Search
  • Follow NativePlanet
Share
» »ట్రెక్కింగ్, క్యాంపింగ్ చేయాలంటే దేవకుండ్ వాటర్ ఫాల్ కు వెళ్ళాల్సిందే..

ట్రెక్కింగ్, క్యాంపింగ్ చేయాలంటే దేవకుండ్ వాటర్ ఫాల్ కు వెళ్ళాల్సిందే..

మహారాష్ట్రలో ట్రెక్కింగ్ ప్రదేశాలు, జలపాతాలు పుష్కలంగా ఉన్నాయి . పిక్ నిక్ స్పాట్ లు కూడా ఉన్నాయి. అలాంటి అద్భుతమైన ప్రదేశాల్లో ఒక ప్రదేశం గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీరు ట్రెక్కింగ్, క్యాంపింగ్ , స్విమ్మింగ్ వంటి క్రీడలన్నింటికి అనుకూలంగా ఉంటుంది. ఇవన్నీ మీరు ఒకే ప్రదేశంలో అనుభవించవచ్చు. ట్రెక్కింగ్ కు అనువైన ప్రదేశం దేవకుండ్ .

దేవకుండ్ జలపాతం ఎక్కడ ఉంది

దేవకుండ్ జలపాతం ఎక్కడ ఉంది

దేవకుండ్ జలపాతం మహారాష్ట్రంలోని రాయగడ్ జిల్లాలో భైరాలో ఉంది. రాయగఢ్ లోని దేవకుండ్ జలపాతం ఒక ప్రసిద్ద పర్యాటక ఆకర్షణ మరియు అందమైన పిక్ నిక్ స్పాట్. కుంకులికా నది నుండి ఉద్భవించినట్లు భావిస్తున్న మూడు జలపాతాల కలయికతో దేవకుండ్ జలపాతాలు కలవు.

దేవకుండ్ అంటే దేవీదేవతల స్నానపు తొట్టే అని అర్థం

దేవకుండ్ అంటే దేవీదేవతల స్నానపు తొట్టే అని అర్థం

దేవ్ కుండ్ ఒక చిన్న గ్రామం. దీనికి ఆసక్తికరమైన పురాణకథతో సంబంధం ఉంది. హిందూ పురాణ కథనాలు అనుసరించి విశ్వకర్మను ఒకే రాత్రిలో మూడు ఆలయాలను నిర్మించమని కోరగా అందుకు అంగీకారం తెలిపిన విశ్వకర్మ ఒకే రాత్రిలో మూడు ఆలయాలను నిర్మించి పూర్తి చేసాడు. మూడు ఆలయాలు ఒకే శైలిలో పుష్కరిణి సహితంగా నిర్మించబడి ఉన్నాయి.

దేవకుండ్ అంటే దేవీదేవతల స్నానపు తొట్టే అని అర్థం. బరిపడ వెలుపల సుమారు 60కిలోమీటర్ల దూరంలో ఉంది, ఈ ప్రాంతం ఒక సుందరమైన ప్రదేశం దాదాపు 60కిలోమీటర్ల దూరంలో ఉంది, అలాగే దేవకుండ్ నుండి 25కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉడాల పట్టణంలో ఎంతో ఐకమత్యంతో పండుగలు జరుపుకుంటారు. జనవరిలో జరిగే పంటకోత పండుగ సంక్రాంతి సమయంలో దేవకుండ్ సందర్శించడం ఉత్తమం.జనవరిలోజరిగే పంటకోత పండుగ సంక్రాంతి సమయంలో దేవకుండ్ సందర్శించడం ఉత్తమం. దేవకుండ్ లో ఆధ్యాత్మిక భావంతో జరుపుకునే ఈ పండుగలు, వేడుకలు సందర్శకుల అందరి హృదయాలను చూరగొంటాయి.

ట్రెక్కింగ్ కు మూడు గంటలు

ట్రెక్కింగ్ కు మూడు గంటలు

దేవకుండ్ అసలు గ్రామంలో ట్రెక్కింగ్ కు మూడు గంటలు పడుతుంది. దేవకుండ్ వాటర్ ఫాల్ సందర్శించడానికి అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ జలపాతాల్లో ఆడిపాడవచ్చు, స్నానాలు చేయవచ్చు. ఈ జలపాతాలను పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది అంతే కాదు, విదేశీ పర్యాటకులను కూడా ఎక్కువగా ఆకర్షిస్తుంది.

దేవకుండ్ అసలు గ్రామమైన భిరా

దేవకుండ్ అసలు గ్రామమైన భిరా

దేవకుండ్ అసలు గ్రామమైన భిరా చేరుకున్న తర్వాత మీరు 3 నుండి 4 కిమీ అడుగుల ట్రెక్కీని బిర్రా డ్యాంతో పాటు దట్టమైన అటవీప్రాంతంలో చూడవచ్చు. ఇక్కడ ట్రెక్కింగ్ మార్గంలో నీటి ప్రవాహం మరియు బహిరంగా స్థలం ఉంటుంది. ఫారెస్ట్ లో కాలిబాటలో వెల్లాల్సిందే అలాగే కాలిబాట పొడవున మట్టి , రాతి మార్గాలు ట్రెక్కింగ్ కు కష్టం అవుతుంది.

ట్రెక్కీ బిరాతో మొదలవుతుంది. అక్కడ మీరు అనేక బోర్డ్ లు మరియు చిహ్నాలు చూస్తారు. ట్రెక్కింగ్ ప్రారంభించడానికి ముందే, మీరు భీరా డ్యామ్ రిజర్వాయర్ మీదుగా నడుస్తారు. మీరు కొంత సమయం గడపాలని కోరుకుంటే శిభిరాలను ఎంపిక చేసుకోవచ్చు. 45-50 నిముషాల పాటు నడక సాగించాలి. అలాగే రాఖీ ప్యాచ్ నుండి పది నిముషాల పాటు నడవాలి. దారి పొడవునా దుకాణాలను ఉన్నాయి మరియు నిమ్మరసం అందుబాటులో ఉంటాయి.

భీరా ఆనకట్ట :

భీరా ఆనకట్ట :

బిరీ డ్యామ్ టాటా పవర్ డ్యామ్ అని కూడా పిలుస్తారు. ఈ ఆనకట్ట దేశంలో అత్యంత శక్తివంతమైన జలవిద్యుత్ ప్రాజెక్టులలో ఒకటి. భీరా ఆనకట్ట చుట్టూ ఆకుపచ్చగా అందమై ప్రక్రుతి సౌందర్యం పర్యాటకులను ఆకర్షిస్తుంది. భీరా డ్యాం అద్భుతమైన పిక్నిక్ స్పాట్. ఇక్కడకి పర్యాటకలు సందర్శనగా పిక్న్ ఒక్క రోజు ప్లాన్ చేసుకోవచ్చు. వారాంతంలో మీరు మీ కుటంబ సభ్యులు మరియు స్నేహితులతో వెళ్ళవచ్చు.

దేవకుండ్ జలపాతం మార్గం గుండా

దేవకుండ్ జలపాతం మార్గం గుండా

దేవకుండ్ జలపాతం మార్గం గుండా వెళుతుంటా ఎంతో ఆనందిస్తారు. ఈ జలపాతంకు చేరే మార్గంలో ట్రెక్కింగ్ మరియు హైకింగ్ ఆనందించడానికి మీకు అవకాశం ఉంది. ఇదిమీరు పూర్తి క్యాంపిగ్ తో హ్యాపిగా తిరిగి రావచ్చు. క్యాంపింగ్ చేస్తున్నప్పుడు భోగి మంటలు, లేదా బార్బెక్యూ మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ట్రెక్కింగ్ సమయంలో మాత్రమే శిబిరాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే స్విమ్మంగ్ కూడా మిమ్మల్ని ఆహ్లాదపరుస్తుంది. దేవకుండ్ అడువల అందమైన దృశ్యం మొత్తం పర్యాటన అంతా హ్యాపిగా సాగుతుంది.

దేవకుండ్ సందర్శించడానికి ఏది మంచి సమయం:

దేవకుండ్ సందర్శించడానికి ఏది మంచి సమయం:

వర్షాకాలం ముందు లేదా తర్వాత , మీరు దేవకుండ్ జలపాతం సందర్శించవచ్చు. వర్షాకాలంలో జలపాతాలు నిండిపోతాయి. అలాగే చుట్టు పక్కల గుట్టలు జలధారలతో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. అందువల్ల సెప్టెంబర్ తర్వాత జలపాతాలను సందర్శించడానికి చాలా మంచి సమయం . అలాగే అక్టోబర్ నుండి నవంబర్ మధ్య వరకు ఉంటుంది.

Misc. trains

దేవకుండ్ జలపాతపు లోనావాల నుండి 52కిలోమీట దూరంలో ఉంది.

దేవకుండ్ జలపాతపు లోనావాల నుండి 52కిలోమీట దూరంలో ఉంది. ముంబై నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఈ దేవకుండ్ జలపాతాలున్నాయి. ఇది ముంబై మహానగరంతో పాటు ఇతర ప్రధాన నగారాలు అనుసంధానింపబడినవి. ఇక్కడ నుండి రైలు, విమానాల్లో ముంబై చేరతాయి. ముంబై నుండి లోనావాలా వరకు స్థానికి రైళకళ్ళు మరియు బస్సులు సులభంగా చేరుకోవచ్చు. లోనావాల నుండి ట్యాక్సీ లేదా కాబ్ లను అద్దెకు తీసుకోవచ్చు. లోనావాల నుండి భైరా వరకు స్థానిక బస్సులు అందుబాటులో ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X