• Follow NativePlanet
Share
» »ఆ ఆలయంలో దేవునికి రూపంలేదట !

ఆ ఆలయంలో దేవునికి రూపంలేదట !

చెట్టినాడ్ తమిళనాడు లోని దక్షిణాన ఉన్నసివగంగై జిల్లాలోని ఒక ప్రాంతం. ఒకప్పుడు 96 గ్రామాల సమూహం గా ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం 74 గ్రామాలు, 2 పట్టణాలను కలిగి ఉంది. 19 వ, 20 వ శతాబ్దంలో ఇక్కడి ప్రజలు బర్మా, సింగపూర్, మలేషియా వంటి తూర్పు ఆసియా ఖండాలకు వలస వెళ్లారని చెబుతారు. అందుకేనెమో రజినీకాంత్ సినిమాలు అక్కడ కూడా ఆడతాయి కాబోలు ! చెట్టినాడ్ 'నట్టుకోట్టై చెట్టియార్స్' కు స్వస్థలం. వీరు వడ్డీలు, వ్యాపారాలు చేస్తుంటారు. ఆహార రుచులకు, కట్టడాలకు మరియు ఆలయాలకు చెట్టినాడ్ ప్రసిద్ధి చెందినది.

చెట్టినాడ్ .. ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది కదూ ! ఆ గుర్తొచ్చిందా బాలకృష్ణ నటించిన పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలో కోడిపుంజు పేరు కదా ! మరి పుంజుకు, చెట్టినాడ్ కు ఏదైనా సంబంధం ఉందా ?? అంటే, అవుననే చెప్పాలి. చెట్టినాడు కోడికూరలకు ప్రసిద్ధి. ఇక్కడ వైవిధ్యభరితమైన కోడి రుచులు రుచి చూడవచ్చు. నాన్ వెజ్ ప్రియులకు చెట్టినాడ్ సూచించదగినది.

ఆ ఆలయంలో దేవునికి రూపంలేదట !

ఆ ఆలయంలో దేవునికి రూపంలేదట !

చెట్టినాడ్ వంటలు

కోడికూర కు ప్రత్యేకమైనది చెట్టినాడ్. ఇక్కడ సూపర్ చెఫ్ లు ఉంటారు. వారు మంచి రుచికరమైన వంటలను తయారుచేస్తారు అలాగే ఉడికించిన గ్రుడ్లు కూడా. మీల్స్ విషయానికి వస్తే అన్నం, పప్పు, మనక్కాయల సాంబార్, వంకాయ కూర, ఉడికించిన కాయగూరలు, నెయ్యి, పాయసం, పెరుగు వడ్డిస్తారు.

చిత్రకృప : Maccess Corporation

ఆ ఆలయంలో దేవునికి రూపంలేదట !

ఆ ఆలయంలో దేవునికి రూపంలేదట !

కట్టడాలు

18 వ శతాబ్దం నాటి భవంతులు, కట్టడాలు చెట్టినాడ్ లో కలవు. లోపల ఇంటీరియర్ మార్బుల్, టేక్ వంటి ఖరీదైన వాటితో డిజైన్ చేసి ఉంటారు. తూర్పు ఆసియా, యూరప్ ఖండాల నుంచి దిగుమతి చేసుకున్న ఫర్నీచర్ లు, పింగాణీ వస్తువులు అదనపు ఆకర్షణలు.

చిత్రకృప : Joelsuganth

ఆ ఆలయంలో దేవునికి రూపంలేదట !

ఆ ఆలయంలో దేవునికి రూపంలేదట !

ట్యాంక్

చెట్టినాడ్ ఆలయాలను చాలా వరకు తమిళరాజ్యాన్ని పాలించిన చేర వంశీయులు నిర్మించారు. వీటన్నింటినీ వాస్తు, ఆగమ శాస్త్రాల ప్రకారం కట్టించారు. ప్రతి ఆలయం 'ట్యాంక్' లేదా 'ఊరని (తమిళంలో)' కలిగి ఉంటుంది.

చిత్రకృప : Koshy Koshy

ఆ ఆలయంలో దేవునికి రూపంలేదట !

ఆ ఆలయంలో దేవునికి రూపంలేదట !

దేవాలయాలు

చెట్టినాడ్ చుట్టుపక్కల మరియు చెట్టినాడ్ లో ప్రసిద్ధి చెందిన ఆలయాలు : వైరవాన్ కోవిల్, ఇరనియుర్, కర్పగా వినాయకర్, కుంద్రకుడి మురుగన్, కొట్టైయుర్ శివన్ మరియు కందనూర్ శివన్ ఆలయాలు చూడదగ్గవి.

చిత్రకృప : Sundaram Ramaswamy

ఆ ఆలయంలో దేవునికి రూపంలేదట !

ఆ ఆలయంలో దేవునికి రూపంలేదట !

అవుదైయార్ కోయిల్

అవుదైయార్ కోయిల్ చెట్టినాడ్ కు 40 కిలోమీటర్ల దూరంలో కలదు. మునిక్కవ్వసక్కర్ ద్వారా 9 వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం 15 వ శతాబ్దంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంది. ఇది శివాలయం. ఇందులో శివుడు ఉండడు, నంది ఉండదు. వేడన్నం లో కాకర కాయల ముక్కలు వేస్తే వచ్చే సెగలే దేవుని నైవేద్యమట.

చిత్రకృప : Sabari Girisan M

ఆ ఆలయంలో దేవునికి రూపంలేదట !

ఆ ఆలయంలో దేవునికి రూపంలేదట !

చీరలు, టైల్స్

స్థానిక కాటన్ చీరలను 'కందాంగి' అని పిలుస్తారు. ఇవి ఎంతో తేలికగా ఉంటాయి. మట్టిని, గ్లాస్ ప్లేట్ ను ఉపయోగించి స్థానికంగా తయారుచేసే టైల్స్ చెట్టినాడ్ లో తప్ప మీరెక్కడా దొరకదు. టైల్స్ ను చేతితో తయారుచేస్తారు.

చిత్రకృప : Jean-Pierre Dalbéra

ఆ ఆలయంలో దేవునికి రూపంలేదట !

ఆ ఆలయంలో దేవునికి రూపంలేదట !

పరిశ్రమలు

చెట్టినాడ్ సిమెంట్ రంగానికి ప్రసిద్ధి చెందినది. ఇక్కడ సెంట్రల్ కెమికల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ను 300 ఎకరాలలో స్థాపించారు. చెట్టినాడ్ పేరుతో సిమెంట్ కర్మాగారం కూడా కలదు.

చిత్రకృప : Balajijagadesh

ఆ ఆలయంలో దేవునికి రూపంలేదట !

ఆ ఆలయంలో దేవునికి రూపంలేదట !

కరైకుడి మధురై ఎయిర్ పోర్ట్, తిరుచిరాపల్లి

అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లు చెట్టినాడ్ సమీపాన కలవు. అక్కడి నుండి కరైకుడి టాక్సీ లేదా క్యాబ్ లలో ప్రయాణించవచ్చు. చెన్నై నుండి రామేశ్వరం వెళ్లే రైళ్లు పుదుకొట్టై, కరైకుడి, చెట్టినాడ్ స్టేషన్ లలో ఆగుతాయి. కరైకుడి నుండి ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు ఎక్కి చెట్టినాడ్ వెళ్ళవచ్చు.

చిత్రకృప : C/N N/G

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి