» »బ్రిహదీస్వర దేవాలయం - చోళ రాజుల కీర్తి ప్రతిష్టల వైభవం!

బ్రిహదీస్వర దేవాలయం - చోళ రాజుల కీర్తి ప్రతిష్టల వైభవం!

Written By:

తమిళనాడు లోని తంజావూర్ లో కల బ్రిహదీశ్వర టెంపుల్ దాని నిర్మాణ శైలికిశిల్ప సంపాదకు ఎంతో పేరు గాంచింది. ఈ దేవాలయ శిల్ప వైభవానికి సంబంధిన కొన్ని చిత్రాలను సంక్షిప్త వివరణలతో పరిశీలించండి.

వేయి సంవత్సరాల అంద చందాలు.

వేయి సంవత్సరాల అంద చందాలు.

బృహదీశ్వర టెంపుల్ ను చోళ రాజులలో మొదటి రాజ రాజ చోళుడు క్రీ. శ. 1004 మరియు 1009 ల మధ్య నిర్మించాడు. క్రీ. 1010 లో ఈ దేవాలయ ఆవిష్కరణ అతి వైభవంగా జరిగింది. ఇండియా లో ఇది ఒక అతి పెద్ద టెంపుల్ కాగా, దీని నిర్మాణ శైలి చోళుల శిల్ప కళా వైభవాన్ని చాటుతుంది. ఈ దేవాలయం యునెస్కో సంస్థ చే వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది.

ఫోటో క్రెడిట్ : vishwaant

శివ భగవానుడి నివాసం

శివ భగవానుడి నివాసం

బృహదీశ్వర ఆలయం శివ భగవానుడికి అంకితం చేయబడింది. ప్రధాన దైవం శివుడి ని ఈ దేవాలయంలో అర్చిస్తారు.
ఫోటో క్రెడిట్ : Benjamín Preciado

ఇండియాలో అతి పొడవైన టెంపుల్

ఇండియాలో అతి పొడవైన టెంపుల్

ఇండియాలో ఈ టెంపుల్ గోపురం అతి పొడవైనది గాను, టెంపుల్ పూర్తిగా గ్రానైట్ రాతితో నిర్మించబడినది గాను పేరు పొందింది. అయితే, ఆసక్తి కరంగా ఈ దేవాలయ చుట్టుపట్ల ఎక్కడా గ్రానైట్ రాయి లభ్యత కనపడదు. మరి నిర్మానికి ఈ రాయి ని ఎక్కడ నుండి తెచ్చారనేది నేటికీ అంతు పట్టని విషయం. టెంపుల్ యొక్క గోపుర విమానం 216 అడుగురు ఎత్తు మరియు ప్రపంచంలోని అతి పొడవైనది గా చెప్పబడుతుంది.

ఫోటో క్రెడిట్ : varunshiv

గోడలపై చిత్రాలు

గోడలపై చిత్రాలు

ఈ టెంపుల్ నిర్మాణపు రాళ్ళపై ఆకాలం నాటి అనేక చిత్రాలను అతి నైపుణ్యంగా నగిషీలు చెక్కారు. ఈ టెంపుల్ లో చోళ, నాయక వంశాల కాలం నాటి లిఖిత శాసనాలు కలిగి వుంది. ఫోటో క్రెడిట్ :
ఫోటో క్రెడిట్ : Nireekshit

కళా నైపుణ్యం

కళా నైపుణ్యం

టెంపుల్ సముదాయం ఒక నది ఒడ్డున కలదు. వాస్తవానికి ఈ దేవాలయం చుట్టూ పట్టణం ఏర్పడింది.
ఫోటో క్రెడిట్ :varunshiv

నృత్య కళలు

నృత్య కళలు

టెంపుల్ యొక్క బయటి గోడలు మొదటి అంతస్తులోనివి 81 నృత్య చిత్రాలు లేదా భరతనాట్య భంగిమలు కలిగి వుంటాయి.

ఫోటో క్రెడిట్ :varunshiv

నంది విగ్రహం

నంది విగ్రహం

టెంపుల్ ప్రవేశం వద్ద శిలా నంది రెండు మీటర్ల ఎత్తులో ఆరు మీటర్ల పొడవున మరియు రెండున్నర మీటర్ల వెడల్పు తో అందంగా చెక్కబడి సందర్శకులకు కను విందు చేస్తుంది.

ఫోటో క్రెడిట్ : varunshiv

వేయి సంవత్సరాల వైభవ ఉత్సవాలు

వేయి సంవత్సరాల వైభవ ఉత్సవాలు

2010 సంవత్సరంలో ఈ బృహదీశ్వర ఆలయ వేయి సంవత్సారాల ఉత్సవ వేడుకలను అతి వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల గుర్తుగా రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా, భారత ప్రభుత్వం అయిదు రూపాయల నాణెము లను ముద్రించింది. ఈ టెంపుల్ గౌరవార్ధం 1954 సంవత్సరంలో వేయి రూపాయల నోట్లను కూడా ముద్రించింది.

Please Wait while comments are loading...