Search
  • Follow NativePlanet
Share
» »అద్భుత కాఫీ రుచులు - అరకు వాలీ అందాలు !

అద్భుత కాఫీ రుచులు - అరకు వాలీ అందాలు !

దక్షిణ భారత దేశ ప్రజలు సాధారణంగా కాఫీ అంటే ఎంతో ఇష్టం చూపుతారు. కమ్మటి రుచి, మంచి వాసన, చిక్కగా పొగలు కక్కే కాఫీ పట్ల పిల్లలు, పెద్దలు ఎంతో ఆకర్షితులవుతారు.

కాఫీ ఉత్పత్తులలో కర్ణాటక, తమిళ్ నాడు , కేరళ రాష్ట్రాలు ప్రసిద్ధి చెందినవి అయినప్పటికీ, ఆంధ్ర ప్రదేశ్ కూడా ఇపుడు వాటి స్థానాన్ని అందుకోవటానికి కృషి చేస్తోంది. కాఫీ ఉత్పత్తుల రాష్ట్రాలైన 'సెవెన్ సిస్టర్ స్టేట్స్ అఫ్ ఇండియా 'లో ఇది కూడా చేరిపోయింది. భారత దేశపు కాఫీ గింజల ఉత్పత్తి వర్షాధారంగా వుంటుంది. కనుక కొన్నిసార్లు 'ఇండియన్ మాన్సూన్ కాఫీ అని కూడా చెప్పబడుతుంది. మన దేశంలో తప్పించి మరెక్కడా కూడా ఇంత అధిక పరిమాణంలో కాఫీ ఉత్పత్తులు నీడ పట్టున జరగవు. మన దేశంలోని కాఫీ రుచులకు, మరియు ఆధునిక తోటల పెంపక మార్గాలకు గాను మన కాఫీ ఎగుమతులు సుమారు ప్రతి ఏటా 80 శాతం వరకూ వుంటాయి.

అరకు వాలీ లో కాఫీ ఉత్పత్తి.
చరిత్ర
ఇండియా లో అసలు కాఫీ మొక్కల సాగు ఎప్పటినుండి మొదలైందని పరిశోధిస్తే, ఇది, ప్రవక్త బాబా బుడాన్ కాఫీ విత్తనాలను యెమెన్ దేశం నుండి తీసుకు రావటంతో ఇండియా లో కాఫీ మొక్కల సాగు మొదలైంది. సెయింట్ బాబా బూదాన్ తాను పవిత్ర మక్కా యాత్ర ముగించుకొని ఇండియా కు తిరిగి వచ్చేటపుడు, తాను తాగిన కాఫీ అనబడే పానీయా రుచుల అనుభూతిని తన సహచరులతో పంచుకోనకుండా ఉండలేకపోయాడు. ఈ ప్రవక్త పేరుపై ఇప్పటికి కాఫీ ని అధికంగా ఉత్పత్తి చేసే కర్ణాటాక లోని చిక్కమగలూర్ లో ఒక కొండ కూడా కలదు.

అరకు వాలీ కాఫీ ప్రాధాన్యత
విశాఖపట్నం లోని అద్భుత ప్రకృతి దృశ్యాలు కల అరకు వాలీ దక్షిణ ఇండియాలో సినిమా షూటింగ్ లకు ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో అనేకమంది ఆటవిక తెగలవారు నివసిస్తారు.

ఇది ఒక కాలుష్య రహిత ప్రదేశం. మీరు విశాఖపట్నం సందర్సిన్చేటపుడు, అరకు వాలీ తప్పక చూడండి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే కాఫీ గింజలు 'అరకు ఎమరాల్డ్ ' అనే బ్రాండ్ పేరుతో విదేశాలకు మంచి డిమాండ్ తో ఎగుమతి అవుతాయి. ఇండియా లో మొట్ట మొదటి గిరిజన ఉత్పత్తుల ఆర్గానిక్ కాఫీ గా ఈ బ్రాండ్ పేరు పడింది. ఈ కాఫీ ఉత్పత్తిలో ఇక్కడ కల ఆదివాసి తెగ ప్రజల సంక్షేమం ఎంతో కాలంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.

అద్భుత కాఫీ రుచులు - అరకు వాలీ అందాలు !

ఈ కాఫీ సాగు పెంపకంలో వీరికి అవసరమైన ఆధునిక మెళకువలను నాంది ఫౌండేషన్ వారికి శిక్షిణ ఇస్తోంది. ఈ రకంగా అభివృద్ధి చేయబడిన అరకు ఎమరాల్డ్ బ్రాండ్ కాఫీ సహజ సూర్య రశ్మి తో పెరిగి, మంచి నాణ్యత గలదిగా కాఫీ ఉత్పత్తుల ప్రపంచంలోకి అడుగిడింది. దేశ విదేశాల కాఫీ ప్రియులను అలరిస్తోంది.

ఇండియా లో కాఫీ సాగు అక్టోబర్ నుండి మార్చ్ వరకు అనుకూలం. మీరు కాఫీ ప్రియులు అయివుంటే తప్పక అరకు వాలీ సందర్శించి ప్రత్యేక మైన ఈ కాఫీ పెంపకం పరిశీలించండి. ఇటీవలి కాలంలో కాఫీ ప్రాధాన్యత ప్రతి రంగంలోనికి అనుసంధానించ బడింది. ఎంత కళా ప్రియులైనా సరే, ఏ రంగం వారైనా సరే, వారి పనులను ఒక కప్పు కాఫీ తో మొదలు పెట్టాల్సిందే.

అరకు వాలీ ఎలా చేరాలి ?
విశాఖపట్నం నగరానికి సుమారు 114 కి. మీ. ల దూరం లో కల అరకు వాలీ కి రోడ్ మరియు రైలు మార్గాలు సౌకర్యం. ఓడిషా సరిహద్దు లో వుండటం వలన అరకు వాలీ కి ఓడిషా నుండి కూడా టూరిస్ట్ లు వస్తారు.

కాఫీ అనేది మన నిత్య జీవితం లో ఒక భాగం అయింది. సౌత్ ఇండియా లో చాలా మంది ప్రజలు, తమ రోజు ప్రారంభం ను చేతిలో ఒక కప్పు కాఫీ తోను, మరియు ఆ రోజు న్యూస్ పేపర్ తోను మొదలు పెట్టం విశేషం గా చూస్తాము. అరకు వాలీ లోని ఆది వాసి తెగలకు కృతజ్ఞత గా అయినా సరే లేదా అరకు వాలీ అందాలు తనివి తీరా చూసేందుకు అయినా సరే ఈ ప్రాంతాన్ని తప్పక సందర్సించాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X