Search
  • Follow NativePlanet
Share
» » నారసింహుడిని ఓడించిన ఈ దేవుడిని పూజిస్తే చేతబడి...

నారసింహుడిని ఓడించిన ఈ దేవుడిని పూజిస్తే చేతబడి...

తమిళనాడులోని తిరుభువనంలో ఉన్న శరభేశ్వర దేవాలయం గురించి కథనం.

దక్షిణాది రాష్ట్రాల్లో ప్రచారంలో ఉన్న కొన్ని పురాణ కథనాలకు, ఉత్తరాదిలో ఉన్న అదే కథనాలకు కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. అయితే ఒక దేవుడి విషయంలో మాత్రం తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ప్రాచూర్యంలో ఉన్న కథనాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కథనాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది.

అటువంటి పురాణ కథనమే మనకు హిరణ్యకశిపుడిని సంహరించిన నారసింహుడి విషయంలో వ్యక్తమవుతుంది. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ప్రాచూర్యంలో ఉన్న కథనాలను అనుసరించి హిరణ్యకశిపుడి సంహరించిన నారసింహుడి రూపంలో ఉన్న విష్ణవు తీవ్ర రౌద్రంగా ఉంటాడు.

అతని రౌద్రాన్ని చెంచు లక్ష్మి కాక త్రిమూర్తుల్లో ఒకరు తగ్గిస్తారు. ఆ రూపం విచిత్రంగా ఉంటుంది. అటువంటి రూపానికి దేవాలయం కూడా ఉంది. అరుదైన అటు వంటి దేవాలయంతో పాటు ఆ రూపానికి సంబంధించిన పూర్తి స్థాయి కథనం మీ కోసం...

 రక్తం వల్ల మరింత రౌద్రంగా

రక్తం వల్ల మరింత రౌద్రంగా

P.C: You Tube

హిరణ్యకశిపుడిని సంహరించడానికి విష్ణుమూర్తి నరసింహావతారం ఎత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హిరణ్యకశిపుడి రక్తం అమ`తం తాగిన విష్ణుమూర్తి శరీరం పై పడుతుంది. దీంతో ఆయన మరింత రౌద్రంగా తయారవుతాడు.

తిరిగి భూమి పై పడితే

తిరిగి భూమి పై పడితే

P.C: You Tube

మరో వైపు విష్ణువు శరీరం పై పడిన రక్తం తిరిగి భూమి పై పడితే అనేక మంది హిరణ్యకశిపుళ్లు పుట్టి వారికి మరణం అంటూ ఉండదని దేవుళ్లు భయపడుతారు. ఈ సమస్య నుంచి గట్టెక్కించాల్సిందిగా అందరూకలిసి ఆ పరమశివుడిని వేడుకొన్నారు.

విచిత్ర రూపం

విచిత్ర రూపం

P.C: You Tube

దీంతో పరమశివుడు విచిత్ర రూపం దాల్చాడు. మానవ శరీరం, గరుడి మొహం రెక్కలు, సింహపు కాళ్లు, తోక కలిగి ఉంటాడు. అంతే కాకుండా ఎనిమిది చేతులు, ఎనిమిది కాళ్లతో చూడటానికి చాలా భయంకరంగా ఉంటాడు.

ఒక దానిలో ప్రత్యంగరా దేవి

ఒక దానిలో ప్రత్యంగరా దేవి

P.C: You Tube

ఇక ఆ రెండు రెక్కల్లో ఒకటి ప్రత్యంగరాదేవి, మరో రెక్కలో శూలిని దుర్గను ఆవాహన చేసి ఉంటాడు. అటు పై ఉగ్ర రూపంతో ఉన్న నరసింహుడిని ఆకాశంలోకి తీసుకువెళుతాడు. భూమ్యాకర్షణ శక్తి పనిచేయనంత ఎత్తుకు తీసుకువెళుతాడు.

 పరమేశ్వరుడు గెలుస్తాడు

పరమేశ్వరుడు గెలుస్తాడు

P.C: You Tube

అక్కడ వీరిద్ధరికీ ఘోర యుద్ధం జరుగుతుంది. దీనిలో శరభేశ్వరుడి రూపంలో ఉన్న పరమేశ్వరుడు విజయం సాధించి నరసింహుడి శరీరాన్ని నొక్కుతాడు. దీంతో అతని శరీరం పై ఉన్న చెడు రక్తం మొత్తం బయటికి వస్తుంది.

భూమ్యాకర్షణ శక్తి

భూమ్యాకర్షణ శక్తి

P.C: You Tube

అయితే అక్కడ భూమ్యాకర్షణ శక్తి ఉండదు కాబట్టి ఆ రక్త భూమి పై పడకుండా అలాగే ఉండిపోతుంది. ఇక చెడు రక్తం తన శరీరం పై నుంచి వెళ్లిపోయిన వెంటనే ఆ నరసింహుడు శాంతించి అక్కడే శివుడిని పూజించాడని పురాణ కథనం.

 చాలా అరుదైన ఆలయం

చాలా అరుదైన ఆలయం

P.C: You Tube

ఈ శరభేశ్వరుడికి కేవలం చాలా అరుదుగా మాత్రమే దేవాలయాలు ఉన్నాయి. అటు వంటి దేవాలయం తిరుభువనం లో ఉంది. కాగా శరభేశ్వరుడిని పూజిస్తే ఒకేసారి శివుడు, కాళి, దుర్గ, విష్ణు వును పూజించిన
ఫలం దక్కుతుందని మన పురాణాలు చెబుతున్నాయి.

చేతబడి బలాదూర్

చేతబడి బలాదూర్

P.C: You Tube

ఇక ఈ శరభేశ్వరుడిని పూజించడం వల్ల ఆరోగ్యం, కోర్టు విషయాల్లో చికాకులు తప్పిపోతాయని చెబుతారు. ముఖ్యంగా చేతబడి, గ్రహస్థితుల వల్ల కలిగే దోషాలు తొలిగిపోతాయని చెబుతారు. ఇక ముఖ్యంగా 11 వారాల పాటు శరభేశ్వరుడి యాగం చేయడం వల్ల తెలియని శత్రువుల నుంచి వచ్చే ముప్పు తప్పుతుందని భక్తుల నమ్మకం.

కంపహరేశ్వర దేవాలయం

కంపహరేశ్వర దేవాలయం

P.C: You Tube

ఇక తిరుభువనంలోనే మనకు కంపహరేశ్వరుడి దేవాలయం కూడా ఉంది. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. ఈ శివుడిని పూజించడం వల్ల నరాల బాధలన్నీ తగ్గుతాయని చెబుతారు. ఒణుకు, అర్థం లేని భయాలు, మెదడు సరిగా ఎదగక పోవటం మొదలైన అనేక బాధల నుంచి విముక్తి లభిస్తుందని స్థానిక భక్తుల నమ్మకం.

మహాలింగేశ్వరుడిని

మహాలింగేశ్వరుడిని

P.C: You Tube

పాండ్యరాజైన వరగుణ పాండ్యన్ బ్రాహ్మణుడిని చంపడం వల్ల బ్రహ్మ హత్యా దోషం పట్టుకుంటుంది. దీంతో ఆ రాజు ఆ పరమశివుడి సూచన మేరకు కుంబకోణం దగ్గర్లో ఉన్న మహాలింగేశ్వరుడి సందర్శిస్తాడు.

 ఆలయం బయటే

ఆలయం బయటే

P.C: You Tube

అయితే బ్రహ్మహత్యా దోషం ఆలయంలోకి ప్రవేశించలేక ఆ మహాలింగేశ్వరం దేవాలయం తూర్పు వాకిలి బయటే ఉండిపోతుంది. అయితే దైవ దర్శంన తర్వాత వేరే వాకిలి నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా ఆ వరగుణ పాండ్యన్ ఆ దోషం తనని ఎక్కడ తిరిగి పట్టుకుంటుందోనని భయంతో వణుకుతూనే ఉంటాడు.

 అందువల్లే కంప హరేశ్వర లింగం

అందువల్లే కంప హరేశ్వర లింగం

P.C: You Tube

తిరిగి ఆ పరమేశ్వరుడి సూచన మేరకు ఇక్కడ ఉన్న శివలింగాన్ని పూజించడం వల్ల ఆ భయం పూర్తిగా రూపుమాసి పోతుంది. అందువల్లే ఈ శివలింగాన్ని కంపహరేశ్వర లింగం అని అంటారు. ఈ ఆలయం విశాలమైనది.

అనేక ఉపాలయాలు

అనేక ఉపాలయాలు

P.C: You Tube

ఈ ఆలయంలో భిక్షాటన మూర్తి, లింగోద్భవ మూర్తి, దక్షిణామూర్తి, బ్రహ్మ, దుర్గ మొదలైన దేవాతల విగ్రహాలెన్నో ఉన్నాయి. ఇక ఆలయంలో ఉన్న శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని కులోత్తుంగ చోళుడు-3 కట్టించాడు.

అరుదైన ద్రావిడ శైలి

అరుదైన ద్రావిడ శైలి

P.C: You Tube

ఆలయ నిర్మాణం ద్రావిడ శైలిలో ఉంటుంది. అయితే ఒక్క ఆలయ విమానం, రాజగోపురం నిర్మాణంలో ఆ శైలి కనిపించదు. ఆలయ విమానం ఎత్తు రాజ గోపురానికంటే ఎత్తులో ఉంటుంది. ఇది ద్రావిడ శైలి ఆలయ నిర్మాణానికి విరుద్ధం.

 పట్టు చీరలకు

పట్టు చీరలకు

P.C: You Tube
ఇటు వంటి నిర్మాణం కొన్ని దేవాలయాల్లో మాత్రమే మనం చూడగలం. ఇక ఆలయం కుంభకోణం-మైలాదుతురై మధ్యన ఉంటుంది. ఆలయం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకూ తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకూ తెరిచి ఉంటుంది. ఇక ఈ తిరుభువనం పట్టుచీరలకు చాలా ప్రాచూర్యం చెందినది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X