Search
  • Follow NativePlanet
Share
» » పరమశివుడు స్వయంగా ప్రతిష్టించి పూజించిన శివలింగం సందర్శనతో...

పరమశివుడు స్వయంగా ప్రతిష్టించి పూజించిన శివలింగం సందర్శనతో...

తిరువిడైమరుదూర్ లోని మహాలింగేశ్వర దేవాలయం గురించి కథనం.

సాధారణంగా శివలింగాన్ని మహాపురుషులు లేదా రాజులు ప్రతిష్టింపజేసి దానికి ఆలయాలను నిర్మిస్తారు. మరికొన్ని చోట్ల స్వయంభువుగా వెలుస్తుంది. అయితే ఇది కొంత అరుదైన విషయం. ఇదిలా ఉండగా దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒకే ఒక చోట ఆ పరమశివుడు ప్రతిష్టించిన శివలింగం ఒకే ఒక చోట ఉంది.

అంతే కాకుండా ఆయన చాలా ఏళ్లపాటు తపస్సు చేసి అలా వచ్చిన శక్తిని శివలింగంలో ప్రవేశపెట్టాడని చెబుతారు. అందువల్లే ఆ శివలింగం భూమి పై ఉన్న అన్ని శివలింగాల కంటే విశిష్టమైనదని చెబుతారు.ఇక ఇక్కడ అరుదుగా కనిపించే తెల్ల మద్ది చెట్లు మనకు కనిపిస్తాయి.

ఇటువంటి చెట్లు కేవలం శ్రీశైలం మల్లికార్జుని సన్నిధిలో మాత్రమే చూడవచ్చు. ఈ ఆలయం పక్కనే భారత దేశంలో అత్యంత అరుదైన దేవాలయాల్లో ఒకటిగా పేర్కొనే మూకాంబిక దేవి ఆలయాన్ని కూడాచూడవచ్చు. ఇన్ని విశిష్టతలు కలిగిన ఆ ఆలయానికి సంబంధించిన పూర్తి స్థాయి కథనం మీ కోసం.....

కుంభకోణం దగ్గర్లోనే

కుంభకోణం దగ్గర్లోనే

P.C: You Tube

సృష్టి మొదలయ్యినప్పుడు బ్రహ్మ దేవుడు రూపొందించిన కలశం మొదట భూమి పై తాకిన ప్రదేశం కుంభకోణం. అందువల్లే ఈ క్షేత్రాన్ని అతి పవిత్రమైన ప్రాంతంగా హిందూ పురాణాల్లో పేర్కొంటారు.
అటువంటి కుంభకోణం దగ్గర్లోనే తిరువిడైమరుదూర్ అనే పుణ్యక్షేత్రం ఉంది.

పురాణాల్లో

పురాణాల్లో

P.C: You Tube

ఈ క్షేత్రం గురించి భారతీయ పురాణాల్లో పేర్కొనబడింది. ఇక్కడే పరమశివుడు రాబోయే కాలంలో భక్తులు సేవించుకోవడానికి వీలుగా ఒక పెద్ద శివలింగాన్ని సృష్టించి, ఆ శివలింగానికి శక్తిని ప్రసాదించడానికి

శివుడు తపస్సు చేసి

శివుడు తపస్సు చేసి

P.C: You Tube

అలా తపస్సు చేయగా వచ్చిన శక్తిని ఆ శివలింగంలో ప్రవేశపెట్టాడని పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే ఈ శివలింగానికి అంతటి శక్తి అని చెబుతారు. ఇక్కడ ఉన్న శివలింగాన్ని మహాలింగస్వమి అని పిలుస్తారు.

మధ్యలో ఉంటుంది.

మధ్యలో ఉంటుంది.

P.C: You Tube

ఈయన ఈ ప్రాంతంలోని అన్ని శివాలయాలుకు, సప్త విగ్రహ మూర్తులకు మధ్యలో కొలువుతీరి ఉన్నాడు. చిదంబరంలోని ఉన్న నటరాజ స్వామి ఆలయంలోని నటరాజు, తిరు చెంగళూరులోని చండికేశ్వరుడు, తిరువలంజులిలోని వైట్ వినాయకుడు, స్వామిమలై లో ఉన్న సుబ్రహ్మణ్యస్వామి, నవగ్రహాలయాల్లో ఉన్న సూర్యుడు, అలాన్ దేవాలయంలోని దక్షణామూర్తి.

నాలుగు దిక్కుల్లో

నాలుగు దిక్కుల్లో

P.C: You Tube

ఇక ఈ దేవాలయానికి చుట్టూ నాలుగు దిక్కుల్లో నాలుగు దేవాలయాలు ఉన్నాయి. అవి తూర్పు వీధిలో విశ్వనాథుడు, పడమట ఉన్న బుుషిపురేశ్వరుడు, దక్షిణ వీధిలో ఉన్న ఆత్మనాధుడు, వీధిలో ఉన్న
చొన్ననాధుడు. ఇంతటి విశిష్టమైన దేవాలయం వల్ల దీనిని అందువల్ల హిందువులు ఈ క్షేత్రాన్ని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తారు.

నంది చాలా పెద్దది

నంది చాలా పెద్దది

P.C: You Tube

ఆలయ మండపంలో ఉన్న నంది చాలా పెద్దదిగా ఉంటుంది. అయితే దీనిని ఒకే శిలతో చేయబడలేదు. అందువల్ల అంత బరువుగా ఉండదని చెబుతారు. ఈ మహాలింగస్వామికి భక్తితో ప్రదక్షిణ చేస్తే ఏవిధమైన మానసిక బాధలైనా తొలిగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వివాహం, పిల్లలు కావాల్సిన వారు ఎక్కువ మంది ఈ క్షేత్రాన్ని సందర్శిస్తూ ఉంటారు.

ప్రవేశ ద్వారం నుంచి

ప్రవేశ ద్వారం నుంచి

P.C: You Tube

ఈ ఆలయంలో ప్రవేశ ద్వారం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్లరు. ఒకవేళ అలా చేస్తే బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుందని చెబుతారు. ఇందుకు సంబంధించి ఒక కథనం ప్రచారంలో ఉంది. ఒకసారిపాండ్య రాజు వరుగుణ పాండ్యన్ అడవిలో వేటకి వెలుతాడు.

ప్రవేశ ద్వారం నుంచి

ప్రవేశ ద్వారం నుంచి

P.C: You Tube

ఈ ఆలయంలో ప్రవేశ ద్వారం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్లరు. ఒకవేళ అలా చేస్తే బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుందని చెబుతారు. ఇందుకు సంబంధించి ఒక కథనం ప్రచారంలో ఉంది. ఒకసారి పాండ్య రాజు వరుగుణ పాండ్యన్ అడవిలో వేటకి వెలుతాడు.

పాండ్యరాజు

పాండ్యరాజు

P.C: You Tube

తిరిగి వచ్చే సమయంలో చీకటి పడుతుంది. ఆ చీకట్లో అతని గుర్రం ఒక బ్రాహ్మణుడి మీదుగా వెళ్లి అతిని చావుకు కారణమవుతుంది. దీంతో అతనికి బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుంది. శివ భక్తుడైన పాండు రాజు శివుడిన ప్రార్థిస్తాడు.

శివుడు కలలలో కనిపించి

శివుడు కలలలో కనిపించి

P.C: You Tube

శివుడు కలలో కనిపించి తిరువిడైమరుదూర్ వెళ్లి శివలింగాన్ని దర్శించుకోవాల్సిందిగా సూచిస్తాడు. దీంతో రాజు తిరువిడైమరుదూర్ వెళ్లి తూర్పు ద్వారం గుండా ఆలయ ప్రవేశం చేస్తాడు. అతన్ని అన్ని చోట్లకు
వెంటాడుతున్న బ్రహ్మహత్యా దోషం పవిత్రమైన శివాలయంలోకి రాలేక తూర్పు ద్వారం వద్దనే ఉండి పోతుంది.

బ్రహ్మహత్య దోషం

బ్రహ్మహత్య దోషం

P.C: You Tube

ఇక రాజు శివుడిని ఆరాధించే సమయంలో ఒక అశరీర వాణి వినిపిస్తుంది. తూర్పు ద్వారం నుంచి కాక వేరే ద్వారం గుండా వెళ్లమని సూచిస్తుంది. రాజు అలాగే చేస్తాడు. దీంతో ఇప్పటికీ ఆ బ్రహ్మహత్య దోషం అక్కడే ఉందని లోనికి వెళ్లిన వారు ఎవరైనా ఈ ద్వారం గుండా వస్తే బ్రహ్మహత్య దోషం వారికి చుట్టుకుంటుందని చెబుతారు.

మధ్యార్జునం

మధ్యార్జునం

P.C: You Tube

ఈ పవిత్రక్షేత్రానికి మధ్యార్జునం అని కూడా పేరు. ఉత్తరంలో ఉన్న శ్రీశైల మల్లికార్జునిడికి, దక్షిణాన ఉన్న తిరుపుట్టైమరుదూరుకు మధ్యన ఉండటం వల్ల ఈ క్షేత్రాన్ని మధ్యార్జునం అని అంటారు. అర్జునం అంటే మద్ది చెట్టు. ఈ మూడు క్షేత్రాల్లో మాత్రమే అత్యంత అరుదైన మద్ది చెట్టును మనం చూడగలం.

మూకాంబిక దేవాలయం

మూకాంబిక దేవాలయం

P.C: You Tube

ఇక ఈ ఆలయం పక్కనే మనకు భారత దేశంలో అత్యంత ఆలయాల్లో ఒకటిగా చెప్పబడే మూకాంబిక అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. అమ్మవారు పద్మాసనంలో కూర్చొన్న స్థితిలో మనకు కనిపిస్తుంది. మూకాసురుణ్ణి చంపడం వల్ల వచ్చి బ్రహ్మ హత్యా దోషం పోవడానికి ఇక్కడ తపస్సు చేసినట్లు స్థలపురాణం చెబుతుంది.

సంతానం కోసం

సంతానం కోసం

P.C: You Tube

కర్నాటకలోని మూకాంబిక దేవి ఆలయం వలే ఈ ఆలయం కూడా చాలా ప్రాముఖ్యం కలిగినది. ఈమెను చాలా శక్తికల దేవతగా ప్రజలు భావిస్తారు. ఇక్కడ బ్రహ్మ హత్య దోషం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతే కాకుండా పిల్లల కోసం, సుఖ ప్రసవం కోసం ఈ దేవిని స్థానిక భక్తులు పూజిస్తారు.

చోళరాజులు

చోళరాజులు

P.C: You Tube

ఈ ఆలయం చాలా విశాలమైనది. ఈ ఆలయాన్ని చోళరాజులు 9వ శతాబ్దంలో నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు గోపురాలతో అలరారే ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని పెద్ద ఆలయాలలో ఒకటి. చోళ
రాజులతో పాటు ఈ ఆలయాన్ని పాండ్యులు, తంజావూర్ నాయక రాజులు, తంజావూర్ మరాఠాలు అభివ`ద్ధి చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X