Search
  • Follow NativePlanet
Share
» »టిబెట్ తర్వాత అతి పెద్ద బౌద్ధాలయం బైలకుప్పె..అందులో బంగారంతో చేసిన విగ్రహాలు చూశారా?

టిబెట్ తర్వాత అతి పెద్ద బౌద్ధాలయం బైలకుప్పె..అందులో బంగారంతో చేసిన విగ్రహాలు చూశారా?

టిబెట్ తర్వాత అతి పెద్ద బౌద్ధాలయం బైలకుప్పె..అందులో బంగారంతో చేసిన విగ్రహాలు చూశారా?

కూర్ లేదా కొడుగు పట్టణం కర్నాటకలోని ప్రసిద్ది చెందిన హిల్ స్టేషన్ లో ఒకటి. ఈ ప్రదేశం ప్రధానంగా పర్వతమయం కనుక కూర్గ్ ను 'ఇండియాలోని స్కాట్ లాండ్' గా మరియు కర్నాటకలోని కాశ్మీర్' గా అభివర్ణిస్తుంటారు. పేరుకు తగ్గట్టే కూర్గ్ చరిత్ర కూడా ఎంతో విశిష్టమైనది. ఈ ప్రాంతాన్ని ఎందరో రాజవంశీయులు పరిపాలించారడనికి అనేక చారిత్రక ఆధారాలున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిన ఉణ్న పలు రాజవంశస్తులు అంటే కదంబాలు , గంగాలు, చోళులు, రాష్ట్రకూటులు, హోయసలలు, విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని పాలించిన వారిలో ఉన్నారు.

పచ్చటి అడవుల అందాలను పొగ మంచు మద్యను దాచేసుకుని దోబూచులాడే అడవి అందాలు హనీమూన్ జంటలకు ఎంతో బాగుంటుంది. అలాగే వీకెండ్స్ లో గడపడానికి, ఒకటి రెండు రోజులు సెలవులను ఎంజాయ్ చేయడానికి వచ్చే వారికి కూడా ఇది ఒక చక్కటి ప్రదేశం.

కూర్గ్ లో ప్రధానంగా చూడవల్సిన ప్రదేశాలు చాలానే

కూర్గ్ లో ప్రధానంగా చూడవల్సిన ప్రదేశాలు చాలానే

కూర్గ్ లో ప్రధానంగా చూడవల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నవాటిలో అబ్బే ఫాల్స్, మడికేరి కోటి, మల్లలి ఫాల్స్, టిబెట్ బంగారు దేవాలయం ప్రధానమైనవి. ట్రెక్కింగ్ చేసేవారికి పుష్పగిరి ఫాల్స్, కోటి బెట్ట, నిషాని మోటి ప్రదేశాలు అనుకూలం. ఇక్కడ జలపాతాలను జులై మరియు సెప్టెంబర్ మధ్యలో చూస్తే ఎంతో బాగుంటుంది. అలాగే ఇక్కడి మాన్ సూన్ సీజన్ సాహసప్రియులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో రివర్ రాప్టింగ్ చేయొచ్చు.

Geetha Grandhe

 దక్షిణాదిలోనే అతి పెద్ద టిబెట్ సెటిల్‌మెంట్

దక్షిణాదిలోనే అతి పెద్ద టిబెట్ సెటిల్‌మెంట్

కూర్గ్ సమీపంలో బైలకుప్పె అపే ప్రాంతం ఉంది. ఇది దక్షిణాదిలోనే అతి పెద్ద టిబెట్ సెటిల్‌మెంట్( టిబెట్ దేశీలయుల)నివాస స్థలం. ఇది మడికెరి నుండి 40కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశం టిబెట్ దేశం తర్వాత టిబెటియన్లకు చెందిన అతి పెద్ద వలస స్థావరంగా ప్రసిద్దికెక్కినది.

Ashwin Kumar

ఈ ఆలయంలో బంగారంతో చేసిన విగ్రహాలున్నాయి

ఈ ఆలయంలో బంగారంతో చేసిన విగ్రహాలున్నాయి

ఇక్కడ దాదాపు 20గ్రామాలలో బౌద్దులు నివసిస్తున్నారు. ఇక్కడ అద్భుతమైన ఎన్నో బౌద్ద ఆరామాలు ఉన్నాయి. ముఖ్యంగా బైలకుప్పెలోని అతి పెద్ద బౌద్దాలయం కూడా ఇటు భక్తులను మరియు అటు పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ ఆలయంలో బంగారంతో చేసిన విగ్రహాలున్నాయి. అందుకే దీన్ని గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తుంటారు.

Rahul Nair

టిబెట్ స్థావరాలు

టిబెట్ స్థావరాలు

టిబెట్ స్థావరాలు కాకుండా ఇక్కడ మీరు ప్రసిద్ద నాం ద్రోల్లింగ్ మొనాస్టరీ చూడవచ్చు. ఇక్కడ గోల్డెన్ టెంపుల్ గా పిలవబడే బౌద్దారామంలో మూడు రాగి మరియు బంగారు పూత కల బుద్ధుడి విగ్రహాలు గోల్డెన్ టెంపుల్ లో ఉన్నాయి. ఈ సముదాయంలో ఇంకా ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి. బౌద్ధ సన్యాసినులను మరియు సన్యాసుల వసతులు కూడా ఉన్నాయి. టిబెట్ హస్త కళా వస్తువులతో కొన్ని షాపులు కూడా చూడవచ్చు.

సెరా మొనాస్టరీ : నాం ద్రోలింగ్ మొనాస్టరీకి

సెరా మొనాస్టరీ : నాం ద్రోలింగ్ మొనాస్టరీకి

ఈ ఆరామంలో రెండు శాఖల ఆరామాలున్నాయి. అవి సెరా జీ మరియు సెరా మీ. ఈ మొనాస్టరీలు నాం ద్రోలింగ్ మొనాస్టరీకి సుమారు 3కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ ప్రదేశంలో సందర్శకులు తక్కువ సంఖ్యంలో వస్తుంటారు. ప్రతి రోజూ సాంయంత్రం బౌద్ధ సన్యాసులు ఏదో ఒక అంశంపై చర్చలు చేయటం గమనించవచ్చు.

Photo Courtesy: Ashok666

సెరా మొనాస్టరీ :

Aneezone

ఏమి చేయాలి: ప్రార్థనా చక్రాలు తిప్పవచ్చు

ఏమి చేయాలి: ప్రార్థనా చక్రాలు తిప్పవచ్చు

బలం కలిగి భక్తి ఉన్నవారు అక్కడ కల ప్రార్థనా చక్రాలు తిప్పవచ్చు. ఈ చక్రాల పై ప్రార్థనలు ఉంటాయి. వేరే వారి కష్టాలు తొలగించాలనుకునే వారు వారిని తలుచుకుంటూ ఈ చక్రాలను తిప్పితే, వారి కష్టాలు తొలగిపోతాయని చెబుతారు. టిబెట్ బౌద్ధమతం ఎలా అభివృద్ధి అయిందో వివరిస్తారు.

Photo Courtesy: Bilal M Jafri

మిని టిబెట్ :

మిని టిబెట్ :

మీరు తప్పకుండా ఇక్కడ బైలకుప్పె మిని టిబెట్ ను సందర్శించాల్సిందే. ఇక్కడ నివసించే టిబెటియన్ సన్యాసుల కొరకు తప్పకుండా కొంత భూమిని ఇవ్వాల్సిందిగా అప్పట్లో ప్రైమ్ మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రూ ఆదేశించారు. అందువల్లే ప్రస్తుతం దక్షిణ భారత దేశంలో బైలకుప్పె ఒక అతి పెద్ద టిబెటియన్ సెటిల్మెంట్ గా ప్రసిద్ది చెందినది. ఈ బ్యూటిఫుల్ టౌన్ కలర్ఫుల్ గా కనబడుతుంది.

Richard Allaway

ఫోటోగ్రఫీ:

ఫోటోగ్రఫీ:

ఫోటోగ్రఫీని ఇష్టపడే వారికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం, అద్భుతమైన టెంపుల్ టిబెట్ సన్యాసులు, షాపింగ్ కాంప్లెక్స్, హ్యాండీక్రాఫ్ట్ స్టోర్స్, టిబెటియన్ కాలనీలు, టెబెటియన్ వంటలు వంటి ఫోటోలను కెమెరాల్లో బందించకుండా ఉండలేరు.

షాపింగ్

షాపింగ్

షాపింగ్ కు రెండు మార్కెట్ లు కలవు. ఒకటి కేంప్ 1 కాగా మరొకటి నాం ద్రోల్లింగ్ మొనాస్టరీ మెయిన్ గేట్ వద్ద కలదు. షాపింగ్ తర్వాత, తగిన ధరలో రుచికర భోజనం చేయవచ్చు. ఇక్కడ మొనాస్టరీ కాంప్లెక్స్ వెలుపల రెస్టారెంట్ లు కలవు. పొగ తాగుట , ఆల్కహాలు ఈ మొనాస్టరీ ఆవరణలో నిషేధించ బడ్డాయి.

PC: Brunda Nagaraj

వసతి

వసతి

బైలకుప్పేలో ఉండాలనుకునే వారు ముందుగా ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్ తీసుకోవాలి. చాలామంది సందర్శకులు ఇక్కడ వుండరు. పక్కనే కల కూర్గ్ ప్రదేశానికి వెళ్ళిపోతారు. సమీపంలో కల ఇతర ఆరామాలు చూడాలనుకుంటే, ఇక్కడే ఒక గెస్ట్ హౌస్ కలదు. గదులు చాలా సింపుల్ గా వుంటాయి. టెలివిజన్ కూడా వుండదు.

ఆహారాలు

ఆహారాలు

టిబెట్ రెస్టారెంట్ లు ఇక్కడ సాయంత్రం ఏడు గంటలకు మూసివేస్తారు. కనుక ఆ లోపే మీరు టిబెట్ ఆహారాలు రుచి చూడాలి. నాం ద్రోల్లింగ్ మొనాస్టరీ సమీపంలో రెండు ఇండియన్ రెస్టారెంట్ లు కలవు. ఇవి మాత్రం రాత్రి తొమ్మిది గంటల వరకూ తెరచి వుంటాయి.

Ritesh Man Tamrakar

ప్రశాతం వాతావరణంను గడపడానికి ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు

ప్రశాతం వాతావరణంను గడపడానికి ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు

ప్రశాతం వాతావరణంను గడపడానికి ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు.. ఇది బెంగళూరుకు 214కి.మీల దూరంలో ఉంది. సుమారు 4గంటల రోడ్ ప్రాయాణంలో ఈ ప్రదేశాన్ని చేరుకోవచ్చు. బైలకుప్పె తర్వాత ఇక్కడ ఇంకా, మైసూర్, కూర్గ్, కుశాల్ నగర్, కావేరి నిసర్గదామ, దుబరే ఎలిఫెంట్ క్యాంప్ వంటి ప్రదేశాలు చూడదగ్గవి. కూర్గ్ ను సందర్శించాలంటే, ఆగస్ట్ నుండి నవంబర్ మాసం వరకు అనుకూలంగా ఉంటుంది.

బైలకుప్పెకు ఎలా వెళ్ళాలి:

బైలకుప్పెకు ఎలా వెళ్ళాలి:

బైలకుప్పె బెంగళూరు నుండి కూర్గ్ వెళ్లే మార్గంలో ఉంది. బస్సులు, ఇతర వాహనాలలో రోడ్డ్ మార్గంలో ప్రయాణించవచ్చు. బెంగళూరు నుండి సుమారు 5 గంటలు మంగళూరు నుండి రెండున్నర గంటల ఈ ప్రదేశం చేరవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X