Search
  • Follow NativePlanet
Share
» »ఇంద్రుడి శరీరం పై ఉన్న ‘యోని’ లను తొలగించి శుచి చేసిన క్షేత్రం

ఇంద్రుడి శరీరం పై ఉన్న ‘యోని’ లను తొలగించి శుచి చేసిన క్షేత్రం

భారతదేశంలో శుచీంద్రంలో ఉన్న ధనుమలయన్ ఆలయం మూలవిరాట్టు రూపం మరెక్కడా మనకు కనిపించదు. ఒకే విగ్రహంలో శివుడు, విష్ణువు, బ్రహ్మ దేవుళ్లను మలిచిన తీరు మనకు అబ్బుర పరుస్తుంది.

శుచీంద్రం దత్తాత్రేయ క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందినది. ఆది శంకరాచార్యలు ఈ శుచీంద్ర పుణ్యక్షేత్రాన్ని సందర్శిచినప్పుడు పరమశివుడి తాండవ నృత్యాన్ని ప్రత్యక్షంగా చూశాడని చెబుతారు.

ఆ పరమేశ్వరుడు స్వయంగా ప్రణవ మంత్రాన్ని ఆది శంకరాచార్యలుకు ఈ శుచీంద్రం పుణ్యక్షేత్రంలోనే ఉపదేశించాడని పురాణ కథనం. ఇక్కడ ప్రతి ఏడాది జరిగే రథోత్సవం చూడటానికి దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో పర్యాటకులు ఈ శుచీంద్రం పుణ్యక్షేత్రానికి వస్తారు. ఇంతటి విశిష్టమైన పుణ్యక్షేత్రానికి సంబంధించిన వివరాలతో కూడిన కథనం మీ కోసం..

ఎన్నో కథలు

ఎన్నో కథలు

P.C: You Tube

శుచీంద్రాంతో ముడిపడిన ఎన్నో పురాణ, ఇతిహాస గాధలు మనకు వినిపిస్తాయి. అందులో ఒకటి ఇంద్రుడు తన శాపాన్ని పోగొట్టుకొని శుచిగా మారిన ప్రాంతమే అటు పై శుచీంద్రంగా మారిందని చెబుతారు. భారతీయ పురాణాలను అనుసరించి ఇంద్రుడు గౌతమి భార్య అహల్య పై కన్నేస్తాడు.

సూర్యోదయానికి ముందే

సూర్యోదయానికి ముందే

P.C: You Tube

ఒక రోజు రాత్రి సూర్యోదయానికి ముందు గౌతముడు నివశిస్తున్న పర్ణశాల వద్దకు వెళ్లి కోడి రూపంలో కూత వేస్తాడు. గౌతముడు తెల్లవారిందనుకొని దగ్గర్లోని నదికి స్నానం చేయడానికి వెలుతాడు. ఇదే సమయంలో ఇంద్రుడు అహల్య చెంతకు చేరుతాడు.

అహల్య

అహల్య

P.C: You Tube

వచ్చినవాడు తన భర్త అనుకొని అహల్య ఇంద్రుడి ఒడిలో సేదదీరుతూ ఉంటుంది. అయితే నదికి వెళ్లిన గౌతముడికి సూర్య భగవానుడు కనిపించడు. దీనితో తిరిగి తన పర్ణశాలకు తిరిగి వచ్చేస్తాడు. అయితే అక్కడ ఇంద్రుడు తన భార్య చెంత ఉండటం చూసి ఆగ్రహం చెందుతాడు.

శరీరం మొత్తం యోనిల మయం

శరీరం మొత్తం యోనిల మయం

P.C: You Tube

దీంతో కామంతో మహర్షి భార్య చెంతకు చేరిన ఇంద్రుడి ఒంటి పై మొత్తం ‘యోని'లు మొలవాలని శపిస్తాడు. దీంతో ఇంద్రుడు అత్యంత అందవికారంగా తయారవుతాడు. జరిగిన దానికి చింతించిన ఇంద్రుడు తనకు శాప విముక్తి కలిగించాలని త్రిమూర్తులను వేడుకొంటారు.

ఒక విగ్రహం పై

ఒక విగ్రహం పై

P.C: You Tube

వారి సూచన పై ఒకే రాతి పై త్రిమూర్తులను చెక్కి ఆ విగ్రహన్ని శుచీంద్రంలో ప్రతిష్టిస్తాడు. అటు పై ఆ విగ్రహం ముందు ఉన్న తీర్థంలో ప్రతి రోజూ స్నానం చేసి నిష్టతో ఆ విగ్రహానికి పూజలు చేస్తాడు. దీంతో అతని శరీరం పై యోని లన్నీ తొలిగిపోయి అతను శుచిగా మారి శాప విముక్తుడవుతాడు.

మరో కథనం ప్రకారం

మరో కథనం ప్రకారం

P.C: You Tube

అందువల్లే ఈ క్షేత్రానికి శుచీంద్రమని పేరు. మరో కథనం ప్రకారం త్రిమూర్తులను అత్రి భార్య అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించాలని ములసి బ్రాహ్మణుల వేశంలో వారింటికి భిక్షకు వస్తారు. తమకు ఒక ఆచారం ఉందని చెప్పి దాని ప్రకారం నడుచుకొంటే భిక్ష స్వీకరిస్తానని చెబుతారు.

నగ్నంగా

నగ్నంగా

P.C: You Tube

తమకు భిక్ష ఇచ్చేవారు నగ్నంగా ఉండలని షరత్తు పెడుతారు. దీంతో అనసూయ తన తప:శక్తితో వారిని చిన్న బిడ్డలుగా మార్చి ఊయ్యాలలో వేస్తుంది. అటు పై లక్ష్మీ, పార్వతి, సరస్వతులు వచ్చి ఆమెను వేడుకొనగా తిరిగి వారిని మామూలు రూపంలోకి తీసుకువస్తుంది. ఈ విషయం జరిగినది ఈ సుచీంద్రంలోనేనని చెబుతారు.

అద్భుత శిల్ప సంపద

అద్భుత శిల్ప సంపద

P.C: You Tube

ఇక ఈ దేవాలయంలోని అద్బుత శిల్పకళ మన మనసులను దోస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆలయంలోని అలంకార మండపం చాలా అందంగా ఉంటుంది. ఇందులో నాలుగు పెద్ద రాతి స్తంభాలు

వాటికి అనుబంధ స్తంభాలతో ఏక రాతి నిర్మితం ఈ అలంకార మంటపం. ఇక్కడ రెండు స్తంభాలకు ముప్పై మూడు చిన్న స్తంభాలు కలిసి ఉంటాయి.

సంగీత స్వరాలు

సంగీత స్వరాలు

P.C: You Tube

అదే విధంగా మరో రెండు స్తంభాలకు ఇరవైఐదు చిన్న స్తంభాలు జత చేయబడి ఉంటాయి. ఇవన్నీ సంగీత స్తంభాలే. ఏ స్తంభాన్ని మీటినా సంగీత స్వరం వినిపించడం ఈ అలంకార మంటపం ప్రత్యేకత. ఒక్కొక్క స్తంభం నుంచి ఒక్కొక్క రకమైన సంగీత ధ్వని వినిపిస్తుంది.

18 అడుగుల రాతి విగ్రహం

18 అడుగుల రాతి విగ్రహం

P.C: You Tube

ఆలయం వెలుపల పద్దెనిమిది అడుగుల ఎత్తు రాతి హనుమంతుని విగ్రహం మనకు కనిపిస్తుంది. తమిళనాడులో ఇంత ఎత్తు హనుమంతుని విగ్రహం మరెక్కడా లేదని చెబుతారు. ఇక ఆలయ ప్రధాన గోపురం ఎత్తు 134 అడుగులు.

ఎత్తైన రాజ గోపురం

ఎత్తైన రాజ గోపురం

P.C: You Tube

అందువల్ల చాలా దూరానికే మనకు ఆలయ గోపురం కనిపిస్తుంది. ఆలయ ప్రధాన ద్వారం ఎత్తు ఇరవై నాలుగు అడుగులు. ఈ ప్రధాన ద్వారం పై ఉన్న అనేక వర్ణ రంజిత శిల్పాలు భారతీయ శిల్పకళా వైభవానికి నిదర్శనం.

కొలచెల్

కొలచెల్

P.C: You Tube

శుచీంద్రం పట్టణానికి దగ్గరగా కన్యాకుమారికి నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో కొలచెల్ అనే చారిత్రాత్మక ప్రదేశం కలదు. ఇక్కడ డచ్ వారికి భారత రాజులకు మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ ప్రదేశాన్ని మనం ఇప్పటికీ చూడవచ్చు.

మరికొన్ని ఆలయాలు

మరికొన్ని ఆలయాలు

P.C: You Tube

శుచీంద్రంలో ధనుమలయన్ ఆలయం ప్రసిద్ధి చెందినప్పటికి ఇక్కడ మరొకొన్ని ముఖ్యమైన ఆలయాను మనం చూడవచ్చు. ముఖ్యంగా ద్వారక ఆలయం, మునుథితనం కై ఆలయం, ఆశ్రమం శాస్త్ర ఆలయం, కరుపసామి ఆలయం, తదితర ఆలయాలను మనం చూడవచ్చు.

ఎక్కడ ఉంది

ఎక్కడ ఉంది

P.C: You Tube

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కన్యాకుమారికి కేవలం 11 కిలోమీటర్ల దూరంలో సుచీంద్రం పుణ్యక్షేత్రం ఉంటుంది. అదే విధంగా నాగర్ కోయిల్ నుంచి 7 కిలోమీటర్లు, తిరునల్వేలి నుంచి 105 కిలోమీటర్లు, త్రివేండ్రం నుంచి సుమారు 81 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే సుచీంద్రం చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X