Search
  • Follow NativePlanet
Share
» » కొడైకెనాల్ వెళ్తున్నారా? అయితే స్వర్గంలాంటి ఈ బ్ర్యాంట్ పార్క్ తప్పక సందర్శించండి..

కొడైకెనాల్ వెళ్తున్నారా? అయితే స్వర్గంలాంటి ఈ బ్ర్యాంట్ పార్క్ తప్పక సందర్శించండి..

తమిళనాడులో వున్న కొడైకెనాల్ హిల్ స్టేషన్ పర్యాటకులకు స్వర్గధామంగా నిలుస్తుంది. ఎత్తైన కొండలు, పచ్చదనం పరచుకున్న లోయలు, అక్కడక్కడా పారుతున్న నదులతో, కొడైకెనాల్ అందాలు చూపరులను కట్టిపడేస్తాయి. 7200 అడుగ

వేసవిలో చల్లదనం కోసం హిల్ స్టేషన్స్ కు వెళ్ళటం అందరూ చేసేదే. అయితే ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళాలంటే కొంత వ్యయప్రయాసలకు లోను కావలసి వస్తుంది. ఎక్కువ రోజులు సమయం కేటాయించవలసి వస్తుంది. అలా కాకుండా కొడైకెనాల్ వంటి ప్రదేశాలను ఎంచుకుంటే సమ్మర్ వొకేషన్ ను ఈజీగా పూర్తిచేసుకుని రావచ్చును. ప్రిన్సెస్‌ ఆఫ్‌ హిల్‌స్టేషన్‌గా పేరుమోసిన కొడైకెనాల్‌, రాష్ట్రంలో ముఖ్యమైన పర్యాటక కేంద్రాల్లో ఒకటి. దిండుగల్‌ జిల్లాలో పర్వత శ్రేణులు, ప్రకృతి అందాల మధ్య అలరిస్తున్న ఈ విహార కేంద్రం, ఊటీ తర్వాత పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తున్న ప్రాంతంగా పేరు తెచ్చుకుంది. ఇది కేవలం రాష్ట్ర, దేశ సందర్శకులనే కాక, విదేశీ సందర్శకులను కూడా అమితంగా ఆకట్టుకుంటోంది.

తమిళనాడులో వున్న కొడైకెనాల్ హిల్ స్టేషన్ పర్యాటకులకు స్వర్గధామంగా నిలుస్తుంది. ఎత్తైన కొండలు, పచ్చదనం పరచుకున్న లోయలు, అక్కడక్కడా పారుతున్న నదులతో, కొడైకెనాల్ అందాలు చూపరులను కట్టిపడేస్తాయి. 7200 అడుగుల ఎత్తులో వుండే కొడైకెనాల్ మండువేసవిలో చల్లదనాన్ని పంచుతుంది. కొడైకెనాల్ కు వెళితే గనక నాలుగైడురోజులు విడిది చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి.

కొడైకెనాల్ తమిళనాడులో, తూర్పు కనుమల్లో వేసవి విడిది

కొడైకెనాల్ తమిళనాడులో, తూర్పు కనుమల్లో వేసవి విడిది

కొడైకెనాల్ తమిళనాడులో, తూర్పు కనుమల్లో నెలకొని ఉన్న అందమైన వేసవి విడిది. భారతదేశంలో పేరు పొందిన వేసవి విడుదుల్లో ఒకటి. కొడై కెనాల్ తమిళనాడు రాష్ట్రానికి దాదాపు నడిబొడ్డుకు దగ్గరగా ఉంది. దీనికి దక్షిణంగా 120 కి.మీ. దూరంలో మదురై, పడమరగా 64 కి.మీ. దూరంలో పళని, ఉత్తరంగా 99 కి.మీ. దూరంలో దిండిగల్ ఉన్నాయి.

హిల్ స్టేషన్స్ లో ప్రసిద్ది చెందినది కొడైకెనాల్లోని బ్ర్యాంట్ పార్క్

హిల్ స్టేషన్స్ లో ప్రసిద్ది చెందినది కొడైకెనాల్లోని బ్ర్యాంట్ పార్క్

అందమైన పర్యాటక ప్రదేశాల్లో..హిల్ స్టేషన్స్ లో ప్రసిద్ది చెందినది కొడైకెనాల్లోని బ్ర్యాంట్ పార్క్. ఆంగ్లేయుల కాలంలో పురుడు పోసుకున్న ఈ సహజ సౌందర్య నిలయాలను ఏడాది పొడవునా పర్యాటకులు సందర్శిస్తూనే ఉంటారు. పర్యాటకులతో ఎక్కువగా రద్దీగా ఉండే బోటానికల్ గార్డెన్ ఇక్కడ ఉంది. ముఖ్యంగా సంవత్సరానికొకసారి మే నెలలో జరిగే హార్టికల్చర్ షో అత్యద్భుతంగా ఉంటుంది. ఇది కొడైకెనాల్ సరస్సుకు తూర్పు భాగంలో ఉంది. ఈ పార్క్ లో అనేక హైబ్రిడ్ మరియు గ్రాఫ్ట్ ను చూడవచ్చు. అలాగే ఈ పార్క్ లో కట్ చేసే వివిధ రకాల పువ్వులను ఎగుమతి చేస్తుంటారు. అందుకు కారణం పువ్వులు ఎక్కువ సమయం మంచి పరిమళాలతో వాడిపోకుండా నిల్వ ఉంటాయి.

PC:Aruna

బ్రిటీష్‌ సైనిక అధికారి గ్లెన్‌ బ్రయంట్‌ 1980లో దీనికి రూపకల్పన

బ్రిటీష్‌ సైనిక అధికారి గ్లెన్‌ బ్రయంట్‌ 1980లో దీనికి రూపకల్పన

ముఖ్యంగా బ్ర్యాంట్ పార్క్ లో ప్రధాన ఆకర్షణగా ఉండే గ్లాస్ హౌస్ చూడకుండా కొడైకెనాల్ పర్యటన పూర్తి కాదు. వివిధ రకాల రంగురంగులప పువ్వులున్నఈ పార్క్ కు మరింత ఆకర్షణను జోడిస్తుంది. ఈ బ్ర్యాంట్ పార్క్ బస్టాండ్ కు తూర్పున అరకిలోమీటర్ దూరంలో ఉంది. ఈ పార్క్ చక్కగా నిర్వహించబడుతున్నది. ఈ పార్క్ ను 1908లో చక్కగా నిర్వహిస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్ హెచ్.డి.బ్ర్యాంట్ పేరుపెట్టారు.బ్రిటీష్‌ సైనిక అధికారి గ్లెన్‌ బ్రయంట్‌ 1980లో దీనికి రూపకల్పన చేశారు. ఈ పార్కుకు చెరువు తూర్పున వుంది. ఇందులో రకరకాల పువ్వులు.. ఇటు హైబ్రీడ్‌, అటు అంటుకట్టు మొక్కలను చూడొచ్చు.

Ishfaq Shams

ధార్మిక ప్రాధాన్యత కలిగిన బోధి చెట్లు

ధార్మిక ప్రాధాన్యత కలిగిన బోధి చెట్లు

ఈ పార్క్ లో వివిధ రకాల పొదలు, యూకలిప్టస్ చెట్లు, కాక్టస్ చెట్లు, ఉన్నాయి. ముఖ్యంగా వింటర్ సీజన్లో ఈ పార్క్ రంగురంగుల పూలతో విస్తరించి ఉంటుంది. ఈ ప్రదేశంలో 1857 నుండి యూకలిప్టస్ చెట్లు, ధార్మిక ప్రాధాన్యత కలిగిన బోధి చెట్లు ఇక్కడ ఉన్నాయి. బోధి చెట్ల వల్ల ఈ పార్క్ కు కొంత ఆధ్యాత్మికత కూడా తోడైంది.

Challiyan

బొటానికల్ గార్డెన్ లో వివిధ రకాల రంగు..రంగుల పూలు చెట్లు

బొటానికల్ గార్డెన్ లో వివిధ రకాల రంగు..రంగుల పూలు చెట్లు

అంతే కాదు, ఈ బొటానికల్ గార్డెన్ లో వివిధ రకాల రంగు..రంగుల పూలు చెట్లు అమ్ముతున్న నర్సరీ కూడా ఉంది. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్పించే కురింజి పూలు కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ పార్క్ లో 350 రకాల చెట్లు740 రకాల గులాబీ మొక్కలను చూసి పరవశించవచ్చు.

Monalisha Ghosh

మే నెలలో నిర్వహించే సమ్మర్ ఫెస్టివల్ ఫ్లవర్ షో

మే నెలలో నిర్వహించే సమ్మర్ ఫెస్టివల్ ఫ్లవర్ షో

అలాగే ఈ పార్క్ లో ప్రతి ఏటా ఉద్యాన ప్రదర్శన మే నెలలో నిర్వహించే సమ్మర్ ఫెస్టివల్ ఫ్లవర్ షో టూరిస్ట్ లను అమితంగా ఆకర్షింస్తుంది. ముఖ్యంగా బొటానికల్ ఇష్టపడే వారికి ఇది ఒక ప్రక్రుతి స్వర్గం అని చెప్పవచ్చు. ఈ ఫ్లవర్ షోను అక్కడి డిపార్ట్మెంటల్ ఆఫ్ ఆర్టికల్చర్ వారు నిర్వహిస్తుంటారు. ఇక్కడ వివిధ రకాల ఆర్గానిక్ వెజిటేబుల్స్ మరియు పువ్వులను అమ్ముతుంటారు. కేవలం మంచు, చలి ఉండే కొండ ప్రాంతాల్లో మాత్రమే పెరిగే పైన్ వృక్షాలు ఇక్కడ ఒక చోట సుమారు ఒక కిలోమీటర్ విస్తీర్ణంలో దట్టంగా పెరిగి ఉన్నాయి. ఇక్కడ చాలా సినిమాల షూటింగ్ జరుగుతుంటాయి.

rajaraman sundaram

ఈ పార్క్ కేవలం పర్యాటకుల సందర్శనార్థం,

ఈ పార్క్ కేవలం పర్యాటకుల సందర్శనార్థం,

ఈ పార్క్ కేవలం పర్యాటకుల సందర్శనార్థం, వినోదానికి మాత్రమే కాదు, చదుకునే వారికి ప్రాక్టికల్ సెంటర్ గా ఆర్నమెంటల్ హార్టికల్చర్ మరియు డెమాన్స్ట్రేషన్ సెంటర్ గా కూడా పనిచేస్తోంది. ఇక్కడ విద్యార్థులకు వివిధ రకాలుగా, వివిధ రకాల పద్దతుల్లో ట్రైనింగ్, ప్రూనింగ్, బడ్డింగ్, గ్రాఫ్టివ్, పాట్టింగ సీడ్స్ ..ఇంకా మరెన్నో విధాలుగా ట్రైనింగ్ ఇస్తుంటారు. వీటన్నింటితో పాటు ఈ ప్రదేశం ప్రశాంత వాతావరణం కోరుకునేవారు, విశ్రాంతి తీసుకోవాలనుకొనేవారు ఈ ప్రదేశం ఫర్ఫెక్ట్ ప్లే .

Jaseem Hamza

కొడైకెనాల్ హిల్ స్టేషన్ లో ఈ పార్క్ తో పాటు మరిన్ని టూరిస్ట్ స్పాట్స్

కొడైకెనాల్ హిల్ స్టేషన్ లో ఈ పార్క్ తో పాటు మరిన్ని టూరిస్ట్ స్పాట్స్

కొడైకెనాల్ హిల్ స్టేషన్ లో ఈ పార్క్ తో పాటు మరిన్ని టూరిస్ట్ స్పాట్స్ కూడా ఉన్నాయి. వాటిలో బేరిజామ్ లేక్, కోకర్ వాక్, కురిజండవార్ టెంపుల్, కొడైకెనాల్ లేక్, గ్రీన్ వాలీ వీ, సూసైడ్ పాయింట్, పిల్లర్ లేక్స్, సైలెంట్ వ్యాలీ వ్యూ, డెవిల్స్ కిచెన్, గుణ కేవ్స్, ఫైన్ ఫారెస్ట్ , శాంతీ వ్యాలీ, సిల్వర్ క్యాస్ కేడ్, టెలీస్కోప్ హౌస్ , కుకల్ కేవ్, శెన్ బగనూర్ మ్యూజియం మొదలగునవి టూరిస్ట్ లను ఆహ్వానిస్తోంది.

Enigmatic1324

ప్రవేశ రుసుం :

ప్రవేశ రుసుం :

ప్రదేశ రుసుం, ఒక్కొక్కరికి రూ.20.

Monalisha Ghosh

సమయం:

సమయం:

ఈ పార్క్ సోమవారం నుండి ఆదివారం వరకు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6గంటల వరు తెచి ఉంటుంది.
అలాగే వర్షాకాలంలో ఈ పార్క్ ను సందర్శించడం అంత సౌకర్యవంతంగా ఉండదు. పార్క్ మొత్తం చుట్టి ప్రక్రుతిని , పువ్వుల పరిమళాలను ఆశ్వాదించాలంటే కనీసం 2 గంటల సమయమైనా పడుతుంది. కాబట్టి వర్షాకాలం అంత అనుకూలంగా ఉండదు. శీతాకాలంలో నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ నెలల్లో ఉష్ణోగ్రతలు ఉన్నా కూడా, చల్లగా ఎంజాయ్ చేసే సమయం ఇక్కడ. ఇది మీకు ఒక మధురానుభూతిని కలిగిస్తుంది.
ఇక మార్చి నుండి మే వరకు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. అప్పుడప్పుడు వర్షాలు కూడా పడటం వల్ల ఈ సమయం కూడా సైట్ సీయింగ్ కు అనుకూలంగా ఉంటుంది.

ఎలా చేరుకోవాలి:

ఎలా చేరుకోవాలి:

కొడైకెనాల్ బ్ర్యాంట్ పార్క్ కు సమీపంలో మదురై ఎయిర్ పోర్ట్ 120కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుండి స్టేట్ సర్వీస్ బస్సులు ఉన్నాయి. అలాగే కొడైకెనాల్లోని సిటీ క్యాబ్స్ ను బుక్ చేసుకోవచ్చు. ఈ పార్ట్ కు 21కిలోమీటర్ల దూరంలో కొడైకెనాల్ బస్టాండ్ ఉంది. రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ట్రైన్ లో ట్రావెల్ చేయాలని కోరుకునే వారికి కొడై రోడ్ కు 80కిలోమీటర్ల సమీపంలో రైల్వే స్టేషన్ ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X