అందువల్లే ఇక్కడ ఉన్న వేదనారాయణుడిని వ్యాపారస్తులు, గ`హ రుణం తీసుకొని సొంత ఇళ్లు కట్టించుకొన్నవారు, బ్యాంకుల నుంచి అప్పుతీసుకొని చిన్నచిన్న వ్యపారాలు చేసిన వారు ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X