» »పేదల ఊటీ ఎక్కడుందో మీకు తెలుసా..

పేదల ఊటీ ఎక్కడుందో మీకు తెలుసా..

By: Venkata Karunasri Nalluru

శ్రీకాకుళాన్ని ఒకప్పుడు "సికాకుళం" అని పిలిచేవారు. దీనిని "పేదల ఊటీ" అని కూడా పిలుస్తారు. శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ లోని ఒక జిల్లా. బంగాళాఖాతం ఒడ్డున కలదు. శ్రీకాకుళంలో అనేక ఆలయాలు కలవు. అంతేకాకుండా ఈ జిల్లాకు ప్రాచీన చరిత్ర కూడా కలదు.

శ్రీకాకుళం చరిత్ర
ఈ ప్రాంతంలో బౌద్ధమతం ఒకప్పుడు బాగా ప్రాచుర్యంలో వుండేది. ఇక్కడ జగతిమెట్ట, శాలిహుండం, దంతపురిజ్ వంటి అనేక బౌద్ధ ఆరామాలు కనుగొనబడ్డాయి. ఆంధ్రప్రదేశ లో నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైంది ఇక్క్దడే.

1. శ్రీ ఉమారుద్ర కోటేశ్వరాలయం

1. శ్రీ ఉమారుద్ర కోటేశ్వరాలయం

ఇక్కడ పర్వతాకారంలో వున్న నందీశ్వరుడు ఏకాంత గణపతితో కొలువై వున్నాడు. ఈ జిల్లలో కోదండరామస్వామి ఆలయం, జుమ్మా మసీదు ప్రసిద్ధి చెందినవి.
PC: Palagiri

2. అరసవల్లిలో సూర్యదేవుని కిరణాల అపురూప దృశ్యాలు

2. అరసవల్లిలో సూర్యదేవుని కిరణాల అపురూప దృశ్యాలు

శ్రీకాకుళం నుండి 3కి.మీ దూరంలో అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణస్వామి దేవాలయం ప్రసిద్ధిచెందినది. ఇక్కడ ఒక సం||లో రెండుసార్లు సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు నేరుగా సూర్యనారాయణస్వామి పాదాలపై పడతాయి. ఈ అపురూప దృశ్యాన్ని చూడటానికి ఆంధ్రప్రదేశ్ భక్తులే కాకుండా ఇతర రాష్ట్రాలలోని భక్తులు కూడా తరలివస్తూ వుంటారు. ఇక్కడ సూర్యభగవానునికి రథసప్తమికి ప్రత్యేక విశేష పూజలు జరుగుతాయి.
PC: Pavanpatnaik

3. శ్రీముఖ లింగేశ్వర దేవస్థానం

3. శ్రీముఖ లింగేశ్వర దేవస్థానం

వంశధార నదీ తీరంలో వెలసిన శ్రీముఖ లింగేశ్వర దేవస్థానం శ్రీకాకుళం నుండి 56 కి.మీ. ల దూరంలో వుంది. ఈ ప్రదేశానికి ఒక చరిత్ర వుంది. శబరుల శివుని కోసం తపస్సు చేస్తే శివుడు విప్ప చెట్టు నుండి ప్రత్యక్షమయ్యి సాక్షాత్కరించాడట. ఇక్కడ గల ఈశ్వరునికి 3 ముఖాలు వుంటాయి. వీటిని వరుసగా సోమేశ్వర, ముఖలింగేశ్వర స్వామి, భీమేశ్వర అనే పేర్లు వాడుకలో వున్నాయి.
PC: Kishore.bannu

4. శ్రీ కూర్మనాధస్వామి దేవాలయం

4. శ్రీ కూర్మనాధస్వామి దేవాలయం

శ్రీ కూర్మనాధస్వామి దేవాలయం శ్రీకాకుళం నుండి 15 కి.మీ. దూరాన గల శ్రీకూర్మం అనే గ్రామంలో వున్నది. ఇక్కడ దేవుడు పశ్చిమ ముఖంగా వుంటారు. ఈ ఆలయంలో గల రెండు ధ్వజస్థంభాల మీద క్రీ.శ. 11 వ శతాబ్ద కాలం నాటి శాసనాలు చెక్కబడి వున్నాయి. ఇక్కడ ఇంకా చూడవలసిన ఇతర దేవాలయాలు: శ్రీ వరదరాజస్వామి ఆలయం, శ్రీ రామానుజాచార్యుల ఆలయం, శ్రీ మధ్వాచార్యుల ఆలయం, కోదండరామస్వామి దేవాలయాలు చూడవచ్చును.
PC: విశ్వనాధ్.బి.కె.

5. కళింగపట్నం

5. కళింగపట్నం

శ్రీకాకుళానికి 25 కి.మీ. దూరంలో వున్న కళింగపట్నం బంగాళాఖాతం ఒడ్డున వున్న ఓడరేవు. ఇక్కడి కళాంజలి సాంస్కృతిక సంస్థ రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచినది. మదీనా సాహెబ్ సమాధి మందిరం ఇక్కడ ప్రాముఖ్యమైనది. ఈ మందిరంలో ముస్లింలే కాకుండా హిందువులు కూడా దర్శించుకొంటారు. ఇక్కడ లైట్ హౌస్ ఒక ఆకర్షణ, దీనిని 1876 సం లో ఆంగ్లేయులు కట్టించారు. ఈ వైట్ హౌస్ ల ఫోకస్ 23 కి.మీ దూరం వరకు పడుతుంది. ఈ ప్రదేశం ఒక మంచి పిక్నిక్ స్థలం.
Photo Courtesy: Antony Colas

6. కన్నులకింపైన తోటలతో కవిటి

6. కన్నులకింపైన తోటలతో కవిటి

ఇచ్చాపురం, సోంపేట అనే రెండు పట్టణాలకు మధ్యలో వుంది కవిటి. ఈ ప్రాంతాన్ని ఉద్యానవనం అంటారు. సముద్రమట్టం నుండి 41 మీటర్ల ఎత్తులో ఉంది. సముద్రతీరానికి సమీపంలో పనస, కొబ్బరి, జీడిమామిడి, తోటలు చూచుటకు ఆహ్లాదకరంగా వుంటుంది. ఈ గ్రామంలో శ్రీ సీతారామస్వామి ఆలయం, చింతామణి అమ్మవారి ఆలయం ముఖ్యమైన ఆలయాలు.
Photo Courtesy: SriHarsha PVSS

7. బారువ తీరం

7. బారువ తీరం

బారువతీరం ఒక సముద్ర తీర ప్రాంతం. ఈ తీరం విశాలమైన ఇసుక తిన్నెలను కలిగి వుంది. సముద్ర స్నానానికి ఇక్కడ అనువుగా వుంటుంది. ఇది శ్రీకాకుళం నుండి 120 కి.మీ దూరంలో వుంది. ఇక్కడ జగన్నాథ ఆలయం, జనార్ధన, కోటిలింగేశ్వర ఇంకా మొదలైన ఆలయాలు వున్నాయి.
PC: Srinu258

8. తేలినీలాపురం

8. తేలినీలాపురం

తేలినీలాపురం టెక్కిలికి 4 కి.మీ దూరంలో వుంది. ఇక్కడ విదేశీపక్షులైన పెలికాన్, సైబీరియా, పెయింటెడ్ స్టార్క్స్ మొదలైన జాతిపక్షులు పిండోత్పత్తిని జరుపుకొనటానికి వస్తాయి. పిల్లలు పెద్దయిన తర్వాత ఏప్రిల్ నెలలో తిరిగి వెళ్ళిపోతాయి. ఈ పక్షులు ఎంత ఎక్కువగా వస్తే పంటలు అంత బాగా పండుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. పక్షులు రావడం తగ్గితే ఏదో కీడు జరుగుతుందని ఇక్కడ వాళ్ళు తరతరాల నమ్మకం. ఈ ప్రాంతం చేరుటకు బస్సు సౌకర్యాలు లేవు. తలగం జంక్షన్ లో దిగి ఒక కిలోమీటర్ నడవాలి. టెక్కిలి నుంచయితే ఆటలలో వెళ్ళవచ్చు.
Photo Courtesy: Satya murthy Arepalli

9. దంతపురి

9. దంతపురి

దంతపురిని దంతవరపు కోట అని కూడా పిలుస్తారు. శ్రీకాకుళానికి 21 కి.మీ ల దూరంలో వుంది. కోటలో 50 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు కలిగిన మట్టిగోడలు వున్నాయి. ఇక్కడ జైన మతం అభివృద్ది చెందినట్లు తెలుస్తుంది. ఇక్కడ అనేక రాతి విగ్రహాలు వున్నాయి.
Photo Courtesy:seshagirirao

10. శాలిహుండం

10. శాలిహుండం

శాలిహుండం శ్రీకాకుళానికి 18 కి.మీ దూరంలో వుంది. ఇది పవిత్ర బౌద్ద యాత్రా స్థలం. శాలిహుండం అంటే ధాన్యం గాదె అని అర్థం, బౌద్ధ సన్యాసులు ఆహారధాన్యాలను నిలవచేసుకునే కేంద్రంగా శాలిహుండం వుండటంతో ఆ పేరు వచ్చిందని చెప్తారు. పురావస్తుశాఖ భద్రపరచిన మ్యూజియంలో వీటన్నింటినీ చూడవచ్చును. ఇక్కడ వంశధారానది ప్రవహిస్తుంది. ఈ నది ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది.

PC: Adityamadhav83

11. జగతిమెట్టు

11. జగతిమెట్టు

పోలాకి మండలంలో దుబ్బకవానిపేట సమీపంలో గల జగతిమెట్ట దగ్గర బౌద్ధమతం యొక్క ఆధారాలు లభించాయి. బౌద్ధ మాట ప్రచారం కోసం జగతిమెట్ట వద్ద శాలిహుండం స్థావరంగా చేసుకొని ఉండేవారని చెప్తారు. అప్పటి వంటగదులు, వంట పాత్రలు తవ్వకాలలో బయటబడ్డాయి. ఆనాటి స్నానవాటికలు ఇప్పుడు చెరువులుగా వున్నాయి.
Photo Courtesy: George Puvvada

12. పాండవుల మెట్ట

12. పాండవుల మెట్ట

పాండవుల మెట్ట శ్రీకాకుళానికి 148 కి.మీ ల దూరంలో ఆముదాల వలస వద్ద కలదు. జనమతస్తులు క్రీ.పూ 3, 4 శతాబ్దాలలో ఇక్కడ నివశించారని తెలుస్తుంది. ఇక్కడ మెట్ట పై భాగంలో అతి పెద్ద రాతిపరుపులు వున్నాయి. ఇంతపెద్ద రాతిపరుపులు ఇంగ్లాండ్ దేశంలో తప్ప ఇంకెక్కడా లేదని పరిశోధకులు తేల్చారు. ఈ పరుపులు క్రింద ఆదివాసుల ప్రార్థనా మందిరాలు కూడా వున్నట్లు తెలుస్తుంది.
Photo Courtesy: Adityamadhav83

Please Wait while comments are loading...